అనువాదలహరి

కవిత్వస్పృహ… పాబ్లో నెరూడా, చిలియన్ కవి

సరిగ్గా ఆ వయసులో కవితాస్పృహ నాలో ప్రవేశించింది…
నన్ను వెతుక్కుంటూ. నాకు తెలీదు. అదెక్కడనుండి వచ్చిందో
మంచులోంచి వచ్చిందా, ప్రవాహంలోంచి వచ్చిందా తెలీదు.
అదెలా వచ్చిందో ఎప్పుడొచ్చిందోకూడా తెలీదు.
నిజం. అవి గొంతులు కావు, అవి
మాటలు కావు, నిశ్శబ్దమూ కాదు,
నడుస్తున్న నన్ను రమ్మని ఆజ్ఞాపించింది
చీకటికొమ్మలమాటునుండీ,
అకస్మాత్తుగా అన్నిచోటులనుండీ
వీశృంఖలమైన అగ్నికీలలలోంచో
ఒంటరిగా తిరిగి వస్తున్నపుడో,
ఏ ముఖమూలేక పడున్న నన్ను
ఒక్కసారిగా తాకింది.

నాకేం చెప్పాలో తెల్లీలేదు
నోటమాటలు రాలేదు
ఎలా పలకరించాలో తెలీదు
నా కంటికి ఏమీ కనిపించడం లేదు,
నా ఆత్మలో ఏదో చైతన్యం మొదలైంది
అది జ్వరమో, మరిచిపోయిన రెక్కలు మొలిచాయో
అంతే, నేను నా త్రోవ వెతుక్కో సాగేను
ఆ వేడిమికి
అర్థాన్ని వెతుక్కుంటూ
నా తొలి అస్పష్ట వాక్యాన్ని రాసేను,
చాలా పేలవమైంది, అర్థం లేదు,
అచ్చమైన తెలివితక్కువ ఆలోచనకి ఉదాహరణ,
ఏమీ తెలియని వాడి
స్వచ్చమైన అనుభవం,
ఒక్కసారిగా ఆకాసపు
గడియలు తొలగి
ద్వారాలు తెరుచుకున్నాయి
సరికొత్తలోకాలు,
కంపించే పూలవనాలు
చిద్రమైన నీడలు.
దాని నిండా
అనేక బాణాలు, నిప్పులు, పూలగుత్తులు
ముగింపుకొస్తున్న చీకటి, ఈ విశ్వం.

నేను సూక్ష్మాతి సూక్ష్మమైన జీవిని
నక్షత్రాల వెలుగులతో నిండిన
శూన్యాన్ని ఆపోశనపట్టేను
ఒక నిగూఢమైన ప్రతిమలా
ఆ పోలికలతో
నేనూ ఆ అంతులేని లోతులకి
ప్రతీకగా అనుభూతిచెందాను.
చుక్కలతోపాటు దొర్లుకుంటూ
నా మనసూ ఆకాశం మీద
స్వేఛ్ఛగా విహరించసాగింది.

పాబ్లో నెరూడా

July 12, 1904 – September 23, 1973

చిలియన్ కవి

.

 

.

Pablo Neruda
Pablo Neruda 1963
Courtesy: Wikipedia

 

.

 Poetry

.

 And it was at that age…Poetry arrived

 in search of me. I don’t know, I don’t know where

 it came from, from winter or a river.

 I don’t know how or when,

 no, they were not voices, they were not

 words, nor silence,

 but from a street I was summoned,

 from the branches of night,

 abruptly from the others,

 among violent fires

 or returning alone,

 there I was without a face

 and it touched me.

 I did not know what to say, my mouth

 had no way

 with names

 my eyes were blind,

 and something started in my soul,

 fever or forgotten wings,

 and I made my own way,

 deciphering

 that fire

 and I wrote the first faint line,

 faint, without substance, pure

 nonsense,

 pure wisdom

 of someone who knows nothing,

 and suddenly I saw

 the heavens

 unfastened

 and open,

 planets,

 palpitating plantations,

 shadow perforated,

 riddled

 with arrows, fire and flowers,

 the winding night, the universe.

 And I, infinitesimal being,

 drunk with the great starry

 void,

 likeness, image of

 mystery,

 I felt myself a pure part

 of the abyss,

 I wheeled with the stars,

 my heart broke free on the open sky.

.

Pablo Neruda

July 12, 1904 – September 23, 1973

Chilean Poet and Diplomat

Poem Courtesy: http://wonderingminstrels.blogspot.in/2003/06/poetry-pablo-neruda.html

 

అప్పుడే చనిపోవు… పాబ్లో నెరూడా చిలీ కవి

నువ్వు మెల్ల మెల్లగా మరణించడం మొదలెడతావు;

నువ్వు దేశాలు తిరగనప్పుడు,
పుస్తకాలు చదవనప్పుడు,
జీవన నిక్వాణాలని వినిపించుకోనపుడు,
నిన్ను నువ్వు అర్థం చేసుకోలేనపుడు
నువ్వు మెల్ల మెల్లగా మరణించడం మొదలెడతావు.

నీ ఆత్మగౌరవాన్ని చంపుకున్నప్పుడు,
ఇతరులు నీకు సహాయంచెయ్యడానికి ఇష్టపడనపుడు
నువ్వు మెల్ల మెల్లగా మరణించడం మొదలెడతావు.

నువ్వు నీ అలవాట్లకు బానిసవైపోయినపుడు,
ఎప్పుడూ నడచినతోవల్లోనే నడుస్తూ ఉన్నప్పుడు…
నీ దినచర్యమార్చుకోనపుడు,
నువ్వు వేర్వేరు రంగులు ధరించలేనపుడు,
లేక, అపరిచితులతో మాటాడడానికి ఇష్టపడనపుడు.
నువ్వు మెల్ల మెల్లగా మరణించడం మొదలెడతావు:

నీ నేత్రాలను చెమరింపజేసి
నీ హృదయం త్వరగా కొట్టుకునేలా చేసే
అన్ని రసానుభూతుల్నీ
వాటి ఆవేశాల తీవ్రతలనీ విడనాడినపుడు;
నువ్వు మెల్ల మెల్లగా మరణించడం మొదలెడతావు:

అనిశ్చయమైన వాటికోసం నీ సురక్షితస్థిని ఒడ్డలేనపుడు,
నీ కలలను వెంటాడుతూ పోలేనపుడు,
జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా
పారిపోడానికి
నిన్ను నువ్వు విడిచిపెట్టలేనపుడు
నువ్వు మెల్ల మెల్లగా మరణించడం తథ్యం!!!

.
పాబ్లో నెరూడా

July 12, 1904 – September 23, 1973

చిలీ కవి

Pablo Neruda
Pablo Neruda 1963
Courtesy: Wikipedia

Don’t Die Yet

.

You start dying slowly ;
if you do not travel,
if you do not read,
If you do not listen to the sounds of life,
If you do not appreciate yourself.
You start dying slowly :

When you kill your self-esteem,
When you do not let others help you.
You start dying slowly ;

If you become a slave of your habits,
Walking every day on the same paths…
If you do not change your routine,
If you do not wear different colours
Or you do not speak to those you don’t know.
You start dying slowly :

If you avoid to feel passion
And their turbulent emotions;
Those which make your eyes glisten
And your heart beat fast.
You start dying slowly :

If you do not risk what is safe for the uncertain,
If you do not go after a dream,
If you do not allow yourself,
At least once in your lifetime,
To run away…..
You start dying Slowly !!!

.

Pablo Neruda 

July 12, 1904 – September 23, 1973

Chilean Poet

ద యునైటెడ్ ఫ్రూట్ కంపెనీ… నెరూడా

(గత కొన్ని సంవత్సరాలుగా మనదేశంలో ప్రతిరోజూ బయటపడుతున్న స్కాముల పరంపర చూస్తుంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలూ, నిర్ణయాధికారంగల అధికారులూ, ఇతర చిల్లర మల్లర ప్రభుత్వోద్యోగులూ పోటీలుపడిమరీ దేశసంపదని కొందరు వ్యక్తులకో, కొన్ని విదేశీసంస్థలకో దఖలుపరచడానికి … ప్రజాభిప్రాయాన్ని తోసిరాజని, అధికారాన్ని తమకు అందజేసిన రాజ్యాంగంమీద చేసిన ప్రమాణాన్ని బేఖాతరుచేసి, నిస్సిగ్గుగా, నిర్లజ్జగా రాజ్యాంగేతర శక్తులుగా ఎదిగి, న్యాయవ్యవస్థనుకూడా లక్ష్యపెట్టకుండా చేసిన ప్రయత్నాలు పరిశీలిస్తే, గత శతాబ్దపు పూర్వార్థంలో మధ్య అమెరికను దేశాలలోని నియంతృత్వప్రభుత్వాలు ప్రవర్తించిన తీరు నెరూడా ఎలా చిత్రించాడో దానికి అచ్చుగుద్దినట్టు ఉందని ఇంగితజ్ఞానం ఉన్నవారెవరికైనా ఇట్టే అర్థం అయిపోతుంది.

ఆ వైనం ఏమిటో ఒకసారి చిత్తగించండి:)

.

ఇలా సృష్టికి ప్రాభాతభేరీ మ్రోగడమే ఆలశ్యం,

భూమ్మీద సమస్తం మూటగట్టి సిద్ధంచేయబడి ఉన్నాయి

యెహోవా భూమిని ఖండాలుగా విభజించి,

కోకకోలా కంపెనీకి, ఆనకొండలకీ,

ఫోర్డు మోటార్స్ మొదలైనవాటన్నిటికీ పంచేసేడు.

.

యునైటెడ్ ఫ్రూట్ కంపెనీ మాత్రం

మధ్యఅమెరికాకి నాజూకైన నడుములాంటి

నా నేలమీది అతిసారవంతమైన తీరాన్ని

తనకోసం అట్టేపెట్టుకుంది.

.

దాని సామ్రాజ్యాన్ని “బనానా రిపబ్లిక్స్”

అని ముద్దుగా నామకరణం చేసి

అమరవీరులసమాధుల సాక్షిగా,

స్వేఛ్ఛా, పతాకాలతోపాటు

ఔన్నత్యంకోసం పోరాడే వీరులమీద

పెత్తనం చెలాయిస్తూ

తన వికృతనాటకం ప్రారంభించింది.

.

దేశాల స్వాతంత్ర్యాన్ని రద్దుచేసి

కొందరికి నియంతల కిరీటాలు తగిలించింది

మత్సరాల్ని ఒరలోంచి బయటకు వొదిలి

జలగల్లాంటి నియంతృత్వాలూ,

TrujillO జలగలూ, Tacho జలగలూ

Carias జలగలూ, Martines జలగలూ

Ubico జలగలూ గాక,

సామాన్యంగా రక్తంతాగే జలగలూ,

సమాధులమీద దాడిచేసే తాగుబోతు జలగలూ,

నియంతృత్వంలో బాగా తర్ఫీదుపొందిన

మేధావి జలగలూ,

బఫూన్ జలగల ఆదరణకూడా పొందింది.

.

రక్తపిశాచులైన ఈ జలగలమధ్య

ఫ్రూట్ కంపెనీ తన ఓడలు లంగరువేస్తుంది

కాఫీ, పళ్ళూ దోచుకుపోడానికి.

అప్పుల్లో ములిగిపోయిన మా దేశాల సంపద

కంచాల్లో వడ్డించినట్టు ఓడల్లోకి తరలిపోతుంది.

ఈ మధ్యలో

ఓడరేవుల్లోనిచెరుకు అగడ్తల్లో

దేశీయ ఇండియన్లు పడిపోతుంటారు

తొలిసంజ రాలే పొగమంచు  దుప్పటిలో

చుట్టబడి సమాధికై ఎదురుచూస్తూ;

కొన్ని వందల శవాలు,

పేరూ – ఊరూ లేనివి,

రాలిపోయిన అనామకులు,

చెత్తమీదకి విసిరేసిన

కుళ్ళిపోయిన పళ్ళలాంటి వాళ్ళు.

.

పావ్లో నెరూడా

చిలీ  కవి

July 12, 1904 – September 23, 1973

(Notes:

Trujillo: Rafael Leonidas Trujillo Molina, 1930 – 1961 వరకు డొమినికన్ రిపబ్లిక్ అధ్యక్షుడు

Tacho: 1936 – 1956  నికరాగువా అధ్యక్షుడైన Anastasio Somoza Garcia మారుపేరు

CariasTiburcio Carias Andino, 1933-1946ల మధ్య హోండురాస్ అధ్యక్షుడు

Martinez: Maximiliano Hernandez Martinez, 1931 – 1944  ఎల్ సాల్వడార్ అధ్యక్షుడు

Ubico: Jorge Ubico  y Castaneda, 1931-1944 ల మధ్య గ్వాటిమాలా  అధ్యక్షుడు   )

Pablo Neruda (1904–1973)
Pablo Neruda (1904–1973) (Photo credit: Wikipedia)

The United Fruit Co.
.

When the trumpet sounded, it was
all prepared on the earth,
the Jehovah parcelled out the earth
to Coca Cola, Inc., Anaconda,
Ford Motors, and other entities:
The Fruit Company, Inc.
reserved for itself the most succulent,
 the central coast of my own land,
the delicate waist of America.
It rechristened its territories
as the ’Banana Republics’
and over the sleeping dead,
over the restless heroes
who brought about the greatness, the liberty and the flags,
it established the comic opera:
abolished the independencies,
presented crowns of Caesar,
unsheathed envy, attracted
the dictatorship of the flies,
 Trujillo flies, Tacho flies,
 Carias flies, Martines flies,
 Ubico flies, damp flies
of modest blood and marmalade,
drunken flies who zoom
over the ordinary graves,
circus flies, wise flies
 well trained in tyranny.

Among the blood-thirsty flies
the Fruit Company lands its ships,
taking off the coffee and the fruit;
the treasure of our submerged
territories flow as though
on plates into the ships.

Meanwhile Indians are falling
into the sugared chasms
of the harbours, wrapped
for burials in the mist of the dawn:
a body rolls, a thing
that has no name, a fallen cipher,
a cluster of the dead fruit
thrown down on the dump.
.

Pablo Neruda

(Important Notes:

Opera Buffa:  Italian Comic Opera.

Trujillo: Rafael Leonidas Trujillo Molina, President of the Dominican Republic , 1930-61.

Tacho: It is the nickname of Anastasio Somoza Garcia, President of Nicaragua, 1936-56

Carias:  Tiburcio Carias Andino, President of Honduras, 1933-1946

Martinez: Maximiliano Hernandez Martinez, President of El Salvador, 1931-44

Ubico: Jorge Ubico  y Castaneda, President of Guatimala, 1931-44

Pablo Neruda

 

.

 

మిధ్యగా కనిపిస్తున్న ఈ బహుళంలో,
అన్ని ఆకులూ … ఈ ఆకే
అన్ని రేకులూ… ఈ పువ్వే.
అన్ని పళ్ళూ ఒక పండే
అన్ని చెట్లూ ఒక చెట్టే
ఒక్క పువ్వు ఈ ప్రపంచాన్ని నడిపించగలదు. 

 

పావ్లో నెరూడా

 

(పైకి ఎంతో సరళంగా కనిపిస్తున్న ఈ కవితలో, గొప్ప తాత్త్విక సత్యం ఉంది. నిజానికి అన్ని రూపాలలో కనిపిస్తున్న పువ్వైనా, ఆకైనా, అవి ఒక్కటే. ఆ ఒక్కటీ మిగతావాటికన్నిటికీ ప్రాతినిధ్యం వహిస్తోంది.  ఒక్క పువ్వు ఈ ప్రపంచాన్ని నడిపించగలదనడంలో, ఆశావహ దృక్పథమే కాదు, మానవతప్పిదాల వల్ల సృష్టిలో కొంత వినాశం జరిగినా, తిరిగి పుంజుకోగలదు అన్న భావన ఉంది అందులో.)

 

 

Pablo Neruda (1956)
Pablo Neruda (1956) (Photo credit: Wikipedia)

 

.

 

All leaves are this leaf,

 

all petals, this flower

 

in a lie of abundance.

 

All fruit is the same,

 

the trees are only one tree

 

and one flower sustains all the earth.

 

(“Unity,” from Manual Metaphysics by Pablo Neruda; trans. by Ben Belitt)

 

Pablo Neruda

 

 

సానెట్ XVII …పావ్లో నెరూడా

.

నువ్వొక అపురూపమైన గులాబీవనో, గోమేధిక మణివనో,
లేక నిప్పురవ్వల్లాంటి లవంగమొగ్గవనో ప్రేమించను.  
నిన్ను కొన్ని రహస్యమైన వస్తువుల్ని ప్రేమించినట్టు,
ఎవరికీ తెలియకుండా గుండెకీ, నీడకీ మధ్య ప్రేమించాలి

ఎన్నడూ పుష్పించకపోయినా, కనపడని ఎన్నోపుష్పాలప్రకాశాన్ని
తనలో నిలుపుకున్న ఒక చెట్టుని ప్రేమించినట్టు, నిన్నుప్రేమిస్తా.
నీ ప్రేమ కారణంగానే, ఒక చెప్పలేని గాఢ సుగంధం
భూమినుండి వెలువడి నిగూఢంగా నాలో నిక్షిప్తమై ఉంది

ఎలా, ఎప్పుడు, ఎక్కడనుండి ప్రేమిస్తున్నానో తెలీదు
నిన్నునిన్నుగా, భేషజాలూ, అహం లేకుండా ప్రేమిస్తున్నాను.
నిన్నలా ఎందుకు ప్రేమిస్తున్నానంటే మరోలా తెలీదు కనుక

ఈ ప్రేమలో … “నేను” అన్నదీ లేదు … “నువ్వు” అన్నదీ లేదు
నాగుండెమీది నీ చెయ్యి నా చెయ్యే అనుకునేంత సామీప్యత    
నేనునిద్రలోకి ఒరుగుతుంటే, నీ కళ్ళు మూతపడేంత మమేకత.

.

Pablo Neruda (1904–1973)
Pablo Neruda (1904–1973) (Photo credit: Wikipedia)

పావ్లో నెరూడా

.

Sonnet XVII

.

I do not love you as if you were salt-rose, or topaz,
or the arrow of carnations the fire shoots off.
I love you as certain dark things are to be loved,
in secret, between the shadow and the soul.

I love you as the plant that never blooms
but carries in itself the light of hidden flowers;
thanks to your love a certain solid fragrance,
risen from the earth, lives darkly in my body.

I love you without knowing how, or when, or from where.
I love you straightforwardly, without complexities or pride;
so I love you because I know no other way

than this: where I does not exist, nor you,
so close that your hand on my chest is my hand,
so close that your eyes close as I fall asleep.

.

Pablo Neruda

(July 12, 1904 – September 23, 1973 )

Chilean Poet

ఈ సాయంసంధ్యకూడా … పాబ్లో నెరూడా

.

ఓహ్! ఈ సాయంసంధ్యకూడా మనకి కాకుండా పోయింది.

.

సన్నని కారుచీకటి తెరలుకమ్ముకుంటుండగా

మనిద్దరం చెట్టపట్టాలేసుకునిఉండడమెవరూ చూడలేదులే.

.

నా కిటికీలోంచి గమనించాను

దూరాన కొండకొనకొమ్ములలో సూర్యాస్తమయ వేడుక

.

ఒకోసారి, ఎండతునక నా అరచేతుల్లో నిప్పుకణికలా మండుతుంది.

.

నీకు  తెలుసు… ఇంతవిచారంలోనూ,

నా మనసు ఉగ్గపట్టుకుని నిన్ను తలుచుకుంటానని!

అవును, ఇంతకీ నువ్వపుడెక్కడున్నావు?

నీతో ఎవరెవరున్నారు?

ఏం చెబుతున్నారు?

నువ్వు దూరంగా ఉన్నావన్న బాధలో నేనున్నప్పుడే,

నీ మీద నా ప్రేమ నన్ను అమాంతం ఉక్కిరిబిక్కిరి చెయ్యాలా?

.

అసురసంధ్యవేళ చదివే పుస్తకమెప్పుడూ క్రిందపడిపోతుంది.

నా జ్ఞానం దెబ్బతిన్న కుక్కపిల్లలా నా కాళ్ళదగ్గరే ముడుచుకుపోతుంది.

.

ముఖాలు అస్పష్టం చేస్తూ నిష్క్రమిస్తున్న సంధ్యతోపాటు,

నువ్వుకూడా ఎప్పుడూ నా నుండి జారుకుంటావు.

.

పాబ్లో నెరూడా

.

(అసురసంధ్యవేళ: సూర్యాస్తయమయి, పూర్తిగా చీకటిపడీ పడని వేళని ఉత్తరాంధ్రప్రాంతంలో అసురసంధ్యవేళ అంటారు… Thanks Usha garu for the correction)

.

We Have Lost Even…

.

We have lost even this twilight.

No one saw us this evening hand in hand

While the blue night dropped out of the world.

I have seen from my window

The fiesta of sunset in the distant mountain tops.

Sometimes a piece of sun

Burned like a coin between my hands.

I remembered you with my soul clenched

In the sadness of mine that you know.

Where were you then?

Who else was there?

Saying what?

Why will the whole of love come on me suddenly

When I have sad and feel you are far away?

The book fell that is always turned to at twilight

And my cape rolled like a hurt dog at my feet.

Always, always you recede through the evenings

towards where the twilight goes erasing statues.

.

Pablo Neruda.

(July 12, 1904 – September 23, 1973)

Chilean Poet, Diplomat and Politician .

దూరం గా తొలగిపోకు… పాబ్లో నెరూడా

దూరంగా తొలగి పోకు, ఒక్క రోజుకైనా సరే! ఎందుకంటే…

ఎందుకంటే… నాకెలాచెప్పాలో తెలియడం లేదు, రోజంటే… చాలా సమయం.

ట్రైన్లన్నిట్నీ ఎక్కడో యార్డ్ లో విశ్రాంతికి తీసుకుపోతే,

ఖాళీ ప్లాట్ ఫారం మీద వాటికోసం నిరీక్షించినట్టు,  నేను నీకోసం నిరీక్షిస్తుంటాను

.

నన్ను ఒక గంటసేపైనా విడిచిపెట్ట వద్దు.  ఎందుకంటే,

నా పరివేదనా బిందువులు ఒక్కొక్కటీ కలిసి ప్రవాహమౌతాయి,

గూడుకై దిమ్మరిగా తిరిగే పొగ,  అలా దారితప్పి తేలియాడుతూ

నాగుండెల్లోకి జొరబడి నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది

.

ఓహ్, కడలితీరాన నీ ఊహాచిత్రము చెదిరిపోకుండుగాక!

నీ కన్రెప్పలు సుదూర శూన్యంలోకి చూస్తూ అల్లాడకుండుగాక!

ప్రియతమా! నన్ను ఒక క్షణం కూడా విడువకు!

ఎందుకంటే, ఆ క్షణం లో నువ్వు ఎంతో దూరం వెళ్ళిపోయి ఉంటావు

నేను చిక్కుల్లో చిక్కుకుని, వెనుదిరిగి  రావా?

నన్నిలా మరణించమని విడిచిపెట్టి వెళిపోతావా?

అని అడుగుతూ, భూమంతా గాలిస్తూ ఉంటాను.

.

పాబ్లో నెరూడా

.

Don’t Go Far Off

.

Don’t go far off, not even for a day, because —

because — I don’t know how to say it: a day is long

and I will be waiting for you, as in an empty station

when the trains are parked off somewhere else, asleep.

.

Don’t leave me, even for an hour, because

then the little drops of anguish will all run together,

the smoke that roams looking for a home will drift

into me, choking my lost heart.

.

Oh, may your silhouette never dissolve on the beach;

may your eyelids never flutter into the empty distance.

Don’t leave me for a second, my dearest,

because in that moment you’ll have gone so far

I’ll wander mazily over all the earth, asking,

Will you come back? Will you leave me here, dying?

.

Pablo Neruda

మృత్యు హేల … Neruda

.

అక్కడ ఒంటరి శ్మశానాలున్నాయి,

సమాధులనిండా చప్పుడుచెయ్యని ఎముకలు,

సొరంగంగుండా ప్రయాణిస్తున్న మనసు,

అంతా చీకటి, చీకటి, చీకటిమయం,

పగిలిపోయిన ఓడలా మనలోకే మన మహాభినిష్క్రమణం,

మన మనసుల్లోకే  మనం మునిగిపోతున్నట్టు,

మన శరీరం నుండి విడివడి ఆత్మలోకి జారి బతికినట్టు.

.

అక్కడ శవాలున్నాయి,

పాదాలు చల్లగా, బంకమట్టితో చేసినట్టు,

ఎముకల్లో మృత్యువుంది,

కుక్కలు లేకుండా  వినిపిస్తున్న మొరుగుడులా

ఎక్కడో దూరంగా రుద్రభూములనుండి వస్తున్న గంటానాదంలా

చెమ్మగా ఉన్న గాలిలో వర్షిస్తున్న కన్నీళ్ళలా .

.

ఒక్కోసారి నాకు

ఒంటరిగా ప్రయాణమౌతున్న శవపేటికలు కనిపిస్తుంటాయి,

పాలిపోయిన మృత యాత్రికులను తీసుకునిపోతూ,

మహిళల కేశాలు నిర్జీవంగా ఉంటాయి,

Bakers దేవదూతల్లా తెల్లగా

Notaryలతో వివాహితలైన ఫ్రౌఢలు విషణ్ణవదనలై

శవపేటికలు నిలువుగా

ప్రవాహానికి వ్యతిరేకంగా

మృత్యురవంతో ఎగసిన తెరచాపలతో

మృత్యు రవమైన నీరవంతో నిండి

ముదురు గులాబీవర్ణంగల ‘వైతరణి’ ని దాటుతూ.

.

మృత్యువు ముఖ్యంగా

కాళ్ళులేని బూటు చేసే చప్పుడులా

మనిషిలేని సూటులా ప్రవేశిస్తుంది.

వచ్చి తలుపు తడుతుంది,

పొడి లేని ఉంగరంతో,

అసలు వేలే లేని ఉంగరంతో

వచ్చి అరుస్తుంది

నోరుగాని, నాలుకగాని, గొంతుకగాని ఉండవు.

అయినప్పటికీ, దాని అడుగులు వినిపిస్తునే ఉంటాయి,

దాని ఆహార్యం సడిలేనిసవ్వడి చేస్తుంది, చెట్లలా…

.

నాకు సందేహమే, ఎందుకంటే నాకు కొంచెమే తెలుసు,

నాకసలు కనేకనిపించదు,

కాని నాకనిపిస్తుంది, దాని పాటలో తడిసిన ఊదారంగుపూల ఛాయ ఊందేమోనని,

భూమిమీద హాయిగావికసించే నల్లకలువలలాంటి ఊదారంగుపూలు,

మృత్యువు ముఖం హరితంగా ఉంటుంది,

అందుకంటే చావు శరీరానికి  పచ్చరంగు అద్దుతుంది గనుక,

దానిలో తీవ్రమైన హేమంతపు విషాద వివర్ణంతోపాటు,

నవనాడులలోకీ చొచ్చుకుపోయిన చల్లదనం ఉంటుంది.

.

కానీ, మృత్యువు చీపురు వేషం వేసుకుని ప్రకృతిలో పరిభ్రమిస్తుంది,

నేలను ఊడుస్తూ, శవాలకై  గాలిస్తూ,

మృత్యువు చీపురులోనే ఉంది,

చీపురు శవాలకై వెదికే మృత్యువు నాలుక,

అది దారానికై వెదికే సూది.

.

మృత్యువు మడతమంచాల్లో ఉంటుంది

నల్లని దుప్పట్లలోనూ

బొంతలమీదా నిద్రించి దాని జీవితం గడిపి,

అకస్మాత్తుగా ప్రాణం విడుస్తుంది:

ఎంత విషాదభరమైన కేకవేస్తుందంటే

ఆ పెడబొబ్బకి దుప్పట్లు తెరచాపల్లా విచ్చుకుని

శయ్యలు పడవలై ఏదో తీరాలకు ప్రయాణమౌతై.

అక్కడ admiral వేషంలో  మృత్యువు నిరీక్షిస్తుంటుంది.

.

Nothing But Death

.

There are cemeteries that are lonely,

graves full of bones that do not make a sound,

the heart moving through a tunnel,

in it darkness, darkness, darkness,

like a shipwreck we die going into ourselves,

as though we were drowning inside our hearts,

as though we lived falling out of the skin into the soul.

.

And there are corpses,

feet made of cold and sticky clay,

death is inside the bones,

like a barking where there are no dogs,

coming out from bells somewhere, from graves somewhere,

growing in the damp air like tears of rain.

Sometimes I see alone coffins under sail,

embarking with the pale dead, with women that have dead hair,

with bakers who are as white as angels,

and pensive young girls married to notary publics,

caskets sailing up the vertical river of the dead,

the river of dark purple,

moving upstream with sails filled out by the sound of death,

filled by the sound of death which is silence.

.

Death arrives among all that sound

like a shoe with no foot in it, like a suit with no man in it,

comes and knocks, using a ring with no stone in it, with no finger in it,

comes and shouts with no mouth, with no tongue, with no throat.

Nevertheless its steps can be heard

and its clothing makes a hushed sound, like a tree.

.

I’m not sure, I understand only a little, I can hardly see,

but it seems to me that its singing has the color of damp violets,

of violets that are at home in the earth,

because the face of death is green,

and the look death gives is green,

with the penetrating dampness of a violet leaf

and the somber color of embittered winter.

But death also goes through the world dressed as a broom,

lapping the floor, looking for dead bodies,

death is inside the broom,

the broom is the tongue of death looking for corpses,

it is the needle of death looking for thread.Death is inside the folding cots:

it spends its life sleeping on the slow mattresses,

in the black blankets, and suddenly breathes out:

it blows out a mournful sound that swells the sheets,

and the beds go sailing toward a port

where death is waiting, dressed like an admiral

వెలుగు శిఖరం … Neruda

.

ఓ వెలుగు శిఖరమా, వారాశిగర్భంలోని

శిల్పాలనూ, కంఠహారాలనూ ఉత్ప్రేక్షించిన విషాద సౌందర్యమా,

శుక్ల నేత్రమా, పరీవ్యాప్తజలరాశి చిహ్నమా,

ఆల్బట్రాస్ తీతువా, సముద్ర దంతమా,

సాగరపవన సహచరీ, ద్వీపసమూహలత

లోలోతులలోనుండి ఆవిర్భవించిన ఓ విశిష్ట గులాబీ,

ఓ సహజ నక్షత్రమా, ఓ పచ్చల కిరీటమా,

ఒంటరి వంశంలోని ఏకైక వంగడమా,

ఒక చినుకులా, ఒక ద్రాక్షలా, ఒక సముద్రంలా,

ఇప్పటికీ అందవు, దొరకవు, అంతుబట్టవు.

.

Tower of Light

O tower of light, sad beauty
that magnified necklaces and statues in the sea,
calcareous eye, insignia of the vast waters, cry
of the mourning petrel, tooth of the sea, wife
of the Oceanian wind, O separate rose
from the long stem of the trampled bush
that the depths, converted into archipelago,
O natural star, green diadem,
alone in your lonesome dynasty,
still unattainable, elusive, desolate
like one drop, like one grape, like the sea.

Pablo Neruda

నీ అధరం, నీ స్వరం, నీ శిరోజాలకై నా తపన —- Neruda

.

దూరంగా తరలిపోకు… ఒక్క రోజుకైనా…

దూరంగా విడిచిపోకు… ఒక్క రోజుకైనా…

ఎందుకంటే, నాకెలా చెప్పాలో తెలీదు- రోజంటే  చాలా దీ… ర్ఘ… మైనది…

నీను నీకోసం నిరీక్షిస్తూ ఉంటాను…

ట్రైన్లన్నీ నడవకుండా ఎక్కడో షెడ్డ్లల్లో నిద్రపోతుంటే,

ఖాళీ ప్లాట్ ఫారం మీద ఎదురుచూసినట్టు.

.

నన్ను విడిచిపెట్టకు, ఒక్క క్షణమైనా,

ఎందుకంటే, బొట్లు బొట్లుగా కారే నా ఆవేదన, వరదలా ప్రవహిస్తుంది,

తలదాచుకుందికి కలతిరిగిన పొగ, దారితప్పి నాలో ప్రవేశించి,

కోల్పోయిన నాహృదయాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.

.

ఓహ్, సముద్రపు ఒడ్డున  నీ తేజోరూపము ఎన్నడూ కరిగిపోకుండుగాక,

నీ కను రెప్పలు శూన్యదూరాలలోకి వెదకకుండునుగాక

నా ప్రాణమా, నన్ను విడనాడకు ఒక లిప్తపాటైనా, ఎందుకంటే,

ఆ క్షణంలో నువ్వు ఎంతో దూరం నడిచి ఉంటావు,

నేను,  భూమండలమంతా సోమరిగా తిరుగుతూ, ‘నువ్వు వస్తావా?

నన్నిలా చావమని ఇక్కడ వదిలేస్తావా?’ అని అడుగుతాను

.

I crave for your mouth, your voice, your hair

.

.

Don’t go far off, not even for a day

Don’t go  far off, not even for a day,

Because, I don’t know how to say it – a day is too long.

And I will be waiting for you, as in

an empty station when the trains are

parked off somewhere, asleep.

.

Don’t leave me even for an hour, because then

The little drops of my anguish will all run together,

the smoke that roams looking for  a home will drift

into me, choking my lost heart.

.

Oh, may your silhouette never dissolve,

On the beach, may your eyelids never flutter

into the empty distance. Don’t leave me for

a second, my dearest, because in that moment you’ll

have gone so far I’ll wander lazily

over all earth, asking, will you

come back? will you leave me here, dying?

…Pablo Neruda

%d bloggers like this: