అనువాదలహరి

కొత్త జీవితం… ఆస్కార్ వైల్డ్ ఐరిష్ కవి

ఏ వేటా లభించని సముద్రం అంచున అలా నిరీక్షిస్తూ నిలబడ్డాను
నా ముఖాన్నీ, జుట్టునీ నురుగుతో కెరటాలు తడి ముద్ద చేసేదాకా.
గతించిన రోజు ఎర్రని చితిమంటలు సుదీర్ఘంగా
పశ్చిమాకాశాన మండుతున్నాయి; గాలి బావురుమని ఊళలేస్తోంది;
అరుచుకుంటూ సీ గల్స్ నేలవైపు పరిగెత్తుతున్నాయి;
“అయ్యో! నా జీవితమంతా బాధలమయమేగదా!
నిత్యం ప్రసవవేదన పడే ఈ చవిటి నేలల్లో
పళ్ళూ, బంగారు ధాన్యాన్నీ ఎవరు పండించగలరు?”
అని వగచేను. నా వలలు తెగి, పురితగ్గి, నోరు వెళ్ళబెడుతున్నాయి.
అయినప్పటికీ చివరిసారిగా విసిరేను సముద్రంలోకి
చివరికి ఎమవుతుందోనని ఎదురు చూస్తూ.
వావ్ ! పరమాద్భుతమైన వెలుగులు!
ధవళ కాంతులతో ఆకాశానికి బాలుడు ఎగబ్రాకుతున్నాడు.
ఆ ఆనందంలో వేదనామయమైన గతాన్ని మరిచిపోయాను .
.

ఆస్కార్ వైల్డ్

16 October 1854 – 30 November 1900

ఐరిష్ కవి

.

Image Courtesy: http://upload.wikimedia.org

.

Vita Nuova

.

I stood by the unvintageable sea

Till the wet waves drenched face and hair with spray,

The long red fires of the dying day

Burned in the west; the wind piped drearily;

And to the land the clamorous gulls did flee:

‘Alas!’ I cried, ‘my life is full of pain,

And who can garner fruit or golden grain,

From these waste fields which travail ceaselessly!’

My nets gaped wide with many a break and flaw

Nathless I threw them as my final cast

Into the sea, and waited for the end.

When lo! a sudden glory! and I saw

The argent splendour of white limbs ascend,

And in that joy forgot my tortured past.

.

Oscar Wilde

16 October 1854 – 30 November 1900

Irish Poet, Playwright, Novelist

Poem Courtesy:

https://www.poemhunter.com/poem/vita-nuova/

ఊహా రేఖలు… ఆస్కార్ వైల్డ్, ఐరిష్ కవి

సముద్రం మీద ఎవరో నల్లని గీతలు గీసినట్టుంది

అల్లాడకుండా నిశ్చలంగా ఉన్నగాలి అపశృతిలా ఉంది.

అల్లకల్లోలంగా ఉన్న క్షితిజరేఖవద్ద

గాలికి ఎగరిన పండుటాకులా ఉంది చంద్రరేఖ.

తెల్లని ఆ ఇసకమీద స్పష్టంగా

చెక్కినట్టు ఉంది నల్లగా ఆ పడవ;

నవ్వు ముఖం, తెలియని ఆనందం, మెరుస్తున్న చేత్తో

దానిమీదకి వాడ కుర్రాడొకడు ఎగబ్రాకుతున్నాడు.

ఆకాశంలో పక్షులు అరుస్తున్నాయి,

కొండవాలుమీది ఎండినగడ్డిపనలమీంచి

ఎగురుతున్న గోధుమవన్నె మెడలున్న చిన్ని పిట్టలు

ఆకాశం మీద గీసిన ఊహా చిత్రాల్లా ఉన్నాయి.

.

ఆస్కార్ వైల్డ్

16 October 1854 – 30 November 1900

ఐరిష్ కవి

 

.

Image Courtesy: http://upload.wikimedia.org
Image Courtesy: http://upload.wikimedia.org

.

Les Silhouettes

.

The sea is flecked with bars of grey,

The dull dead wind is out of tune,

And like a withered leaf the moon

Is blown across the stormy bay.

 

Etched clear upon the pallid sand

Lies the black boat: a sailor boy

Clambers aboard in careless joy

With laughing face and gleaming hand.

 

And overhead the curlews cry,

Where through the dusky upland grass

The young brown-throated reapers pass,

Like silhouettes against the sky.

.

Oscar Wilde

16 October 1854 – 30 November 1900

Irish Poet and Writer

నిజమైన ఎరుక … ఆస్కార్ వైల్డ్, ఐరిష్ కవి

నీకన్నీ తెలుసు; నేను వృధాగా

ఆశిస్తున్నాను ఏ పొలం దున్నాలా, ఏ విత్తు నాటాలా అని…

నేలంతా ముళ్ళకంపలతో, కలుపుతో నల్లబారింది

ఇక వానకురిసినా, కన్నీరు కురిసినా దానికి ఒకటే.

నీకన్నీ తెలుసు; నేను అలా ఊరికే కూచుని నిరీక్షిస్తాను

చేవతప్పిన చేతులతో, చూడలేని కళ్లతో,

కడపటి ముసుగు తొలగించేదాకా,

తొలిసారి ద్వారాలు తెరుచుకునేదాకా

నీ కన్నీ తెలుసు; నాకు చూపులేదు.

నా జీవితం వృధా పోదని నాకు నమ్మకం

ఏ శాశ్వత దివ్యలోకాలలోనో

మనం తప్పక మళ్ళీ కలుస్తామని నాకు తెలుసు.

.

(గ్రీకునుండి అనువాదం)

.

ఆస్కార్ వైల్డ్

(16 October 1854 – 30 November 1900)

ఐరిష్ కవి, కథకుడూ, నవలాకారుడూ.

.

Image Courtesy: http://upload.wikimedia.org
Image Courtesy: http://upload.wikimedia.org

.

The True Knowledge

.

Thou knowest all; I seek in vain

What lands to till or sow with seed —

The land is black with briar and weed,

Nor cares for falling tears or rain.

Thou knowest all; I sit and wait

With blinded eyes and hands that fail,

Till the last lifting of the veil

And the first opening of the gate.

Thou knowest all; I cannot see.

I trust I shall not live in vain,

I know that we shall meet again

In some divine eternity.

.

(Translated from Greek)

Oscar Wilde

(16 October 1854 – 30 November 1900) 

Irish Poet

నా మాట … ఆస్కార్ వైల్డ్, ఐరిష్ కవి.

అశాంతీ, ఆతురతలతో నిండిన ఈ ఆధునిక ప్రపంచంలో,

నువ్వూ, నేనూ, మనవంతు ఆనందం మనసారా అనుభవించేం;

ఈ నావకెత్తిన తెల్లని తెరచాపలు మూసివేయబడ్డాయి

మనం ఇందులోకెత్తిన సరకంతా ఖర్చుచేసేశాం.    

.

రోదనవల్ల సంతోషం నానుండి నిష్క్రమించింది, 

అందుకు నా చెక్కిళ్ళు ప్రాయములోనే కళతప్పాయి,  

వయసుమీరని నా పెదాల అరుణిమని వేదన హరించింది,

వినాశము నా శయ్యమీద ఆఖరితెరలు దించుతోంది.  

.

కానీ, కిక్కిరిసిన ఈ జీవితం నీకు ఒక వీణ,

ఒక జంత్రం, లేక వయోలాల సమ్మోహనాదంలాగో 

లేదా, ఉదాత్త సాగర సంగీతానికి పేలవమైన అనుకరణ

శంకువులో నిద్రించే ప్రతిధ్వనిలాగో అనిపించవచ్చు.  

.

ఆస్కార్ వైల్డ్ 

(16 October 1854 – 30 November 1900)

ఐరిష్ కవి, నాటక కర్త

షేక్స్పియరు తర్వాత అంత ఎక్కువగానూ సాహిత్యంలో ఉటంకించబడే (quoted) వ్యక్తి ఆస్కార్ వైల్డ్ మాత్రమే.

ఈ కవిత నిజానికి Dialogues అన్న పేరుతో రాసిన కవితల్లో రెండవది. మొదటికవితలో ఇద్దరు ప్రేమికులు విడిపోతున్నప్పుడు, స్త్రీ దృక్పధంలో ఆ విడిపోవడానికి కారణాలు చెబితే, దానికి సమాధానంగా చెప్పిన ఈ కవితలో, పురుషుడి దృక్కోణం నుండి సమాధానం ఉంటుంది.  

అనేక కారణాల వల్ల ప్రేమికులు విడిపోవడం చాలా సందర్భాలలో జరుగుతుంది. కానీ అన్నిటిలోనూ ఒకరు వాళ్ల విడిపోవడానికి కారణమైన విషయాన్ని మన్నించగలిగినా/ మరిచిపోవాలని చూసినా, రెండవవారు దాన్ని క్షమించలేరు. అప్పుడుకూడ, కొందరిలో  ఉదాత్తమైన వ్యక్తిత్వం, అవతలి వ్యక్తి పట్ల నిజమైన ప్రేమానురాగాలూ వ్యక్తమవుతూనే ఉంటాయి. ఈ కవిత, బహుశా అతని తొలిప్రేయసి Florence తో విడిపోయిన సందర్భంలో వ్రాసి ఉండవచ్చునని కొందరి ఊహ.

Oscar Wilde
Oscar Wilde (Photo credit: Wikipedia)

.

My Voice

.

Within this restless, hurried, modern world

We took our hearts’ full pleasure – You and I,

And now the white sails of our ship are furled,

And spent the lading of our argosy.

.

Wherefore my cheeks before their time are wan,

For very weeping is my gladness fled,

Sorrow has paled my young mouth’s vermilion,

And Ruin draws the curtains of my bed.

.

But all this crowded life has been to thee

No more than lyre, or lute, or subtle spell

Of viols, or the music of the sea

That sleeps, a mimic echo, in the shell.

.

Oscar Wilde

(16 October 1854 – 30 November 1900)

Irish Poet

For an analysis of the poem pl. visit:

1. http://www.helium.com/items/2252109-poetry-analysis-my-voice-by-oscar-wilde

2. http://kellyrfineman.blogspot.com/2009/05/her-voice-and-my-voice-by-oscar-wilde.html

నా శ్రీమతికి (నా కవితల ప్రతితో)… అస్కార్ వైల్డ్.

.

ఈ కావ్యానికి తొలిపలుకుగా

నేను గొప్ప పీఠిక ఏదీ రాయలేను;

కానీ, ఖచ్చితంగా చెప్పగలను

ఇది ఒక కవి,  కవితకిచ్చే అంకితం అని.

.

ఈ రాలిన సుమదళాలు

నీకు సుందరంగా కనిపించగలిగితే…

నీ కురులలో ఒద్దికగా ఒదిగేదాకా

నా ప్రేమ గాలిలో తేలియాడుతూనే ఉంటుంది.

.

ప్రేమరహితమైన ఈ ప్రపంచాన్ని

చలిగాలులూ, హేమంతమూ గడ్డకట్టిస్తే

అది నీ చెవులలో తోటఊసులు చెబుతుంది

అవి, నీకొకతెకే అర్థమవుతాయి.

.

ఆస్కార్ వైల్డ్.

16 October 1854 – 30 November 1900

ఐరిష్  కవీ, రచయితా, నాటక కర్తా.

Oscar Wilde at Oxford
Oscar Wilde at Oxford (Photo credit: Wikipedia)

.

To My Wife – With A Copy Of My Poems

.

I can write no stately proem

As a prelude to my lay;

From a poet to a poem

I would dare to say.
.

For if of these fallen petals

One to you seem fair,

Love will waft it till it settles

On your hair.
.

And when wind and winter harden

All the loveless land,

It will whisper of the garden,

You will understand.

.

Oscar Wilde

16 October 1854 – 30 November 1900

Irish Poet, Playwright and Writer.

తేలికగా నడవండి … ఆస్కార్ వైల్డ్ (తన చెల్లెలి స్మృతిలో)

Oscar Wilde at Oxford
Oscar Wilde at Oxford (Photo credit: Wikipedia)

.

అడుగులు తేలికగా వేసి నడవండి,
ఆమె ఈ మంచుపొరకిందే ఉంది

ష్! నెమ్మదిగా మాటాడండి,
ఆమె విరులు విరియడాన్ని వినగలదు

మేలిమి బంగారంలాంటి ఆమె జుత్తు,
తుప్పుతో కళంకితమైపోయింది

పాపం, చిన్నపిల్ల, ఎంతో అందమైనది,
మట్టిలో కలిసిపోయింది

తెల్లకలువలాంటిది,
హిమమంత తెల్లనిది

తను స్త్రీనన్న విషయంకూడ
తెలియనంత అమాయకంగా పెరిగింది

ఇప్పుడు శవపేటిక, బరువైన రాతిపలకా
ఆమెగుండెమీద కూర్చున్నాయి

నేను ఏకాంతంలో శోకిస్తున్నాను,
తను మాత్రం ప్రశాంతంగా నిద్రిస్తోంది

చాలు. ఆపండి. మీ వీణా నాదాల్నీ,
శోక గీతికలనీ ఆమె వినలేదు.

నా జీవితం ఇక్కడ సమాధి అయిపోయింది.
కాస్త మట్టివేసి కప్పేయండి.

.

ఆస్కార్ వైల్డ్.

.

Tread Gently

.

Tread lightly, she is near

Under the snow,

Speak gently, she can hear

The daisies grow

All her bright golden hair

Tarnished with rust,

She that was young and fair

Fallen to dust.

Lily-like, white as snow,

She hardly knew

She was a woman, so

Sweetly she grew.

Coffin-board, heavy stone,

Lie on her breast,

I vex my heart alone,

She is at rest.

Peace, peace, she cannot hear

Lyre or sonnet,

All my life’s buried here,

Heap earth upon it.

ఆవేదన … ఆస్కార్ వైల్డ్

Oscar Wilde
Oscar Wilde (Photo credit: boocal)

.

విశాలమైన బంగారపు పాతరలు సంపాదించి

తుఫానుల వలన భయం గాని

అడవిలో చెట్లు కూలుతున్న చింతగానీ లేని

ఎవరికైనా జీవితం సాఫీగా సాగితే సాగనీ

.

ఆకలితో అలమటించిన రోజుల వేదనగాని

బాధలూ కన్నీళ్లతో తలపండిన తండ్రిగాని

ఏకాంతంలో దుఃఖాశృవులు రాల్చే తల్లిగాని ఎరుగక

ఎవరికైనా జీవితం సాఫీగా సాగితే సాగనీ.

.

కానీ, అలయించే కష్టాల,పోరాటాల బాటలో

కాళ్ళరిగినా, ఎంత జీవనవిషాదంలోనైనా

దేవునికి చేరువగా నిచ్చెనలు వేసేవారికి

మాత్రం జీవితం సాఫీగా సాగిపోవాలి

.

ఆస్కార్ వైల్డ్

(16 October 1854 – 30 November 1900)

.

A Lament

.

O well for him who lives at ease
With garnered gold in wide domain,
Nor heeds the splashing of the rain,
The crashing down of forest trees.

O well for him who ne’er hath known
The travail of the hungry years,
A father grey with grief and tears,
A mother weeping all alone.

But well for him whose feet hath trod

The weary road of toil and strife,
Yet from the sorrows of his life
Builds ladders to be nearer God.

.

Oscar Wilde

(16 October 1854 – 30 November 1900)

Irish Dramatist, Poet and Author.

For his bio please visit: http://www.online-literature.com/wilde/

రాకుమారి ఘనకార్యం … ఆస్కార్ వైల్డ్

Image Courtesy: http://www.xeniaschmidt.com

.

నిశ్చలాంబువులలో సప్త తారకలు
నిర్మలాకాశంలో సప్త ఋషులు
రాకుమారికి సప్తవ్యసనాఘాతాలు
గుండెలోతులలో గుర్తుగా మిగులు

ఆమె పాదాల చెంత ఎర్రగులాబులు
(ఆమె ప్రాభాతవర్ణపు కురులలోనూ ఎర్రగులాబులే)
అరే, ఆమె హృదయమూ, లేనడుముల సంగమంలోనూ
ఎర్రగులాబులు దాగున్నాయి!.

ఆ రెల్లు పొదల్లో, పరివేల్లములపై
చచ్చిపరున్న యోధుడు అందంగా ఉన్నాడు.
మృష్టాన్నం దొరికిన ఆనందంలో
చిరుచేపలు తెగ సంబరపడుతున్నాయి

ఆ కుర్రాడు దీర్ఘనిద్రలోనూ ముచ్చటగా ఉన్నాడు
(స్వర్ణాంబరాలెప్పుడూ మృత్యువుకి ఎరలేగదా!)
అదిగో ఆకసంలోకి  చూడు, కాకోలాలు
నల్లగా, చీకటంత నల్లగా ఎగురుతున్నై.

అక్కడ ఊరకే చచ్చిపడున్న చేతులేం చేస్తాయి?
(ఆమె చేతులపై రక్తపు మరకలున్నాయి)
ఆ లిల్లీలపై ఎందుకుచెప్మా ఎర్రమచ్చలున్నై?
(నదీసైకతాలపై రక్తపు జాడలున్నై.)

దక్షిణం నుండి  తూర్పుకి రెండూ
ఉత్తరం నుండి పడమటికి రెండూ ఎగురుతునై
బొంతకాకులకి అది పసందైన విందు
రాకుమారికి నిర్భరమైన కనువిందు

ఆమెని నిజంగా ప్రేమించినవాడొకడున్నాడు
(అయ్యో, గడ్డకట్టిన నెత్తురింకా ఎర్రగానే ఉంది)
తనగొయ్యి తానే తవ్వుకున్నాడు, కర్రి “యూ” చెట్టుక్రింద
(ఒక గొయ్యి నలుగురికి సరిపడేంత)

స్థాణువైపోయిన ఆకాసంలో చంద్రుడులేడు
బిక్కచచ్చిన నీటిలోనూ లేడు
ఆమె చేసిన పాపాలు ఏడు
అతను చేసిన పాపం మాత్రం… ఒక్కడు!

.

Image Courtesy: http://upload.wikimedia.org

ఆస్కార్ వైల్డ్

(అక్టోబరు 16, 1854 – నవంబరు 30, 1900)

ఐరిష్ కవీ, నాటకకర్తా, నవలాకారుడూ

(బహుశా, షేక్స్పియరు తర్వాత,   రసస్ఫోరకములైన అతని సూక్తులకి (మన వేమనలా) అంత విస్తృతంగా  ఉటంకించబడే రచయిత ఒక్క ఆస్కార్ వైల్డుమాత్రమే అని నా అభిప్రాయం.  మంచి సాహిత్య సంస్పర్శ ఉన్న కుటుంబంలో పుట్టి (అతని తల్లి కవయిత్రి ఐరిష్ జాతీయ వాది. అతనికి చిన్నతనం లోనే ప్రాచీనకవుల గీతాలు చదివి వినిపించి సాహిత్యానికి కావలసిన ఆవేశాన్నీ, పదసంపదనీ అందించింది)చిన్నతనంలోనే అతను చూపించిన ఆశావహమైన భవిష్యత్తుని కొంతవరకు అందుకోగలిగేడు. అతని నవల The Picture of Dorian Gray, అతని నాటకం, The Importance of Being Earnest అతనికి ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టాయి.  జీవిత చరమాంకంలో తన అభిప్రాయాన్ని మార్చుకుని తన నవలలో దాన్ని స్ఫురింపజేసినా,  జీవితం అసంపూర్ణమనీ, కళని జీవితం అనుకరించాలనే Aestheticism అనే సిధ్దాంతాన్నినమ్మి దాన్ని వ్యాప్తిచేసిన వాళ్లలో ముఖ్యుడు.

ఈ కవితలో పైన చెప్పిన Aestheticism  కి అంగాలైన ప్రతీకలూ, సంకేతాలూ వాడుతూ, ఎక్కడా వాచ్యం చెయ్యకుండా, రాజకుమారి చేసిన ఘాతుకాన్ని ఎలా చెప్పాడో పరిశీలించండి.

.

The Dole of King’s Daughter

.

Seven stars in the still water,

And seven in the sky;

Seven sins on the King’s daughter,

Deep in her soul to lie.

.

Red roses at her feet,

(Roses are red in her red-gold hair)

And O where her bosom and girdle meet

Red roses are hidden there.

.

Fair is the knight who lieth slain

Amid the rush and reed,

See the lean fishes that are fain

Upon dead men to feed.

.

Sweet is the page that lieth there,

(Cloth of gold is goodly prey,)

See the black ravens in the air,

Black, O black as the night are they.

.

What do they there so stark and dead?

(There is blood upon her hand)

Why are the lilies flecked with red?

(There is blood on the river sand.)

.

There are two that ride from the south to the east,

And two from the north and west,

For the black raven a goodly feast,

For the King’s daughter to rest.

.

There is one man who loves her true,

(Red, O red, is the stain of gore!)

He hath duggen a grave by the darksome yew,

(One grave will do for four.)

.

No moon in the still heaven,

In the black water none,

The sins on her soul are seven,

The sin upon his is one.

.

Oscar Wilde

(16 October 1854 – 30 November 1900)

Irish Poet, Dramatist and Writer

Perhaps  next to Shakespeare, only Oscar Wilde is very famous and extensively quoted for his pithy statements. A precocious child of great promise, he lived up to it in a way through two great works…  The Picture of Dorian Gray, a novel and The Importance of Being Earnest… a drama. He was an advocate of Aestheticism in art, a philosophy which professes that the purpose of art is to provide refined sensual pleasure rather than convey any moral instruction. For its adherents, Nature is crude and it should follow art than the other way; and, they used suggestions and symbols, in place of statements, to great effect.  However, at the fag-end of his life he had a change of mind about the supremacy of art over Nature.

You may please note how beautifully he depicted the gory crime of the King’s Daughter without making any specific statement… in the tradition of Aestheticism mentioned above.  The still waters, the still heavens of the last stanza are the parting punch to the poem. Enjoy!

పోర్షియా— ఆస్కార్ వైల్డ్

 

http://static.enotes.com/images/enotes/9493/MV4.jpg
Image Courtesy: http://static.enotes.com

.

బెసానియో ఆ సీసపు పెట్టె మీద

తన సర్వస్వాన్నీ ఒడ్డేటంత సాహసం చేసేడన్నా,

ఆ గర్విష్టి ఏరగాన్  తలదించుకున్నాడన్నా,

ప్రేమతోజ్వలించిన మొరాకో హృదయం ఒక్కసారి చల్లబడిందన్నా

నాకేం ఆశ్చర్యం కలగడం లేదు.

ఎందుకంటే నేను చూసిన వెరోనియన్ వనితలలో

మేలిమికన్నా మేలిమైన సూర్యకాంతి వంటి

ఆ దివ్య  స్వర్ణరచిత దుస్తులలో నీ అందానికి

ఏ ఒక్కరూ  సగంకూడా సరితూగడం లేదు.

అయినా, వివేచనాకవచముగల నువ్వు,

ఆ గంభీరమైన లాయరు గౌను ధరించి,

వెనిస్ నగర చట్టం, ఏంటోనియో గుండె

శాపగ్రస్తుడైన ఆ “యూదు”కి బలికాకుండా

న్యాయవితరణ చేసేవు.

ఓ పోర్షియా! నా గుండె తీసుకో! అది నీకు చెందాలి.

బాండులేదని నేను తగువులాడను.

.

ఆస్కార్ వైల్డ్

.

Portia

.

I marvel not Bassanio was so bold

To peril all he had upon the lead,

Or that proud Aragon bent low his head,

Or that Morocco’s fiery heart grew cold:

For in that gorgeous dress of beaten gold

Which is more golden than the golden sun,

No woman Veronesé looked upon

Was half so fair as thou whom I behold.

Yet fairer when with wisdom as your shield

The sober-suited lawyer’s gown you donned

And would not let the laws of Venice yield

Antonio’s heart to that accursèd Jew–

O Portia! take my heart: it is thy due:

I think I will not quarrel with the Bond.

.

Oscar Wilde

%d bloggers like this: