Tag: omar khayyam
-
రుబాయీ— XIV ఉమర్ ఖయ్యాం, పెర్షియను కవి
మనుషులు పెట్టుకునే ఈ భౌతికమైన ఆశలు బూడిదపాలౌతాయి… తప్పితే, అప్పుడప్పుడు నిజమౌతాయి; కానీ ఎడారి ఇసకమీద కురిసిన మంచులా, త్వరలోనే ఒక గంటో, రెండుగంటలో మెరిసి… మాయమౌతాయి. . ఉమర్ ఖయ్యాం 18 May 1048 – 4 December 1131 పెర్షియను కవి Omar Khayyam XIV The Worldly Hope men set their Hearts upon Turns Ashes — or it prospers ; and anon, Like Snow upon […]
-
రుబాయీ- XVI, ఉమర్ ఖయ్యాం, పెర్షియను కవి
ఒకటి తర్వాత ఒకటి పగలూ రాత్రీ ద్వారాలుగా ఉన్న ఈ పాడుబడ్డ సత్రంలో, చూడు, సుల్తానులు ఒకరి వెనక ఒకరు ఇక్కడ బసచేసిన ఆ గంటా, ఘడియా తమ వైభవాల్ని ప్రదర్శించి, ఎవరిత్రోవన వాళ్ళు పోయారో! . ఉమర్ ఖయ్యాం 18 May 1048 – 4 December 1131 పెర్షియను కవి .. Rubaiyat – XVI . Think, in this battered Caravanserai Whose doorways are alternate Nights and Day, […]
-
రుబాయీ XIV … ఉమర్ ఖయ్యాం, పెర్షియన్
మనుషులు మనసు లగ్నంచేసే లౌకికాపేక్షలు బూడిదైపోతాయి… లేదా వర్ధిల్లుతాయి; ఐనా, అవి త్వరలోనే పొడిబారిన ఎడారి ముఖం మీది మంచు బిందువుల్లా ఘడియో రెండు ఘడియలో వెలుగు వెలిగి… మాయమౌతాయి. . ఉమర్ ఖయ్యాం 18 May 1048 – 4 December 1131 పెర్షియన్ . . Rubai XIV The Worldly Hope men set their Hearts upon Turns Ashes — or it prospers; and anon, […]
-
రుబాయీ – 51… ఉమర్ ఖయ్యాం, పెర్షియన్ కవి
ఆ రాసే చెయ్యి రాస్తూనే ఉంటుంది, ఎంతరాసినా ఆగదు; ముందుకు పోతూనే ఉంటుంది; నీ ప్రార్థనలూ, మేధస్సూ అందులో ఒక్క వాక్యాన్ని కూడా వెనక్కి వచ్చి సరిదిద్దేలా చెయ్యలేవు, నువ్వు ఎన్ని కన్నీళ్ళు కార్చు; ఒక్క అక్షరంకూడా చెక్కుచెదరదు. . ఉమర్ ఖయ్యాం (18 May 1048 – 4 December 1131) పెర్షియను కవీ, తాత్త్వికుడూ, గణిత, ఖగోళ శాస్త్రజ్ఞుడు. (అనువాదం: ఫిజెరాల్డ్ ) . Rubai- LI The Moving Finger writes; and, […]
-
పద్యం -38… ఉమర్ ఖయ్యాం, పెర్షియను కవి
నిన్న రాత్రి ఊరంతా తిరుగుతూ మట్టి కూజాలమ్మే దుకాణం దగ్గర ఆగేను, వాటిపక్కన నిశ్శబ్దంగా నిల్చున్న నేను, అవి ఇలా అనడం విన్నాను: ఎన్నో ఏళ్ళుగా మేము మా దారంట వచ్చిన లెక్కలేనంతమంది కుమ్మరుల, వ్యాపారుల ఆప్యాయపు స్పర్శకు పులకించాము. వాళ్ళందరూ అకస్మాత్తుగా నిష్క్రమించారు– మమ్మల్ని వదిలి మరి వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్ళేరో ఏమో! . ఉమర్ ఖయ్యాం (18 May 1048 – 4 December 1131) పెర్షియను కవీ, తాత్త్వికుడూ, గణిత, ఖగోళ శాస్త్రజ్ఞుడు. […]
-
ఉమర్ ఖయ్యాం రుబాయీలు
. ఓహో, జ్ఞానుల్ని చర్చించుకోనీ! రా, ఈ ముసలి ఖయ్యాం తోడుగా నడు; ఒకటి మాత్రం నిజం- పరిగెడుతుంది జీవితం మిగతావన్నీ అబద్ధమైనా ఈ ఒక్కటి మాత్రం నిజం: ఒకసారి విరిసిన కుసుమం, రాలిపోవడం తథ్యం.. వయసులో ఉన్నప్పుడు తరచు సేవించేవాడిని పండితులనీ, యోగులనీ ; ఇదీ, అదీ, ప్రతి విషయాన్నీ చాలా కూలంకషంగా తర్కించేవాళ్ళు; ఎన్నిసార్లు వెళ్ళినగానీ నాకేం లాభించలేదు. వెళ్ళినద్వారంలోంచే తిరిగొచ్చేవాడిని వాళ్లలో జ్ఞాన బీజాలని అక్షరాలా నాటేను; కష్టపడి చేజేతులా […]
-
The Cultivator … Duvvoori Ramireddy (Part 1)
The name of Kavikokila Duvvoori Ramireddy strikes a chord in the old generation recalling his translation of Omar Khayyam’s Rubaiyat as “Panasala”. Besides being prolific in Arabic, Sanskrit, Telugu and English, he had published 4 volumes of poetry and a number of articles on folklore. In his book “Krishivaludu” (The Cultivator), Sri Reddy describes the […]