Tag: Oliver Wendell Holmes
-
పరిహాసానికి పరాకాష్ఠ … ఆలివర్ వెండెల్ హోమ్స్ , అమెరికను
. మాంఛి సంతోష సమయంలో ఒకసారి నేను నాలుగు మాటలు రాసేను కవితలా. అలవాటు ప్రకారం, చదివినవాళ్ళు ఓహో అద్భుతంగా ఉంటుందని అంటారనుకున్నాను. అవి ఎంత సరసంగా, అద్భుతంగా ఉన్నాయంటే మామూలు పరిస్థితుల్లో అంత అసభ్యంగా గట్టిగా నవ్వనినేనే పగలబడి నవ్వలేక చచ్చాను. మా పనివాడిని పిలిచేను. అతనొచ్చేడు; నాలాంటి అర్భకుడు పిలవగానే వచ్చేడంటే అతనెంత మంచివాడో కదా! అతను మంచి అవయవపుష్టి ఉన్నవాడు. “ఇవి ప్రింటరుకి తీసుకెళ్ళి ఇవ్వు” అన్నాను, అంటూ, ఇలా అలవాటైన హాస్యధోరణిలో…