అనువాదలహరి

పిచ్చికుక్కపై స్మృతిగీతం… ఆలివర్ గోల్డ్ స్మిత్, ఐరిష్ కవి

సదయులారా! సహృదయులారా!

నా కథని ఒకసారి ఆలకించండి!

ఇందులో మీకు కొత్తదనం కనిపించకపోతే

మిమ్మల్ని ఎక్కువసేపు నిలబెట్టదు.

అనగనగా ఇస్లింగ్టన్ అనే ఊరిలో

ప్రపంచమంతటా కీర్తిగణించిన,

ప్రార్థనచెయ్యడంలో అతన్ని మించినవాడు

లేడనిపించుకున్న ఒక భక్తుడుండేవాడు.

శత్రువునైనా, స్నేహితుడినైనా సమదృష్టితో చూసి

సాంత్వననీయగల కరుణార్ద్ర హృదయుడాతడు

అతనికి వస్త్రధారణపై మమకారం లేక

ఎప్పుడూ దిగంబరిగానే తిరిగే వాడు.

అన్ని ఊళ్ళలో ఉన్నట్టే ఆ ఊరిలోకూడా,

ఒకానొక కుక్క ఉండేది,

అక్కడ మేలుజాతి వేటకుక్కనుండి, సంకరజాతి,

ఊరకుక్కల వరకు అన్నిరకాలూ ఉన్నాయి.

మొదట్లో ఆ వ్యక్తీ, ఈ కుక్కా స్నేహంగా ఉండేవారు

కానీ ఎందుకో కోపం వచ్చి స్నేహం చెడింది.

అంతే, దాని ప్రతాపం చూపించడానికి,

పిచ్చెత్తినట్టు ఒకసారి అతన్ని బాగా కరిచేసింది.

అయ్యో అంటూ చుట్టుపక్కల వీధులవాళ్ళు

ఆశ్చర్యంతో, పరిగెత్తుకుంటూ వచ్చారు

ఈ కుక్కకి నిజంగా పిచ్చెక్కిందనీ, లేకపోతే

అంతమంచి మనిషిని కరుస్తుందా అని కొందరన్నారు.

దేముడిని నమ్మిన ఏ వ్యక్తి కంటికైనా

ఆ గాయం తీవ్రమైనదని తెలుస్తూనే ఉంది.

కొందరు ఆ కుక్క నిజంగా పిచ్చిదని నిర్థారిస్తే

ఆ మనిషి ఇక బతకడని మరికొందరు నిర్థారించేరు.

కాని, కొద్దిరోజుల్లోనే ఒక వింత జరిగి

ఆ ధూర్తులు చెప్పినదంతా అబద్ధమని తేల్చింది.

ఆ మనిషి కుక్కకాటునుండి బయట పడ్డాడు

కానీ, పాపం, చచ్చిపోయింది మాత్రం ఆ కుక్కే!

.

(వికార్ ఆఫ్ వేక్ ఫీల్డ్ అన్న నవలనుండి)

ఆలివర్ గోల్డ్ స్మిత్

ఐరిష్ కవి, నవలాకారుడు, నాటక కర్తా.

Image Courtesy: http://upload.wikimedia.org

.

An Elegy on the Death of a Mad Dog

.

Good people all, of every sort,

Give ear unto my song;

And if you find it wondrous short,

It cannot hold you long.

In Islington there was a man,

Of whom the world might say,

That still a godly race he ran

Whene’er he went to pray.

A kind and gentle heart he had,

To comfort his friends and foes;

The naked everyday he clad,

When he put on his clothes.

And in that town a dog was found,

As many dogs there be,

Both mongrel, puppy, whelp, and hound,

And curs of low degree.

This dog and man at first were friends,

But when a pique began,

The dog, to gain his private ends,

Went mad, and bit the man.

Around from all the neighbouring streets

The wondering neighbours ran,

And swore the dog had lost its wits,

To bite so good a man.

The wound it seem’d both sore and sad

To every Christian eye:

And while they swore the dog was mad,

They swore the man would die.

But soon a wonder came to light,

That show’d the rogues they lied,

The man recover’d of the bite,

The dog it was that died.

.

(From The Vicar of Wakefield)

Oliver Goldsmith

(10 November 1728 – 4 April 1774)

Irish Novelist, Playwright and Poet

Poem Courtesy:

https://archive.org/details/childrensgarlan01unkngoog/page/n263

ఓ జ్ఞాపకమా! నమ్మక ద్రోహీ! … ఆలివర్ గోల్డ్ స్మిత్, ఐరిష్ కవి

ఓ జ్ఞాపకమా! నమ్మక ద్రోహీ,

నువ్వొక మిధ్యవి, అయినా విసిగిస్తూ ఉంటావు

ఎప్పుడూ గతకాలపు వైభోగాలు గుర్తుచేస్తూ

గతాన్ని అంతటినీ ఒక బాధగా మిగులుస్తావు.

ప్రపంచం లాగే, నువ్వూ బాధితుల్నే బాధిస్తావు,

నీ నవ్వులు, పాపం ఆ బడుగు జీవి వేదనను పెంచుతూంటుంది

ఎవడైతే అందరి శ్రేయస్సూ ఆశిస్తుంటాడో

వాడికి తప్పకుండా నువ్వో బద్ధ శత్రువవుతావు.  

.

ఆలివర్ గోల్డ్ స్మిత్

(10 November 1730 – 4 April 1774)

ఐరిష్ కవి.

.

Oliver Goldsmith

,

O Memory!  Thou Fond Deceiver!

 .

O Memory!  Thou fond deceiver,

  Still importunate and vain,

To former joys recurring ever,

  And turning all the past to pain;

 

Thou, like the world, the oppress’d oppressing,

  Thy smiles increase the wretch’s woe;

And he who wants each other blessing

In thee must ever find a foe

.

Oliver Goldsmith

Irish Poet

(10 November 1730 – 4 April 1774)

Poem Courtesy:

The Book of Georgian Verse.  1909.

Ed. William Stanley Braithwaite.

(http://www.bartleby.com/333/26.html)

పల్లెటూరి బడిపంతులు… ఆలివర్ గోల్డ్ స్మిత్, ఇంగ్లీషు-ఐరిష్ కవి.

(విజయనగరంలో గంటి వెంకటరమణయ్యపంతులనే లెక్కలమేష్టారు MRMP School లో పనిచేస్తూ ఉండేవారు. ఆయన ఇంగ్లీషులోకూడ దిట్ట. ఆయన మా గురువుగారు. చాలకాలం ఆంధ్రప్రదేశ్  టీచర్స్ ఫెడరేషన్ కి సెక్రటరీగా కూడ పనిచేశారు. గురాచారివారి వీధిలో వాళ్ళ ఇల్లు ఉదయాన్నే ఎప్పుడూ పిల్లలతో కళకళలాడుతుండేది. ఈ కవిత చదువుతుంటే నాకు ఆయనే గుర్తువస్తారు. ఈ కవితలో చెప్పిన స్కూలు టీచరుకి ఉన్న చాలా లక్షణాలు ఆయనలో ఉన్నాయి. ముఖ్యంగా మాటకరుకుగా ఉన్నా మనసు  మెత్తదనం, Strict Discipline, లెక్కలలో ప్రావీణ్యం, పిల్లలపట్ల అనురాగం, విద్యపట్ల ఉన్న అపారమైన గౌరవం.  కాలం ఎంత నిర్దాక్షిణ్యంగా వ్యక్తుల్నీ చరిత్రనీ తనతో మోసుకుపొతుందో కదా!  Nobody remembers GVR or SS Master now.

GVR మాష్టారూ, ఇది మీకు పాదాభివందనం తో.)

.

అదిగో, ఊరిపొలిమేర రోడ్డువార కంచెపక్కన

ఎవరికీ పట్టకుండా పూచిందో అందమైన ముళ్ళగోరింట

అక్కడే ఒకప్పుడు, సందడిగా ఉండే వీధరుగుమీద

పిల్లలకి పాఠాలుచెబుతూ చిన్నబడి నడిపేవాడొక పంతులు

.

కఠినమైన క్రమశిక్షకుడు, చూడ్డానికి మహాకఠినుడు,

నాకు బాగా అనుభవం, నాకే కాదు,బడి ఎగేసే ప్రతిపిల్లాడికీ ఎరికే;

ఆ జడిసే పిల్లలు ఎంతబాగ గ్రహించగలరంటే, ఉదయాన్నే

అతని ముఖం చూసి ఆ రోజు ఎలా ఉంటుందో ముందే పసిగట్టేవాళ్ళు.

.

అతను వేసే జోకులకి తెచ్చిపెట్తుకుని మరీ నవ్వే వాళ్ళు

ఎందుకంటే, అతను లెక్కలేనన్ని జోకులేసేవాడు

అతనుగాని నొసలు చిట్లించేడా, విపత్తు ముందుందని

అందరికీ గుసగుసలతో విషయం నలుగురికీ వ్యాపించేది

.

అయితేనేం,అతని మనసు వెన్న. అతను కఠినంగా ఉండవలసి వస్తే

నేరం అతనిదికాదు, విద్యపట్ల అతనికున్న నిబద్ధతే కారణం.

ఊరు ఊరంతా అతనికి ఎంతోతెలుసునని తీర్మానించింది

అతనికి రాయనూ, గణించనూ వచ్చుననడంలో సందేహంలేదు.

.

భూములు కొలవడం,లెక్కలుకట్టడం; రాబోయే ఉపద్రవాలు చెప్పడమే కాదు;

అతను వస్తువులనాణ్యత నిర్ణయించగలడని కథలుగా చెప్పుకుంటారు;

వాదనాపటిమలో కూడా, ఆ పంతులుకి ప్రత్యేకత ఉంది

ఓడిపోయినప్పటికీ, వాదించగలశక్తి అతనికుంది.

.

మాటాడుతున్నప్పుడు మాటలు గంభీరంగా ప్రవాహంలావస్తుంటే

ఆశ్చర్యపోతూనే గ్రామీణులు అతనిచుట్టూ చేరేవారు;

వాళ్ళకి చూస్తున్నకొద్దీ ఆశ్చర్యం కలుగుతుండేది

ఇంత చిన్న బుర్ర అన్ని తెలివితేటలు ఎలా ఉన్నాయా అని.

.

కాని,  ఇపుడదతని కీర్తి అంతా గతం. ఎక్కడైతే అతను

ఎన్నో విజయాలు చవిచూసేడో, ఇపుడది పూర్తిగా మరుగుపడింది.

.

ఆలివర్ గోల్డ్ స్మిత్

(10 November 1730 – 4 April 1774)

ఇంగ్లీషు-ఐరిష్ కవీ, నవలా కారుడూ, నాటక కర్తా.

(గోల్డ్ స్మిత్ పెరు చెప్పగానే వెంటనే గుర్తువచ్చే రచనలు The Deserted Village కవిత, Vicar of Wakefield నవల, She Stoops to Conquer నాటకం. 18వ శతాబ్దంలో ఇంగ్లాండులో, నేటి భారతదేశంలో లా,భూములు కోల్పోయి జీవనాధారం పోయి పట్టణాలకు పల్లె ప్రజలు వలస పోయినపుడు గ్రామీణజీవనం ఎంత అతలాకుతలం అయిందో గోల్డ్ స్మిత్ తన కవిత “Deserted Village” లో బాగా చిత్రించాడు. అతనికి బాగా పేరు తెచ్చిపెట్టిన ఈ కవితలో కూడా గ్రామీణుల అమాయకత్వం, చదువుపట్ల, చదువుకున్న వారిపట్ల (ఇప్పటికీ) ఉండే ఎనలేని గౌరవం, విభ్రమంకనిపిస్తాయి.)

Oliver_Goldsmith
Oliver_Goldsmith (Photo credit: Wikipedia)

.

Village School Master

.

Beside yon straggling fence that skirts the way
With blossom’d furze unprofitably gay,
There, in his noisy mansion, skill’d to rule,
The village master taught his little school;
A man severe he was, and stern to view,
I knew him well, and every truant knew;
Well had the boding tremblers learn’d to trace
The days disasters in his morning face;
Full well they laugh’d with counterfeited glee,
At all his jokes, for many a joke had he:
Full well the busy whisper, circling round,
Convey’d the dismal tidings when he frown’d:
Yet he was kind; or if severe in aught,
The love he bore to learning was in fault.
The village all declar’d how much he knew;
‘Twas certain he could write, and cipher too:
Lands he could measure, terms and tides presage,
And e’en the story ran that he could gauge.
In arguing too, the parson own’d his skill,
For e’en though vanquish’d he could argue still;
While words of learned length and thund’ring sound
Amazed the gazing rustics rang’d around;
And still they gaz’d and still the wonder grew,
That one small head could carry all he knew.
But past is all his fame. The very spot
Where many a time he triumph’d is forgot.

.

Oliver Goldsmith

(10 November 1730 – 4 April 1774)

English Irish Poet, Dramatist, and Novelist.

It is presumed that Goldsmith had unveiled the school master in this poem on the lines of  Paddy Bryne, his own school master at Lissoy, Ireland. He was able to record the history of 18th century village life when the farmers lost ownership of their lands; some of them became workers in their own lands for survival and most of them migrated to cities making villages barren and deserted.   

పిచ్చికుక్క స్మృతికి… Oliver Goldsmith

Image Courtesy: http://covers.openlibrary.org

.

మంచి మనసున్న మనుషులు మీరంతా
నా పాట కాస్త చెవొగ్గి వినండి
ఇది మీకు వింతగా అనిపించకపోతే
మీ పని మీరు చేసుకుందురుగాని

ఇస్లింగ్టన్ లో ఒక మనిషుండేవాడు
అతని గురించి లోకమేమనుకునేదంటే
అతను ప్రార్థన చెయ్యడానికి నిలబడితే
ఆ దేముడే దిగివచ్చేడా అని అనిపించేదట.

మిత్రులనీ శతృవులనీ అనునయించడానికి
అతనికి సున్నిత, దయార్ద్ర హృదయముంది
అతను వస్త్రధారణచేసేడంటే కేవలం
తన నగ్నత్వాన్ని కప్పిపుచ్చడానికే

వేటకుక్కల్లాంటి మేలుజాతి మొదలు
సంకరజాతివీ, నాటుకుక్కలదాకా
ఉన్న ఆ ఊర్లో,  ఒక కుక్క ఉంది
మిగతా కుక్కల లాగే

మొదట్లో కుక్కకీ అతనికీ మంచి స్నేహమే
కాని వాళ్ళిద్దరిమధ్యా బెడిసికొట్టినతర్వాత
దాని గొప్పచాటుకుందికేమో అన్నట్టు
పిచ్చెక్కి, అతన్ని గట్టిగా కరిచేసింది

ఆ చుట్టుపక్కల వీధుల్లోంచి
అందరూ ఆశ్చర్యపోతూ పరిగెత్తుకొచ్చేరు
అంతమంచివాడిని కరిచిందంటే, ఖచ్చితంగా
దానికి పిచ్చెక్కి ఉంటుందని తిట్టిదిగపోసారు

పచ్చి పుండులాంటి గాయం చూస్తుంటే,
క్రిస్టియన్ అన్న వాడికెవడికైనా బాధేస్తుంది
దానికి పిచ్చెక్కిందని నిందిస్తూనే, పాపం అతను
చావడం ఖాయం అని నిశ్చయించుకున్నారు

కాని అంతలోనే వింతల్లోకి వింత ఒకటి జరిగి
వాళ్ళందరూ ఎంత దుర్మార్గులో తెలిసొచ్చింది
అందరూ అనుకున్నట్టుగాగాక, అతను తేరుకున్నాడు
ఎటొచ్చీ చచ్చిపోయింది, పాపం, ఆ కుక్కే!

.

ఆలివర్ గోల్డ్ స్మిత్

(నవంబరు 10, 1730 – ఏప్రిల్ 4, 1774)

ఇంగ్లీసు-ఐరిష్ కవీ, నాటక కర్తా, నవలా కారుడూ.

[ఇస్లింగ్టన్ అన్నది ఉత్తరలండనులో ఒకప్రదేశం(ఇప్పుడు లండను మహానగరంలో ఒక భాగమైపోయింది). ఆ రోజుల్లో జల్సాలకీ, పోకిరీ రాయుళ్ళకీ ప్రసిధ్ధి. ఈ కవితలో పైకి చాలా సాదాసీదాగా కనిపిస్తుంది గాని, ఇందులో వక్రోక్తి (Irony)ద్వారా కవి మంచి సందేశాన్ని అందిస్తున్నాడు…. కుక్కకాటుకంటే మనిషికాటు ఇంకా ప్రమాదకరమైనదని. ఇక్కడ మనిషి “నగ్నత్వం (Nakedness)” (అంటే సమాజానికి ప్రకటించే స్వరూపం కాక అసలు వ్యక్తిత్వం) మీద అతని చమత్కారం గమనించదగ్గది.]

ఆలివర్ గోల్డ్ స్మిత్ అనగానే The Deserted Village అన్న గొప్ప కవితా, The Vicar of Wakefield అన్న నవలా, She Stoops to Conquer అన్న Commedy of Manners నాటకం గుర్తొస్తాయి. 18వ శతాబ్దంలో బ్రిటిషుపార్లమెంటు Inclosure చట్టాన్ని తీసుకువచ్చి రైతులని రైతుకూలీలుగా మార్చినప్పుడు, ఒక గ్రామానికి గ్రామాన్నే నేలమట్టం చేసినప్పుడు హృదయం ద్రవించి వ్రాసిన ఆర్త గీతి The Deserted Village .

.

An Elegy on the Death of a Mad Dog

.

Good people all, of every sort,
Give ear unto my song;
And if you find it wondrous short,
It cannot hold you long.

In Islington there was a man
Of whom the world might say,
That still a godly race he ran—
Whene’er he went to pray.

A kind and gentle heart he had,
To comfort friends and foes;
The naked every day he clad—
When he put on his clothes.

And in that town a dog was found,
As many dogs there be,
Both mongrel, puppy, whelp, and hound,
And curs of low degree.

This dog and man at first were friends;
But when a pique began,
The dog, to gain some private ends,
Went mad, and bit the man.

Around from all the neighbouring streets
The wond’ring neighbours ran,
And swore the dog had lost its wits
To bite so good a man.

The wound it seemed both sore and sad
To every Christian eye;
And while they swore the dog was mad,
They swore the man would die.

But soon a wonder came to light
That showed the rogues they lied,—
The man recovered of the bite,
The dog it was that died!

Image Courtesy: http://upload.wikimedia.org

Oliver Goldsmith

(10 November 1730 – 4 April 1774)

An Anglo-Irish Poet, Dramatist, and Novelist.

%d bloggers like this: