అనువాదలహరి

తోటమాలి … రబీంద్రనాథ్ టాగోర్, భారతీయ కవి

ఈ రోజు రబీంద్రనాథ్ టాగోర్ 159 వ జన్మదిన వార్షికోత్సవం

నీకు అదే ఇష్టమనిపితే

నా పాటని ఇప్పుడే ఆపేస్తాను.

నీ గుండె ఉద్వేగానికి లోనవుతోందంటే

నీ ముఖంలోకి చూడడం విరమించుకుంటాను. 

నడుస్తూ నడుస్తూ, ఆశ్చర్యంతో అడుగు తడబడితే  

నేను ప్రక్కకి తొలగి, వేరే దారి చూసుకుంటాను.

పూదండ గ్రుచ్చుతూ తడబడుతున్నావంటే

అలికిడిలేని నీ తోటవంక కన్నెత్తైనా చూడను. 

ఈ కొలనునీరు తుంటరిగా నీపైకి ఎగురుతోందంటే

ఈ ఒడ్డున నా పడవ నడపడమే మానుకుంటాను.

.

రబీంద్రనాథ్ టాగోర్

(7 May 1861 – 7 August 1941)

భారతీయ కవి

Image Courtesy: Wikipedia

The Gardener

If you would have it so,

I will end my singing.

If it sets your heart aflutter,

I will take away my eyes from your face.

If it suddenly startles you in your walk,

I will step aside and take another path.

If it confuses you in your flower-weaving,

I will shun your lonely garden.

If it makes the water wanton and wild,

I will not row my boat by your bank.

.

Rabindranath Tagore

(7 May 1861 – 7 August 1941)

Indian Poet

Poem Courtesy:  Contributed by Nirupama Ravindra

file:///C:/Users/hello/Google%20Drive/27th%20Feb%20%20Saved%20Files/My%20Literature%20%20Original/poetry%20collections/The%20Gardener-tagore_files/The%20Gardener-tagore.htm

నీవు లేక… హెర్మన్ హెస్, జర్మను కవి

సమాధి ఫలకంలా శూన్యంగా చూస్తుంటుంది

తలగడ రాత్రివేళ నా వైపు

నీ కురులలో తలవాల్చి నిద్రించకుండా

ఇలా ఒంటరిగా పడుకోవడం

ఇంత కఠినంగా ఉంటుందని ఊహించలేదు.

ఏ చప్పుడూ లేని ఇంటిలో నేను ఒంటరిని

వేలాడుతున్న లాంతరు మసిబారిపోయింది.

నీ చేతులు నా చేతిలొకి తీసుకుందికి

మెల్లగా చెయిజాచుతాను ,

కాంక్షాభరితమైన నా పెదవిని నీవైపు జాచి

నన్ను నేనే ముద్దుపెట్టుకుంటాను, నిరాశతో, నిస్సత్తువతో

చటుక్కున మేలుకుంటాను

నా చుట్టూ చలికప్పినచీకటి నిలకడగా ఆవహించి ఉంటుంది.

కిటికీలోంచి ఒక తారక స్పష్టంగా మెరుస్తుంటుంది…

సొగసైన నీ కురులేవీ?

మధురమైన నీ పెదవులెక్కడ?

ఇప్పుడు ప్రతి వేడుకలోనూ విషాదాన్నీ

ప్రతి మధువులోనూ విషాన్నీ దిగమింగుతున్నాను

నీవులేక ఇలా…

ఒంటరిగా, ఒక్కడినీ ఉండటం

ఇంతకష్టంగా ఉంటుందని ఎన్నడూ ఊహించలేదు.

.

హెర్మన్ హెస్

2 July 1877 – 9 August 1962

జర్మను కవి, నవలాకారుడు.

Hermann Hesse

Without You

.

My Pillow gazes upon me at night

Empty as a gravestone;

I never thought it would be so bitter

To be alone,

Not to lie down asleep in your hair.

I lie alone in a silent house,

The hanging lamp darkened,

And gently stretch out my hands

To gather in yours,

And softly press my warm mouth

Toward you, and kiss myself, exhausted and weak-

Then suddenly I’m awake

And all around me the cold night grows still.

The star in the window shines clearly-

Where is your blond hair,

Where your sweet mouth?

Now I drink pain in every delight

And poison in every wine;

I never knew it would be so bitter

To be alone,

Alone, without you.

.

Hermann Hesse

2 July 1877 – 9 August 1962

German Poet

Poem Courtesy:

http://famouspoetsandpoems.com/poets/hermann_hesse/poems/13707

చెప్పితీరవలసినది… గుంతర్ గ్రాస్ జర్మన్ కవి

(ఇది రెండు దేశాలమధ్య అగ్రరాజ్యాలు ఆడుకునే ఆట కాదు.  వాటి మధ్య చిచ్చుపెట్టి అగ్రరాజ్యాలు చలికాచుకునే అవకాశాన్ని ఇస్తున్న దేశాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. మనప్రయోజనాలకోసం ఎదురుగా ఘాతుకం జరుగుతున్నా మౌనంగా ఊరుకుని, చివరికిమౌనం వీడడంవల్ల, ఎవరికీ ప్రయోజనం చేకూరదన్నది చెప్పకనే చెబుతున్నాడు కవి. )

నేను మౌనంగా ఎందుకున్నాను,చాలా కాలం మనసులో దాచుకుని
అందరికీ విశదమూ, రణనీతిలో సాధనచేస్తూవస్తున్నదానిని?
యుద్ధం ముగిసిన తర్వాత, బ్రతికి బట్టకట్టగలిగిన మనమందరం
మహా అయితే, అధోజ్ఞాపికలుగా మిగిలిపోతాం.

ఒక మిషగా చూపించే ‘మొదటగా దాడిచేసే హక్కు’
ఇరానియన్లనందరినీ తుడిచిపెట్టవచ్చు…
ప్రగల్భాలుపలకడానికి బానిసలూ
వ్యవస్థీకృత వేడుకలకి అలవాటు పడినవారు వారు—
ఎందుకంటే, వాళ్ళ భూభాగంలో ఎక్కడో
ఒక బాంబు తయారు చేస్తున్నారేమోనని అనుమానం.
ఎన్నో ఏళ్లనుండి, మరొకదేశంలో, రహస్యంగానైనప్పటికీ,
అణుబాంబు తయారుచేయగల సమర్థత పెరుగుతూ వస్తోంది,
దాని మీద నియంత్రణా లేదు, పరిశీలనకు అందుబాటులోనూ లేదు
అయినప్పటికీ, నన్ను నేను నిరోధించుకుంటున్నాను
ఆ దేశం పేరు పైకిచెప్పకుండా. ఎందుకు?

ప్రపంచవ్యాప్తంగా ఈ వాస్తవాల్ని మరుగుపరిచే ప్రయత్నంలో
నా మౌనంకూడా దానికి ఒక అనుబంధప్రక్రియే,
వాటిని నేరారోపక అసత్యాలుగా భావిస్తాను
బలవంతంగా, శిక్ష అమలుచెయ్యవచ్చు
అందరూ దానిగురించి మరిచిపోయిన ఉత్తరక్షణంలో.
యూదులకు వ్యతిరేకత… జగద్విదితమే.

ఇప్పుడు, నా దేశం, ఇంతకు మునుపు
స్వయంగా ఆచరణలో పెట్టిన
పూర్వాపరాలులేని ఆ ఘాతుకాన్ని
సమయం దొరికినపుడల్లా ప్రతిఘటించినదాన్ని
కేవలం వ్యాపారప్రాతిపదికమీదే అయినప్పటికీ
కాకపోతే, తియ్యని మాటలతో  గతానికి పరిహారంగా
ప్రకటిస్తోంది ఇజ్రాయేలుకి ఒక “U-Boat” అందజేస్తానని,
దాని ప్రత్యేకత సర్వనాశనం చెయ్యగల క్షిపణుల్ని
ఒక్క అణుబాంబైనా తయారుచేస్తున్న దాఖలాలేని దేశంపై మోహరించడం.
భయం నిశ్చయాన్ని కలిగిస్తుంది కనుక
నేను చెప్పవలసింది చెబుతాను.

నేను ఇన్నాళ్లు మౌనంగా ఉన్నా, ఎందుకున్నట్టు?
ఎందుకంటే, నేను నా మూలాలు గురించి ఆలోచిస్తూ ఉన్నాను
దానికి అంటిన మరక ఇక ఎన్నటికీ సమసిపోదు
అందుకని ఇజ్రాయేలుకి నేను కట్టుబడి ఉన్నాను.

ఈ వాస్తవాన్ని ప్రకటిత సత్యంగా స్వీకరించకుండా
కట్టుబడే ఉండాలనుకున్నాను.
కానీ నా చివరి ఇంకుబొట్టుతోపాటు వయసు మీరి
ఇప్పుడే ఎందుకు చెబుతున్నాను
ఇజ్రాయేలు సమకూర్చుకుంటున్న అణుశసామర్థ్యం
ఇప్పటికే బలహీనంగా ఉన్న ప్రపంచశాంతికి ముప్పని?
ఎందుకంటే, అది చెప్పితీరవలసినది
రేపటికి అది చెప్పడం వలన సమయం మించిపోవచ్చు;
అదిగాక,జర్మనులుగా… ఇప్పటికే భారాన్ని మోస్తున్న మనం
ఒక నేరానికి సరుకు ఏర్పాటుచేసినవాళ్ళం అవొచ్చు.
అది ముందుచూపుతో గ్రహించవచ్చు. కనుక నేరంలో మన భాగస్వామ్యం
అలవాటుగా చెప్పే కుంటిసాకులతో తప్పించుకోగలిగేది కాదు.

ఇక నేను మౌనంగా ఉండలేనని ఒప్పుకుంటాను.
కారణం మొదటగా, నేను ఈ పశ్చిమదేశాల ఆత్మవంచనకి విసిగెత్తిపోయాను.
అదనంగా, మరికొంతమంది తమ మౌనాన్ని వీడేట్టు చెయ్యవచ్చు,
అందరూ గుర్తించిన ప్రమాదాన్ని ఆచరించబోయేవాడు
తనహింసామార్గాన్ని వీడేలా ప్రోత్సహించవచ్చు,
దానితో బాటే ఇజ్రాయేలు అణుసామర్థ్యమూ,
ఇరానులోని అణుకేంద్రాలూ శాశ్వతంగా
ఏ నిర్భందాలూ లేకుండా ఒక అంతర్జాతీయసంస్థ పర్యవేక్షణకి
రెండుదేశాల ప్రభుత్వాలూ అంగీకరించేలా
నిర్దేశించనూ వచ్చు.

ఈ ఒక్క మార్గం ద్వారానే అందరూ,
ఇజ్రాయేలీలూ, పాలస్తీనియన్లూ,
ఒక ఉన్మాదానికిలోనైన ఈ ప్రాంతంలోని
మిగిలిన దేశాల ప్రజలందరూ,
శతృమూకలమధ్య  అన్యోన్యంగా గా బ్రతికే అవకాశం ఉంది.
మనం కూడా;  లబ్ధిపొందవచ్చు.
.
గుంతర్ గ్రాస్

జర్మను కవి

Günter GrassPhoto Courtesy: Wikipedia

What Must Be Said

Why do I stay silent, conceal for too long
What clearly is and has been
Practiced in war games, at the end of which we as survivors
Are at best footnotes.

It is the alleged right to first strike
That could annihilate the Iranian people–
Enslaved by a loud-mouth
And guided to organized jubilation–
Because in their territory,
It is suspected, a bomb is being built.

Yet why do I forbid myself
To name that other country
In which, for years, even if secretly,
There has been a growing nuclear potential at hand
But beyond control, because no inspection is available?

The universal concealment of these facts,
To which my silence subordinated itself,
I sense as incriminating lies
And force–the punishment is promised
As soon as it is ignored;
The verdict of “anti-Semitism” is familiar.

Now, though, because in my country
Which from time to time has sought and confronted
Its very own crime
That is without compare
In turn on a purely commercial basis, if also
With nimble lips calling it a reparation, declares
A further U-boat should be delivered to Israel,
Whose specialty consists of guiding all-destroying warheads to where the existence
Of a single atomic bomb is unproven,
But as a fear wishes to be conclusive,
I say what must be said.

Why though have I stayed silent until now?
Because I thought my origin,
Afflicted by a stain never to be expunged
Kept the state of Israel, to which I am bound

And wish to stay bound,

From accepting this fact as pronounced truth.

Why do I say only now,
Aged and with my last ink,
That the nuclear power of Israel endangers
The already fragile world peace?
Because it must be said
What even tomorrow may be too late to say;
Also because we–as Germans burdened enough–
Could be the suppliers to a crime
That is foreseeable, wherefore our complicity
Could not be redeemed through any of the usual excuses.

And granted: I am silent no longer
Because I am tired of the hypocrisy
Of the West; in addition to which it is to be hoped
That this will free many from silence,
That they may prompt the perpetrator of the recognized danger
To renounce violence and
Likewise insist
That an unhindered and permanent control
Of the Israeli nuclear potential
And the Iranian nuclear sites
Be authorized through an international agency
By the governments of both countries.

Only this way are all, the Israelis and Palestinians,
Even more, all people, that in this
Region occupied by mania
Live cheek by jowl among enemies,
And also us, to be helped.

Gunter Grass

16 October 1927 – 13 April 2015

German Poet, Novelist, multi-faceted genius

1999 Nobel Prize for Literature.

Poem Courtesy:

http://www.theatlantic.com/international/archive/2012/04/gunter-grasss-controversial-poem-about-israel-iran-and-war-translated/255549/

 

అప్పుడే చనిపోవు… పాబ్లో నెరూడా చిలీ కవి

నువ్వు మెల్ల మెల్లగా మరణించడం మొదలెడతావు;

నువ్వు దేశాలు తిరగనప్పుడు,
పుస్తకాలు చదవనప్పుడు,
జీవన నిక్వాణాలని వినిపించుకోనపుడు,
నిన్ను నువ్వు అర్థం చేసుకోలేనపుడు
నువ్వు మెల్ల మెల్లగా మరణించడం మొదలెడతావు.

నీ ఆత్మగౌరవాన్ని చంపుకున్నప్పుడు,
ఇతరులు నీకు సహాయంచెయ్యడానికి ఇష్టపడనపుడు
నువ్వు మెల్ల మెల్లగా మరణించడం మొదలెడతావు.

నువ్వు నీ అలవాట్లకు బానిసవైపోయినపుడు,
ఎప్పుడూ నడచినతోవల్లోనే నడుస్తూ ఉన్నప్పుడు…
నీ దినచర్యమార్చుకోనపుడు,
నువ్వు వేర్వేరు రంగులు ధరించలేనపుడు,
లేక, అపరిచితులతో మాటాడడానికి ఇష్టపడనపుడు.
నువ్వు మెల్ల మెల్లగా మరణించడం మొదలెడతావు:

నీ నేత్రాలను చెమరింపజేసి
నీ హృదయం త్వరగా కొట్టుకునేలా చేసే
అన్ని రసానుభూతుల్నీ
వాటి ఆవేశాల తీవ్రతలనీ విడనాడినపుడు;
నువ్వు మెల్ల మెల్లగా మరణించడం మొదలెడతావు:

అనిశ్చయమైన వాటికోసం నీ సురక్షితస్థిని ఒడ్డలేనపుడు,
నీ కలలను వెంటాడుతూ పోలేనపుడు,
జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా
పారిపోడానికి
నిన్ను నువ్వు విడిచిపెట్టలేనపుడు
నువ్వు మెల్ల మెల్లగా మరణించడం తథ్యం!!!

.
పాబ్లో నెరూడా

July 12, 1904 – September 23, 1973

చిలీ కవి

Pablo Neruda
Pablo Neruda 1963
Courtesy: Wikipedia

Don’t Die Yet

.

You start dying slowly ;
if you do not travel,
if you do not read,
If you do not listen to the sounds of life,
If you do not appreciate yourself.
You start dying slowly :

When you kill your self-esteem,
When you do not let others help you.
You start dying slowly ;

If you become a slave of your habits,
Walking every day on the same paths…
If you do not change your routine,
If you do not wear different colours
Or you do not speak to those you don’t know.
You start dying slowly :

If you avoid to feel passion
And their turbulent emotions;
Those which make your eyes glisten
And your heart beat fast.
You start dying slowly :

If you do not risk what is safe for the uncertain,
If you do not go after a dream,
If you do not allow yourself,
At least once in your lifetime,
To run away…..
You start dying Slowly !!!

.

Pablo Neruda 

July 12, 1904 – September 23, 1973

Chilean Poet

%d bloggers like this: