దివ్య స్పర్శ… మాయా ఏంజెలో, అమెరికను కవయిత్రి
ధైర్యం అంటే ఏమిటో ఎరుగక
సుఖానికి బహిష్కృతులమైన మేము
ప్రేమ, పవిత్రమైన తన దేవాలయాలను విడిచిపెట్టి
మా చూపుల చాయలకు అందుతూ
జీవితంలోకి మళ్ళీ మమ్మల్ని మేల్కొలిపేదాకా
ఒంటరితనపు నత్తగుల్లల్లో ముడుచుకు పడుకుంటాము.
ప్రేమ వస్తుంది
దాని వెనుకే, సుఖపరంపరలూ
గతకాలపు ఆనంద చిహ్నాలూ
ఏనాటివో, చరిత్ర తుడిచివెయ్యలేని బాధలూ అనుసరిస్తాయి.
కానీ, మేము ధైర్యంగా నిలబడగలిగితే
మా మనసుల్లోని భయాలని
ప్రేమ పటాపంచలు చేస్తుంది.
ప్రేమయొక్క ఉద్ధృతమైన కాంతిప్రవాహం
అలవాటైన పిరికిదనంనుండి మమ్మల్ని తప్పిస్తుంది.
ఇప్పుడు మాకు ఎంతో సాహసం వస్తుంది.
ఒక్కసారిగా అవగతమౌతుంది
మేము ఇలా ఉండడానికీ,
ఎప్పటికీ ఇలానే ఉండడానికీ ప్రేమ ఎంత అవసరమో.
ఎప్పటికైనా మాకు స్వేచ్ఛను ప్రసాదించి
బానిసత్వంనుండి విముక్తినివ్వగలిగేది ప్రేమ ఒక్కటే!
.
మాయా ఏంజెలో
April 4, 1928 – May 28, 2014
అమెరికను కవయిత్రి
.
Touched by an Angel
.
We, unaccustomed to courage
exiles from delight
live coiled in shells of loneliness
until love leaves its high holy temple
and comes into our sight
to liberate us into life.
Love arrives
and in its train come ecstasies
old memories of pleasure
ancient histories of pain.
Yet if we are bold,
love strikes away the chains of fear
from our souls.
We are weaned from our timidity
In the flush of love’s light
we dare be brave
And suddenly we see
that love costs all we are
and will ever be.
Yet it is only love
which sets us free.
.
Maya Angelou
April 4, 1928 – May 28, 2014
American Poet
Poem Courtesy:
https://100.best-poems.net/touched-angel.html
ఒంటరిగా…. మాయా ఏంజెలో, అమెరికను కవయిత్రి
నిన్న రాత్రి
అలా పడుక్కుని ఆలోచిస్తున్నాను
నీరు దాహాన్ని తీర్చగలిగేదిగానూ
రొట్టి రాయిలాకాకుండా రొట్టిలా ఉండగలిగే
ప్రశాంతమైన చోటు ఏదైనా
ఈ మనసుకి సాధించగలనా అని.
నాకు ఒక్కటే సమాధానం దొరికింది
నేను పొరబడలేదనే అనుకుంటున్నాను:
ఇక్కడ
ఒంటరిగా, ఏకాకిగా
ఏ మినహాయింపులూ లేకుండా
ఏ ఒక్కడూ ఏదీ సాధించలేడు.
ఒంటరిగా, ఏకాకిగా
ఏ మినహాయింపులూ లేకుండా
ఏ ఒక్కడూ ఏదీ సాధించలేడు.
చాలా మంది కోటీశ్వరులున్నారు
వాళ్ల డబ్బు వాళ్ళకు ఎందుకూ కొరగాదు
వాళ్ల భార్యలు దెయ్యం పూనినట్లు అన్ని చోట్లకీ పరిగెడతారు
పిల్లలు ఏ ఉత్సాహమూ లేక, ఎప్పుడూ విచారంగా ఉంటారు.
రాతిగుండెలుగల వాళ్లని
ఖరీదైన వైద్యులు సేవిస్తుంటారు
ఒంటరిగా, ఏకాకిగా
ఏ మినహాయింపులూ లేకుండా
ఏ ఒక్కడూ ఏదీ సాధించలేడు.
మీరు జాగ్రత్తగా వింటానంటే
నాకు తెలిసిన మాటొకటి చెబుతాను మీకు
తుఫాను మేఘాలు కమ్ముకుంటున్నాయి
పెనుగాలులు వీచే సూచనలు కనిపిస్తున్నాయి
మానవజాతి కష్టాల్లో చిక్కుకుంది
ఆ మూలుగులు నాకు వినిపిస్తున్నాయి.
‘ఎందుకంటే, ఒంటరిగా,
ఏకాకిగా, ఏ మినహాయింపులూ లేకుండా
ఏ ఒక్కడూ ఏదీ సాధించలేడు.
ఒంటరిగా, ఏకాకిగా
ఏ మినహాయింపులూ లేకుండా
ఏ ఒక్కడూ ఏదీ సాధించలేడు.
.
మాయా ఏంజెలో
April 4, 1928 – May 28, 2014
అమెరికను కవయిత్రి.
.
Alone
.
Lying, thinking
Last night
How to find my soul a home
Where water is not thirsty
And bread loaf is not stone
I came up with one thing
And I don’t believe I’m wrong
That nobody,
But nobody
Can make it out here alone.
Alone, all alone
Nobody, but nobody
Can make it out here alone.
There are some millionaires
With money they can’t use
Their wives run round like banshees
Their children sing the blues
They’ve got expensive doctors
To cure their hearts of stone.
But nobody
No, nobody
Can make it out here alone.
Alone, all alone
Nobody, but nobody
Can make it out here alone.
Now if you listen closely
I’ll tell you what I know
Storm clouds are gathering
The wind is gonna blow
The race of man is suffering
And I can hear the moan,
‘Cause nobody,
But nobody
Can make it out here alone.
Alone, all alone
Nobody, but nobody
Can make it out here alone.
.
Maya Angelou
April 4, 1928 – May 28, 2014
American
Poem Courtesy:
https://100.best-poems.net/alone.html
మహావృక్షాలు కూలినపుడు… మాయా ఏంజెలో, అమెరికను కవయిత్రి
మహా వృక్షాలు కూలినపుడు
దూరాన కొండలమీది రాళ్ళు కంపిస్తాయి,
సింహాలు ఒత్తైన పొడవాటి రెల్లుపొదల్లో
దాక్కుందికి పరిగెడతాయి,
చివరికి ఏనుగులు సైతం
ప్రాణభీతితో సురక్షితప్రదేశాలకి చేరుకుంటాయి.
అడవుల్లో
మహా వృక్షాలు కూలుతున్నప్పుడు
చిన్నజీవాలు
వాటి జ్ఞానేంద్రియాలు భయానికి హరించుకుపోయి
మౌనంలోకి ముడుచుకుపోతాయి
గొప్పవ్యక్తులు మరణించినపుడు
మనని ఆవరించినగాలి
పలచనై, తేలికై, క్రియాశూన్యమైపోతుంది.
మనం ఊపిరి బిగబడతాం
మనకళ్ళు
క్షణికమైనా,
స్పష్టంగా చూస్తాయి,
మన జ్ఞాపకశక్తి
ఒక్కసారిగా మరింతపదునుతేరి
పరిశీలుస్తూ ఉంటుంది
పైకి చెప్పని మంచిమాటలను నెమరేసుకుంటూ
చేద్దామనుకుని చెయ్యలేకపోయిన
పనులు గుర్తుచేసుకుంటున్న మనల్ని …
మాహాత్ముల మరణంతో
వాళ్లతో పెనవేసుకున్న
మన అస్తిత్వం
మననుండి శలవు తీసుకుంటుంది.
వాళ్ళ ప్రకృతిమీద ఆధారపడిన
మన ఆత్మలు
ముడుచుకుని, శుష్కించిపోతాయి.
మన ఆలోచనలు
వాళ్ళ దీప్తి వల్ల ప్రేరేపింపబడి,
వికసించినవి కావడంవల్ల
వారితోనే చెల్లాచెదరైపోతాయి.
మనకి ఎంతగా బుద్ధి మాంద్యం వస్తుందంటే
చెప్పలేని అజ్ఞానపు
అంధకార గుహల్లోకి చొరబడతాము.
గొప్పవ్యక్తులు మరణించినతర్వాత
కొంత కాలానికి మళ్ళీ ప్రశాంతత చేకూరుతుంది
నెమ్మదిగా. దానికో క్రమం ఉండదు.
హాయినికూర్చే విద్యుత్తరంగాలలా
శరీరంలో ప్రశాంతత నెమ్మదిగా నిండుతుంది.
మన ఇంద్రియాలు మనకి చేకూరినా
అవి ఎన్నడూ మునుపటిస్థితి చేరుకోలేవు.
అయినా అవి గుసగుసలాడుతాయి:
“వాళ్ళు ఇక్కడ జీవించేరు; ఇక్కడే జీవించేరు.
మనంకూడా బ్రతకగలం. మునపటికంటె మెరుగ్గా.
ఎందుకంటే, వాళ్ళు మనముందే జీవించేరు గనుక.”
.
మాయా ఏంజెలో
అమెరికను కవయిత్రి.
.
Maya Angelou
.
When Great Trees Fall
.
When great trees fall,
rocks on distant hills shudder,
lions hunker down
in tall grasses,
and even elephants
lumber after safety.
When great trees fall
in forests,
small things recoil into silence,
their senses
eroded beyond fear.
When great souls die,
the air around us becomes
light, rare, sterile.
We breathe, briefly.
Our eyes, briefly,
see with
a hurtful clarity.
Our memory, suddenly sharpened,
examines,
gnaws on kind words
unsaid,
promised walks
never taken.
Great souls die and
our reality, bound to
them, takes leave of us.
Our souls,
dependent upon their
nurture,
now shrink, wizened.
Our minds, formed
and informed by their
radiance,
fall away.
We are not so much maddened
as reduced to the unutterable ignorance
of dark, cold
caves.
And when great souls die,
after a period peace blooms,
slowly and always
irregularly. Spaces fill
with a kind of
soothing electric vibration.
Our senses, restored, never
to be the same, whisper to us.
They existed. They existed.
We can be. Be and be
better. For they existed.
.
Maya Angelou
American
ఆడవాళ్ళ పని… మాయా ఏంజెలో

.
నేను పిల్లల్ని సంబాళించాలి
దుస్తులకి చిన్నమార్పులు చెయ్యాలి
నేల తడిగుడ్దతో తుడవాలి
బజారుకెళ్ళి సరుకులు కొనుక్కురావాలి
కోడికూర వేపుడు చెయ్యాలి
ఆ పిల్లని తుడవాలి
స్నేహితులకి ఫలహారం తయారుచెయ్యాలి
తోటలో కలుపుతియ్యాలి
చొక్కాలు ఇస్త్రీ చెయ్యాలి
పసివాళ్లకి బట్టలుతొడగాలి
ఆ డబ్బామూత తెరవాలి
ఈ ఇల్లంతా ఊడవాలి
తర్వాత అస్వస్థుల్ని పలకరించాలి
పత్తికాయలు కొయ్యాలి
ఓ సూర్య కిరణమా! నా మీద ప్రసరించు.
ఓ వర్షమా! నా మీద ఒకసారి వర్షించు!
ఓ హిమబిందువులారా! నా మీద తేలికగా రాలి,
నా నుదిటిని మరోసారి చల్లబరచండి!
ఓ తుఫానూ! నీ అతిప్రచండమైన వీచికలతో
నన్నిక్కడనుండి ఎత్తికెళిపో.
నేను మళ్ళీ విశ్రాంతి తీసుకోగలిగేదాకా,
ఆకాశంలో అలా తేలియాడనీ.
ఓ మంచు తునకలారా!
మెల్లమెల్లగా రాలి చల్లని తెల్లని
మీ మంచు ముద్దులతో ముంచెత్తండి.
నన్నీరాత్రికి విశ్రమించనీయండి.
ఎండా, వానా, వంగిన ఆకాశం, పర్వతాలూ,
మహాసముద్రాలూ, చెట్టుచేమలూ, రాయిరప్పలూ,
మిణుకుమనే నక్షత్రాలూ, మెరిసే వెన్నెల…
నాదని చెప్పుకోగలిగింది మీరుతప్ప వేరెవరూ లేరు.
.
మాయా ఏంజెలో.
.
Womanwork
.
I’ve got the children to tend
The clothes to mend
The floor to mop
The food to shop
Then the chicken to fry
The baby to dry
I got company to feed
The garden to weed
I’ve got shirts to press
The tots to dress
The can to be cut
I gotta clean up this hut
Then see about the sick
And the cotton to pick.
Shine on me, sunshine
Rain on me, rain
Fall softly, dewdrops
And cool my brow again.
Storm, blow me from here
With your fiercest wind
Let me float across the sky
‘Til I can rest again.
Fall gently, snowflakes
Cover me with white
Cold icy kisses and
Let me rest tonight.
Sun, rain, curving sky
Mountain, oceans, leaf and stone
Star shine, moon glow
You’re all that I can call my own.
.
Maya Angelou
అయినా, నేను పైకి లేస్తాను… మాయా ఏంజెలో

.
నువ్వు కసిగా, వక్రీకరించిన అబధ్ధాలతో,
చరిత్రలో నన్ను విలువలేనట్టు చిత్రీకరించ వచ్చు
నన్ను బురదలో తొక్కి అణగార్చ వచ్చు,
అయినా, నేను ఆ ధూళిలాగ పైకి లేస్తాను.
.
నా ఎదురుసమాధానం నిన్ను కలవరపెడుతోందా?
నువ్వెందుకు దుఃఖం లో ములిగి ఉన్నావు?
నా ఇంట్లో చమురుబావులు తోడుతున్నంత
ధీమాగా నే నడుగువేస్తున్నాననా?
.
సూర్య చంద్రుల్లాగా
అలుపెరుగని కడలి తరంగాల్లాగా
ఎగసిపడే ఆశల్లా విరజిమ్ముకుంటూ
నేనింకా పైకి ఉబుకుతాను.
.
నేను క్రుంగిపోతే చూడాలనుకున్నావుకదూ?
శిరసు అవనతం చేసి, కనులు నేలకు వాల్చి
భుజాలు కన్నీరులా క్రిందకి జారిపోతూ
హృదయవిదారకంగా రోదిస్తూ, బలహీనమైపోయి?
.
నా అహం నిన్ను బాధిస్తోందా?
నా పెరట్లో బంగారు గనులు తవ్వుతున్నంత
ధీమాగా నేను నవ్వడం
భరించలేనంత కష్టంగా ఉందా?
.
నువ్వు నీ మాటలతో చంపెయ్య వచ్చు
నీ చూపులతో ముక్కలు చెయ్యొచ్చు
నీ ద్వేషంతో హతమార్చ వచ్చు
అయినా నేను గాలిలా, మళ్ళీ పైకి లేస్తాను.
.
నా స్త్రీత్వం నిన్ను తలక్రిందులు చేస్తోందా?
నా ఊరువుల సందులో వజ్రాలున్నట్టుగా
నేను నాట్యం చెయ్యడం
నీకు ఆశ్చర్యంగా ఉందా?
.
అవమానాల చరిత్ర కుటీరాల్లోనుండి లేస్తాను
బాధల పునాదుల్లో కూరుకుపోయిన గతాన్నుండి లేస్తాను
నేనొక ఎగసిపడి విస్తరించే నల్ల సముద్రాన్ని,
ఉరకలేస్తూ, ఉప్పెనలా విరిగిపడే అలని కౌగిలిస్తాను
భయాల్నీ, భీతావహనిశల్నీ వెనక వదిలేసి నే నుదయిస్తాను
అద్భుతమూ, తరళమూ ఐన ఉషోదయంగా ఆవిర్భవిస్తాను.
నేను నా పూర్వీకులనుగ్రహించిన ఆశీస్సులను మోసుకొచ్చే,
బానిస కలనీ, ఆశాగీతాన్నీ.
నేను లేస్తాను
లేస్తాను
లేస్తాను.
.
మాయా ఏంజెలో
.
Still I Rise
You may write me down in history
With your bitter, twisted lies,
You may trod me in the very dirt
But still, like dust, I’ll rise.
Does my sassiness upset you?
Why are you beset with gloom?
‘Cause I walk like I’ve got oil wells
Pumping in my living room.
Just like moons and like suns,
With the certainty of tides,
Just like hopes springing high,
Still I’ll rise.
Did you want to see me broken?
Bowed head and lowered eyes?
Shoulders falling down like teardrops.
Weakened by my soulful cries.
Does my haughtiness offend you?
Don’t you take it awful hard
‘Cause I laugh like I’ve got gold mines
Diggin’ in my own back yard.
You may shoot me with your words,
You may cut me with your eyes,
You may kill me with your hatefulness,
But still, like air, I’ll rise.
Does my sexiness upset you?
Does it come as a surprise
That I dance like I’ve got diamonds
At the meeting of my thighs?
Out of the huts of history’s shame
I rise
Up from a past that’s rooted in pain
I rise
I’m a black ocean, leaping and wide,
Welling and swelling I bear in the tide.
Leaving behind nights of terror and fear
I rise
Into a daybreak that’s wondrously clear
I rise
Bringing the gifts that my ancestors gave,
I am the dream and the hope of the slave.
I rise
I rise
I rise.
Maya Angelou