Tag: Matthew Arnold
-
ఊరట… మాత్యూ ఆర్నాల్డ్, ఇంగ్లీషు కవి
సూర్యరశ్మిని పొగమంచు కప్పేసింది నాలుగుప్రక్కలనుండీ పొగలు ఎగస్తున్న పొట్టి గుడిశెలు నన్ను చుట్టుముట్టి ఉన్నాయి; ఏదో చెప్పలేని నిరాశ నా మనసుని కృంగదీస్తోంది. కానీ, నే నొకవంక దిగులుతో అలమటిస్తుంటే ప్రతి దిక్కునా లెక్కలేనన్ని అవకాశాలు ఒకదానివెంట ఒకటి పరచుకుంటున్నాయి గణించలేనంత మంది మనుషులు చెప్పలేనన్ని మానసిక అవస్థలలో గడుపుతున్నారు. ఇక్కడనుండి దూరంగా, ఆసియాలో చదునుగా ఉన్న బిక్షువుల ఆశ్రమగోపురాలపైనా బంగారు రంగులో మెరిసే లాసా (టిబెట్) లోని మిద్దెలపైనా సూర్యుడు మిలమిల మెరుస్తున్నాడు. పసుపుపచ్చని టైబరు […]
-
షేక్స్పియర్… మాత్యూ ఆర్నాల్డ్, ఇంగ్లీషు కవి
(ఇది షేక్స్పియర్ 400 వ వర్థంతి సంవత్సరము) ఇతరులు మా ప్రశ్నలకి బందీలైపోతారు. నువ్వు స్వతంత్రుడివి. జ్ఞానశిఖరానివై, మేము పదే పదే ప్రశ్నలడుగుతున్నా నువ్వు నవ్వుతూ నిశ్చలంగా ఉంటావు. నువ్వు తారకలకే నీ ఘనతని పరిచయం చేస్తావు. ధృఢంగా ఒక పాదాన్ని సముద్రంలో ఉంచి అత్యున్నత స్వర్గాన్ని నీ నివాసం చేసుకుని, నీ పాదాల చెంతనున్న మేఘవలయాలని మాబోటి మర్త్యుల నిరర్థకమైన వెతుకులాటకి వదిలెస్తావు. స్వయంగా నేర్చుకుని, స్వయంగా తరచిచూచి, స్వయంగా సాధించి, ఆత్మగౌరవం సంపాదించుకుని […]