Tag: Mary Oliver
-
ఒక వేసవి పొద్దు… మేరీ ఆలివర్, అమెరికను కవయిత్రి
ఈ ప్రపంచాన్ని ఎవరు సృష్టించారు? ఆ తెల్లని హంసనీ నల్లని ఎలుగుని ఎవరు సృష్టించారు? ఈ మిడతని ఎవరు సృష్టించారు? ఈ మిడత… గడ్డిలోంచి తన్నుకుంటూ పైకెగసిన ఈ మిడత నా చేతిలోనున్న పంచదారని తింటున్న మిడత పైకీ క్రిందకీ కాకుండా ముందుకీ వెనక్కీ దవడలు కదుపుతున్న ఈ మిడత తన పెద్ద, సంకీర్ణమైన కనులతో నిక్కి చూస్తున్న మిడతని. దాని బలహీనమైన ముందుకాళ్ళు పైకెత్తి తన ముఖాన్ని నులుముకుంటోంది. దాని రెక్కల్ని చాచి టపటప కొట్టి […]
-
అడవి బాతులు… మేరీ ఓలివర్ , అమెరికను కవయిత్రి
మీరు మంచి వాళ్లై ఉండవలసిన అవసరంలేదు. ప్రాయశ్చిత్తం చేసుకుందికి మీరు మోకాళ్ళమీద ఎడారిలో వందలమైళ్ళు నడవ వలసిన పనీ లేదు. మీ శరీరంలో దాగున్న ఆ మృదువైన జంతువుని దానికి ఏది ఇష్టమయితే దాన్ని ఇష్టపడనిస్తే చాలు మీ నిరాశా నిస్పృహల గురించి నాకు చెప్పండి, నావి నేను చెబుతాను. ఈ లోపున ప్రపంచం దాని మానాన్న అది నడిచిపోతుంటుంది. ఈ లోపున సూర్యుడూ, స్ఫటికాల్లాంటి వడగళ్ళవానలూ ఈ సువిశాల మైదానాల మీంచి, పచ్చిక బయళ్ళమీంచి, దట్టమైన […]