Tag: Luís Vaz de Camões
-
సానెట్ 2 … లూయిజ్ వాజ్ ది కమోజ్, స్పానిష్ కవి
నా పెదవినుండి వెలువడిన మధుర గీతాల్లారా, నను విడిచిపొండి, సంగీతానికి శృతిబద్ధమైన వాద్యపరికరాల్లారా, నను వీడిపొండి, మైదానాల్లోని రమణీయమైన ఎగిసే నీటిబుగ్గలారా, నను వీడిపొండి కొండకోనల్లోని మంత్రముగ్ధుణ్ణిచేసే తరు, లతాంతాల్లారా, నను వీడిపొండి, అనాదిగా వేణువునుండి వెలువడుతున్న రసధునులారా, నను విడిచి పొండి, జనపదాల్లోని విందు, వినోద, జాతర సమూహాల్లారా, నను విడిచిపొండి, రెల్లుపొదలలోదాగిన జంతు, పక్షి సమూహాల్లారా, నను వీడిపొండి, శీతలతరుచాయలలో హాయిగా విశ్రమించే గోపకులారా, నను వీడిపొండి, నాకిపుడు ఏ సూర్య చంద్రులూ ఉదయించి […]
-
సానెట్… లూయిజ్ వాజ్ ది కమోజ్, స్పానిష్ కవి
కాలమూ మనిషీ ఎన్నడూ స్థిరంగా ఉండరు; అదృష్టం దూరమైన మనిషి ధైర్యమూ దూరమౌతుంది; సరి కొత్త స్వభావాన్ని సంతరించుకున్న ప్రకృతితో ఈ ప్రపంచమంతా “తిండిపోతు మార్పు” ఆహారంలా కనిపిస్తోంది. ఏ దిక్కు చూసినా అంతులేని సరికొత్త చిగుళ్ళు కనుపిస్తున్నాయి ఎంతగా అంటే, ఈ భూమి ఇంత భరించగలదని ఊహించలేనంత. బహుశా గతాన్ని గురించిన శోకమే నిలకడగా ఉంటుంది, గతంలో చేసిన మంచికై వగపూను, అది నిజంగా మంచి అయితే. కాలం పచ్చదనంతో మొన్నటిదాకా ఈ మైదానాన్ని ఉల్లాసం […]