అనువాదలహరి

అర్థరాత్రి వేళ… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి

 .

ఎలాగైతేనేం, ఇన్నాళ్ళకి నాకు జీవితం అంటే అర్థమయింది,

ప్రతిదానికీ ప్రారంభమే గాని, దేనికీ ముగింపు ఉండదు,

మనం గెలిచామనుకుని సంబరపడే గొప్పవిజయాలన్నీ,

మన భ్రమతప్ప నిజానికి ఎన్నడూ గెలిచినవి కావు.

.

దేనికోసమైతే నా ఆత్మ గూడుకట్టుకుందో ఆ ప్రేమ కూడా,

చివరికి, కలతతో ఆలోచనలలోపడ్ద అతిథిలా వస్తుంది.

సంగీతమూ, మగవారి పొగడ్తలూ, ఆఖరికి చిరునవ్వైనా సరే,

మిగతావాటికంటే అంతగొప్పగా ఏమీ ఉండవు.

.

సారా టేజ్డేల్

(August 8, 1884 – January 29, 1933)

అమెరికను కవయిత్రి,  పులిట్జరు బహుమతి గ్రహీత.

.

English: Filsinger, Sara Teasdale, Mrs., portr...
English: Filsinger, Sara Teasdale, Mrs., portrait photograph. (Photo credit: Wikipedia)

At Midnight

.

Now at last I have come to see what life is,
Nothing is ever ended, everything only begun,
And the brave victories that seem so splendid
Are never really won.

Even love that I built my spirit’s house for,
Comes like a brooding and a baffled guest,
And music and men’s praise and even laughter
Are not so good as rest.

.

Sara Teasdale,
(August 8, 1884 – January 29, 1933)
American Poet

  • The Look (quieterelephant.wordpress.com)

జ్ఞానోదయం .. సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి

అవి వసంతకాలపు తొలిరాత్రులు
హేమంతపు మత్తు నిదర ఇంకా వదల్లేదు
మా చుట్టూ ఉన్న నీడలూ, గాలీ
మేము మాట్లాడుకోని మాటలకి చెవులురిక్కిస్తున్నాయి.

పది సంవత్సరాలు దొర్లిపోయాయి గాని
వసంతం ఇప్పుడూ అప్పటంతవాడిగానే ఉంది
మళ్ళీ మొదలుపెట్టాల్సి వస్తే
అప్పుడు చేసినవే మళ్ళీ మళ్ళీ చేస్తాం

ఎదురుచూసిన వసంతం అయితే ఎన్నడూ రాలేదు
కాని, అదేమిటో తెలుసుకోగలిగినంత జీవితం గడిచిపోయింది
మనకి లేనిది ఎప్పుడూ లేకుండానే మిగిలిపోతుంది,
మనకున్న వస్తువుల్నే మనం పోగొట్టుకునేది.

.

.

సారా టీజ్డేల్

అమెరికను కవయిత్రి

.

మాటలని పొదుపుగా వాడి, ఒక్కొక్కసారి ఏ రకమైన ప్రతీకలూ వాడకుండానే, చెప్పవలసిన భావాన్ని  పాఠకుడికి అందజెయ్యగలగడంలో సారా టీజ్డేల్ ఆరితేరిన కవయిత్రి. ఇక్కడ మూడే మూడుపాదాల కవితలో  వ్యక్తులమధ్య నెమ్మదిగా ప్రవేశించే అసంతృప్తీ, ఎడబాటూ; చివరి పాదంలో అద్భుతమైన సత్యాన్నీ, మనసులోని బాధనీ ఎంత అందంగా వ్యక్తీకరించిందో గమనించవచ్చు.

.

English: Filsinger, Sara Teasdale, Mrs., portr...
English: Filsinger, Sara Teasdale, Mrs., portrait photograph. (Photo credit: Wikipedia)

.

WISDOM

It was a night of early spring,
The winter-sleep was scarcely broken;
Around us shadows and the wind
Listened for what was never spoken.

Though half a score of years are gone,
Spring comes as sharply now as then—
But if we had it all to do
it would be done the same again.

It was a spring that never came;
But we have lived enough to know
That what we never have, remains;
It is the things we have that go.
.
Sara Teasdale.

Poem Courtesy: http://www.gutenberg.org/files/25880/25880-h/25880-h.htm#WISDOM

సీలియా కి ప్రేమతో… బెన్ జాన్సన్, ఇంగ్లీషు కవి

.

నీకు అంగీకారమైతే, నను నీ చూపులతో సేవించు,

ప్రతిగా, నేను నా కళ్లతో ప్రమాణం చేస్తాను;

పోనీ,ఒక్క ముద్దైనా కప్పుమీద గుర్తుగా విడిచిపో,

ఇక జీవితంలో మద్యం జోలికి వెళ్ళనేవెళ్ళను.

మనసులో చెలరేగుతున్న దాహార్తి

తీరడానికి దివ్యసుధలను కోరుకుంటోంది.

కానీ, భగవంతుడే స్వయంగా అమృతాన్ని అందించినా

నీకు బదులుగా అమరత్వాన్ని స్వీకరించలేను.

.

ఈ మధ్యనే, గులాబీలమాల ఒకటి పంపించాను,

దానితో నిన్నేదో సత్కరిద్దామని కాదు;

అక్కడయితే తను వసి వాడదని

దానికి ఒక ఆశ్వాసనను కల్పించడానికి, అంతే.

కాని, దానిని నీవు కేవలం ఆఘ్రాణించి

వెనుకకు తిరిగి పంపించేసేవు:

ఆరోజునుండి, దానినుండి వెల్లివిరిసే పరిమళం

తనసహజ పరిమళం కాదు, నీ సుగంధమే. ఒట్టు!

.

బెన్ జాన్సన్

11 June 1572 – 6 August 1637

ఇంగ్లీషు కవి

ఆంగ్లసాహిత్యంలో పెరుపడ్డ ప్రేమకవితలలో ఇది ఒకటి. మూల కవితలోని సౌందర్యం  ఉదాత్తమైన ప్రేమ ప్రకటనా, దానికి హంగుగా వాడిన అలంకారాలూ, ఉత్ప్రేక్షలూ, అతిశయోక్తులూ. ఆ రోజుల్లో అది గొప్పే. ఎందుకంటే, ఇంగ్లీషు కావ్యభాషగా నిలదొక్కుకుందికి ప్రయత్నం చేస్తున్న కాలం అది. నిజానికి రెనైజాన్సు కాలంలో ఇంగ్లీషులోకంటే గ్రీకు లాటిన్ భాషలలో రాయడమూ, చదవడమే గొప్ప. కవిత్వాన్నీ, నాటకాలనీ ఆ ప్రమాణాలతోనే పరీక్షించి విమర్శించే వాళ్లు.

.

Ben_Jonson
Ben_Jonson (Photo credit: Wikipedia)

.

To Celia

.

Drink to me, only, with thine eyes,

And I will pledge with mine;

Or leave a kiss but in the cup,

And I’ll not look for wine.

The thirst that from the soul doth rise,

Doth ask a drink divine:

But might I of Jove’s nectar sup,

I would not change for thine.

I sent thee, late, a rosy wreath,

Not so much honouring thee,

As giving it a hope, that there

It could not withered be.

But thou thereon didst only breathe,

And sent’st back to me:

Since when it grows, and smells, I swear,

Not of itself, but thee.

.

Ben Jonson

ప్రేమఫలించిన తర్వాత … సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి

.

ఇక అందులో ఇంద్రజాలం ఉండదు,

అందరువ్యక్తుల్లాగే మనమూ కలుసుకుంటుంటాం,

నేను నీకూ, నువ్వు నాకూ

ఇక అద్భుతాలుగా అనిపించం.

.

ఒకప్పుడు నువ్వు సుడిగాలివి, నేను సముద్రాన్ని—

ఆ వైభవం ఇక ఏమాత్రం ఉండదు…

నేను సముద్రపొడ్డునే

అలసిపోయిన ఒక మడుగునై మిగిలిపోయాను.

.

ఆ మడుగుకి ఇప్పుడు తుఫానులబెడదనుండీ

ఎగసిపడే అలలనుండీ విముక్తి దొరికింది

అయితేనేం, దానికి దొరికిన అంత ప్రశాంతతకీ సముద్రం కంటే,

ఏదో పోగొట్టుకున్న అసంతృప్తి మిగిలిపోతుంది.

.

సారా టీజ్డేల్

August 8, 1884 – January 29, 1933

అమెరికను కవయిత్రి  

.

English: Filsinger, Sara Teasdale, Mrs., portr...
English: Filsinger, Sara Teasdale, Mrs., portrait photograph. (Photo credit: Wikipedia)

.

After Love
 

.

There is no magic any more,
We meet as other people do,
You work no miracle for me
Nor I for you.

You were the wind and I the sea —
There is no splendor any more,
I have grown listless as the pool
Beside the shore.

But though the pool is safe from storm
And from the tide has found surcease,
It grows more bitter than the sea,
For all its peace. 

.

Sara Teasdale

August 8, 1884 – January 29, 1933 

American Poetess

Poem Courtesy: http://www.poets.org/viewmedia.php/prmMID/19423

  • The Look (quieterelephant.wordpress.com)

నా మాట … ఆస్కార్ వైల్డ్, ఐరిష్ కవి.

అశాంతీ, ఆతురతలతో నిండిన ఈ ఆధునిక ప్రపంచంలో,

నువ్వూ, నేనూ, మనవంతు ఆనందం మనసారా అనుభవించేం;

ఈ నావకెత్తిన తెల్లని తెరచాపలు మూసివేయబడ్డాయి

మనం ఇందులోకెత్తిన సరకంతా ఖర్చుచేసేశాం.    

.

రోదనవల్ల సంతోషం నానుండి నిష్క్రమించింది, 

అందుకు నా చెక్కిళ్ళు ప్రాయములోనే కళతప్పాయి,  

వయసుమీరని నా పెదాల అరుణిమని వేదన హరించింది,

వినాశము నా శయ్యమీద ఆఖరితెరలు దించుతోంది.  

.

కానీ, కిక్కిరిసిన ఈ జీవితం నీకు ఒక వీణ,

ఒక జంత్రం, లేక వయోలాల సమ్మోహనాదంలాగో 

లేదా, ఉదాత్త సాగర సంగీతానికి పేలవమైన అనుకరణ

శంకువులో నిద్రించే ప్రతిధ్వనిలాగో అనిపించవచ్చు.  

.

ఆస్కార్ వైల్డ్ 

(16 October 1854 – 30 November 1900)

ఐరిష్ కవి, నాటక కర్త

షేక్స్పియరు తర్వాత అంత ఎక్కువగానూ సాహిత్యంలో ఉటంకించబడే (quoted) వ్యక్తి ఆస్కార్ వైల్డ్ మాత్రమే.

ఈ కవిత నిజానికి Dialogues అన్న పేరుతో రాసిన కవితల్లో రెండవది. మొదటికవితలో ఇద్దరు ప్రేమికులు విడిపోతున్నప్పుడు, స్త్రీ దృక్పధంలో ఆ విడిపోవడానికి కారణాలు చెబితే, దానికి సమాధానంగా చెప్పిన ఈ కవితలో, పురుషుడి దృక్కోణం నుండి సమాధానం ఉంటుంది.  

అనేక కారణాల వల్ల ప్రేమికులు విడిపోవడం చాలా సందర్భాలలో జరుగుతుంది. కానీ అన్నిటిలోనూ ఒకరు వాళ్ల విడిపోవడానికి కారణమైన విషయాన్ని మన్నించగలిగినా/ మరిచిపోవాలని చూసినా, రెండవవారు దాన్ని క్షమించలేరు. అప్పుడుకూడ, కొందరిలో  ఉదాత్తమైన వ్యక్తిత్వం, అవతలి వ్యక్తి పట్ల నిజమైన ప్రేమానురాగాలూ వ్యక్తమవుతూనే ఉంటాయి. ఈ కవిత, బహుశా అతని తొలిప్రేయసి Florence తో విడిపోయిన సందర్భంలో వ్రాసి ఉండవచ్చునని కొందరి ఊహ.

Oscar Wilde
Oscar Wilde (Photo credit: Wikipedia)

.

My Voice

.

Within this restless, hurried, modern world

We took our hearts’ full pleasure – You and I,

And now the white sails of our ship are furled,

And spent the lading of our argosy.

.

Wherefore my cheeks before their time are wan,

For very weeping is my gladness fled,

Sorrow has paled my young mouth’s vermilion,

And Ruin draws the curtains of my bed.

.

But all this crowded life has been to thee

No more than lyre, or lute, or subtle spell

Of viols, or the music of the sea

That sleeps, a mimic echo, in the shell.

.

Oscar Wilde

(16 October 1854 – 30 November 1900)

Irish Poet

For an analysis of the poem pl. visit:

1. http://www.helium.com/items/2252109-poetry-analysis-my-voice-by-oscar-wilde

2. http://kellyrfineman.blogspot.com/2009/05/her-voice-and-my-voice-by-oscar-wilde.html

నిశాసమాగమము … రాబర్ట్ బ్రౌనింగ్, ఇంగ్లీషు కవి

.

విభూతిరంగులో సముద్రం, నీలివర్ణంలో సుదీర్ఘమైన నేల;   

దిగంతాల అంచున పసుపురంగులో అర్థచంద్రబింబం;

నిద్రలో జడుసుకుని లేచినట్టు ఉవ్వెత్తుగా ఎగసి

వడివడిగా చిన్నచిన్న వృత్తాల్లో పరిగెడుతున్న అలలు.

నావలో నేను ఒడ్దుసమీపించి, ఉప్పుటేరుని కలిసి,

దాని అలసటతీర్చడానికి పర్రలో లంగరు వేశాను

.

సంద్రపువాసనవేస్తూ మైలుపొడవు వెచ్చని తీరం; 

కళ్ళం చేరడానికి ఇంకా దాటవలసిన మూడు పొలాలు; 

కిటికీఅద్దం మీద నెమ్మదిగా తట్టిన ఒక తట్టు,  

తత్తరగా గీచిన అగ్గిపుల్లచప్పుడు, ఒక్కసారిగా లేచిన నీలిమంట,  

ఒకదానికై ఒకటి కొట్టుకుంటునే రెండుగుండెలసవ్వడికన్నా

నెమ్మదిగా, భయోద్వేగాలతో పెల్లుబుకుతున్న నోటిమాట.

.

రాబర్ట్ బ్రౌనింగ్, 

(7 May 1812 – 12 December 1889)

ఇంగ్లీషు కవి, నాటక కర్త.

.

English: Robert Browning, British poet, during...
English: Robert Browning, British poet, during his later years (Photo credit: Wikipedia)

.

Meeting At Night
.

The gray sea and the long black land;

And the yellow half-moon large and low

And the startled little waves that leap

In fiery ringlets from their sleep,

As I gain the cove with pushing prow,

And quench its speed i’ the slushy sand.

Then a mile of warm sea-scented beach;

Three fields to cross till a farm appears;

A tap at the pane, the quick sharp scratch

And blue spurt of a lighted match,

And a voice less loud, through its joys and fears,

Than the two hearts beating each to each!

,

Robert Browning .

English poet and Dramatist

For a very brief but an excellent biography please visit: http://www.victorianweb.org/authors/rb/rbbio.html

కథలుగా చెప్పుకునే అడ్డంకులు… జాన్ మాంటగే, ఐరిష్ కవి.

.

మనిద్దరి మధ్యా కథలుగా చెప్పుకునే అడ్డంకులన్నీ ఉన్నాయి

ఊహకందని సుదీర్ఘమైన మైదానమూ…

భయభ్రాంతుల్ని చేసే కొండల వరుసలూ…

రాత్రల్లా విడువకుండా విసరికొడుతూ

శాక్రమెంటోనీ, శాన్ జోక్విన్ నీ ముంచెత్తి  

రివ్వున ఈదురుగాలులతో తేలియాడిన హేమంతపు వానా… 

.

పగలల్లా నిరీక్షిస్తూనే ఉన్నాను,

స్టేషనుకీ, బారుకీ మధ్య భయం భయంగా తిరుగాడుతూ.

మధ్యలో ఇంకో రైలు వెళ్ళడం చూసాను

శాన్ ఫ్రాన్సిస్కో చీఫో, గోల్డెన్ గేటో  తెలీదు గాని

ముందుకి పొడుచుకొచ్చిన చక్రాలంట

నీళ్ళుధారాపాతంగా కారుతూ…

.

అర్థరాత్రివేళకి నువ్వు పాలిపోయి వచ్చేవు

ఆ నీగ్రోకూలీ గుడ్డిదీపం వెలుతురు వెనక.    

వర్షానికి తడిసిన నాకళ్ళు పోల్చుకోలేదు

పలకరించడానికి సంశయించాను.

కాని, ప్లాట్ ఫారం మీదనుండే నిన్నందుకున్నా

చలిబట్టిపోయిన మనరెండుచేతులూ కలుసుకున్నాయి. 

.

రోజులతరబడి నీతో ప్రయాణించిన 

ఆ ముసలావిడ, తన చెయిజోడుతో

అద్దం మీద స్పష్టంగాకనిపించేలా

ఒక వృత్తం చుట్టింది, మనిద్దరం

ఒకరితో ఒకరు మాటాడలేకపోయినా

చెమ్మకున్న చీకటిలోకి జరిగి

ఒకరినొకరు చుంబించుకోడం చూడ్డానికి.

.

జాన్ మాంటగే

ఐరిష్ కవి.  

ఇంగ్లీషు సాహిత్యానికి ఐరిష్  మరియు స్కాటిష్ కవులూ రచయితలూ చేసిన సేవ అపారమైనది. వాళ్ల అనుభవాలని ఎంత అందంగా కవిత్వీకరించగలరో ఆశ్చర్యం వేస్తుంది. ఈ చిన్న కవితలో ఇద్దరు ప్రేమికుల విరహంతో పాటు, ఒక ముసలామె మనస్తత్వాన్ని కూడా ఎంత చక్కగా జోడించేడో గమనించండి.

.

All Legendary Obstacles

.

All legendary obstacles lay between

Us, the long imaginary plain,

The monstrous ruck of mountains

And, swinging across the night,

Flooding the Sacramento, San Joaquin,

The hissing drift of winter rain.

.

All day I waited, shifting

Nervously from station to bar

As I saw another train sail

By, the San Francisco Chief or

Golden Gate, water dripping

From great flanged wheels.

.

At midnight you came, pale

Above the negro porter’s lamp.

I was too blind with rain

And doubt to speak, but

Reached from the platform

Until our chilled hands met.

.

You had been travelling for days

With an old lady, who marked

A neat circle on the glass

With her glove, to watch us

Move into the wet darkness

Kissing, still unable to speak.

.

John Montague,

(28th February, 1929 – )

Irish Poet.

For further info on John Montague pl. visit:

http://en.wikipedia.org/wiki/John_Montague_(poet)

నాకు సగం సగం అక్కరలేదు … యెవెనీ యెటుషెంకో, రష్యను కవి

.

నేను సగం సగం పుచ్చుకోను…

నాకీ సగం సగం వ్యవహారం నచ్చదు.

నాకు ఆకాశం పూర్తిగా కావాలి!

దిక్కుల చివరిదాకా భూఖండమంతా నాదే!

అనంత సాగరాలూ, నదీనదాలూ, 

మహాపర్వతాలమీది హిమపాతాలతో సహా

సమస్తమూ నాకు కావాలి! 

అంతకు తక్కువైతే ఒప్పుకునేది లేదు. 

.

ఒప్పుకోను! జీవితం సగం ఇస్తానని ప్రలోభపెట్టొద్దు.

ఇస్తే అంతా ఇవ్వడం. లేకపోతే ఏదీ అక్కరలేదు.

నేను ధైర్యంగా ఎదుర్కోగలను.

సంతోషాన్ని సగాలుగా ఇవ్వడం అంగీకరించను.

దుఃఖమైనా సరే. సగం ఇస్తే నే ఒప్పుకోను.

.

అయినా నేను పంచుకుందికి ఒక తలగడ ఉంది,

దాన్ని మెత్తగా చెక్కిలికి ఆనించినపుడు

ఒక నిస్సహాయమైన నక్షత్రం లా, ఒక రాలిపడే ఉల్కలా

ఒక వలయం, నీ చేతి వేలికొసన మెరుస్తోంది.

.

యెవెనీ యెటుషెంకో, రష్యను కవి July 18, 1933 –

.

(ప్రేమ కవిత్వం చాలా మంది రాస్తారు. కాని ఎంతమంది ఇంత చమత్కారంగా రాయగలరు?

మొదటి రెండు పద్యాలూ తుఫానులా ఉంటాయి. ఇందులో సంభాషిస్తున్న వ్యక్తి, తన మనోహరి (మనోహరుడు) కష్టసుఖాలన్నిటితో పరిపూర్ణంగా తనకే కావాలనీ దాపరికాలుండకూడదనీ చెబుతున్నాడు. మూడవపద్యంలోనే అసలు మెరుపు. తన ప్రేయసి (ప్రియుడు) తనపక్కన పడుకుని చెప్పుకోలేని దుఃఖంతో ఉన్నప్పుడు, తెలియకుండానే ఒక అశృకణం నిస్సహాయంగా వేలి కొసన ఉల్కలా రాలి మెరుస్తోందిట. తనలో తనే బాధపడే అటువంటి వ్యక్తికి ఇంతకంటే ఆశ్వాసన ఎవరు ఇవ్వగలరు… మనః స్ఫూర్తిగా ప్రేమించే వ్యక్తి తప్ప!  ప్రేమంటే ఇది అని చెప్పకనే చెబుతున్నాడు కవి.

దీనికి రెండో పార్శ్వం, ఇక్కడ ప్రేమ వ్యక్తి పట్ల కాకుండా, వ్యక్తిగత స్వేచ్ఛకి. స్వాతంత్ర్య భావనకి.  కొన్నిటికే స్వేచ్ఛ ఇచ్చి కొన్నిటికి లేదనే ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలపట్ల కవి  తన నిరశనని తెలియజేస్తున్నాడు. ఇక్కడ ఓదార్పు నిస్సహాయంగా బాధపడే రెండవ వ్యక్తికి. )

.

English: President Nixon meets with Russian po...
English: President Nixon meets with Russian poet Evheny Evtushenko. (Photo credit: Wikipedia)

.

No, I’ll not take the half…

 No, I'll not take the half,
 Give me the whole sky! The far-flung earth!
 Seas and rivers and mountain avalanches--
 All these are mine! I'll accept no less!

 No, life, you cannot woo me with a part.
 Let it be all or nothing! I can shoulder that!
 I don't want happiness by halves,
 Nor is half of sorrow what I want.

 Yet there's a pillow I would share,
 Where gently pressed against a cheek,
 Like a helpless star, a falling star,
 A ring glimmers on a finger of your hand.

Yevgeny Yevtushenko 

1963.


Translated by George Reavey.

Poem and bio Courtesy: http://wonderingminstrels.blogspot.com/2001/07/no-i-not-take-half-yevgeny-yevtushenko.html

Best known poet of the post-Stalin generation of Russian poets,  Yevtushenko’s early poems show the influence of Mayakovsky and loyalty to  communism, but with such works as The Third Snow (1955) Yevtushenko become a  spokesman for the young post-Stalin generation and travelled abroad widely  throughout the Khrushchev and the Brezhnev periods.

Yevtushenko was born in Zima in Irkutsk (July 18, 1933) as a  fourth-generation descendant of Ukrainians exiled to Siberia. He moved to  Moscow in 1944, where he studied at the Gorky Institute of Literature from  1951 to 1954. In 1948 he accompanied his father on geological expeditions to  Kazakhstan and to Altai in 1950. His first important narrative poem Zima  Junction was published in 1956 but gained international fame in 1961 with  Babi Yar, in which he denounced Nazi and Russian anti-Semitism. The poem was  not published in Russia until 1984, although it was frequently recited in  both Russia and abroad.

The Heirs of Stalin (1961), published presumably with Party approval in  Pravda, was not republished until 1987. The poem contained warnings that  Stalinism had long outlived its creator.

Yevtushenko’s demands for greater artistic freedom and his attacks on  Stalinism and bureaucracy in the late 1950s and 60s made him a leader of  Soviet youth. However, he was allowed to travel widely in the West until  1963. He published then A Precocious Autobiography in English, and his  privileges and favors were withdrawn, but restored two years later.

In 1972 Yevtushenko gained huge success with his play Under the Skin of the  Statue of Liberty. Since the 1970s he has been active in many field of  culture, writing novels, engaging in acting, film directing, and  photography. He has also remained politically outspoken and in 1974  supported Solzhenitsyn when the Nobel Prize Winner was arrested and exiled.  In 1989 Yevtushenko became member of the Congress of People’s Deputies.  Since 1990 he has been vice president of Russian PEN. He was appointed  honorary member of American Academy of Arts and Sciences in 1987.

After the accession of Gorbachev to power, Yevtushenko introduced to Soviet  readers many poets repressed by Stalin in the journal Ogonek. He raised  public awareness of the pollution of Lake Baikal and when communism  collapsed he was instrumental in getting a monument to the victims of  Stalinist repression placed opposite Lubianka, headquarters of the KGB.

http://boppin.com/poets/yevtushenko.htm

నా శ్రీమతికి (నా కవితల ప్రతితో)… అస్కార్ వైల్డ్.

.

ఈ కావ్యానికి తొలిపలుకుగా

నేను గొప్ప పీఠిక ఏదీ రాయలేను;

కానీ, ఖచ్చితంగా చెప్పగలను

ఇది ఒక కవి,  కవితకిచ్చే అంకితం అని.

.

ఈ రాలిన సుమదళాలు

నీకు సుందరంగా కనిపించగలిగితే…

నీ కురులలో ఒద్దికగా ఒదిగేదాకా

నా ప్రేమ గాలిలో తేలియాడుతూనే ఉంటుంది.

.

ప్రేమరహితమైన ఈ ప్రపంచాన్ని

చలిగాలులూ, హేమంతమూ గడ్డకట్టిస్తే

అది నీ చెవులలో తోటఊసులు చెబుతుంది

అవి, నీకొకతెకే అర్థమవుతాయి.

.

ఆస్కార్ వైల్డ్.

16 October 1854 – 30 November 1900

ఐరిష్  కవీ, రచయితా, నాటక కర్తా.

Oscar Wilde at Oxford
Oscar Wilde at Oxford (Photo credit: Wikipedia)

.

To My Wife – With A Copy Of My Poems

.

I can write no stately proem

As a prelude to my lay;

From a poet to a poem

I would dare to say.
.

For if of these fallen petals

One to you seem fair,

Love will waft it till it settles

On your hair.
.

And when wind and winter harden

All the loveless land,

It will whisper of the garden,

You will understand.

.

Oscar Wilde

16 October 1854 – 30 November 1900

Irish Poet, Playwright and Writer.

సముద్రం … ఆశాలత, మలయాళీ కవయిత్రి

మా అమ్మమ్మ సముద్రం ఎన్నడూ చూసి ఎరగదు

కానీ, తను పోయిన తర్వాత

ఆమె చితాభస్మాన్ని మాత్రం

మూడు సముద్రాల సంగమమంలో కలిపేరు.

.

ఆ చితాభస్మపు పాత్రలోనుండి

తన కబోది కళ్ళతో

సముద్రం లోని వింతలు చూస్తున్న ఆమె

కూతుళ్ళ శోకాలు విని వెనక్కి తిరిగొచ్చింది

.

“నాకు సముద్రం చూడాలని లేదు, చూడను, అంతే!”

అని, ముమ్మారు వెనక్కి తిరిగొచ్చిన ఆ కలశం

ఎలాగైతేనేం, చివరకి,కెరటాలమీద తేలి పో… యిం… ది,… అయిష్టంగానే.

.

ఆశాలత,

మలయాళీ కవయిత్రి

.

      Ashalata

                              Image Courtesy: http://poetrans.wordpress.com/2012/10/11/the-sea/

Ashalata is  a Ph.D. in English and is working in the Mahatma Gandhi  University .

.

The Sea

Grandma had never seen the sea
But when she passed on,
Her ashes were scattered
At the confluence of seas.

While viewing the sights of the sea
Through her sightless eyes,
From inside the ash-bearing urn,
The wails of her girls draw grandma back

The urn, which thrice came back,
Saying ‘ I don’t wish to see the sea, no!’
Finally goes back to the waves, reluctantly

.

Malayalam Original: Ashalata

English Translation: Anitha Varma

%d bloggers like this: