అనువాదలహరి

రాత్రి తలెత్తే ప్రశ్నలు… లూయీ అంటర్ మేయర్, అమెరికను కవి

అసలు

ఈ ఆకాశం ఎందుకు?

నెత్తిమీద ఉరుములు ఎవరు రేపెడతారు?

ఆ ఫెళఫెళమనే శబ్దం ఎవరు చేస్తారు?

దేవతలు నిద్రలో పక్కమిదనుండి క్రిందకి దొర్లిపోతారా?

వాళ్ళ ఆటబొమ్మలన్నిటినీ పగలగొడుతున్నారా?

సూర్యుడు ఎందుకు అంత త్వరగా క్రిందకి దిగిపోతాడు?

రాత్రిపూట మేఘాలెందుకు ఆకలితో

అప్పుడే ఉదయిస్తున్న చంద్రుణ్ణీ,

చంద్రుడిచుట్టూ ఉన్న గుడినీ మింగడానికి

అన్నట్టుగా నెమ్మదిగా పాకురుతుంటాయి?

అందరూ చెప్పుకుంటున్నట్టు

చుక్కలమధ్య ఎలుగుబంటి ఉంటుందా?

అలాగైతే, అది పచ్చికబయళ్ళ కడ్డంగా కట్టిన

దళ్ళు దూకి పాలపుంతని తాగెయ్యదా?

రాలిన ప్రతి నక్షత్రమూ

మిణుగురుపురుగుగా మారుతుందా?

మళ్ళీ తిరిగి అది ఎన్నడూ స్వర్గం చేరుకోదా?

అసలు ఇంతకీ

ఈ ఆకాశం ఎందుకున్నట్టు?

.

లూయీ అంటర్ మేయర్

అమెరికను కవి

(October 1, 1885 – December 18, 1977)

.

.

Questions at Night

.

Why

Is the sky?

What starts the thunder overhead?

Who makes the crashing noise?

Are the angels falling out of bed?

Are they breaking all their toys?

Why does the sun go down so soon?

Why do the night-clouds crawl

Hungrily up to the new-laid moon

And swallow it, shell and all?

If there’s a Bear among the stars,

As all the people say,

Won’t he jump over those Pasture-bars

And drink up the Milky Way?

Does every star that happens to fall

Turn into a fire-fly?

Can’t it ever get back to Heaven at all?

And why

Is the sky?

.

Louis Untermeyer

(October 1, 1885 – December 18, 1977)

American

Poem Courtesy:

https://www.poemhunter.com/poem/questions-at-night/

గూడు… లూయీ అంటర్ మేయర్, అమెరికను కవి

అలవాటుపడిన అన్ని చక్కనైన త్రోవలనీ విడిచి,
నీ పెదాలకీ, కనులకీ వీడ్కోలు పలికి
నిన్ను మరొక మనిషిలో కనుగొనే ప్రయత్నం …
నీకు ప్రశంసా? నమ్మక ద్రోహమా?

నేను పొందినదాన్నే ఎందుకు వెతుకుతున్నాను,
అరచేతికి అందినదాన్నే ఎందుకు దూరాల వెతుకుతున్నాను?
ఎందుకో నాకు తెలీదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలను
ఎలాగైనా నిన్ను చివరకి పట్టుకోవాలని తపిస్తున్నాను.

నాకు తెలిసిందల్లా ప్రేమకు లెక్కలేనన్ని ఆలంబనలున్నాయనీ,
ఆకలిగొన్న కడుపు లెక్కలేనన్ని వీధులు తిరగాలనీ;
సౌందర్యం ఒక కల, ఈ నేలని నడిపించేదదే;
నన్ను నా గూటికి చేర్చేదీ అదే!
.
లూయీ అంటర్ మేయర్
(October 1, 1885 – December 18, 1977)
అమెరికను కవి, విమర్శకుడు

 

Home

Is it a tribute or betrayal when,
Turning from all the sweet, accustomed ways,
I leave your lips and eyes to seek you in
Some other face?

Why am I searching after that I have,
And going far to find the near at hand?
I do not know— I only know I crave
To find you at the end.

I only know that Love has many a hearth,
That Hunger has an endless path to roam,
And Beauty is the dream that drives the earth
And leads me home.

Louis Untermeyer
(October 1, 1885 – December 18, 1977)
American Poet, Anthologist and Critic.

https://www.poetryfoundation.org/poetrymagazine/browse?volume=8issue=6page=22

ప్రార్థన … లూయీ అంటర్ మేయర్, అమెరికను కవి

ప్రభూ! ఈ బ్రతుకు జీవచ్ఛవం లాంటిదైనప్పటికీ
మేమేమి చేస్తున్నామో మాకు అవగాహనలేకపోయినప్పటికీ
మేము పురిలేని సన్నని దారంవంటి నమ్మకాలతో బ్రతుకుతున్నప్పటికీ
పోరాడి ఓడిపోవడానికి కావలసిన ధైర్యాన్ని ప్రసాదించు.

ఎప్పుడైనా తిరగబడగలిగితే నన్ను తిరగబడనీ
నన్ను భక్తుడికంటే సాహసికుడిని చెయ్యి
నన్ను అన్నిటికీ అతి సులభంగా సంతృప్తిపడేలా చెయ్యకు
నన్ను ఎప్పుడూ సందేహాలతో తేలియాడేలా అనుగ్రహించు.

దృశ్యాలచుట్టూ పరివేష్టితమైన అందాన్నీ
ఆశ్చర్యకరమైన విషయాలనీ చూడగలిగే కన్నులివ్వు
కానీ అన్ని వేళలా పంకిలాలనీ
అందులోనే పుట్టి నశించేవాటినీ చూడగలిగేట్టు చెయ్యి.

నా చెవులు సంగీతాన్ని ఆస్వాదించగలిగేట్టు అనుగ్రహించు
వాసంతపు తొలి మురళీరవాలకీ, మృదంగాలకీ పులకరించనీ
కానీ ఎన్నడూ మురికివాడలలో మ్రోగే
విషాదగీతాలను మరిచిపోయే సాహసం చెయ్యనీకు.

పనులు సగంచెయ్యడానికీ, రాజీపడిపోడానికీ
దూరంగా ఉండే అహంభావిగా, మొండివాడిగా నన్ను ఉంచు
కడకు విజయం నన్ను వరించినప్పటికీ,
ప్రభూ! నాలో ఇంకా కొంత అసంతృప్తి మిగుల్చు.
.

లూయీ అంటర్ మేయర్

(October 1, 1885 – December 18, 1977)

అమెరికను కవి .

.

Prayer

.

God, though this life is but a wraith,

    Although we know not what we use,     

Although we grope with little faith, 

    Give me the heart to fight—and lose.    

Ever insurgent let me be,                 

    Make me more daring than devout;       

From sleek contentment keep me free,       

    And fill me with a buoyant doubt.         

Open my eyes to visions girt  

    With beauty, and with wonder lit—        

But always let me see the dirt,

    And all that spawn and die in it.  

Open my ears to music; let     

    Me thrill with Spring’s first flutes and drums—       

But never let me dare forget     

    The bitter ballads of the slums.    

From compromise and things half done,   

    Keep me with stern and stubborn pride;

And when at last the fight is won,   

    God, keep me still unsatisfied.

.

Louis Untermeyer

(October 1, 1885 – December 18, 1977)

American Poet

Poem Courtesy:

http://www.bartleby.com/104/107.html

 

నవజాత శిశువుకి… లూయీ అంటర్ మేయర్, ఆమెరికను కవి

జీవితమనే కదనరంగానికి ఇదిగో బిడ్డా,

నువ్వు ఏతెంచేవు, విజయ సూచకంగా అరుచుకుంటూ,

కానీ, ఒక సంఘర్షణ నుండి మరొక సంఘర్షణ లోకి

తమస్సీమలనుండి, సందేహాలలోకి అడుగిడుతునావు.

వయసనే సున్నితమైన కవచాన్ని ధరించి,

బిడ్డా, నువ్వు అనేక యుద్ధాలలో పాల్గొనాలి,

నిరసనలే నీ కృపాణాలుగా, సత్యమే నీ డాలుగా,

తారామండలాలను జయించడానికి ప్రేమే నీ పతాకం కావాలి.

నీ చుట్టూ ప్రపంచంలోని నిరాశానిస్పృహలు అలముకుంటాయి,

ఒకోసారి పరాజయం పాలై, దారివెతుక్కోవలసి వస్తుంది.

తప్పటడుగులువేస్తున్నవారికి, నువ్వు ప్రేరణవి కా;

నిరాశాతప్తమైన భవిష్యత్తుకి, ఆశాకిరణానివి కా!

నిబిడాంధకారంలో మునిగిన జగత్తుకి దివ్వెవు కా,

దాని నిర్లిప్తతపాలిటి ఒక భీమప్రహారానివి కా,

ఆ బాధల్లోంచే, అల్లకల్లోలంలోంచే నువ్వు వచ్చేవు,

ఆ కల్లోలంలోకీ, బాధలోకీ తిరిగి నిష్క్రమిస్తావు.

.

లూయీ అంటర్ మేయర్

(October 1, 1885 – December 18, 1977)

ఆమెరికను కవి

.

.

On the Birth of a Child

 .

Lo—to the battle-ground of Life,

Child, you have come, like a conquering shout,

Out of a struggle—into strife;

Out of a darkness—into doubt.

Girt with the fragile armor of Youth,

Child, you must ride into endless wars,

With the sword of protest, the buckler of truth,

And a banner of love to sweep the stars. . . .

About you the world’s despair will surge;

Into defeat you must plunge and grope—

Be to the faltering, an urge;

Be to the hopeless years, a hope!

Be to the darkened world a flame;

Be to its unconcern a blow—

For out of its pain and tumult you came,

And into its tumult and pain you go.

Louis Untermeyer

(October 1, 1885 – December 18, 1977)

American Poet, Anthologist and Critic

Poem Courtesy:

http://www.poemtree.com/poems/OnTheBirthOfAChild.htm

చిత్రం! … లూయీ అంటర్ మేయర్, అమెరికను కవి

శ్వాసించలేనివీ, వేటినీ చూడలేనివీ
అలాంటి వాటికే ఎందుకు మరణం ఉండదో?
ఒక పిసరంత నేలకీ, స్పందనలేని రాతికీ,
ఒక ధూళి కణానికీ, కేవలం మట్టిపెల్లకీ
శాశ్వతత్వం అనుగ్రహించబడింది.
ఒక రైలుదారి పక్క గులకరాయికి మృతిలేదు…
భగవంతుని అపురూపవరం లభించింది దానికి.

మన పూర్వీకులు కోసిన గడ్డి
ఇపుడు వాళ్ళ సమాధులపై మొలుస్తోంది.
పారీ పారనట్టి అతి చిన్న వాగులు
ఎప్పుడూ ఇలా వచ్చి అలా పోతూనే ఉంటాయి.
ఇసకలా జడమై బలహీనమైనవాటిని
చంపి ప్రాణంతీయగల మృత్యువు లేదు.
మనిషొక్కడే గొప్పవాడూ, బలవంతుడూ
మేధోపజీవీ…. అందుకే అతనికి మరణం.
.

లూయీ అంటర్ మేయర్

October 1, 1885 – December 18, 1977

అమెరికను కవీ, విమర్శకుడు.

 .

Louis Untermeyer

.

Irony

.

Why are the things that have no death

The ones with neither sight nor breath!

Eternity is thrust upon

A bit of earth, a senseless stone.

A grain of dust, a casual clod

Receives the greatest gift of God.

A pebble in the roadway lies—

                        It never dies.

The grass our fathers cut away

Is growing on their graves to-day;

The tiniest brooks that scarcely flow

Eternally will come and go.

There is no kind of death to kill

The sands that lie so meek and still….

But Man is great and strong and wise—

                        And so he dies.

.

Louis Untermeyer

October 1, 1885 – December 18, 1977

American Poet and Critic

The New Poetry: An Anthology.  1917.

 Harriet Monroe, ed. (1860–1936).

http://www.bartleby.com/265/379.html

మర నాగలి … లూయీ అంటర్మేయర్, అమెరికను కవి.

.

విధేయతతో శ్రమిస్తూ కువకువలాడే ఈ భీకర మూర్తి కంటే

ఏ నగ్నత్వం ఇంతకంటే అందంగా ఉంటుంది?

ఏ ఆచ్ఛాదనా లేని జిడ్డోడుతున్న ఈ కండరాలూ

గురితప్పని ఈ ఇనప కడ్డీలూ ఎన్నడూ ఆగవు

పక్కలంట పొడవుగా, మెరిసే ఈ ఇనప రేకు

కందెన కూడా పాడుచెయ్యలేని ఇంద్రజాలం.

భూమిని రెండుగా చీల్చగల ఈ భారీ యంత్రం

దాని కోపాన్ని ఉస్ ఉస్ అని నెమ్మదిగా ప్రకటిస్తుంది.

దాన్ని అయిష్టాన్ని వెళ్ళగక్కదు; సృష్టికర్తలమీద

చంపెద్దామన్నంత కోపంతో ఎదురుతిరగదు.

అయితే అంతకంటే తీవ్రమైన అక్కసు మనసులో దాచుకుంటుంది;

తనయజమానికి భుక్తి సంపాదించడానికి బ్రతుకుతూ

నియంత్రించడమే గాని నేర్చుకోలేని కామందుని చూసి

తనబానిస సృష్టించేదానికి బానిస ఔతున్నందుకు నవ్వుతుంది.

.

లూయీ అంటర్మేయర్

(October 1, 1885 – December 18, 1977)

అమెరికను కవి

.

ఏ విశేషమూ లేనట్టు కనిపిస్తున్న ఈ కవితలో ఒక చమత్కారం ఉంది. బానిసత్వ భావన పై ఒక బలమైన ఆక్షేపణ. బానిసత్వం ఒద్దంటూనే మనిషి పరోక్షంగా యంత్రాలకి బానిస అయిపోతూ తన సహజ లక్షణాలను విస్మరించడంపై ఇది తన నిరసన. అమెరికను కవిత్వంలో అంతరాంతరాల్లో ఈ భావన తొంగిచూస్తూనే ఉంటుంది.

.

English: American writer, poet, literary criti...
English: American writer, poet, literary critic, and editor Louis Untermeyer (1885-1977) (Photo credit: Wikipedia)

Portrait of a Machine

.

What nudity is beautiful as this

Obedient monster purring at its toil;

These naked iron muscles dripping oil

And the sure-fingered rods that never miss.

This long and shining flank of metal is

Magic that greasy labor cannot spoil;

While this vast engine that could rend the soil

Conceals its fury with a gentle hiss.

It does not vent its loathing, does not turn

Upon its makers with destroying hate.

It bears a deeper malice; lives to earn

Its master’s bread and laughs to see this great

Lord of the earth, who rules but cannot learn,

Become the slave of what his slaves create

.

Louis Untermeyer

(October 1, 1885 – December 18, 1977)

American Poet, Critic, Anthologist and Editor.

Poem Courtesy:

http://www.gutenberg.org/files/25880/25880-h/25880-h.htm#PORTRAIT_OF_A_MACHINE

%d bloggers like this: