Tag: Louis Ginsberg
-
ఏప్రిల్… లూయీ జిన్స్ బర్గ్, అమెరికను కవి
నా శరీరందీర్ఘనిద్రలో మునిగినా నాకు ఇప్పటికీ ఇంకా గుర్తే సాయంసంధ్యవేళ పొదలు తడిగా ఉన్నపుడు ఏప్రిల్ నెల మనసులో పుట్టించే కోరికలు. వీధులంట వెన్నాడే సంజెవెలుగులు ఎక్కడో దూరాన తీతువు అరుపులు అందంగా, గుండ్రంగా, మెత్తగాలేస్తూ, వానకడిగిన పున్నమి చంద్రుడు. అందుకే, తలూచుతున్న పచ్చగడ్డి క్రింద దానికింద పరుచుకున్న మంచు దిగువన ఓ ఏప్రిల్ మాసమా! నువ్వెప్పుడు అలా అడుగేసినా నా రేణువులు నీకై కలవరిస్తాయి! . లూయీ జిన్స్ బర్గ్ October 1, 1895 – […]