Tag: Letitia Elizabeth Landon
-
పోలిక… లెటీటియా ఎలిజబెత్ లాండన్, ఇంగ్లీషు కవయిత్రి
ఒక అందమైన ఇంద్రధనుసు లాంటి జీవితం చాలు; ఆనందంతో గెంతుతూ, మిడిసిపాటుతో నిండినది: అటువంటి జీవితం వర్సైల్స్ లోని ఉద్యానవనం లాంటిది, అక్కడ అన్నీ కృత్రిమమైనవే; అక్కడ సెలయేరు చలువరాయి తొట్టెలలో బంధించబడుతుంది, లేదా వేడిగా ఉన్న గాలిలోకి చిమ్మబడుతుంది… జలపాతాల్లా అద్భుతంగా మెరుస్తూ; ఆ ప్రకృతి శక్తి, అంతటి మహత్తరశక్తీ, క్షణికమైన ఆటవస్తువైపోతుంది; అన్ని ఆటవస్తువుల్లాగే, దానిజీవితమూ బుద్బుదమే. . లెటీటియా ఎలిజబెత్ లాండన్ 14 August 1802 – 15 October 1838 ఇంగ్లీషు […]
-
లండను నగర దృశ్యం.4.. శ్మశానవాటి… లెటిషా ఎలిజబెత్ లాండన్
. నిన్ను బ్రతిమాలుకుంటా ఈ చివికిపోతున్న ఎముకలమధ్య నన్ను సమాధిచెయ్యొద్దు. కిక్కిరిసిపోతున్న ఈ రాళ్ళగుట్టలు నేలను మరీ గట్టిగా ఒత్తుతున్నాయి. వాళ్ళ ఆడంబరాలతో, ఆనందాలతో జన జీవితం మరీ చేరువగా ఉంది; ప్రాపంచికసుఖాలకు అలవాటుపడ్డ ఈ నేలమీద నిన్ను బ్రతిమాలుకుంటా, సమాధిచెయ్యవద్దు ఎడతెరిపిలేని ఈ వాహనాల చప్పుళ్ళు చనిపోయిన వాళ్ళకి నిద్రాభంగంచేస్తాయి ఓహ్, నా తలమీంచి ఇలా జీవితం రాదారివెయ్యడం నేను జన్మజన్మలకీ భరించలేను. ఇక్కడ స్మృతిఫలకాలు, నిస్తేజంగా, బావురుమంటున్నాయి అవి దేనికదే ఒంటరిగా నిలబడి […]