అనువాదలహరి

ప్రభాత గీతం… కార్ల్ విల్సన్ బేకర్, అమెరికను కవయిత్రి

ఆ కొండ చిగురున లేలేత వెలుగు ప్రసరిస్తోంది
అక్కడెక్కడో ఒక పచ్చని చామంతి కనిపిస్తోంది,
మరెక్కడో అంతకంటే తీయని మధువు ఆస్వాదించబడుతోంది.

కొన్ని శిలలుగా ఉండిపో నిర్ణయించబడ్డాయేమో!
తమకి తెలిసిన విషయాలే తెలుసుకుంటూ
తమ ఆత్మలోకి మరింత గాఢంగా నాటుకుంటూ…

కానీ, కొన్ని నన్నూ చిరుగాలినీ అనుసరించవలసిందే

మేమెప్పుడూ స్వేచ్ఛగా, విహరించడానికి సిద్ధంగా ఉంటాం,
భవిష్యంత ఆశావహంగా ఇంకెన్నడూ ఉండలేదు!

.
కార్ల్ విల్సన్ బేకర్
(1878–1960)
అమెరికను కవయిత్రి.

Karle Wilson Baker

Karle Wilson Baker

 
Photo Courtesy: Wikipedia

.

Morning Song

.

There’s a mellower light just over the hill,

And somewhere a yellower daffodil,

And honey, somewhere, that’s sweeter still.

And some were meant to stay like a stone,

Knowing the things they have always known,

Sinking down deeper into their own.

But some must follow the wind and me,

Who like to be starting and like to be free,

Never so glad as we’re going to be!

.

Karle Wilson Baker (Pen name: Charlotte Wilson)

(1878–1960)

American Poetess

Poem Courtesy:

Contemporary verse anthology; favorite poems selected from the magazine “Contemporary verse” 1916-1920, Page 6

ప్రకటనలు

మంచి సావాసము… కార్ల్ విల్సన్ బేకర్, అమెరికను కవయిత్రి

.

అప్పచెల్లెళ్ళలా వరుసలో నిల్చున్నఏడు రావిచెట్ల పక్కనా

ఈ రోజు నడుస్తూ నేను చాలా ఎత్తు ఎదిగాను…

చీకటి పడుతూనే మొగలిపొదల్లో వణుకుతూ వేలాడుతున్న

నక్షత్రంతో సంభాషించిన నా మనసు తేటపడిందనుకుంటున్నాను.

.

ఈ సాంధ్యవేళ దేవదారుకొమ్మల్లోంచి ఆ ఎర్రపిట్ట రాగరంజితమైన పిలుపుకి

నా మదిలోని తనజంట మేల్కొందిహాయిగా తియ్యగా బదులివ్వడానికి

నీలి మేఘాల పరదాలలోంచి హఠాత్తుగా ఒక దేవత తల ఊచుతోంది…

ఓహ్!నీ పవిత్రాంశలు భువికి అవనతించడానికి నే నేపాటిదానని ప్రభూ?.

.

కార్ల్ విల్సన్ బేకర్

(Oct 13, 1878 –  Nov 8, 1960)

అమెరికను కవయిత్రి.

.

Karle Wilson Baker

Karle Wilson Baker

Photo Credit: Wikipedia

.

Good Company

.

Today I have grown taller from walking with the trees,

The seven sister-poplars who go softly in a line;

And I think my heart is whiter for its parley with a star

That trembled out at nightfall and hung above the pine.


The call-note of a redbird from the cedars in the dusk

Woke his happy mate within me to an answer free and fine;

And a sudden angel beckoned from a column of blue smoke—

Lord, who am I that they should stoop— these holy folk of thine?

.

Karle Wilson Baker

(Oct 13, 1878 –  Nov 8, 1960)

American Poet and Author

I am sure you will be pleased in no less measure to read this about the poetess:

http://scholar.lib.vt.edu/ejournals/old-WILLA/fall98/jackson.html

(Poem Courtesy:

The Second Book of Modern Verse a Selection of the Work of Contemporaneous … Ed.  By Jessie Rittenhouse, Page 90)
%d bloggers like this: