అనువాదలహరి

జారిపోతున్న క్షణాలు… జార్జి లూయీ బోర్హెస్, అర్జెంటీనా కవి

నా జీవితాన్ని తిరిగి జీవించే అవకాశం వస్తే

మరిన్ని తప్పులు చెయ్యడానికి

రెండవసారి ప్రయత్నిస్తాను.

పరిపూర్ణంగా దోషరహితంగా ఉండడానికి ప్రయత్నించను.

ఏ ఒత్తిడీలేకుండా తీరుబాటుగా ఉంటాను,

ఇప్పటికంటే సంతృప్తిగా ఉంటాను.

నిజానికి అతి తక్కువ విషయాలని ప్రాధాన్యత ఇస్తాను

ఇప్పటికంటే తక్కువ పరిశుభ్రంగా ఉంటాను

ఎక్కువ తెగువచూపిస్తాను

ఎక్కువ ప్రయాణాలు చేస్తాను

ఎక్కువ సూర్యాస్తమయాలు చూస్తాను

ఎక్కువ కొండలెక్కుతాను

ఎక్కువ నదుల్లో ఈదుతాను

ఇప్పటివరకు చూడని ఎన్నో ప్రదేశాలు చూస్తాను

ఎక్కువ ఐస్ క్రీం తిని, తక్కువ ‘నిమ్మరసం జల్లిన గింజలు’ తింటాను,

తక్కువ ఊహించుకున్నవీ

ఎక్కువ నిజమైన సమస్యలూ ఎదుర్కొంటాను

జీవితంలో ప్రతిక్షణాన్నీ

వివేకంతో, ఫలవంతమైన జీవితం

జీవించిన వాళ్ళలో ఒకడిగా ఉంటాను.

నా జీవితంలోనూ ఆనందకరమైన క్షణాలుంటాయనుకోండి.

కానీ, రెండోసారి అన్నీ ఆనందక్షణాలే ఉండేలా ప్రయత్నిస్తాను.

జీవితం ఎలా ఉంటుందో నీకు తెలియకపోతే

ఇప్పుడున్న క్షణాన్ని పోగొట్టుకోకు.

ఎక్కడికెళ్ళినా తమతోపాటు ఒక థర్మామీటరూ

వేడినీళ్ళ సీసా

ఒక గొడుగూ, పారాచ్యూటూ లేకుండా

వెళ్ళనివారిలో ఒకడిగా బ్రతికేను.

మళ్ళీ జీవించే అవకాశం వస్తే తక్కువ సామానుతో ప్రయాణిస్తాను

మళ్ళీ జీవించే అవకాశం వస్తే

వసణ్తకాలం ప్రారంభం నుండి

శిశిర ఋతువు కడదాకా

ఉత్తికాళ్ళతో పనిచేస్తాను

ఎడ్లబండిమీద ప్రయాణిస్తాను,

మళ్ళీ జీవించే అవకాశం వస్తే

ఎక్కువ సూర్యోదయాలు చూస్తాను, ఎక్కువమంది పిల్లల్తో ఆడతాను.

నాకప్పుడే 85 నిండేయి,

నేను అట్టే రోజులు బ్రతకనని తెలుసు.

.

జార్జి లూయీ బోర్హెస్

(24 August 1899 – 14 June 1986)

అర్జెంటీనా కవి.

.

Instants

.

If I could live again my life,

In the next – I’ll try,

– to make more mistakes,

I won’t try to be so perfect,

I’ll be more relaxed,

I’ll be more full – than I am now,

In fact, I’ll take fewer things seriously,

I’ll be less hygenic,

I’ll take more risks,

I’ll take more trips,

I’ll watch more sunsets,

I’ll climb more mountains,

I’ll swim more rivers,

I’ll go to more places – I’ve never been,

I’ll eat more ice creams and less (lime) beans,

I’ll have more real problems – and less imaginary

ones,

I was one of those people who live

prudent and prolific lives –

each minute of his life,

Offcourse that I had moments of joy – but,

if I could go back I’ll try to have only good moments,

If you don’t know – thats what life is made of,

Don’t lose the now!

I was one of those who never goes anywhere

without a thermometer,

without a hot-water bottle,

and without an umberella and without a parachute,

If I could live again – I will travel light,

If I could live again – I’ll try to work bare feet

at the beginning of spring till

the end of autumn,

I’ll ride more carts,

I’ll watch more sunrises and play with more children,

If I have the life to live – but now I am 85,

– and I know that I am dying …

.

Jorge Luis Borges

24 August 1899 – 14 June 1986

Argentine Poet

Poem Courtesy:

http://famouspoetsandpoems.com/poets/jorge_luis_borges/poems/2918

తన దృష్టిలోపం మీద… జార్జ్ లూయీ బోర్హెస్, అర్జెంటీనా కవి

నా ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా, అవిచ్ఛిన్నమైన

వెలుగుపుంజమొకటి కాలక్రమంలోనన్నావహించింది,

అది సమస్త వస్తువుల్నీ విశ్లేషించి విశ్లేషించి కడకు, నా ముందు

వర్ణ,రూపరహితమైన వస్తువుగా నిలబెట్టేది,కేవల భావనగా.

జనప్రవాహంతో పొరలిప్రవహించే మౌలికమైన దివారాత్రాలు కూడా

ప్రాభాతసమయాన అరుణోదయానికి ఎదురుచూస్తూ

చిక్కగా, స్థిరంగా, నిలకడగా కనిపించే ఉషః కాంతిలా

మారిపోయేవి. నాకు ఒక్కటంటే ఒక్కటైనా మనిషిముఖం

చూడగలిగితేబాగుణ్ణనిపించేది. నాకు తెలియకుండానే,

చేత్తోపట్టుకోడం తప్ప మరేమీచెయ్యలేని ఆ మూసిన విజ్ఞానసర్వస్వ

సంపుటాలలోంచి చిన్నచిన్న పక్షులూ, వెన్నెల చందమామలూ ఎగిరిపోయేవి.

మంచికో చెడుకో, తక్కినవాళ్ళందరికీ ఈ ప్రపంచం దక్కితే దక్కనీ

నాకు మాత్రం ఈ మసకవెలుతురూ, కవిత్వప్రయాసలూ చాలు.

.

జార్జ్ లూయీ బోర్హెస్

(24th Aug 1899 – 14th June 1986)

అర్జెంటీనా కవి

 

 

.

Jorge Luis Borges
Argentine Poet

On His Blindness

.

In the fullness of years, like it or not,

A luminous mist surrounds me, unvarying,

That breaks things down into a single thing,

Colorless, formless. Almost into a thought.

The elemental, vast night and day

Teeming with people have become a fog

Of constant, tentative light that does not flag,

And lies in wait at dawn. I longed to see

Just once a human face. Unknown to me

The closed encyclopedia, the sweet play

In volumes I can do no more than hold,

The tiny soaring birds, the moons of gold.

Others have the world, for better or worse;

I have this half-dark, and the toil of verse.

.

Jorge Luis Borges

(24th Aug 1899 – 14th June 1986)

Argentine Poet

Poem Courtesy: https://www.poetryfoundation.org/poetrymagazine/browse?contentId=38927

ఉన్నదున్నట్టుగా … జార్జ్ లూయిస్ బోర్హెస్, అర్జెంటీనా కవి

తోట వాకిలి తెరుచుకుంటుంది,

సేవకుడికుండే విధేయతతో

బహుకాల సేవన ఇచ్చే చనవుతో అడిగే ప్రశ్నలా;

తోటలోకి ప్రవేశించిన తర్వాత

అక్కడ ఉండే ప్రతి వస్తువూ యథాతథంగా

మనసులో ముద్రవేసి ఉండడంతో

వాటిని ఏకాగ్రతతో పరిశీలించవలసిన అవసరం లేదు.

నాకు అన్ని సంప్రదాయాలూ, ఆలోచనలూ

ప్రతి జనసమూహమూ అల్లే

పలుకుబడుల అంతరార్థాలూ తెలుసు;

వాటిగూర్చి ప్రత్యేకంగా చెప్పనక్కరనూ లేదు,

లేని హక్కులూ, అధికారాలూ కోరదలుచుకోనూ లేదు.

నా చుట్టూ ఉన్నవాళ్ళకి నా గురించి బాగా తెలుసు

నా మానసిక వ్యధలూ, బలహీనతలూ తెలుసు.

బహుశా మనకు భగవంతుడు ప్రసాదించిన

ఉన్నత స్థితి చేరుకోవడమంటే ఇదేనేమో :

గెలుపులూ, పొగడ్తలూ కాదు,

చెట్లూ, గుట్టలులా

నిరాకరించలేని సత్యంలో భాగంగా

మనల్ని మనల్నిగా  అంగీకరించడమే.

.

 జార్జ్ లూయిస్ బోర్హెస్,

24 August 1899 – 14 June 1986

అర్జెంటీనా కవి.

.

.

Simplicity

.

It opens, the gate to the garden

with the docility of a page

that frequent devotion questions

and inside, my gaze

has no need to fix on objects

that already exist, exact, in memory.

I know the customs and souls

and that dialect of allusions

that every human gathering goes weaving.

I’ve no need to speak

nor claim false privilege;

they know me well who surround me here,

know well my afflictions and weakness.

This is to reach the highest thing,

that Heaven perhaps will grant us:

not admiration or victory

but simply to be accepted

as part of an undeniable Reality,

like stones and trees.

.

Jorge Luis Borges

24 August 1899 – 14 June 1986

Argentinian Poet

 

Poem Courtesy: http://www.poetryintranslation.com/PITBR/Spanish/Borges.htm#_Toc192667903

 

 

ఆత్మహత్య… హార్హి లూయిస్ బోర్హెస్, అర్జెంటీనా కవి

రాత్రి ఇక ఒక్క నక్షత్రమూ మిగలదు.

ఆమాటకొస్తే, అసలు రాత్రే మిగలదు

నేను మరణిస్తాను, నాతో పాటే

దుర్భరమైన ఈ సమస్త విశ్వమూను.

నేను పిరమిడ్లని తుడిచిపెట్టెస్తాను. ధనాన్నీ,

ఖండాలనీ, అక్కడి అన్నిరకాల ముఖాలనీ,

పోగుపడ్డ గతాన్నీ నేను చెరిపెస్తాను.

చరిత్రనీ, పాటు, మట్టినీ మట్టిలో కలిపెస్తాను.

నేనిపుడు కడపటి సూర్యాస్తమయాన్ని చూస్తున్నాను.

చిట్టచివరి పక్షి పాట వింటున్నాను.

నే నెవరికీ ఏదీ వారసత్వంగా మిగల్చను.

.

హార్హి లూయిస్ బోర్హెస్

24 August 1899 – 14 June 1986

అర్జెంటీనా కవి

.

Jorge Luis Borges

.

Suicide

.

Not a star will remain in the night.

The night itself will not remain.

I will die and with me the sum

Of the intolerable universe.

I’ll erase the pyramids, the coins,

The continents and all the faces.

I’ll erase the accumulated past.

I’ll make dust of history, dust of dust.

Now I gaze at the last sunset.

I am listening to the last bird.

I bequeath nothingness to no-one.

.

(Translated  from Spanish by : AS Kline @ 2008)

Jorge Luis Borges

24 August 1899 – 14 June 1986

Argentinian Poet, Translator, Short-story Writer

Poem Courtesy:

http://www.poetryintranslation.com/PITBR/Spanish/Borges.htm#_Toc192667909

 

మిల్టనూ- ఒక గులాబీ… జార్జ్ లూయిస్ బోర్హెస్, అర్జెంటీనా కవి

కాల మాళిగలలో కనుమరుగైపోయిన

వేల తరాల గులాబులలోంచి

ఒక్క పువ్వుని విస్మృతినుండి వెలికితీస్తాను

ఒకే ఒక్క నిష్కల్మషమైన గులాబి…

అలాంటిదంటూ ఒకటి ఉంటే. విధీ! అనుగ్రహించు!

అటువంటి గులాబిని ఎంచుకోగల శక్తి నాకొకసారి …

మిల్టను తన ఎదురుగా ఉంచుకున్నదీ,

మౌనంగా కాలగర్భంలో కలిసిన దానిని.

సింధూరవర్ణమో, పసుపురంగో

నాశమైన తోటలోని తెల్ల గులాబియో;

చిత్రంగా దాని గతం ఈ కవితలో దేదీప్యంగా

వెలుగుతూ శాశ్వతంగా మిగిలే ఉంటుంది.

బంగారు వర్ణమో, రక్తవర్ణమో, తెలుపో, నలుపో

విధి చేతిలో కనిపించకుండా నిలిచిన గులాబిలా.

.

జార్జ్ లూయిస్ బోర్హెస్

(24 August 1899 – 14 June 1986)

అర్జెంటీనా కవి

 

Jorge Luis  Borges

.

A Rose and Milton

.

From the generations of roses

That are lost in the depths of time

I want one saved from oblivion,

One spotless rose, of all things

That ever were. Fate permits me

The gift of choosing for once

That silent flower, the last rose

That Milton held before him,

O vermilion, or yellow

Or white rose of a ruined garden,

Your past still magically remains

Forever shines in these verses,

Gold, blood, ivory or shadow

As if in his hands, invisible rose.

.

Jorge Luis Borges

(24 August 1899 – 14 June 1986)

Argentine Poet

Translated by AS Kline

 

http://www.poetryintranslation.com/PITBR/Spanish/Borges.htm#_Toc192667905

 

పెంపుడుపిల్లి స్మృతికి… హోర్షే లూయీ బోర్షెస్ , అర్జెంటీనా కవి

.

నీకున్న నిశ్శబ్దపు ముసుగు అద్దాలకి కూడా ఉండదు

తొలిసంధ్యవేకువకి కూడ నీపాటి రహస్యోదయం లేదు,

వెన్నెల వెలుగులో, మేము దూరం నుండి మాత్రమే

రహస్యంగా కనిపెట్టగలిగిన చిరుతవి నువ్వు.

.

 ఏ దైవేచ్ఛా పరికల్పనో తెలీదుగాని,

మేమెంత వెంటాడినా నిన్ను అందుకోలేము;

భాగీరథి కన్నా, సూర్యాస్తమయంకన్నా సుదూరంగా

నీ ఏకాంతం నీది, నీ రహస్యం నీది.

.

 చెయిజాచి అందించిన నా క్షణమాత్ర లాలనని

నీ వెన్ను అంగీకరించింది; నువ్వు కనికరించావు,

నాటినుండి అనునిత్యం ఈ స్నేహ హస్తం నుండి

ప్రేమ అందుకొందికి. ఇపుడది విస్మృతిలోకి జారుకుంది.

.

ఇపుడు నీ కాలగణనమే వేరు; నీ రాజ్యానికి నువ్వే అధినేతవి –

ఆ లోకం … కలలా భిన్నమైనదీ, చొరరానిదీ.

.

హోర్షే లూయీ బోర్షెస్,

August 24, 1899 – June 14, 1986

అర్జెంటీనా కవి, కథకుడూ, అనువాదకుడూ, వ్యాసకర్తా.

ఇతని రచనలలో ప్రత్యేకత సాహిత్యంలో శూన్యత(మిధ్య).అతని కథలూ, కవితలూ సాహిత్యంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన  మేజికల్ రియలిజం అన్న ప్రక్రియకి దారితీసేయి. మేజికల్ రియలిజంలో ప్రథానంగా, కాలంతో  నిమిత్తం లేకుండా పాత్రలు వచ్చి పోతుంటాయి. (ప్రముఖ కథకులు మునిపల్లె రాజుగారు ఈ మేజికల్ రియలిజం మనకి కొత్త కాదనీ, ముఖ్యంగా భారతం లోనూ, రామాయణ, భాగవతాదుల్లో కూడ చాలా పాత్రలు ఇలాగే వస్తూ పోతుంటాయని చెబుతూ,ఆయనకూడా కొన్ని మంచికథలు వ్రాసేరు). నిజానికి ఈ మేజికల్ రియలిజం, 19వ శతాబ్దం లో సాహిత్యంలో వచ్చిన నేచురలిజం అన్న ప్రక్రియపై తిరుగుబాటు. ఈతని కథల్లో ఎక్కువగా, కలలూ, అద్దాలూ, జంతువులూ, మతమూ, భగవంతుడూ, తాత్త్విక చింతనా మొదలైనవన్నీ ఉంటాయి.

.

Español: Jorge Luis Borges
Español: Jorge Luis Borges (Photo credit: Wikipedia)

.

To a Cat

.

Mirrors are not more wrapt in silences
 nor the arriving dawn more secretive ;
 you, in the moonlight, are that panther figure
 which we can only spy at from a distance.
 By the mysterious functioning of some
 divine decree, we seek you out in vain ;
 remoter than the Ganges or the sunset,
 yours is the solitude, yours is the secret.
 Your back allows the tentative caress
 my hand extends. And you have condescended,
 since that forever, now oblivion,
 to take love from a flattering human hand.
 you live in other time, lord of your realm –
 a world as closed and separate as dream.

Jorge Luis Borges
(Aug. 24, 1899 – June 14, 1986)
 Argentinian Poet

Poem Courtesy: http://wonderingminstrels.blogspot.com/2000/04/to-cat-jorge-luis-borges.html

%d bloggers like this: