అనువాదలహరి

సంధ్యాగమనము … జాన్ మిల్టన్, ఇంగ్లీషు కవి

నిశ్శబ్దాన్ని తోడు గొని, మత్తుగొలిపే చీకటి ముసుగు

ప్రకృతి యెల్లెడలా అంచెలంచెలుగా పరచుకుంటూ 

ప్రశాంతంగా అడుగు మోపింది సాయంసంధ్య; పశుపక్ష్యాదులు 

తమ తమ పసరిక నెలవులకూ, గూళ్ళకూ చేరుకున్నాయి; 

ఎటుజూసినా నిశ్శబ్దమే, వనప్రియ కోకిలారవం మినహా; 

తను రాత్రంతా శృంగారగీతికల నాలపిస్తూనే ఉంది;

నిశ్శబ్దపు గుండె పరవశించింది. ఇపు డాకసమునిండా

ఇంద్రనీలమణులప్రభలే; ఆ నక్షత్రాతిథులమధ్య

రేచుక్క అరుణిమతో జేగీయమానంగా వెలుగులీనుతోంది;  

ఇంతలో మొయిలుదొంతరల తెరలుమాటుచేసి రాజోచిత దర్పంతో

అసమాన తేజస్వియైన రేరాజు తొంగిచూసాడు. అంతే!

అంతటి రజనీ నీలాంబరమూ … వెండివలిపమై భాసించింది.

.

జాన్ మిల్టన్

(9 December 1608 – 8 November 1674)

ఇంగ్లీషు కవి

An Evening

.

Now came still evening on, and twilight gray

Had in her sober livery all things clad;

Silence accompany’d; for beast and bird,

They to their grassy couch, these to their nests,

Were slunk, all but the wakeful nightingale;

She all night long her amorous descant sung;

Silence was pleas’d. Now glow’d the firmament

With living sapphires; Hesperus, that led

The starry host, rode brightest, till the moon,

Rising in clouded majesty, at length

Apparent queen unveil’d her peerless light,

And o’er the dark her silver mantle threw.

.

John Milton

(9 December 1608 – 8 November 1674)

English Poet

From: Paradise Lost IV Book

వనదేవత… జాన్ మిల్టన్, ఇంగ్లీషు కవి

అడుగుల జాడలు అగుపడక,

మిలమిల మెరిసే మెత్తని ఆకుపచ్చని పచ్చికమీద,

నేను తీగలు సారిస్తూ

పాటపాడుతుంటే నన్ననుసరించు.

చుక్కలు చొరరాని చిక్కని

ఎల్మ్ చెట్టు కొమ్మల నీడలో

నా వెంట రా

ఆమె దివ్యత్వానికి తగ్గట్టుగా

శోభాయమానంగా అలంకరించుకుని కూచున్న

ఆమెదగ్గరకి నిను చేరుస్తాను.

అటువంటి వనదేవతని

ఈ నేల ఎన్నడూ చూసి ఎరుగదు.

.

జాన్ మిల్టన్

9 December 1608 – 8 November 1674

ఇంగ్లీషు కవి

(From ‘Arcades’)

.

O’RE the smooth enameld green      

    Where no print of step hath been,

    Follow me as I sing,  

    And touch the warbled string.      

Under the shady roof    

Of branching Elm Star-proof,

    Follow me,      

I will bring you where she sits

Clad in splendor as befits       

    Her deity.        

Such a rural Queen       

All Arcadia hath not seen.

.

John Milton.

9 December 1608 – 8 November 1674

Poem Courtesy:

The Oxford Book of English Verse: 1250–1900.

Ed: Arthur Quiller-Couch, 1919.

http://www.bartleby.com/101/312.html

 

 

కాలం… జాన్ మిల్టన్, ఇంగ్లీషు కవి

ఓ క్రూరమైన కాలమా! నీ పరుగు పూర్తయేదాకా పరిగెత్తు.
బరువైన సీసపు లోలకపు గమనాన్ని పోలిన వేగంతో
నీరసంగా అడుగులువేసే ఘడియల్ని నీ వెంట తీసుకుపో;
నీకు దొరికే ఆ నశ్వరమూ, నిరుపయోగమైన
వాటితోనే నీ పొట్ట పగిలేలా సుష్టుగా ఆరగించు
అదంతా కేవలం క్షణభంగురమైన వ్యర్థము.
మేము పోగొట్టుకున్నదీ  లేదు
నువ్వు బావుకున్నదీ లేదు.
ఎందుకంటే, ఒక్కొక్క పనికిమాలిన వస్తువునీ
అంకించుకుంటూ, చివరకి నిన్ను నువ్వే ఆరగించుకున్నాక
అనశ్వరమైన బ్రహ్మానందం మాకోసం నిర్రిక్షిస్తుంటుంది
ఒక్కొక్కరికీ ఆత్మీయమైన ముద్దు పెడుతూ;
సంతోషం వరదలా మమ్మల్ని ముంచెత్తుతుంది.
ప్రతీదీ త్రికరణశుద్ధిగా మంచిదయినపుడు
పరిపూర్ణమైన దివ్యత్వం ప్రతిబింబించినపుడు
ఆ దేవుని ఉత్కృష్ట స్వర్లోక సింహాసనము నిత్యమూ
సత్యమూ, శాంతీ, ప్రేమలతో విరాజిల్లుతుంది.
ఆనందదాయకమైన అతని కేవల దర్శనము చేత
ఊర్ధ్వ పథగామి యైన మా ఆత్మ, ఐహికమైన
సమస్త గుణదోషాలనుండీ వినిర్ముక్తమౌతుంది
మృత్యువునీ, విధినీ,కాలమా!చివరకి నిన్నూ ధిక్కరిస్తూ.

.

జాన్ మిల్టన్

(9 December 1608 – 8 November 1674)

 ఇంగ్లీషు కవి

.

Image Courtesy: Wikipedia
Image Courtesy: Wikipedia

John Milton

.

On Time

Fly envious Time, till thou run out thy race, 

Call on the lazy leaden-stepping hours,         

Whose speed is but the heavy Plummets pace;        

And glut thy self with what thy womb devours,     

Which is no more than what is false and vain,        

And merely mortal dross;         

So little is our loss,

So little is thy gain.         

For when as each thing bad thou hast entomb’d,     

And last of all, thy greedy self consum’d,     

Then long Eternity shall greet our bliss         

With an individual kiss;  

And Joy shall overtake us as a flood,  

When everything that is sincerely good        

And perfectly divine,      

With Truth, and Peace, and Love shall ever shine   

About the supreme Throne       

Of him, t’whose happy-making sight alone,  

When once our heav’nly-guided soul shall clime,   

Then all this Earthy grosnes quit,        

Attir’d with Stars, we shall for ever sit,         

Triumphing over Death, and Chance, and thee O Time.

John Milton.

(9 December 1608 – 8 November 1674)

English Poet

Poem Courtesy:

The Oxford Book of English Verse: 1250–1900.

Arthur Quiller-Couch, ed. 1919.

http://www.bartleby.com/101/308.html

 

 

 

 

%d bloggers like this: