అనువాదలహరి

సానెట్… జాన్ మేస్ ఫీల్డ్, ఇంగ్లీషు కవి

అదలా ఉండొచ్చు; కానీ తెలియనిదాన్ని అలానే ఉండనీ.
భూమి మీద మనమందరం సూర్యుడి సేవకులం. 
నాలోని చైతన్యమంతా సూర్యుడినుండే వస్తుంది,
అతని అమృతస్పర్శే సకలజీవులకూ ప్రాణభిక్ష.

మనంశూన్యంలో తిరుగుతున్నామంటే అతని శక్తివల్లనే 
అతని యవ్వనం గ్రీష్మం, మన ఆహారం అతని మగసిరే 
సౌందర్యం అంటే అతని ముఖంలోకి చూడగలగడమే
అతను చీకటి తొలగించి, పూలకు రంగులద్దుతాడు.

అతనేమిటో, ఎవరికి తెలుసు? కానీ, మనం అతని సొత్తు 
అతనిచుట్టూ రోదసిలో ప్రదక్షిణం చేస్తాం, ఏళ్ళకి ఏళ్ళు 
మనందరం చెట్టుకు పూచి వాడిపోతున్న ఆకులం
ఎవరి లాలసలు, అధికారాలు, భయాలు వాళ్ళవి.

మనం ఏమవుతామో ఎవరికెరుక? కానీ ప్రతి ఒక్కరం
ధూళికణం మీద ధూళికణంలా సూర్యుడి సేవకులం.

.
జాన్ మేస్ ఫీల్డ్

(June 1878 – 12 May 1967)

ఇంగ్లీషు కవి

 

 

 

.

.

 

SONNET

 

It may be so; but let the unknown be.

We, on this earth, are servants of the sun.

Out of the sun comes all the quick in me,

His golden touch is life to everyone.

 

His power it is that makes us spin through space,

His youth is April and his manhood bread,

Beauty is but a looking on his face,

He clears the mind, he makes the roses red.

 

What he may be, who knows? But we are his,

We roll through nothing round him, year by year,

The withering leaves upon a tree which is

Each with his greed, his little power, his fear.

 

What we may be, who knows? But everyone

Is dust on dust a servant of the sun.

.

John Masefield

(June 1878 – 12 May 1967)

English Poet and Writer

 

Courtesy:

http://www.gutenberg.org/files/38438/38438-h/38438-h.htm

జీవితమా! నే నేవర్ని?… జాన్ మేస్ ఫీల్డ్, ఇంగ్లీషు కవి

జీవితమా! నే నేవర్ని? అవిశ్రాంతంగా తిరిగే

జీవకణాలు పదిలంగా పొదువుకున్న నీటి తిత్తినా?

అ వెందుకు పనిచేస్తున్నాయో వాటికే తెలియదు, ఒక క్షణం ఆగవు,

వాటి యజమాని ఎక్కడ ఉన్నాడో నాకు అంతుపట్టదు

వాటిని పనిచెయ్యమని అడగను, అయినా అవి కష్టపడి పనిచేస్తాయి,

అవొక ప్రపంచాన్ని అల్లుతాయి ఒకరినొకరు వాడుకునేలా;

ఏ లక్ష్యం సాధించడానికో నాకు తెలీదు, ఎప్పుడు మొదలో తెలీదు

ఎవర్ని పొగడాలో, ఎవర్ని తెగడాలో, ఎవర్ని ముద్దుచెయ్యాలో తెలియదు.

ఒక అద్భుతంలో మరొక అద్భుతం పొదిగినట్టు,

నే నీ విశ్వానికి సమాధానం చెబుతుంటాను, కెరటం తర్వాత కెరటంలా

నా మీంచి, తడిదో. పొడిదో, నీటిపుట్టంత గాలి పుట్ట తరలిపోతుంది,

గగనబిలంలోంచి ఈదుకుంటూ నిండు జాబిలి లేస్తుంది

లేదా అద్భుతమైన రవిబింబం ఉదయిస్తుంది;

కోటానుకోట్ల ఈ “నేను” లు పులకరిస్తాయి

ఎందుకో తెలీదు, అయినా ఆశ్చర్యం పడక మానవు.

.

జాన్ మేస్ ఫీల్డ్

1 June 1878 – 12 May 1967

ఇంగ్లీషు కవి

.

What am I, Life?

.

What am I, Life? A thing of watery halt

Held in cohesion by unresting cells,

Which work they know not why, which never halt,

Myself unwitting where their Master dwells

I do not bid them, yet they toil, they spin

A world which uses me as I use them;

Nor do I know which end or which begin

Nor which to praise, which pamper, which condemn.

So, like a marvel in a marvel set,

I answer to the vast, as wave by wave

The sea of air goes over, dry or wet,

Or the full moon comes swimming from her cave,

Or the great sun comes forth: this myriad I

Tingles, not knowing how, yet wondering why.

.

John Masefield

The New Poetry: An Anthology.  1917.

Harriet Monroe, ed. (1860–1936).

http://www.bartleby.com/265/214.html

అస్వస్థతతో మంచంపట్టినపుడు… జాన్ మెయిస్ ఫీల్డ్, ఇంగ్లీషు కవి

పగలల్లా గాలి రొద వింటూనే ఉన్నాను
అది ఏమి చెప్పదలుచుకుందో దానితో సహా.
రాత్రల్లా గాలి చేసిన చప్పుళ్ళు విన్నాను
పోరాటానికి పోతూ అదిచేసిన హాహాకారాలతో సహా.
గాలి ఆగగానే వర్షమూ
వర్షం ఆగగానే గాలీ
కొండమీద దాడి చెయ్య సాగేయి
అది మాత్రం నిశ్చలంగా ఉంది.

పగలల్లా సముద్రం
నేలని స్థిరంగా ఉండనీలేదు,
రాత్రల్లా నేలమీదకి సముద్రంలోని
ఇసక అంతా పోగుపెడుతూనే ఉంది
రాత్రంతా అది తెల్లగా
మెరవడం చూశాను
ఘోరమైన దాని జుత్తు విరబోసుకుని
ఇప్పటికీ… ఇంకా…

పగలల్లా ఆ కొండకి
గాలి ఎంత బలంగా తాకుతుందో  తెలిసింది;
రాత్రల్లా ఆ కొండ
సముద్రపు పోటుని తట్టుకుంది;
కిటికీలోంచి చూస్తున్న నాకు
సందేహమూ ఆశ్చర్యమూ కలిగేయి:
అంత బలమైన శక్తులు అంతసేపు
సమ ఉజ్జీ అయిన బలిమితో తలపడాలా అని.
.
జాన్ మెయిస్ ఫీల్డ్

1 June 1878 – 12 May 1967

ఇంగ్లీషు కవి

John Masefield

.

Watching by a Sick-Bed

.

I Heard the wind all day,

And what it was trying to say.

I heard the wind all night

Rave as it ran to fight;

After the wind the rain,

And then the wind again

Running across the hill

As it runs still.

And all day long the sea

Would not let the land be,

But all night heaped her sand

On to the land;

I saw her glimmer white

All through the night,

Tossing the horrid hair

Still tossing there.

And all day long the stone

Felt how the wind was blown;

And all night long the rock

Stood the sea’s shock;

While, from the window, I

Looked out, and wondered why,

Why at such length

Such force should fight such strength.

.

John Masefield

1 June 1878 – 12 May 1967

English Poet

Poem Courtesy:

The New Poetry: An Anthology.  1917.

Harriet Monroe, ed. (1860–1936).

http://www.bartleby.com/265/213.html

మళ్ళీ సముద్రం మీదకి పోవాలి… జాన్ మేస్ ఫీల్డ్, బ్రిటిషు కవి

నేను మళ్ళీ సముద్రం మీదకి పోవాలి

ఒంటరి సముద్రమూ, ఆకాసమూ వైపుకి.

నేను కోరుకునేదల్లా ఒక పొడవాటి ఓడా

దానికి దోవచూపడానికి ఒక నక్షత్రమూ,

గిరగిరా తిరిగే చక్రాలూ, హుషారుగా ఈలవేసే గాలీ

దానివడికి అటుఇటు ఊగే  తెల్లని తెరచాపా,

సంద్రతలం మీద సన్నని తెల్లని మంచుతెరా,

అప్పుడే చీకటిని తొలగిస్తున్న అరుణోదయమూ.

నేను మళ్ళీ సముద్రం మీదకి వెళ్ళాలి

పరిగెడుతున్న అలల పిలుపుకి ఊ కొడుతూ,

అది స్పష్టమైన, నీరవమైన పిలుపే,

అందులో సందేహం లేదు.

నేను కోరుకునేదల్లా, గాలి చురుకుగా ఉండే రోజు

వెండి మబ్బులు చెల్లాచెదరైపోతుండాలి.

పిచికారీ కొడుతున్నట్టు తుషారాలూ, నురుగూ పైకి ఎగయాలి,

సీ-గల్స్ సంతోషంతో ఎగురుతూ కూతపెట్టాలి.

నేను మళ్ళీ సముద్రం మీదకి పోవాలి

తిరిగి నా నిలకడలేని దేశదిమ్మరి బతుక్కి,

ఆ పక్షి తోవలో, తిమింగలం త్రోవలో

సానపట్టిన కత్తిలా వడిగాలి కోస్తుంటే;

నేను కోరేదల్లా: ఒక సాహస గాథ,

నా తోటి యాత్రికుడు ఆనందంగా పాడుతూ చెప్పాలి;

ఈ మాయ జీవితం ముగిసేక

ప్రశాంతమైన నిద్రా, తియ్యటి కలలూ.  అంతే!

.

జాన్ మేస్ ఫీల్డ్

1 June 1878 – 12 May 1967

బ్రిటిషు కవి

.

John Masefield

.

Sea Fever

.

I must go down to the seas again,

   to the lonely sea and the sky,

And all I ask is a tall ship

   and a star to steer her by,

And the wheel’s kick and the wind’s song

   and the white sail’s shaking,

And a grey mist on the sea’s face

   and a grey dawn breaking.

 

I must go down to the seas again,

   for the call of the running tide

Is a wild call and a clear call

   that may not be denied;

And all I ask is a windy day

   with the white clouds flying,

And the flung spray and the blown spume,

   and the sea-gulls crying.

 

I must go down to the seas again

   to the vagrant gypsy life,

To the gull’s way and the whale’s way

   where the wind’s like a whetted knife;

And all I ask is a merry yarn

   from a laughing fellow rover,

And quiet sleep and a sweet dream

   when the long trick’s over.

 .

[From Salt-Water Ballads (1902)]

.

John Masefield

1 June 1878 – 12 May 1967

English Poet

%d bloggers like this: