అనువాదలహరి

కాలిపోతున్న ఓడ… జాన్ డన్ ఇంగ్లీషు కవి.

.

ఇది చాలా సందేశాత్మకమైన కవిత. మనం జీవితాలు కాలి మునిగిపోతున్న ఓడలాంటివి. మరణాన్నించి ఎవ్వరమూ తప్పించుకోలేం. అలా తప్పించుకుందికి ప్రయత్నంచేసిన వారికి మరణకారణం మారుతుందేమో గాని మరణాన్నుంచి మినహాయింపు మాత్రం దొరకదు. జాన్ డన్ 17 వ శతాబ్దపు ప్రముఖ ఆధిభౌతిక (Metaphysical) కవుల పరంపరకి చెందినవాడు.

.

సముద్రంలో మునిగిపోవడంవల్ల తప్ప మంటలనుండి

తప్పించుకోలేని కాలిపోతున్న ఓడ లోంచి

కొందరు మనుషులు ఒక్కసారి బయటకు గెంతారు ,

వాళ్ళు శత్రుఓడలదరికి జేరగానే వాళ్ళతూటాలకు బలైపోయారు;

అలా ఆ ఓడలో ఉన్న వాళ్ళందరూ సమసిపోయారు,

చిత్రంగా, సముద్రంలో దూకినవారు నిప్పుకీ,

మండుతున్న ఓడలో మిగిలినవారు నీటమునిగీ.

.

జాన్ డన్

(22 January 1572 – 31 March 1631)

ఇంగ్లీషు కవి.

.

Burnt Ship

.

Out of a fired ship, which by no way 

But drowning could be rescued from the flame, 

Some men leap’d forth, and ever as they came 

Near the foes’ ships, did by their shot decay; 

So all were lost, which in the ship were found, 

      They in the sea being burnt, they in the burnt ship drown’d. 

.

John Donne

(22 January 1572 – 31 March 1631)

English Poet

Poem Courtesy: https://www.poetryfoundation.org/poems/44095/a-burnt-ship

మృత్యువా, గర్వపడకు! … జాన్ డన్.

http://www.idlebrain.com/images/ganta.jpg
Image Courtesy: http://www.idlebrain.com

 (This translation is dedicated to  Sri Ghantasala Venkateswara Rao, the IMMORTAL Singer,  on his 89th Birth Anniversary)

.

ఓ మృత్యువా, గర్వపడకు!

ఎవరో కొందరు నిన్ను మహాశక్తిశాలివనీ,

భయంకరమైన దానివనీ అన్నారని.

నీ కంత శక్తులేం లేవు.

.

నువ్వెవర్నో కొందర్ని గెలిచేనని ఊహించేసుకుంటున్నావుగానీ,

వాళ్ళేం  మరణించలేదు.

ఓసి పిచ్చి దానా! అంతెందుకు,

నువ్వు నన్నే గెలవలేవు!

.

విశ్రాంతిలోనూ, నిద్రలోనూ కూడా

మనుషులు మరణించినట్టే ఉంటారు.

కనుక, వాటితర్వాత కలిగే ఉత్సాహమూ ఆనందంకంటే,

మృత్యువుతర్వాత ఇంకా ఎక్కువ కలగాలి.

.

అతి త్వరలోనే

మా లోని మంచి వ్యక్తులు నీతో ప్రయాణించవచ్చు.

వాళ్ళ భౌతికకాయాలు ప్రకృతిలో కలిసినా,

ఆత్మలు నిర్వాణాన్ని చేరుకుంటాయి.

.

విధికీ, యాదృఛ్ఛిక సంఘటనలకీ,

రాజ్యాధికారానికీ, అన్నిటికీ తెగించినవారికీ,

నువ్వొక బానిసవి…. 

గరళాలూ, యుధ్ధాలూ, అనారోగ్యాలూ నీ ఆటపట్లు.

.

నీ కంటే, నల్లమందూ , వశీకరణలూ బాగా పనిచేస్తాయి

మనుషుల్ని నిద్రపుచ్చడానికి.

అలాంటప్పుడు,

ఎందుకు నీకీ విరగబాటు?

.

ఒక చిన్న కునుకు తర్వాత

మేము శాశ్వతంగా మేలుకుంటాం,

మరి మాకు మృత్యువు లేదు.

పాపం! ఓ మృత్యువూ! మరణం ఉన్నది నీకే!

.

జాన్ డన్

.

Death Be Not Proud (Or Holy Sonnet X)

.

Death be not proud, though some have called thee

Mighty and dreadful, for, thou art not so.

For, those, whom thou think’st, thou dost overthrow,

Die not, poor death, nor yet canst thou kill me.

From rest and sleep, which but thy pictures be,

Much pleasure;  then from thee, much more must flow,

And soonest our best men with thee do go,

Rest of their bones, and souls delivery.

Thou art slave to Fate, Chance, kings, and desperate men,

And dost with poison, war, and sickness dwell;

And poppy, or charms can make us sleep as well,

And better than thy stroke; why swell’st thou then?

One short sleep past, we wake eternally,

And death shall be no more; Death, thou shalt die.

.

John Donne

(“Death Be Not Proud” is one of the most famous poems in English literature. Its popularity lies in its subtle poetic language and in establishing that there is death only to the mortal frame and not to the soul. Donne beautifully analyses that death is a slave in the hands of Fate, chance and perverted people who perpetrate it by virtue of their power, arrogance, greed or hatred.  He even compares that things like Poppy seeds from which a potion is produced to induce sleep, work better as sedative. He says while the mortal remains are consigned to elements, after a brief interlude, the soul awakens to reincarnate, a faith in the  immortality … a common strain of Donne’s times, which incidentally matches oriental thought. This was originally titled as Holy Sonnet X. … translator. )

మనిషొక దీవి కాదు … జాన్ డన్

http://api.ning.com/files/0LF5F*AzPzyA5W1NIPrZHmrR8WNb2L5bJKGr12x5zUTx1wLNyjkvBxhcZv8w4x5O9oNcDvsoNEALh*z381op8DwZlmZSKP5e/symmetry.jpg?&
Image Courtesy: http://api.ning.com

.

మనిషి ఒక స్వయం సమృధ్ధమైన దీవి కాదు…

ప్రతివాడూ ఒక భూఖండంలో ఖండమే…

సంపూర్ణతకి పరిపూర్ణతనిచ్చే అంతర్భాగమే…

ఒక మట్టిపెళ్ళ కెరటాలకి కొట్టుకుపోయినా,

యూరోపు ఆ మేరకు వెలవెలబోతుంది

ఒక మిట్ట తరిగిపోయినరీతి…

నీదో, నీ స్నేహితుడిదో,

మొఖాసాలో కొంత భూమి కోల్పోయినతీరు…

మరణించిన ప్రతి మనిషితోనూ, 

నాలో కొంత మేరను కోల్పోతున్నాను నేను,

ఎందుకంటే నేను మనుషులతో ముడిపడి ఉన్నాను గనుక.

అందుకే, గంటలు ఎవరికోసం మ్రోగుతున్నాయో

తెలుసుకుందికి కబురంపకు…

అవి నీ కోసమే …

.

జాన్ డన్

.

No Man is an Island  (or, For Whom the Bells Toll)

.

No man is an island, entire of itself.

Each is a piece of the continent, a part of the main.

If a clod be washed away by the sea, Europe is the less.

As well as if a promontory were.

As well as if a manor of thine own

Or of thine friend’s were.

Each man’s death diminishes me,

For I am involved in mankind.

Therefore, send not to know

For whom the bell tolls,

It tolls for thee.

.

John Donne

1572 (between 24 January and 19 June)– 31 March 1631

%d bloggers like this: