
రాబర్ట్ బ్లూమ్ ఫీల్డ్ స్మృతిలో… జాన్ క్లేర్, ఇంగ్లీషు కవి
Robert Bloomfield
(3 December 1766 – 19 August 1823)
Was a self-educated English working-class poet, admired by Stephen Duck, Mary Collier and John Clare.
Image Courtesy: http://etc.usf.edu/clipart/32000/32088/bloomfield_32088.htm
నిరాడంబరంగా కమ్మని గీతాలాలపించుకునే గాయకమణీ
ఈనాటి మిరిమిట్లుగొలిపే ఆడంబరాలు నీకు నచ్చవు.
సహజమైన ప్రకృతిదృశ్యాలూ, పొలాలూ, మేఘమాలికలూ
తరులూ, శ్రమజీవులైన తేనెటీగలూ లలితలలితమైన
తమరాగాలతో నీపాటకి సంగీతాన్ని సమకూరుస్తాయి.
ప్రకృతే నిన్ను అక్కునజేర్చుకుంది; మంది గుర్తించక పోతే పోనీ.
రెంటికీ ప్రకృతే వనరై, భూమ్యాకాశాలు ప్రతియేడూ
వాటి తరగలలో త్వరితాన్ని తీసుకువచ్చినా,
ఉధృతంగా పొరలే నాగరికపు సెలయేటి కెరటాలు బలమైనవి
మనసులో పాడుకుంటూ నిదానంగా పారే పల్లెవాగులు తట్టుకోలేవు.
గాయపడిన నీ గీతానికి వగవనక్కరలేదు.
ఎందుకంటే వేసవి ఎండలు సెలయేటి నీరు ఎండగట్టినా
నీ తేనీటి ఊటల వాగు గలగలలు శాశ్వతంగా నిలిచిఉంటాయి.
.
జాన్ క్లేర్
(13 July 1793 – 20 May 1864)
ఇంగ్లీషు కవి
In Memory of Robert Bloomfield
.
Sweet unassuming Minstrel not to thee
The dazzling fashions of the day belong
Natures wild pictures field and cloud and tree
And quiet brooks far distant from the throng
In murmurs tender as the toiling bee
Make the sweet music of thy gentle song
Well—nature owns thee let the crowd pass bye—
The tide of fashion is a stream too strong
For pastoral brooks that gently flow and sing
But nature is their source and earth and sky
Their annual offerings to her current bring
Thy injured muse and memory need no sigh
For thine shall murmur on to many a spring
When their proud stream is summer burnt and dry
.
John Clare
(13 July 1793 – 20 May 1864)
English Poet
Poem courtesy:
https://www.cambridgescholars.com/download/sample/60814 page 7
వీనస్… జాన్ క్లేర్, ఇంగ్లీషు కవి
ఓ వీనస్! పగలు గతించింది
మెత్తగా మౌనంగా రాలుతోంది మంచు
ఇప్పుడు ప్రతిపువ్వు మీదా కన్నీటిబొట్టే
స్వర్గం వేరెక్కడా లేదు, ఉంది నీ చెంతనే!
ఓ వీనస్! అందమైన సంధ్య మమ్మల్ని
నెమ్మదిగా, తెలియకుండా కమ్ముకుంటోంది
దివా రాత్రాల కలయిక వేళ
పసిపాప ఊపిరితీస్తున్నట్టు ఉంది.
ఓ వీనస్! మంచుకురిసిన నేలమీద
రాలిపడిన పువ్వు నిద్రిస్తోంది
మంచు సన్నని జల్లుగా కురుస్తుంటే
చుట్టూ ప్రకృతి శ్వాసిస్తున్నట్టు ఉంది.
ఓ వీనస్! వినీలాకాశంనుండి
మిణుకుమంటున్న నీ కాంతికిరణం
అలసిన బాటసారికి తోవచూపిస్తూ
నేలని మన్నించేలా చేస్తుంది.
.
జాన్ క్లేర్
13 జులై 1793 – 20 మే 1864
ఇంగ్లీషు కవి.
.

.
Hesperus
Hesperus the day is gone
Soft falls the silent dew
A tear is now on many a flower
And heaven lives in you
Hesperus the evening mild
Falls round us soft and sweet
‘Tis like the breathings of a child
When day and evening meet
Hesperus the closing flower
Sleeps on the dewy ground
While dews fall in a silent shower
And heaven breathes around
Hesperus thy twinkling ray
Beams in the blue of heaven
And tells the traveller on his way
That earth shall be forgiven
John Clare
13 July 1793 – 20 May 1864
English Poet
[Notes:
Hesperus: evening star. Hesperus or Vesper (a planet, usually Venus) seen at sunset in the western sky]
గత సంవత్సరం… జాన్ క్లేర్, ఇంగ్లండు
బ్లాగ్మిత్రులకి, సందర్శకులకీ
2013 నూతన సంవత్సర శుభాకాంక్షలు.
కొత్త సంవత్సరం మీకూ మీ కుటుంబానికీ
ఆయురారోగ్యైశ్వర్యానందసందోహాల్ని కొనితెచ్చుగాక
అని మనఃపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాను.
.
పాత సంవత్సరం వెళ్ళిపోయింది…
చీకటిలోకి… శూన్యం లోకి:
ఇక పగలు ఎంత వెతికినా కనిపించదు
రాత్రి దాని సంగతి ఎవరూ చెప్పరు.
అది దాని అడుగుజాడలు గాని, గుర్తులుగాని,
వెలుగునీడల చిరునామా గాని వదలలేదు.
క్రిందటేడు పక్కింటివాళ్ల పోలిక లుండేవి దానికి
ఈ ఏడు అదంటే అందరూ తెల్లమొహం వేస్తారు.
.
కనిపించేదంతా ఆశాశ్వతమే:
ఉషోదయంలో గమనించే తుషారాలకి
ఉన్నంతసేపైనా అంతకంటే ప్రస్ఫుటమైన ఆకృతీ,
దానికంటే ఇంద్రియగోచరమైన పదార్థమూ ఉంటాయి.
ప్రతి చలిమంటదగ్గరా, గుడిశలోనూ,
ప్రతి సమావేశంలోనూ అందరికీ ఆత్మీయ వ్యక్తే
మనసారా అందరూ కోరుకునే అతిథే
పాపం, ఇప్పుడు మాత్రం ఎవ్వరికీ ఏమీ కాదు.
.
పారేసిన కాగితాలు గాని
ప్రక్కకు తోసేసిన పాత బట్టలుగాని
నిన్న మనం మాటాడుకున్న మాటలు గాని
మళ్ళీ మనం గుర్తుపట్టగలిగినవి;
కాని, కాలం ఒకసారి తొలగిపోయిందా
ఎవ్వరూ దాన్ని వెనక్కి పిలవలేరు
కొత్త సంవత్సరము ముంగిట్లో
పాతది అందరూ దాన్ని శాశ్వతంగా కోల్పోయారు.
.
జాన్ క్లేర్.
ఇంగ్లండు
.

.
The Old Year
.
The Old Year’s gone away
To nothingness and night:
We cannot find him all the day
Nor hear him in the night:
He left no footstep, mark or place
In either shade or sun:
The last year he’d a neighbour’s face,
In this he’s known by none.
All nothing everywhere:
Mists we on mornings see
Have more of substance when they’re here
And more of form than he.
He was a friend by every fire,
In every cot and hall–
A guest to every heart’s desire,
And now he’s nought at all.
Old papers thrown away,
Old garments cast aside,
The talk of yesterday,
Are things identified;
But time once torn away
No voices can recall:
The eve of New Year’s Day
Left the Old Year lost to all.
.
John Clare
English Poet
(Poem Courtesy: http://www.poets.org/viewmedia.php/prmMID/19332)
తొలి ప్రేమ … జాన్ క్లేర్

.
ఆ క్షణం వరకు ప్రేమ నన్నెప్పుడూ
అంత అకస్మాత్తుగా, అంత తియ్యగా, తాకలేదు.
ఆమె ముఖం ఒక మనోజ్ఞమైన కుసుమంలా వికసించి
నా మనసు పూర్తిగా దోచుకుంది.
.
నా ముఖం రక్తపుబొట్టులేనంతగా పాలిపోయింది
నా కాళ్ళు కదలాడడం మానేసేయి.
ఆమె నన్ను చూడగానే నాకేమయిందో!
నా జీవితం, సమస్తం మృత్పిండంలా మారిపోయాయి.
.
నా ముఖం లోకి ఒక్కసారి రక్తం పెల్లుబికింది.
నా కళ్ళు చూపులు దక్కి,
మిట్టమధ్యాహ్నం అర్థరాత్రిలా
చెట్లూ చేమలూ ఏవీ కనపడడం మానేసేయి.
.
కంటికి ఒక్కటి కనిపిస్తే ఒట్టు.
నా కళ్ళనుండి మాటలు ప్రవహించడం ప్రారంభించేయి,
తీగనుండి సాగే స్వరంలా,
నా గుండె ఉడుకురక్తంలో బొబ్బలెక్కుతోంది.
.
పుష్పాలు హేమంతపు సొత్తా?
ప్రేమకెప్పుడూ చలి’మంట’లేనా?
ఆమె నా మూగ బాసలు వింటున్నట్టుందిగాని,
ప్రేమమొర నర్థంచేసుకునే ప్రయత్నం లేదు.
.
నా ఎదురుగా ఉన్నంత చక్కని ముఖం
నే నిదివరకెన్నడూ చూడలేదు.
నా హృదయం తన ఉనికి విడిచి
మరి వెనకకి మరలి రాదే!
.
జాన్ క్లేర్
బ్రిటిషు కవి
.
First Love
.
I ne’er was struck before that hour
With love so sudden and so sweet,
Her face it bloomed like a sweet flower
And stole my heart away complete.
My face turned pale as deadly pale.
My legs refused to walk away,
And when she looked, what could I ail?
My life and all seemed turned to clay.
And then my blood rushed to my face
And took my eyesight quite away,
The trees and bushes round the place
Seemed midnight at noonday.
I could not see a single thing,
Words from my eyes did start —
They spoke as chords do from the string,
And blood burnt round my heart.
Are flowers the winter’s choice?
Is love’s bed always snow?
She seemed to hear my silent voice,
Not love’s appeals to know.
I never saw so sweet a face
As that I stood before.
My heart has left its dwelling-place
And can return no more
.
John Clare
నేనున్నాను … జాన్ క్లేర్
See Video: I Am — By John Clare.
.
నేనున్నాను.
కానీ నేనెవరో, ఏమిటో
ఎవరికీ తెలీదు… లక్ష్యపెట్టరు.
నా మిత్రులు నన్నొక స్మృతిపథంలోలేని విషయంలా వదిలేస్తారు.
నా బాధలు నేనే అనుభవిస్తున్నాను.
అవి గుంపులు గుంపులుగా ఎగసిపడి మాయమవుతుంటాయి
ప్రేమ ఛాయలు మృత్యువులో మరణించినట్టు…
అయినా నేనున్నాను.
కోలాహలం, అలక్ష్యాల శూన్యం లోకి
పగటికలల చైతన్య సముద్రం లోకి,
నీడలతో బాటు విసిరివేయబడినప్పటికీ, బ్రతికే!
అక్కడ బ్రతుకు పట్ల స్పృహ గాని,
హర్షాతిరేకాలుగాని ఉండవు,
జీవన మూల్యాల నౌకాభంగాలు తప్ప.
అత్యంత ఆత్మీయమైనవే—
నేను అపురూపమైన వాటినే ప్రేమించాను—
అయినా అవి పరాయివైపోతాయి…
కాదు కాదు… మిగతావాటికంటే వింతగా కనిపిస్తాయి
.
నేను మనిషి మున్నెన్నడూ అడుగిడని దృశ్యాలు అపేక్షిస్తున్నాను…
ఎన్నడూ స్త్రీలు శోకించనీ, హసించనీ ప్రదేశాలు కోరుకుంటాను…
అక్కడ నా సృష్టికర్తతో సహజీవనం చెయ్యడానికి…
నా బాల్యంలో నిద్రించినంత సుఖంగా ఆదమరచి నిద్రించడానికి…
ఒకర్ని బాధపెట్టకుండా, నేను బాధపడకుండా మేను వాల్చడానికి…
క్రింద పచ్చికా— మీద వంగిన ఆకాశమూ ఉండేలా.
.
జాన్ క్లేర్
.
I Am!
.
I am! yet what I am none cares or knows,
My friends forsake me like a memory lost;
I am the self-consumer of my woes,
They rise and vanish in oblivious host,
Like shades in love and death’s oblivion lost;
And yet I am! and live with shadows tost
Into the nothingness of scorn and noise,
Into the living sea of waking dreams,
Where there is neither sense of life nor joys,
But the vast shipwreck of my life’s esteems;
And e’en the dearest—that I loved the best—
Are strange—nay, rather stranger than the rest.
I long for scenes where man has never trod;
A place where woman never smil’d or wept;
There to abide with my creator, God,
And sleep as I in childhood sweetly slept:
Untroubling and untroubled where I lie;
The grass below—above the vaulted sky.
.
John Clare
(13 July 1793 – 20 May 1864)
A British Poet.
(He was the greatest working-class (rural ) poet that England has ever produced. No one has ever written more powerfully of Nature, of his rural childhood, and of his alienation and unstable self. Clare was committed to Lunatic Asylum in two spells and in the second, for 23 years at Northamptonshire County General Lunatic Asylum (now St. Andrew’s Hospital) where he remained for the rest of his life. It’s supposed that he wrote his most famous poem I Am there. In creativity and philosophical depths in this poem and his ‘Bird’s Nest’ poems he can be reckoned on par with Wordsworth, his contemporary )