అనువాదలహరి

నిష్క్రమిస్తున్న అతిథి… జేమ్స్ వ్హిట్ కూంబ్ రైలీ, అమెరికను కవి

జీవితమూ, ప్రేమా

ఎంత మనసుపడే ఆతిథేయులు!

కాలవిలంబన చేస్తూనే వెనుతిరిగాను.

ఇంత వయసుమీరిన తర్వాత కూడా

అవి నాపై తమ ఉత్కృష్టమైన సత్కారాలలో

ఏ లోపం రానియ్యనందుకు ఎంతో ఆనందం వేసింది.

అందుకని, లోపలి సంతోషం ముఖంలో కనిపిస్తుండగా

ఎంతో కృతజ్ఞతా భావంతో ఆగి

వాటి చేతులు రెండూ మెత్తగా ఒత్తుతూ అన్నాను:

“కృతజ్ఞుణ్ణి! సమయం చక్కగా గడిచింది. సెలవు!”

.

జేమ్స్ వ్హిట్ కూంబ్ రైలీ

(October 7, 1849 – July 22, 1916)

అమెరికను కవి

.

James Whitcomb Riley

.

A Parting Guest

.

What delightful hosts are they…

Life and Love!

Lingeringly I turn away,

This late hour, yet glad enough

They have not withheld from me

Their high hospitality.

So, face lit with delight

And all gratitude I stay,

Yet to press their hands and say:

“Thanks. — so fine a time! Good night!”.

.

James Whitcomb Riley

Poem Courtesy:

https://archive.org/details/littlebookofmode00ritt/page/200

అఖండ ప్రార్థన… జేమ్స్ విట్ కూంబ్ రైలీ, అమెరికను

ఓ ప్రభూ! కరుణామయా!

దయావార్నిధీ!

నేను ఇష్టపడే వారినందరినీ

ఈ రోజు నీ కటాక్షవీక్షణలతో చూడు!

వాళ్ళ హృదయాలని పట్టిపీడించే అలసటని తొలగించు!

గాలిని తూర్పారబెడుతున్నట్టు ఎగిరే

నీ దూతల రెక్కల రెపరెపల జాడల్లో

వాళ్లకి కావలసిన అవసరాలూ తీర్చు!

బాధాతప్తహృదయులందరికీ

బాధలనుండి విముక్తి కలిగించు.

తిరిగి వాళ్ళ పెదాలపై

చిరునవ్వులు వరదెత్తనీ!

లేమితో అలమటించే దీనులకు

ప్రభూ! ఈ రోజు నా సొత్తైన

అనంతమైన సంతృప్తి సంపదని

పంచవలసిందిగా ప్రార్థిస్తున్నాను!

.

జేమ్స్ విట్ కూంబ్ రైలీ

(October 7, 1849 – July 22, 1916)

అమెరికను

.

The Prayer Perfect

.

Dear Lord! kind Lord!

Gracious Lord! I pray

Thou wilt look on all I love,

Tenderly to-day!

Weed their hearts of weariness;

Scatter every care,

Down a wake of angel wings

Winnowing the air.

Bring unto the sorrowing

All release from pain;

Let the lips of laughter

Overflow again;

And with all the needy

O divide, I pray,

This vast treasure of content

That is mine to-day!

.

James Whitcomb Riley

(October 7, 1849 – July 22, 1916)

American Poet

Poem Courtesy:

https://www.poetrynook.com/poem/prayer-perfect

అలనాటి నా ప్రేయసి…జేమ్స్ విట్ కూంబ్ రైలీ, అమెరికను కవి

సాయంత్రంవేళ ఒంటరిగా కూచుని ఫోటో ఆల్బమ్ తిరగేస్తూ, అందులో
కనిపించిన మిత్రుల ముఖాలు చూసి వాళ్ళ గురించి దీర్ఘంగా ఆలోచించినట్టు
నా ఆలోచనల ఎండుటాకులు చెల్లాచెదురుచేస్తున్నాను వాటి నీడల అమరికలో
చిరునవ్వులు చిందించే అలనాటి నా ప్రేయసి ఛాయలు కనుగొనేదాకా.

నా కళ్ళలో పడుతున్న తీక్ష్ణమైన వెలుగు తగ్గించడానికి, దానిని తగ్గిస్తే
లాంతరులోని దీపం ఆశ్చర్యంగా నా వంక రెప్పలు కొట్టుకుంటూ చూస్తోంది;
పొగతోపాటు మాయమవడానికి పొగాకుకి బంధం వేస్తోందేమోనన్నట్టున్న నా
నిట్టూర్పుతప్ప, చడీచప్పుడు లేకుండా నేను నా పొగాకుగొట్టాన్ని వెలిగిస్తున్నాను.

అదొక సుగంధభరితమైన సింహావలోకనం— ఎందుకంటే, రూపుదిద్దుకుంటున్న
ప్రేమభావనలు, విరిసిన హృదయపుష్పంలోంచి వచ్చే నెత్తావి వెదజల్లుతాయి.
నా పెంకి ఆలోచనలు అలనాటి నా ప్రియురాలి వెంట పరిగెడుతుంటే,
మళ్ళీ మళ్ళీ పాతకలలే కనగలగడం భగవద్దత్తమైన ఒక వరం –

క్రింద, నా చదువుకునే గదిలో, రెక్కలు చప్పుడు చేస్తున్నట్టు నా పిల్లల
గొంతులూ, నా శ్రీమతి రాగాలాపనా నాకు ఒకపక్క వినిపిస్తున్నాయనుకొండి,
చింతల వంతలన్నీ కలల రేవులో తమ లంగరు దించిన తర్వాత
పట్టపగ్గాలు లేని ఆలోచనలకు నేను సిగ్గుపడడం లేదు.

నిజానికి, నిజాయితీగా చెప్పాలంటే, అప్పుడప్పుడు మంచికి ఒకింత
నష్టాన్ని కలిగించే అపోహల ధూళిపొర అందాన్నిస్తుందంటాను;
నా మట్టుకు, మత్తెక్కించే జ్ఞాపకాల మధువుకి మరింత సువాసన అబ్బి
అలనాటి నా ప్రేయసి గుర్తుగా మరింత పూటుగా త్రాగేలా చేస్తుంది.

కలశంలోంచి వచ్చే భూతాల్లా పొగాకులోంచి పొగలు లేస్తున్నాయి;
లిల్లీ పువ్వులవంటి అందమైన ముఖం, తెమ్మెరవంటి లావణ్యం;
నులివెచ్చని వేసవి వెలుగులా, నీలాకాశపు లలితమైన రుచితో మెరిసే
ఆ రెండు నీలి కన్నుల చూపులకి నేను తన్మయత్వం చెందుతున్నాను.

నేను మొట్టమొదటిసారి చుంబించినపుడు ఆమె పెట్టుకున్న గులాబి రంగు టోపీ
రంగురంగుల దుస్తులూ కనిపిస్తునే ఉన్నాయి; ఆమెను మురిపెంగా తాకినపుడు
ఆమె రాసి ఇచ్చిన ప్రమాణ పత్రం:”మోడువారిన కొమ్మకి అల్లిబిల్లిగా
అల్లుకునే పూలతీవె అంత గాఢంగా” ప్రేమించింది అలనాటి నా ప్రేయసి.

భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకుంటూ మేము మాటాడినప్పటిలా
మరొకసారి సుతిమెత్తని ఆమె చేతి ఒత్తిడి అనుభూతిచెందాను,
నేను మరే వ్యాపకం లేకుండా కవిత్వం రాసుకుంటూ కూచోడానికీ
నేను రాసిన ప్రేమగీతాలకి ఆమె స్వరకల్పన చెయ్యడానికీ

గులాబిపొదలమధ్య కనిపించకుండా, అందమైన చిన్నతోటమధ్య
వాతావరణం ఎప్పుడూ అనుకూలంగా, లతలెప్పుడూ పళ్ళబరువుతో ఊగుతూ
అక్కడి పక్షులెప్పుడూ నా ప్రేయసికి ఇష్టమైన పాటలుపాడుతుండగా
ఒక చిన్న కుటీరంలో మేమిద్దరం హాయిగా కలిసి ఉండాలనుకున్నాం.

నేను ఎప్పుడూ ఆమె ప్రియుడిగా ఉండిపోవాలనీ, ఆమె బంగరు వన్నె కురులు
వెండితీగెలుగా రూపు దిద్దుకునేవరకూ నా హృదయరాణిగా ఉండాలనీ ;
ఇద్దరం ఎంత హాయిగా ఉండాలంటే, ఒకరి పెదాలు మూతబడినపుడు
రెండవవారు వచ్చేదాకా స్వర్గంలోనైనా పెదవి విప్పరాదనీ అనుకున్నాం.
***

కానీ, ఓహ్! మెట్లమీద అడుగులతో అందమైన నా కల చెదిరిపోయింది.
తలుపు నెమ్మదిగా తెరుచుకుంది, అదిగో, నా భార్య అక్కడ నిల్చుంది;
అయితేనేం, అంత ఆతురతతోనూ, అంత పరవశంతోనూ కలల్ని పక్కనబెడతాను
ఎందుకంటే, ఎదురుగా నిల్చున్న అలనాటి నా ప్రేయసికి స్వాగతం పలకడానికి.
.

జేమ్స్ విట్ కూంబ్ రైలీ

 (October 7, 1849 – July 22, 1916)

అమెరికను కవి

.

An Old Sweetheart of Mine

.

As one who cons at evening o’er an album all alone,   

And muses on the faces of the friends that he has known,     

So I turn the leaves of fancy, till in shadowy design     

I find the smiling features of an old sweetheart of mine.        

The lamplight seems to glimmer with a flicker of surprise,            

As I turn it low to rest me of the dazzle in my eyes,     

And light my pipe in silence, save a sigh that seems to yoke 

Its fate with my tobacco, and to vanish with the smoke.        

’T is a fragrant retrospection—for the loving thoughts that start    

Into being are like perfume from the blossom of the heart;            

And to dream the old dreams over is a luxury divine—

When my truant fancy wanders with that old sweetheart of mine.  

Though I hear, beneath my study, like a fluttering of wings,  

The voices of my children, and the mother as she sings,        

I feel no twinge of conscience to deny me any theme            

When Care has cast her anchor in the harbor of a dream.      

In fact, to speak in earnest, I believe it adds a charm    

To spice the good a trifle with a little dust of harm—  

For I find an extra flavor in Memory’s mellow wine    

That makes me drink the deeper to that old sweetheart of mine.             

A face of lily-beauty, with a form of airy grace,  

Floats out of my tobacco as the genii from the vase;    

And I thrill beneath the glances of a pair of azure eyes 

As glowing as the summer and as tender as the skies.  

I can see the pink sunbonnet and the little checkered dress            

She wore when first I kissed her and she answered the caress

With the written declaration that, “as surely as the vine        

Grew round the stump,” she loved me—that old sweetheart of mine.       

And again I feel the pressure of her slender little hand,

As we used to talk together of the future we had planned—          

When I should be a poet, and with nothing else to do  

But write the tender verses that she set the music to:   

When we should live together in a cosy little cot,

Hid in a nest of roses, with a fairy garden-spot, 

Where the vines were ever fruited, and the weather ever fine,        

And the birds were ever singing for that old sweetheart of mine:    

When I should be her lover forever and a day,    

And she my faithful sweetheart till the golden hair was gray;

And we should be so happy that when either’s lips were dumb      

They would not smile in Heaven till the other’s kiss had come.

*****

But, ah! my dream is broken by a step upon the stair, 

And the door is softly opened, and—my wife is standing there;      

Yet with eagerness and rapture all my visions I resign 

To greet the living presence of that old sweetheart of mine.

.

James Whitcomb Riley

 (October 7, 1849 – July 22, 1916)

American

Poem Courtesy: http://www.bartleby.com/360/2/261.html

నిష్క్రమిస్తున్న అతిథి … జేమ్స్ వ్హిట్ కూంబ్ రైలీ, అమెరికను కవి

జీవితమూ, ప్రేమా

ఎంత మనోరంజకులైన గృహస్థులు!

నేను ఎంతో అయిష్టంగా,

అయినా సంతోషంగానే మరలుతున్నాను.

ఈ చరమ ఘడియలలో కూడా

వాళ్ళ ఉదాత్తమైన అతిథిమర్యాదలలో

నాకు ఏమాత్రం లోటు రానీయలేదు.

కనుక ఆనందం నిండిన ముఖంతో

నిండు కృతజ్ఞతతో

వాళ్ళ చేతులు నా చేతిలోకి తీసుకుని ఒత్తుతూ,

“మనం చాలా చక్కని సమయం గడపగలిగాం.

ఎంతో కృతజ్ఞుడిని, శుభరాత్రి,”

అని చెప్పడానికి ఇంకా వేచి ఉన్నాను.

.

జేమ్స్  వ్హిట్ కూంబ్ రైలీ

October 7, 1849 – July 22, 1916

అమెరికను కవి

.

James Whitcomb Riley, 1849-1916, half-length p...
James Whitcomb Riley, 1849-1916, half-length portrait, facing left (Photo credit: Wikipedia)

.

A Parting Guest

.

What delightful hosts are they—

Life and Love!

Lingeringly I turn away,

This late hour, yet glad enough

They have not withheld from me

Their high hospitality.

So, with face lit with delight

And all gratitude, I stay

Yet to press their hands and say,

“Thanks.—So fine a time! Good night.”

.

James Whitcomb Riley

October 7, 1849 – July 22, 1916

American Poet

..

బ్రతుకు ఉపదేశం — జేమ్స్ విట్ కూంబ్ రైలీ

Image Courtesy: http://t1.gstatic.com

.

అరే! చిట్టితల్లీ ! ఏడవకు, ఏడవకు!

వాళ్ళు నీ ఆటబొమ్మ విరిచేసారా, నాకు తెలుసులే;

నీ వంటగిన్నెలూ, బొమ్మరిల్లూ కూడా

ఎప్పుడో పాడుచేసేసారా? అర్రర్రే;

ఈ బాల్యావస్థలన్నీ త్వరలోనే గతంలోకి జారుకుంటాయిలే;

ఇదిగో! చిట్టితల్లీ, ఏడవకమ్మా, ఏడవకు!

.

అదిగో, చిట్టితల్లీ ! ఏడవకు, ఏడవకు!

అర్రర్రే! వాళ్ళు నీ పలక విరిచేసారా? నాకు తెలుసులే;

ఈ స్వేఛ్ఛగా ఆడుకోడాలూ, బడికెళ్ళడాలూ

త్వరలోనే గతంలోకి జారుకుంటాయిలే;

అసలైన జీవితమూ, ప్రేమా త్వరలోనే ఆవహిస్తాయి.

అదిగో చిట్టితల్లీ ! ఏడవకమ్మా, ఏడవకు!

.

అదిగో చిట్టితల్లీ, ఏడవకు, ఏడవకు!

అయ్యో, వాళ్ళు నీ హృదయాన్ని బ్రద్దలు చేసారా? నాకు తెలుసులే;

ఇంద్రధనుసు తళతళలూ,

తెలివయసు తొలకరి కలలూ

త్వరలోనే గతంలోకి జారుకుంటాయిలే;

నువ్వు వగచేవన్నీ భగవంతుని చేతి బందీలు…

అదిగో! ఏడవకమ్మా, ఏడవకు!

.

జేమ్స్ విట్ కూంబ్ రైలీ.

అమెరికను కవి, రచయిత

.

A Life-lesson

.

There! little girl; don’t cry!
They have broken your doll, I know;
And your tea-set blue,
And your play-house, too,
Are things of the long ago;
But childish troubles will soon pass by. —
There! little girl; don’t cry!

There! little girl; don’t cry!
They have broken your slate, I know;
And the glad, wild ways
Of your schoolgirl days
Are things of the long ago;
But life and love will soon come by. —
There! little girl; don’t cry!

There! little girl; don’t cry!
They have broken your heart I know;
And the rainbow gleams
Of your youthful dreams
Are things of the long ago;
But Heaven holds all for which you sigh. —
There! little girl; don’t cry!

.

James Whitcomb Riley

(October 7, 1849 – July 22, 1916)

American Poet and author.

%d bloggers like this: