అనువాదలహరి

ప్రార్థన అంటే… జేమ్స్ మన్ గమ్ రీ, ఇంగ్లీషు కవి

పైకి పలికినా, లోపలే అనుకున్నా
ప్రార్థన అంటే ఒక ఆత్మ నిర్వ్యాజమైన కోరిక,
గుండె లోతుల్లో దాగి కొట్టుమిట్టాడే
తేజస్సు నలుదిక్కులా ప్రసరించు సరళి

ప్రార్థన ఒక నిట్టూర్పు వెనక నున్న భారం
సన్నగా జాలువారే కన్నీటి బిందువు,
దైవం తప్ప మరెవ్వరూ ప్రక్కన లేనిచోట
కన్నులు మెల్లగా పైకి ఎత్తి చూసే తీరు.

ఒక్క శిశువుల పెదాలు మాత్రమే చేయగల
అతి సరళమైన సంభాషణ ప్రార్థన;
మహోత్కృష్టమైన సంకీర్తనలు చేరగల
అత్యున్నత పీఠం ప్రార్థన;

తన నడవడి మర్చుకున్న పాపి గళంలో
నినదించే పశ్చాత్తాపం ప్రార్థన;
తమ గీతాలలో ఆనందించే దేవతలు కేరుతూ
అంటారు: “చూడు, అతను వేడుకుంటున్నాడు!”

ప్రార్థన క్రిస్టియన్ కి ప్రాణస్పందన
క్రిస్టియన్ కి సహజమైన ఊపిరి
మృత్యువు వాకిట అదే సంకేత పదం
ప్రార్థిస్తూనే స్వర్గంలోకి అడుగుపెడతాడు.

సత్పురుషుల ప్రార్థనలు ఒక్కతీరుగా ఉంటాయి
మాటల్లో, నడవడిలో, ఆలోచనలలోనూ.
తండ్రితోనూ, కుమారుడితోనూ
ఒక్కలాటి స్నేహభావమే వాళ్ళు చూడగలరు.

ఏ ప్రార్థనా ఒక్క మనిషి చెయ్యగలిగేది కాదు
పవిత్రమైన ఆత్మ పురికొల్పుతుంది—
శాశ్వతమైన సింహాసనము మీద కూర్చున్న
జీసస్, పాపుల తరఫున అడ్డుపడతాడు.

స్వామీ! నీ దయవల్ల దైవసాక్షాత్కారం పొందేము
జీవితమూ, సత్యమూ, మార్గమూ అదే.
ఈ ప్రార్థనా మార్గం నువ్వు నడిచినదే;
ప్రభూ! ఎలా ప్రార్థించాలో మాకు నేర్పు!
.
జేమ్స్ మన్ గమ్ రీ,

(4 November 1771 – 30 April 1854)

ఇంగ్లీషు కవి

 

 

 

.

 

What is Prayer?

 

Prayer is the soul’s sincere desire,   

  Uttered or unexpressed—    

The motion of a hidden fire    

  That trembles in the breast.  

 

Prayer is the burthen of a sigh,        

  The falling of a tear— 

The upward glancing of an eye,       

  When none but God is near. 

 

Prayer is the simplest form of speech        

  That infant lips can try—     

Prayer the sublimest strains that reach      

  The majesty on high.  

 

Prayer is the contrite sinner’s voice 

  Returning from his ways,     

While angels in their songs rejoice,  

  And cry, “Behold he prays!”

 

Prayer is the Christian’s vital breath—     

  The Christian’s native air— 

His watchword at the gates of death—      

  He enters heaven with prayer.       

 

The saints in prayer appear as one  

  In word, and deed, and mind,        

While with the Father and the Son   

  Sweet fellowship they find.  

 

Nor prayer is made by man alone—

  The Holy Spirit pleads—     

And Jesus, on the eternal throne,     

  For sinners intercedes.

 

O Thou by whom we come to God—        

  The life, the truth, the way!  

The path of prayer Thyself hast trod;       

  Lord, teach us how to pray!

.

James Montgomery

(4 November 1771 – 30 April 1854)

British Poet and Editor

The World’s Best Poetry.

Bliss Carman, et al., eds. 

Volume IV. The Higher Life.  1904.

  1. Prayer and Aspiration

http://www.bartleby.com/360/4/68.html

 

సగటు మనిషి … జేమ్స్ మన్ గమ్ రీ, ఇంగ్లీషు కవి

ఒకప్పుడు, యుగాలు గడవకముందు
ఒక మానవుడు ఉండేవాడు. అతనెవడూ?
మర్త్యుడు! అతన్ని నువ్వు ఎలా చిత్రించినా
అచ్చం నీలాగే ఉంటాడు.

అతనెక్కడపుట్టేడో తెలీదు,
అతనెక్కడ మరణించేడో కూడా తెలీదు,
అతని పేరు భూమ్మీంచి తుడుచుకుపోయింది;
అదొక్క సత్యమే మిగిలి ఉంది.

సుఖమూ దుఃఖమూ, ఆశా, భయమూ
అతని మనసులో ఒకదాని వెనక ఒకటి నిలిచేయి;
అతని బ్రహ్మానందం, విపత్తూ, నవ్వూ, కన్నీరూ,
సర్వస్వమూ తెర మాటున మరుగుబడ్డాయి.   

అతని గుండె చప్పుడూ వడీ, నీరసించిన శరీరం,
ఒకసారి ఎగసి మరోసారి పతనమైన భావోద్వేగాలూ;

ఇవన్ని అతను అనుభవించేడని తెలుస్తోంది
ఎందుకంటే, అందరికీ ఇవి అనుభవమే కనుక.

అతను బాధపడ్డాడు–  కానీ అతని బాధలు గట్టెక్కాయి;
అతను సుఖపడ్డాడు– ఆ సుఖాలూ కడతేరిపోయాయి;
స్నేహితులుండేవారు — ఆ స్నేహితులూ గతించేరు;
అతని శత్రువులు — వాళ్ళూ కాలగర్భంలో కలిసిపోయేరు.

అతను ప్రేమించాడూ, కానీ అతను ఎవర్ని ప్రేమించాడో
ఆ ఆచూకీ సమాధి పొరల్లో అజ్ఞాతమై ఉంది:
ఓహ్! ఆమె ఎంత అందంగా ఉండేదో! ఏమి లాభం?
ఆ అందాన్ని సమాధిపాలవకుండా ఏదీ కాపాడలేకపోయింది.

నువ్విప్పుడు ఏమేమి చూసేవో అతను చూసేడు;
నీనేవి బాధించేయో అవే అతన్నీ బాధించేయి:
నువ్వు లోనయిన మార్పులకి అతనూ లోనయ్యాడు,
అతను నువ్వు రేపు ఏది కాబోతున్నావో, అదే అయాడు.

మారుతున్న ఋతువులు, రేయింబవళ్ళు,
సూర్యచంద్రులూ, నక్షత్రాలూ, ఈ భూమీ, నేలా
ఒకప్పుడు అతని స్వంతం; జీవితం, వెలుగులూ
ఇప్పుడూ ఉన్నా, వాటి ఉనికి అతనికి నిరర్థకం.

ఒకప్పుడు వాటి అందాలు చిలికించిన
మేఘాలూ, సూర్యకిరణాలూ, ఇప్పుడు
ఆకాశంనుండి ఎప్పుడుపోయాయో తెలియకుండా
వాటి జాడలుకూడా లేకుండా నిష్క్రమించాయి.

మానవ జాతి చరిత్ర, శిధిలాలు సర్వస్వం,
ఈ సృష్టి మొదలైన దగ్గరనుండీ
అతని గురించి మరి ఏ గుర్తులూ మిగల్చలెదు
“ఆది మానవుడు ఉండేవాడు” అన్న విషయం తప్ప.

.
జేమ్స్ మన్ గమ్ రీ,

(4 November 1771 – 30 April 1854)

ఇంగ్లీషు కవి

 

.

 

The Common Lot

 .

 

Once, in the flight of ages past, 

There lived a man:—and WHO WAS HE?—         

Mortal! howe’er thy lot be cast,

That man resembled thee.         

 

Unknown the region of his birth,        

The land in which he died unknown:  

His name hath perished from the earth;         

This truth survives alone:—      

 

That joy and grief, and hope and fear,

Alternate triumph’d in his breast;        

His bliss and woe,—a smile, a tear!—

Oblivion hides the rest.   

 

The bounding pulse, the languid limb,

The changing spirits’ rise and fall;      

We know that these were felt by him, 

For these are felt by all.  

 

He suffer’d,—but his pangs are o’er;  

Enjoy’d,—but his delights are fled;    

Had friends—his friends are now no more;  

And foes,—his foes are dead.   

 

He loved,—but whom he loved, the grave    

Hath lost in its unconscious womb:    

O, she was fair!—but nought could save      

Her beauty from the tomb.        

 

He saw whatever thou hast seen;        

Encounter’d all that troubles thee:       

He was—whatever thou hast been;     

He is—what thou shalt be.        

 

The rolling seasons, day and night,     

Sun, moon, and stars, the earth and main,               

Erewhile his portion, life, and light,    

To him exist in vain.       

 

The clouds and sunbeams, o’er his eye         

That once their shades and glory threw,        

Have left in yonder silent sky             

No vestige where they flew.     

 

The annals of the human race,  

Their ruins, since the world began,     

OF HIM afford no other trace   

Than this, THERE LIVED A MAN!            

.

James Montgomery

English Poet and Editor

(4 November 1771 – 30 April 1854)

 

Poem Courtesy:

The Book of Georgian Verse.  1909.

Ed: William Stanley Braithwaite. 

http://www.bartleby.com/333/693.html

 

 

మిత్రులు… జేమ్స్ మన్ గమ్ రీ, ఇంగ్లీషు కవి

ఒకరి తర్వాత ఒకరుగా మిత్రులు నిష్క్రమిస్తారు:
స్నేహితుడ్ని పోగొట్టుకోనివాడు ఎవడు?
ఇక్కడే ముగింపు చూడని
మనసుల కలయిక ఎక్కడా కనిపించదు.
ఈ నశ్వరమైన ప్రపంచమే మన విశ్రాంతి అనుకుంటే
బ్రతికినా, చచ్చినా, ధన్యుడైనవాడెవ్వడూ లేనట్టే

కాల ప్రవాహానికి అతీతంగా ,
మృత్యు లోయకి ఆవల,
ఖచ్చితంగా ఒక దివ్యమైన లోకం ఉంది
అక్కడ జీవితం క్షణికం కాదు;
జీవితంలోని అనుబంధాలు నిమిత్తమైన
నిప్పురవ్వల్లా ఎగిరి, జ్వలించి ఆరిపోయేవి కావు.

పైన ఒక ప్రపంచం ఉంది,
అక్కడ వియోగమన్న మాట తెలీదు;
కాలాతీతమైన ప్రేమ,
కేవలం మంచికొరకే సృష్టించబడ్డది;
ఇక్కడ చనిపోయిన వాళ్ళు
అక్కడకి కొనిపోబడతారని నమ్మకం.

అలా చుక్క తర్వాత చుక్క రాలిపోతుంది,
చివరికి అందరూ మరణించేదాకా ;
ఉదయం ఎలా ప్రవర్థమానమౌతూ
స్వచ్ఛమైన రోజుగా పరిణమిస్తుందో,
ఈ చుక్కలు శూన్యమైన రాత్రిలోకి గ్రుంకకుండా,
అవి స్వర్లోకపు ప్రకాశంలో దాక్కుంటాయి, అంతే!

.

 జేమ్స్ మన్ గమ్ రీ

(4 November 1771 – 30 April 1854)

ఇంగ్లీషు కవి

.

.

Friends

.

Friend after friend departs:        

Who hath not lost a friend? 

There is no union here of hearts,   

Which finds not here an end.

Were this frail world our only rest,       

Living or dying, none were blest.  

 

Beyond the flight of time,     

Beyond the vale of death,     

There surely is some blessèd clime  

Where life is not a breath;           

Nor life’s affections, transient fire, 

Whose sparks fly upwards and expire. 

  

There is a world above,         

Where parting is unknown;  

A whole eternity of love,              

Form’d for the good alone;  

And faith beholds the dying here   

Translated to that glorious sphere.

 

Thus star by star declines,    

Till all are pass’d away;               

As morning high and higher shines         

To pure and perfect day:      

Nor sink those stars in empty night,        

They hide themselves in heaven’s own light.

.

James Montgomery 

(4 November 1771 – 30 April 1854)

British Poet and Editor

 

Poem Courtesy:

The Sacred Poets of the Nineteenth Century. 1907.

Ed. Alfred H. Miles.

http://www.bartleby.com/294/7.html

%d bloggers like this: