Tag: Italian
-
అందమైన ముఖం ప్రభావం… మైకేలేంజెలో, ఇటాలియన్ కవి, శిల్పకారుడు
ఒక అందమైన ముఖం నా ప్రేమని ఉదాత్తం చేస్తుంది అది నా మనసుని తుఛ్ఛమైన కోరికలనుండి మరల్చింది; ఇపుడిక మరణాన్నీ లక్ష్య పెట్టను, పాపపు కోరికల్నీ; నీ ముఖము పైలోకాలలోని సుఖాలకి మచ్చుతునక సత్పురుషులంగీకరించే బ్రహ్మానందాన్ని బోధిస్తుంది. ఆహా! స్వర్లోకపు కపోతానికి ప్రతిరూపంగా నీ అంత గొప్ప వస్తువు సృష్టించిన ఆ భగవంతుడు ఎంద సుందరుడూ, దయాళువూ అయిఉంటాడో గదా భూలోక స్వర్గాలైన ఆ సుందరమైన కనులనుండి నా దృష్టిని మరల్చుకోలేని నా అపరాధాన్ని మన్నించు అవే […]
-
ప్రతి అందమైన వస్తువూ… మైకేలేంజెలో, ఇటాలియన్ కవి
ఏ అందమైన వస్తువైనా మనుషుల్లో నిష్కల్మషమూ, యోగ్యమూ ఐన కోర్కెలు రగులుస్తందంటే, అందానికి ఆటపట్టైన ఈ భూమ్యాకాశాల మధ్య, అది నా ప్రేయసి వంటిదై ఉండాలని నమ్ముతాను; ఎందుకంటే అంత అందమైన ఆమెలో, (ఆమె సమక్షంలో సర్వం మరిచిపోతాను), నాకు భగవంతుని అద్భుతమైన సృష్టినైపుణ్యం కనిపిస్తుంది, నాకు ఏ ఇతర వస్తువులగురించీ ధ్యాసే ఉండదు ఆమె ప్రేమలో మగ్నమై ఉన్నంతవరకు. అందులో వింతేమీ లేదు, ఎందుకంటే ఆ ప్రభావం తప్పించుకోడం నా వశంలో లేదు, ఆమె కనులు […]
-
ఇచ్ఛ, శక్తి, కర్తవ్యమూ… లె నార్దో దవించి, ఇటాలియను చిత్రకారుడు
చెయ్యాలనుకుని, చెయ్యలేని వారు – చెయ్యగలిగినవి చేద్దామనుకోవాలి! మనం చెయ్యలేనివి చేద్దామనుకోవడం వృధా; అందుకనే, ఎవడైతే గురిలేకుండా ఎదో ఒకటి చేద్దామనుకోడో అలాంటి వ్యక్తిని మనం విజ్ఞుడు అని అంటాము. మన బాధల్లాగే, మన సుఖాలు కూడా ఎప్పటికీ ఇచ్చాశక్తిగూర్చిన అవగాహనమీద ఆధారపడి ఉంటాయి. అది మనకి తర్కం తన ఆధిక్యతని ప్రకటించుకున్నా, కర్తవ్యానికి తగ్గట్టు సయిష్టంగా తల ఒగ్గడం నేర్పుతుంది అయినప్పటికీ, చాలా సార్లు నువ్వు చెయ్యలేనివి చెయ్యాలనుకోవాలి, మనకోరిక కన్నీరు తెప్పించినా సంతృప్తిగా స్వీకరించాలి […]
-
జీవితంలో చెడు చాలా చూశాను … యూజెన్యో మోంటేల్, ఇటాలియను కవి
జీవితంలో చెడు చాలా చూశాను; ఎండిందనుకున్న దొంగయేరు అదాత్తున పొంగినట్టు, ఎండకి మాడిపోయిన ఆకులు ముడుచుకుపోయినట్టు, పరిగెడుతున్న గుఱ్ఱం దబ్బున కూలబడినట్టు. మంచి అంతగా ఎరుగను; దైవం ఎందుకు నిర్లిప్తంగా ఊరుకుందా అన్న ఆశ్చర్యం తప్ప; అది పగలే నిద్రలో మునిగిన శిలావిగ్రహం లాటిది ఎక్కడో గగనతలంలో ఎగురుతున్న డేగలాంటిది. . యూజెన్యో మోంటేల్ (12 October 1896 – 12 September 1981) ఇటాలియను కవి . . Evil I’ve often encountered in […]
-
భావ శకలం 2 … జకోమో లెపార్డి , ఇటాలియన్ కవి
మనిషికి చెందిన ఏదైనా క్షణికమే: ఖీయోస్(Chios) కి చెందిన ఆ అంధకవి* నిజమే చెప్పాడు: చెట్ల ఆకులూ, మానుషప్రకృతీ ఒకే ధర్మాన్ని కలిగి ఉన్నాయి. కాని, ఈ మాటలని పట్టించుకునే వాళ్లు తక్కువ. అందరికీ, చపలమైన ఆశ, వయసు తమతో శాశ్వతంగా ఉంటుందని. మన యవ్వనపుష్పం పచ్చగా అందంగా మెరుస్తూ కనిపిస్తే గర్విష్ఠి అయిన విశృంఖల ఆత్మ వృధాగా అనేక అందమైన ఊహలు ఊహిస్తుంది వయసూ, మృత్యువు అన్న ధ్యాస లెకుండా, ఆరోగ్యంగా, బలంగా ఉన్నప్పుడు రోగాం […]