అనువాదలహరి

పేదమహరాజు (సానెట్) .. బార్తలొ మేయో ది సెయింట్ ఏంజెలో, ఇటాలియన్ కవి

(కవి తన పేదరికం గూర్చి హాస్యంగా చెబుతున్నాడు)  

.

దారిద్య్రంలో నేను ఎంత గొప్పవాడినంటే  

ఈ క్షణంలో పారిస్, రోం, పీసా, పాడువా

బైజాంటియం, వెనిస్, ల్యూకా, ఫ్లారెన్స్, ఫర్లీ వంటి 

అన్నినగరాలకి సరఫరా చెయ్యగలను.

నా దగ్గరఅచ్చమైన అనేక ‘శూన్యం’, ‘పూజ్యం’ నాణెపు నిల్వలున్నాయి. 

దానికి తోడు ప్రతి ఏడూ, సున్నాకీ, శూన్యానికీ మధ్య

ఉన్నన్ని ఓడలనిండా వచ్చి పడిపోతుంటాయి.   

బంగారం, విలువైన రత్నాల రాశులయితే  నాదగ్గర

చక్రాల్లా చెక్కినవి వంద సున్నాల విలువైనవున్నాయి;

అన్నిటికంటే, అదంతా మిత్రులకి ఖర్చుచేసే స్వాతంత్య్రముంది.  

నేను ఖర్చుపెట్టడానికి వెనుకాడవలసిన పనిలేదు. 

నా సంపద భద్రతగురించి ఇసుమంతైనా భయపడనక్కర లేదు,

ఏ దొంగా దాన్ని దోచుకుని పోలేడు, దేముడి మీద ఒట్టు!

 .

(అనువాదం: D G రోజెటీ)    

బార్తలొమేయో ది సెయింట్ ఏంజెలో

13th Century  

ఇటాలియన్ కవి 

Sonnet

(He jests concerning his Poverty)

I am so passing rich in poverty

That I could furnish forth Paris and Rome,

Pisa and Padua and Byzantium,

Venice and Lucca, Florence and Forli;

For I possess in actual specie,

Of Nihil and of nothing a great sum;

And unto this my hoard whole shiploads come,

What between nought and zero, annually.

In gold and precious jewels I have got

A hundred ciphers’ worth, all roundly writ;

And therewithal am free to feast my friend.

Because I need not be afraid to spend,

Nor doubt the safety of my wealth a whit:

No thief will ever steal thereof, God wot.

.

Tr: D G Rosetti.

Bartolomeo di  Sant’ Angelo

Italian Poet

13th Century

https://archive.org/details/anthologyofworld0000vand/page/484/mode/1up

మంచు సోన … కర్దూచీ, ఇటాలియన్ కవి

చీకటి ముసిరిన ఆకాశం నుండి నిశ్శబ్దంగా, నెమ్మదిగా కురుస్తోంది మంచు

నగరంలో, అరుపులూ, జీవవ్యాపారాల సందడీ సద్దుమణుగుతోంది

పరిగెడుతున్న చక్రాల శబ్దాలూ, వీధి వర్తకుల అరుపులూ,

యువత కేరింతలూ, ప్రేమగీతాలూ వినిపించడం లేదు. 

కాలావధులు లేని ప్రపంచపు నిట్టూర్పుల్లా, నిద్రపోతున్న మెట్లమీదుగా  

లోహపుజాడీనుండి గంటలు కరకుగా బొంగురుగా మూలుగుతున్నాయి.  

దారితప్పిన పక్షులు కిటీకీ అద్దాలమీద పదే పదే కొట్టుకుంటున్నాయి 

నా సహచర ప్రేతాత్మ మిత్రులు వెనుదిరిగి, నావంకచూస్తూ పిలుస్తున్నారు. 

శలవు ప్రియతములారా, త్వరలో కలుద్దాం, భయమెరుగని ఓ మనసా!   

పద!నీరవంలోకి అడుగువేస్తున్నా, ఆ నీడలోనే విశ్రమిస్తా.

 .

(అనువాదం: రొమిల్డా రెండెల్) 

జియొస్యూ కర్దూచీ 

(27th July 1835 – 16th Feb 1907)

ఇటాలియన్ కవి

Snowfall

.

Silently, slowly falls the snow from an ashen sky,

Cries, and sounds of life from the city rise no more,

No more the hawker’s shout and the sound of running wheels,

No more the joyous song of love and youth arise.

Raucously from the somber spire through the leaden air

The hours moan, like sighs of a world removed from time.

Wandering birds insistent knock on the glowing panes.

My ghostly friends return, and gaze, and call me.

Soon, my dear ones, soon—be still, O dauntless heart—

Down to the silence I come, in the shadow I will rest.

.

(Tr: Romilda Rendel)

Giosuè Carducci 

(27th July 1835 – 16th Feb 1907)

Italian Poet

https://archive.org/details/anthologyofworld0000vand/page/611/mode/1up

అనంతవిశ్వం… జియకోమో లెపార్డీ, ఇటాలియన్ కవి

ఒంటరిగా నిలబడ్డ ఈ కొండ అంటే నా కెంతో ఇష్టం,

చూపుల అవధి దాటిన దిజ్ఞ్మండలాన్ని కనిపించనీయకుండా

నా దృష్టిని నిరోధిస్తున్న ఈ కంచె అన్నా నాకిష్టమే.

కానీ, ఇక్కడ హాయిగా కూచుని ఆలోచనలలో మైమరచినపుడు

నా ఆలోచనలు ఎక్కడో సుదూరతీరాలకు విస్తరించిన రోదసినీ 

అద్భుతమైన నీరవతనీ, దివ్యమైన శాంతినీ గ్రహిస్తాయి;

నాకు ఒక్కసారి భయమేస్తుంది కూడా; కానీ, వెంటనే ప్రక్కనే

ఆకుల దొంతరలలో కదులుతున్న గాలి చేసే మర్మరధ్వనులు విని 

స్పష్టమైన చైతన్యవంతపు వర్తమానాన్నీ, నిర్జీవమైన గతాన్నీ 

ఆ అనంత నీరవతలోని ప్రశాంతతతో, శబ్దాలతో సరి పోల్చుకుని  

మనసులోనే ఆ అనంత తత్త్వాన్ని ఆలింగనం చేసుకుంటాను. 

ఆ మహత్వ అపారతలో నా ఆత్మ తలమునకలైపోతుంది.

ఆ పారావారములో పడవమునక ఎంతో మధురంగా ఉంటుంది.

.
(అనువాదం:  లోర్నా ద లుక్సి) 

జియకోమో లెపార్డీ, 

(29 June 1798 – 14 June 1837)

ఇటాలియన్ కవి

L’Infinito

.

I always loved this solitary hill,

This hedge as well, which takes so large a share

Of the far-flung horizon from my view;

But seated here, in contemplation lost,

My thought discovers vaster space beyond

Supernal silence and unfathomed peace;

Almost I am afraid; then, since I hear

The murmur of the wind among the leaves,

I match that infinite calm unto this sound

And with my mind embrace eternity,

The vivid, speaking present and dead past;

In such immensity my spirit drowns,

And sweet to me is shipwreck in this sea.

.

(Lorna De’ Luccchi)

Giacomo Leopardi

(29 June 1798 – 14 June 1837)

Italian Poet

https://archive.org/details/anthologyofworld0000vand/page/610/mode/1up

ప్రజలు… తొమాసో కేంపనెల్లా, ఇటాలియన్ కవి, తత్త్వవేత్త

తన బలం ఏమిటో తనకే తెలియని తెలివిమాలిన 

పశుప్రాయులు ప్రజలు, అందు వల్లనే వాళ్ళు రాయీ,

కట్టెలువంటి బరువులు మోస్తుంటారు; ఎంతమాత్రం బలంలేని

చిన్నపిల్లవాడి చెయ్యి ముకుతాడుతో, ములుగర్రతో నడపగలుగుతుంది.

ఒక్క తాపు తంతే చాలు, దాని బంధం తెగిపోతుంది,

కానీ ఎందుకో ఆ జంతువు భయపడుతుంది, అంతేకాదు

పిల్లాడు అడిగినవన్నీ చేస్తుంది; దాని భయకారణం దానికే తెలీదు; 

నిష్కారణ భయాలతో తబ్బిబ్బై, అచేతనమైపోతుంది.

అంతకంటే చిత్రం, తన చేతులతో స్వయంగా గొంతు నొక్కుకుని,

రాజ్యాధిపతులు తన ఇంట్లోంచి కొల్లగొని, తనపై విసిరే 

చిల్లరపైసలకు యుద్ధాలనీ, మృత్యువునీ తలకెత్తుకుంటుంది.

ఈ భూమ్యాకాశాల మధ్యనున్న సర్వస్వమూ తనదే అయినా,

ఆ విషయం తనకు తెలియదు; నిజం చెప్పొద్దూ, ఒకవేళ ఎవరైనా 

ఎదురు తిరిగితే వాళ్ళని ఎంతమాత్రం కనికరం చూపక చంపుతుంది.

.

(అనువాదం: జాన్ ఏడింగ్టన్ సైమండ్స్)  

తొమాసో కేంపనెల్లా

(5 September 1568 – 21 May 1639)

ఇటాలియన్ కవీ, తత్త్వవేత్త. 

The People

.

The people is a beast of muddy brain

That knows not its own force, and therefore stands

Loaded with wood and stone; the powerless hands

Of mere a child guide it with bit and rein:

One kick would be enough to break the chain;

But the beast fears, and what the child demands

It does; nor its own terror understands,

Confused and stupefied by bugbears vain.

Most wonderful! With its own hands it ties

And gags itself- gives itself death and war

For pence doled out by kings from its own store.

Its own are all things between earth and heaven;

But this it knows not; and if one arise

To tell the truth, it kills him unforgiven.

.

(Tr: John Addington Symonds)

Tomasso Campanella

(5 September 1568 – 21 May 1639)

Italian Poet

https://archive.org/details/anthologyofworld0000vand/page/599/mode/1up

అలా రాసిపెట్టి ఉంటే… పెట్రార్క్, ఇటాలియన్ కవి

నా జీవితం నీ జీవితం నుండి వేరుపడి, అయినా

జీవిత మలిసంధ్య మసక వెలుతురుల వరకూ 

కొనసాగమని విధి రాసి పెట్టి ఉంటే,

కళతప్పిన ఆ కన్నులను బహుశా నేను చూస్తాను;

నీ నుదుటపై అందంగా వాలే బంగారు ముంగురులు

కొంత వన్నె తగ్గి వెండిజలతారులై కనిపిస్తాయి, 

అక్కడ ఇపుడు సుందరంగా అలంకరించిన పూమాలల బదులు

గతించిన ఎన్నో వసంతాలు జాడలు పరుచుకుంటాయి.

అపుడు నేను సాహసించి నీ చెవులలో ఎప్పటినుండో

అణచుకున్న ప్రేమైక భావనలని గుసగుసలాడినా,

కాలం తాకిడికి ఛిన్నాభిన్నమవగా మిగిలిన ఈ ప్రేమకి

ప్రార్థించడానికి గాని, అర్థించడానికి గాని ఏముంటుంది చెప్పు,

పగిలిన ఈ గుండెకి, కాలం ఎంత గతించినప్పటికీ 

నీవు నిరాకరించక కనికరించి విడిచే నిట్టూరుపు తప్ప! 

 .

(అనువాదం: ఎడ్వర్డ్ ఫిజెరాల్డ్)

పెట్రార్క్

(July 20, 1304 – July 18/19, 1374)

ఇటాలియన్ కవి

If it be destined

.

If it be destined that my Life, from thine

Divided, yet with thine shall linger on

Till, in the later twilight of Decline,

I may behold those Eyes, their lustre gone;

When the gold tresses that enrich thy brow

Shall all be faded into silver -gray,

From which the wreaths that well bedeck them now

For many a Summer shall have fall’n away;

Then should I dare to whisper in your ears

The pent-up Passion of so long ago,

That Love which hath survived the wreck of years

Hath little else to pray for, or bestow,

That wilt not to the broken heart deny

The boon of one too-late relenting Sigh.

.

(Tr: Edward FitzGerald)

 Francesco Petrarca (aka Petrarch)

July 20, 1304 – July 18/19, 1374)

Italian Poet and Scholar

https://archive.org/details/anthologyofworld0000vand/page/560/mode/1up

శేషజీవి … ప్రీమో లెవి, ఇటాలియను కవి

అప్పుడే విచ్చుకుంటున్న మసక వెలుగులో

అతను తన సహచరుల ముఖాలు చూస్తున్నాడు,

సిమెంటు దుమ్ముకొట్టుకుని

ఆ పొగమంచులో కనీకనిపించకుండా,

కలత నిదురలలొనే మృత్యువువాత పడి.

రాత్రివేళ, వాళ్ళ కలల బరువుకి

నిద్రలోనే వాళ్ళదవడలు కదులుతున్నాయి

అక్కడలేని టర్నిప్ ని ఊహించుకు నములుతూ

“నీటమునిగిన మిత్రులారా! దూరంగా పొండి!

పొండి! నా మానాన్న నన్ను విడిచిపెట్టండి.

నేను మిమ్మల్నెవర్నీ వంచించలేదు.

మీ నోటిముందరి రొట్టె లాక్కోలేదు.

నాకు బదులుగా మరొకరిని ఎవరినీ

బలిచెయ్యలేదు. ఏ ఒక్కరినీ.

మీరు తిరిగి ఆ మసకలో కలిసిపోండి.

నేను బతికి బట్టకట్టి, ఊపిరి పీలుస్తూ, తింటూ,

తాగుతూ, నిద్రపోతూ, బట్టలేసుకుంటున్నానంటే

అందులో నా నేరం లేదు! 

.

ప్రీమో లెవి

31 July 1919 – 11 April 1987

ఇటాలియన్ కవి.

.

The Survivor

.

Once more he sees his companions’ faces

Livid in the first faint light,

Gray with cement dust,

Nebulous in the mist,

Tinged with death in their uneasy sleep.

At night, under the heavy burden

Of their dreams, their jaws move,

Chewing a non-existent turnip.

‘Stand back, leave me alone, submerged people,

Go away. I haven’t dispossessed anyone,

Haven’t usurped anyone’s bread.

No one died in my place. No one.

Go back into your mist.

It’s not my fault if I live and breathe,

Eat, drink, sleep and put on clothes.’

.

Primo Levi

31 July 1919 – 11 April 1987

Italian Poet and Holocaust Survivor

Poem Courtesy:

http://famouspoetsandpoems.com/poets/primo_levi/poems/3720

%d bloggers like this: