అనువాదలహరి

కారు నడిమి శలవులు… సీమస్ హీనీ, ఐరిష్ కవి

ఈ కవిత శీర్షిక చిత్రంగా పెట్టాడు కవి. అందుకని దానిని తెలుగులో అనువదించడానికి

కొంతశ్రమపడవలసి వచ్చింది. Mid-term Break ని అన్నదాన్ని ఎన్నికలవిషయంలో

చెప్పినట్టు, మధ్యంతర శలవులు అనడం నాకు నచ్చలేదు, కారణం రెండింటి మధ్య ఉన్న

మౌలికమైన తేడా.

కారు అన్నపదానికి అర్థం ఒక ఋతువు (నవకారు: వసంతం, వానకారు: వర్షాకాలం ఇలా) కొంత

నిర్ణీత వ్యవధి… అన్న అర్థాలున్నాయి. అందుకని Term అన్నపదానికి కారు అన్నది

సరిపోయినట్టు అనిపించింది. 

.

కళాశాల ఆసుపత్రిలో కూచుని పగలల్లా
కారు నడిమి శలవులు సూచిస్తూ మోగే గంటల్ని లెక్కపెట్టాను.
మధ్యాహ్నం రెండుగంటలకి పక్కింటివాళ్ళు ఇంటికి తీసుకువచ్చారు.

వసారాలో, ఏడుస్తూ నాన్న ఎదురయ్యాడు…
ఏ చావునైనా ధైర్యంగా తీసుకోగల మనిషి ఆయన.
జిమ్ ఈవాన్స్ “ఇది తట్టుకోలేని దెబ్బ” అని ఓదారుస్తున్నాడు.

నన్నుచూడగానే, పసివాడు నవ్వుతూ, కేరుతూ
తోపుడుబండి ఊగించాడు, పెద్దవాళ్ళందరూ నాకోసం
నిలుచుని ఎదురుచూస్తూ, నా క్షేమానికి అభినందిస్తూనే

జరిగినప్రమాదానికి విచారం ప్రకటిస్తుంటే సిగ్గేసింది.
ఇంటికి నేనే పెద్దవాణ్ణనీ, దూరంగా కళాశాలలో ఉంటున్నాననీ,
తెలియనివాళ్ళకి గుసగుసలు చెబుతున్నాయి. అమ్మ నా చెయ్యి

తన చేతిలోకి తీసుకుని, కన్నీరెండిన బాధతో నిట్టూరుస్తోంది.
పదిగంటలవుతుంటే, ఒంటినిండా కట్లుకట్టిన శవాన్ని
ఏంబులెన్సులో నర్సులు తీసుకుని వచ్చారు.

మర్నాడు ఉదయం శవాన్నుంచిన మేడమీది గదిలోకి వెళ్ళాను.
ఉపశమనవాక్యాల్లా మంచూ, కొవ్వొత్తులూ బొట్లుగా పక్కని తడుపుతున్నాయి.
ఈ ఆరు వారాల్లో మొదటిసారిగా చూస్తున్నాను వాడిని. బాగా రక్తం కారి ఉంటుంది.

ఎడమ కణతదగ్గర నల్లమందంత గాయపుమచ్చ
మంచం మీద పడుక్కున్నట్టు నాలుగడుగుల పెట్టెలో పడుక్కున్నాడు
ఎక్కడా పెద్ద దెబ్బలు లేవు, ఖచ్చితంగా బంపరు తగిలేసి ఉంటుంది.

నాలుగు అడుగుల పెట్టె, ఏడాదికి ఒక అడుగు అని కొలిచినట్టు.
.

సీమస్ హీనీ

13 April 1939 – 30 August 2013  

ఐరిష్ కవి

.

Seamus Heaney

Photo Courtesy: Wikipedia

.

Mid-Term Break

.

I sat all morning in the college sick bay

Counting bells knelling classes to a close.

At two o’clock our neighbors drove me home.

In the porch I met my father crying–

He had always taken funerals in his stride–

And Big Jim Evans saying it was a hard blow.

The baby cooed and laughed and rocked the pram

When I came in, and I was embarrassed

By old men standing up to shake my hand

And tell me they were “sorry for my trouble,”

Whispers informed strangers I was the eldest,

Away at school, as my mother held my hand

In hers and coughed out angry tearless sighs.

At ten o’clock the ambulance arrived

With the corpse, stanched and bandaged by the nurses.

Next morning I went up into the room. Snowdrops

And candles soothed the bedside; I saw him

For the first time in six weeks. Paler now,

Wearing a poppy bruise on his left temple,

He lay in the four foot box as in his cot.

No gaudy scars, the bumper knocked him clear.

A four foot box, a foot for every year.

.

Seamus Heaney

13 April 1939 – 30 August 2013  

Irish Poet, Playwright and Translator.

Poem Courtesy:

http://famouspoetsandpoems.com/poets/seamus_heaney/poems/12698

ప్రకటనలు

పోగొట్టుకున్న నేల… ఈవన్ బోలాండ్, సమకాలీన ఐరిష్ కవయిత్రి

.

నా కిద్దరు ఆడపిల్లలున్నారు.
నేను ఈ జన్మకి కోరుకున్నది ఆ ఇద్దరినే.
బహుశా నేను అంతకుమించి కోరుకోలేదేమో! .

హాఁ! నేను చారెడు జాగా కూడా కోరుకున్నాను:
ఎప్పుడూ ఎవరిపని వారు చేసుకోగలిగే వాతావరణమున్న దీవి,
చుట్టూ కొండలమధ్య ఒక నగరం, ఒక జీవ నది … ఉన్న చోట.

ఆ నేల నాదని చెప్పుకోగలగాలి. నా స్వంతం.
అక్షరాలా నా తాత్పర్యం అదే.

వాళ్ళు పెద్దవాళ్ళయిపోయి దూరాభారాన ఉన్నారు.

ఇప్పుడు జ్ఞాపకాలే
వలస పోతున్నాయి.
ఆ తావుల్లో ప్రకృతి అంత సహజంగా
కపటమైన ప్రేమ కనిపిస్తుంది.

పిల్లల కళ్లల్లో ప్రతిఫలించవలసిన
రంగురంగుల కొండలూ కోనలూ
పిల్లలు దూరమవడంతో, క్షితిజరేఖలైపోయాయి.

రాత్రి
కళ్లు బరువెక్కి మగతనిద్రలోకి జారుతున్న వేళల్లో

నేను “డబ్లిన్” అఖాతపు తీరాన్ని కలగంటాను,
విశాలమైన కొండప్రదేశాన్నీ, నల్లసానపురాతి వాడరేవునీ చూస్తాను.

నే నూహించుకుంటాను…
సందెచీకటివేళ పడవమీద నిష్క్రమిస్తూ ఆ రోజు
నా పిల్లలు ఈ దృశ్యాల్ని చూసి ఇలాగే అనుకుని ఉంటారా అని.

వాళ్ళు విడిచిపెడుతున్న ప్రతి వస్తువుమీదా
నీడలు ముసురుకుంటుంటే,
వాళ్లు వీటిని కలకాలం గుర్తుపెట్టుకుంటారా? అని

రేవు ఒడ్డున నిలబడినట్టు ఊహించుకుని
పడవ రెయిలింగ్ మీద చివరి చేతిజాడ కనిపించేదాకా నిరీక్షిస్తాను.

తర్వాత నన్ను నేను
నీటి అడుగున అధోలోకంలో ఊహించుకుంటాను,
చీకటి చాలా త్వరగా కమ్ముకొస్తూంటుంది…
ఆ నేలనుపోగొట్టుకున్న మనుషుల చిఠ్ఠా చదువుతూ…
.

ఈవన్ బోలాండ్

జననం 1944

ఐరిష్ కవయిత్రి

.

.

The Lost Land

I have two daughters.

They are all I ever wanted from the earth.

Or almost all.

I also wanted one piece of ground:

One city trapped by hills. One urban river.

An island in its element.

…….

text deleted intentionally for copyright reasons

……..

shadows falling

on everything they had to leave?

And would love forever?

And then

I imagine myself

at the landward rail of that boat

searching for the last sight of a hand.

I see myself

on the underworld side of that water,

the darkness coming in fast, saying

all the names I know for a lost land:

.

EAVAN BOLAND

Born 1944

Irish Poetess

Read the complete poem here:

https://www.poetryfoundation.org/poems/50003/the-lost-land

మరో ట్రాయ్ ఎక్కడుంది? … విలియం బట్లర్ యేట్స్, ఐరిష్ కవి

Maud Gonne

Picture Courtesy: Wikipedia

ఇది యేట్స్ తన ప్రియురాలు, ఐరిష్ నటి, విప్లవకారిణి Maud Gonne మీద వ్రాసిన కవిత. ఇక్కడ ఒక చారిత్రక సత్యాన్ని తీసుకుని (హెలెన్ కోసం ట్రాయ్ పట్టణం దహించబడడం), ఒక విలక్షణమైన ప్రతిపాదన చేస్తున్నాడు: అందం నిప్పులాంటిది. అది ఇతరులనైనా దహిస్తుంది. తనని తానైనా దహించుకుంటుంది. “యేట్స్ ప్రేయసి Maud Gonne కోసం ఇప్పుడెవరూ యుద్ధం చెయ్యడం లేదు గనుక (ఇది అతని ఊహ మాత్రమే), ఆమె తన లక్ష్యంకోసం తనని తాను దహించుకుంటోంది” అని అతని భావం .

.

నా జీవితాన్ని దుఃఖభాజనము చేసిందని ఆమెని ఎందుకు నిందించాలి,

ఈమధ్య ఏమీ ఎరుగని అమాయకులైన యువకులకు

ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీధుల్లో గొడవలుచేసేవాళ్లలా కాకుండా

అత్యంతహింసాత్మకమైన మార్గాలను బోధిస్తోందని ఎందుకు అనాలి …

వాళ్ళకి కోరికున్నంత గాఢంగా ధైర్యంకూడా ఉన్నప్పుడు?

సారించడానికి సిద్ధంగా ఉన్న నారి లాంటి ఆమె అందమూ,

ఈ రోజుల్లో అటువంటిది అంత సహజమైన విషయం కాదు,

రాజీలేని తీవ్రత, ఏకాగ్రత, తిరుగులేని నిశ్చయమూ,

ఉదాత్తమైన వ్యక్తిత్వం నిప్పంత నిర్మలంగా ఉంచిన

ఆమె మనసుకి, ఏది ప్రశాంతతని అందివ్వగలదు?

ఏమీ, ఆమె ఆమె అయిన తర్వాత, అంతకంటే ఏం చేస్తుంది?

తగలబెట్టడానికి మరో ట్రాయ్ ఎక్కడుంది?
.

విలియం బట్లర్ యేట్స్

(13 June 1865 – 28 January 1939)

ఐరిష్ కవి.

.

Why should I blame her that she filled my days

With misery, or that she would of late

Have taught to ignorant men most violent ways,

Or hurled the little streets upon the great,

Had they but courage equal to desire?

What could have made her peaceful with a mind

That nobleness made simple as a fire,

With beauty like a tightened bow, a kind

That is not natural in an age like this,

Being high and solitary and most stern?

Why, what could she have done, being what she is?

Was there another Troy for her to burn?

.

WB Yeats  

(13 June 1865 – 28 January 1939)

Irish Poet

(The Poem was  published in 1921 in the collection Green Helmet and Other Poems.)

Poem Courtesy: https://www.poetryfoundation.org/poems/49772/no-second-troy

 

మరణాన్ని ముందే పసిగట్టిన ఐరిష్ వైమానిక సైనికుడు … విలియమ్ బట్లర్ యేట్స్, ఐరిష్ కవి

నాకు తెలుసు ఆ మేఘాల్లో ఎక్కడో

నేను మృత్యువుని కలుసుకుంటానని;

నేను యుద్ధం చేస్తున్నవారిపట్ల ద్వేషమూ లేదు,

నేను పరిరక్షిస్తున్న వారి పట్ల నాకు ప్రేమా లేదు;

నా జన్మభూమి కిల్టార్టన్ క్రాస్

నా ప్రజలు కిల్టార్టన్ కి చెందిన నిరుపేదలు,

యుద్ధం ముగిసేక వాళ్ళకి కొత్తగా వచ్చే నష్టమూ లేదు

వాళ్ళ జీవితాలు మునపటికంటే ఆనందంగా ఉండేదీ లేదు.

ఏ చట్టమూ, ఏ కర్తవ్యమూ, నన్ను పోరాడమనలేదు,

ఏ రాజకీయ నాయకులూ, ప్రజల జేజేలూ ప్రేరేపించలేదు

కేవలం ఆనందంలో వచ్చిన క్షణికావేశం

నన్నీ మేఘాల్లోకి విధ్వంసానికి పురికొల్పింది;

నేను అన్నీ బేరీజు వేసుకున్నాను, మనసులో గణించాను,

ఇక రానున్న రోజులన్నీ నిరర్ధకంగా బ్రతకాలి,

గడిచిన రోజులన్నీ నిరర్ధకంగానే గడిచిపోయాయి.

కనుక ఈ జీవితానికి నికర బాకీ, ఈ మృత్యువే.

.

విలియమ్ బట్లర్ యేట్స్

(13 June 1865 – 28 January 1939)

ఐరిష్ కవి

W B Yeats

13 June 1865 – 28 January 1939

Irish Poet

An Irish Airman Foresees His Death

.

I know that I shall meet my fate

Somewhere among the clouds above;

Those that I fight I do not hate,

Those that I guard I do not love;

My country is Kiltartan Cross,

My countrymen Kiltartan’s poor,

No likely end could bring them loss

Or leave them happier than before.

Nor law, nor duty bade me fight,

Nor public men, nor cheering crowds,

A lonely impulse of delight

Drove to this tumult in the clouds;

I balanced all, brought all to mind,

The years to come seemed waste of breath,

A waste of breath the years behind

In balance with this life, this death.

.

William Butler Yeats

(13 June 1865 – 28 January 1939)

Irish Poet

Note:

Kiltartan Cross is a place in Ireland. It is the name of a barony in Galway County of western Ireland (a barony is kind of smaller county). Kiltartan was home to one Lady Gregory, a very close friend of Yeats’ who had this really awesome estate called Coole Park. (It was cool in all senses of the word.) Yeats spent lots of time at Coole Park, which is why the volume that contains this poem “An Irish Airman… “ is called The Wild Swans at Coole. The Irish airman named in the poem’s title is Lady Gregory’s son, Robert Gregory, who was killed in the First World War.

Poem Courtesy:

http://wonderingminstrels.blogspot.com/1999/03/irish-airman-foresees-his-death-william.html

అతనిపేరు స్మరించకండి… థామస్ మూర్, ఐరిష్ కవి

రాబర్ట్ ఎమెట్ స్మృతిలో

ఓహ్, అతని పేరు స్మరించకండి! అతని అస్తికలు నిర్లిప్తంగా
ఏ సమ్మానమూ లేక పడి ఉన్నట్లే అజ్ఞాతంలోనే పరుండనీండి;
దుఃఖంతో మేము మౌనంగా కార్చే కన్నీరు, అతని సమాధిపై
తలదిక్కున బొట్టుబొట్టుగా రాలే రాత్రికురిసిన మంచులా బరువుగా రాలనీండి.

కానీ, రాత్రి కురిసిన మంచు, అది మౌనంగా రోదిస్తే రోదించుగాక,
అతను పరున్న సమాధి నలుదుక్కులా పచ్చని తివాచీ కప్పుతుంది;
మేము కార్చే కన్నీరు అది ఎవరికీ కనిపించకపోతే కనిపించకపోవచ్చు గాక
కానీ, అతని స్మృతిని మా మనసులలో చిరస్థాయిగా నిలుపుతుంది.
.

థామస్ మూర్

(28 May 1779 – 25 February 1852) 

ఐరిష్ కవి

.

“O, breathe not his name”

Robert Emmet

O, Breathe not his name! let it sleep in the shade,  

Where cold and unhonored his relics are laid;     

Sad, silent, and dark be the tears that we shed,   

As the night-dew that falls on the grave o’er his head. 

But the night-dew that falls, though in silence it weeps,                  

Shall brighten with verdure the grave where he sleeps;

And the tear that we shed, though in secret it rolls,      

Shall long keep his memory green in our souls.

.

Thomas Moore

(28 May 1779 – 25 February 1852)

Irish Poet

Poem Courtesy:

The World’s Best Poetry.

Volume VII. Descriptive: Narrative.  1904.

Descriptive Poems: I. Personal: Rulers; Statesmen; Warriors

Eds: Bliss Carman, et al.

http://www.bartleby.com/360/7/4.html

కొత్త జీవితం… ఆస్కార్ వైల్డ్ ఐరిష్ కవి

ఏ వేటా లభించని సముద్రం అంచున అలా నిరీక్షిస్తూ నిలబడ్డాను
నా ముఖాన్నీ, జుట్టునీ నురుగుతో కెరటాలు తడి ముద్ద చేసేదాకా.
గతించిన రోజు ఎర్రని చితిమంటలు సుదీర్ఘంగా
పశ్చిమాకాశాన మండుతున్నాయి; గాలి బావురుమని ఊళలేస్తోంది;
అరుచుకుంటూ సీ గల్స్ నేలవైపు పరిగెత్తుతున్నాయి;
“అయ్యో! నా జీవితమంతా బాధలమయమేగదా!
నిత్యం ప్రసవవేదన పడే ఈ చవిటి నేలల్లో
పళ్ళూ, బంగారు ధాన్యాన్నీ ఎవరు పండించగలరు?”
అని వగచేను. నా వలలు తెగి, పురితగ్గి, నోరు వెళ్ళబెడుతున్నాయి.
అయినప్పటికీ చివరిసారిగా విసిరేను సముద్రంలోకి
చివరికి ఎమవుతుందోనని ఎదురు చూస్తూ.
వావ్ ! పరమాద్భుతమైన వెలుగులు!
ధవళ కాంతులతో ఆకాశానికి బాలుడు ఎగబ్రాకుతున్నాడు.
ఆ ఆనందంలో వేదనామయమైన గతాన్ని మరిచిపోయాను .
.

ఆస్కార్ వైల్డ్

16 October 1854 – 30 November 1900

ఐరిష్ కవి

.

Image Courtesy: http://upload.wikimedia.org

.

Vita Nuova

.

I stood by the unvintageable sea

Till the wet waves drenched face and hair with spray,

The long red fires of the dying day

Burned in the west; the wind piped drearily;

And to the land the clamorous gulls did flee:

‘Alas!’ I cried, ‘my life is full of pain,

And who can garner fruit or golden grain,

From these waste fields which travail ceaselessly!’

My nets gaped wide with many a break and flaw

Nathless I threw them as my final cast

Into the sea, and waited for the end.

When lo! a sudden glory! and I saw

The argent splendour of white limbs ascend,

And in that joy forgot my tortured past.

.

Oscar Wilde

16 October 1854 – 30 November 1900

Irish Poet, Playwright, Novelist

Poem Courtesy:

https://www.poemhunter.com/poem/vita-nuova/

జ్వాలలు… జోసెఫ్ కాంప్ బెల్, ఐరిష్ కవి

ప్రకృతి రగిలించే ఆ చిన్ని చిన్ని జ్వాలలు…
నీలి నీలి మొగ్గలూ, ఎర్ర ఎర్రని పూలూ…
తుఫాను రాత్రుల్లో ఆమె ఆగ్రహం కొండల్ని
కొరడాలతో కొట్టినపుడు, చల్లారుతుంది.

మేఘాల ఎత్తుకి ఆమె ఎగదోసే మంటలు
రంగురంగుల హరివిల్లూ, తటిల్లతలూ …
ఆమె ఆగ్రహంతో నేలను గట్టిగా శపిస్తూ కుమ్మేస్తుంది
పర్యవసానం మృత్యువైనా లెక్కచేయదు.

ఆమె ఆత్మలో రగిలించే అగ్ని కీలలు
కవి ఆవేశంలోనూ, విప్లవకారుడి ఆలోచనలోనూ;
రెంటినీ నియంత్రించలేదు; అక్కడ వాడిన ఇంధనం
ఇక్కడకాదు, వేరే గనుల్లోంచి తవ్వి తీసినది.
.

జోసెఫ్ కాంప్ బెల్

July 15, 1879 – June 1944

ఐరిష్ కవి

.

.

                    Fires

  .

The little fires that Nature lights —

  The scilla’s lamp, the daffodil —

  She quenches, when of stormy nights

  Her anger whips the hill.

  The fires she lifts against the cloud —

  The irised bow, the burning tree —

  She batters down with curses loud,

  Nor cares that death should be.

  The fire she kindles in the soul —

  The poet’s mood, the rebel’s thought —

  She cannot master, for their coal

  In other mines is wrought.

.

Joseph Campbell

July 15, 1879 – June 1944

Irish Poet

 

http://wonderingminstrels.blogspot.in/2000/02/fires-joseph-campbell.html

ఒక వాదము… థామస్ మూర్,ఐరిష్ కవి

ఒకే విషయం మీద వేర్వేరు కవులు స్పందించిన కవితలన్నీ ఒకచోట దొరికే సందర్భం అరుదుగా తటస్థిస్తుంది. అలాంటిదే ఇది.  “Sin”  మీద ముగ్గురు కవుల (నిజానికి అందులో ఒకరు గొప్ప నవలా కారుడు) స్పందన వరుసగా మూడు రోజులపాటు చదవొచ్చు.

***

 .
నాకు చాలాసార్లు జ్ఞానులైన ఫకీరులు చెప్పారు
ఊహించడమూ, ఆచరించడమూ రెండూ నేరమేనని
దైవం ఆచరించిన వారిని ఎలా శిక్షిస్తాడో
మనసులో కోరుకున్నవారినీ అలాగే శిక్షిస్తాడని.

కోరిక శిక్షార్హమైనప్పుడు, నువ్వూ నేనూ
మనస్సాక్షిగా నేరానికి శిక్షార్హులమే.
కనుక, కనీసం శిక్ష అనుభవించబోయేముందు
కొంత సుఖాన్ని అనుభవిద్దాము, రా!

థామస్ మూర్
(28 May 1779 – 25 February 1852)
ఐరిష్ కవి

 

An Argument

I’ve oft been told by learned friars,
That wishing and the crime are one,
And Heaven punishes desires
As much as if the deed were done.

If wishing damns us, you and I
Are damned to all our heart’s content;
Come, then, at least we may enjoy
Some pleasure for our punishment!
.
Thomas Moore
(28 May 1779 – 25 February 1852)
Irish Poet
Courtesy: Ian Baillieu’s comment http://wonderingminstrels.blogspot.com/2003/03/this-is-horror-that-night-after-night.html.

గంతులేసే పిల్లలు… జార్జి డార్లీ, ఐరిష్ కవి

సొట్టలుపడే బుగ్గల్లా తూగుతున్న పచ్చిక బీళ్ళలోకి
తెల్లకుచ్చుల జుత్తుగల తలలగుంపొకటి దూసుకొచ్చింది
మొగ్గల్లాంటి పెదాలున్న బాలురూ బాలికలూ
ప్రేమపాశాల చిట్టిపొట్టి ప్రతిరూపాలు వాళ్ళు.

నవ్వులతో సుడులు తిరుగుతున్న కనుల వరుసలవి
ఎంతచక్కగా మెరుస్తున్నాయి! ఎలా కదలాడుతున్నాయి!
నదిమీద తళతళలాడే కెరటాల్లా
జంటవెంట మరొక జంట మెరుస్తున్నాయి.

ఆనందపు మత్తులో తూలుతున్న కెంపువన్నె ముఖాలు
సంతోషం తాండవించే దివ్యస్వరూపాలు అవి,
ప్రేమగా మీరుచేసే ఎకసెక్కాలూ, కోణంగిచేష్టలూ
వాళ్ళూ మీతో చేస్తారు, చెయ్యడానికి వాళ్ళు భయపడరు.
.
జార్జి డార్లీ
1795- నవంబరు 23, 1846

ఐరిష్ కవి

.

The Gambols of Children

DOWN the dimpled greensward dancing, 

  Bursts a flaxen-headed bevy,—     

Bud-lipt boys and girls advancing,  

  Love’s irregular little levy.   

Rows of liquid eyes in laughter,       

  How they glimmer, how they quiver!      

Sparkling one another after,   

  Like bright ripples on a river.        

Tipsy band of rubious faces,  

  Flushed with Joy’s ethereal spirit, 

Make your mocks and sly grimaces 

  At Love’s self, and do not fear it.

.

George Darley

(1795– Nov 23, 1846)

The World’s Best Poetry.

Eds.  Bliss Carman, et al.

Volume I. Of Home: of Friendship.  1904.

Poems of Home: I. About Children

http://www.bartleby.com/360/1/41.html

ప్రేమ ఎప్పుడు ఉదయిస్తుంది? … పెకెన్ హాం బియాటీ , ఐరిష్ కవి

కొందరికి ఆలస్యంగా దొరుకుతుంది, కొందరికి త్వరగా,

కొందరికి మల్లెలతో వసంతంలో,

కొందరికి సంపెంగలతో వర్షర్తువులో,

మరికొందరికి హిమంతంలో చేమంతులతో.

ప్రేమ కొందరిని మెరిసే కనులతో పలకరిస్తే

కన్నీరు నింపుతూ కొందరిని చేరుకుంటుంది;

ప్రేమ కొందరిని గీతాలాలపింపజేస్తే,

కొందరిని నిరాశతో నిట్టూర్పు విడిచేట్టు చేస్తుంది,

కొందరితోనయితే, ప్రేమ అసలు పెదవే విప్పదు;

అందమైన ఓ ప్రేమా! నా దగ్గరికి ఎలా వస్తావు?

నువ్వు తొందరగా వస్తావా, ఆలస్యంగా వస్తావా?

సూర్యుని వెలుగుతోనో, చంద్రుని వెన్నెలతోనో

ఆకసం నిండుతుందా, లేక నిండుకుంటుందా?

దీనంగా అడుగిడతావా, లేక నవ్వుతూనో, పాడుతూనా?

నిట్టూరుస్తూనా? మధురంగానా? మౌనంగానా?

నేను యవ్వనంలో ఉండగానే మనం కలుసుకుంటామా?

లేక జీవిత చరమాంకం సమీపిస్తుందా?

.

పేకెన్ హాం బియాటీ,

(1855–1930)

ఐరిష్ కవి

.

When Will Love Come?

Some find Love late, some find him soon,        

  Some with the rose in May,  

Some with the nightingale in June,   

  And some when skies are gray;      

Love comes to some with smiling eyes,         

  And comes with tears to some;      

For some Love sings, for some Love sighs,         

  For some Love’s lips are dumb.    

How will you come to me, fair Love?        

  Will you come late or soon? 

With sad or smiling skies above,     

  By light of sun or moon?     

Will you be sad, will you be sweet,  

  Sing, sigh, Love, or be dumb?        

Will it be summer when we meet,    

  Or autumn ere you come?

.

Pakenham Beatty

(1855–1930)

English Poet

Born in Brazil and educated in Harrow and Bonn.

The World’s Best Poetry.

Bliss Carman, et al., eds. 

Volume II. Love.  1904.

  1. Love’s Nature

http://www.bartleby.com/360/2/75.html

%d bloggers like this: