అనువాదలహరి

క్షణకాలపు లోలత్వం… రబీంద్రనాథ్ టాగోర్, భారతీయ కవి

ప్రభూ! నీ ప్రక్కన కూర్చునే క్షణకాలపు లోలత్వానికి అనుమతి ప్రసాదించు.

నే చేయవలసిన పనులని తర్వాత నెమ్మదిగా చక్కబెట్టుకుంటాను.

నీ వదనాన్ని వీక్షించక నా మనసుకి విశ్రాంతీ, ఉపశమనమూ లేవు,

దరిలేని శ్రమసాగరంలో నా పని అశ్రాంతశ్రమల ప్రోవు.

నిట్టూర్పులతో, మర్మరధ్వనులతో నా ప్రాంగణంలో అడుగుపెట్టిన ఈ వేసవి రోజున

నికుంజవిహారులు నెత్తావి పూలగుత్తులచుట్టూ తమకంతో నృత్తగీతాలాలపిస్తునాయి.

దొరికిన ఈ కొద్ది ప్రశాంత విశ్రాంతి సమయమూ, నీ ఎదురుగా, మౌనంగా

కూర్చుని, నా జీవితాన్ని నీకు అంకితం చేస్తూ లోలోన ఆలపించనీ! ప్రభూ!

.

రబీంద్రనాథ్ టాగోర్

7th May 1861 – 7th Aug 1941

భారతీయ కవి

Image Courtesy: Wikipedia

.

A Moment’s Indulgence

.

I ask for a moment’s indulgence to sit by thy side. The works

that I have in hand I will finish afterwards.

Away from the sight of thy face my heart knows no rest nor respite,

and my work becomes an endless toil in a shoreless sea of toil.

Today the summer has come at my window with its sighs and murmurs; and

the bees are plying their minstrelsy at the court of the flowering grove.

Now it is time to sit quiet, face to face with thee, and to sing

dedication of life in this silent and overflowing leisure.

.

Rabindranath Tagore

7 May 1861 – 7 August 1941

Indian Poet

Poem Courtesy:

http://famouspoetsandpoems.com/poets/rabindranath_tagore/poems/2203

 

ప్రకటనలు

A Teasing Phrase… Yakoob, Telugu Poet, India

Once a beautiful idea molds itself into a phrase,

And if you do not appropriate it instantly,

You are done. It suddenly disappears into ether!

However much you long for it, you can’t recall.

Search wherever you like, you can rarely find it.

And even in that rare unlikely chance event,

Like a depetalled rose, there will be glaring imperfections.

It’s a teasing phrase which strikes the mind

Like a fruit dropping overhead unaware through foliage;

It’s as precious a phrase as a drop of rain

That abruptly slips through the clouds;

It’s a dreamy phrase that keeps company through the night

Electrifies us, yet, in a trice slithers into oblivion;

It’s a rattling phrase, unable to hail its presence, lies

Silent among the sounds, struggling to win our approval;

It’s an indiscernible phrase, as we explore the worlds around

Spreading the paper in front and concentering our mind. 

The spider which leisurely draws geometric figures on the wall

Spares no time to turn its head this way to leave any hints of it;

And the forever chasing, vigilant and alert lizard

Makes no squeaks to reveal its whereabouts;

Neither the tolling bells on the gate,

The headlines of any newspaper

Nor the remote pages of any book

Restore that alienated phrase back to me.

And I have no idea when it would strike me again.

.

Yakoob

Telugu Poet, India

Kavi Yakoob

ఏమై ఉండొచ్చు

.

ఒకసారి వాక్యం స్ఫురించాక

దాన్ని లోపలికి తీసుకోకుండా వదిలేస్తే

చటుక్కున అదెక్కడికో మాయమౌతుంది…!

ఎంత నిరీక్షించినా మళ్ళీ వెనక్కి రాదు

వెతుకులాడినా దొరకదు, దొరికినా

రేకులు రాలిన పూవులా ఏదో కొరత…

అది ‘కొమ్మల్లోంచి తెలియకుండా

తలమీద రాలిన పండుటాకులాంటి వాక్యం!

గభాల్న మబ్బుల్లోంచి జారిపడ్డ

అపురూపమైన  వర్షపుచినుకులాంటి వాక్యం!

రాత్రంతా ప్రక్కనే ఉండి

ఉక్కిరిబిక్కిరిచేసి, మరుపులోకి జారుకున్న కల లాంటి వాక్యం!

గొంతెత్తి పలకలేక శబ్దాలుగా అణిగిమణిగి

అంగీకారంకోసం పెనుగులాడుతూ ఎగుస్తున్న వాక్యం!

కాగితం  ముందేసుకుని మనసురిక్కించి

ఎంత వెతికినా కానరాని వాక్యం!

తాపీగా గోడలమీద బొమ్మలుగీసుకుంటున్న సాలీడు

ఇటువైపునించి సంౙ్ఞలుచేయదు

అదేపనిగా అటూ ఇటూ  పరుగులుపెట్టే బల్లి

కిచకిచమని కొంచెమైనా చెప్పదు

గంటలుకట్టిన గేటు తన చప్పుళ్ళతో గుర్తుచేయదు

ఏ పత్రికలోని వార్త, పుస్తకంలోని పేజీ…

దూరమైన ఆ వాక్యాన్ని నా దాకా చేర్చదు!

ఎప్పుడు నా కళ్ళముందు ప్రత్యక్షమవుతుందో తెలియనే తెలియదు!

.

కవి యాకూబ్

A Small Chest… Vijay Chandra Rokkam, Telugu Poet

Long long ago
I stashed
a star
in a small chest
And in my
heart’s glasscase
my mother’s
tear

In my childhood
the extra digit
of my last brother

the tooth, recovered
from the accident site,
of Venkatarao…
our male servant
in my childhood.

A sapphire-studded
ring my mother
bought me in an exhibition

A cowry I gleaned
on the sands of Gopalapuram
seashore know not when

A glass globule
I played with
my street friends
in the military lines.

The notes of Kalman
rendered by the Maulana
from Bhapur Bazaar Masjid.

The sound of hammer
as father tried to bend
the galvanized iron sheet

Oh! I collected a lot more.
But now the chest is restive.
Did it fledge, by any chance?
.
Vijay Chandra Rokkam

Telugu Poet, Berhampur

భరిణ

చాలాకాలం క్రిందట
కుంకుమ భరిణలో
నక్షత్రం ఒకటి
దాచాను
మనస్సు సీసాలో
తల్లి అశ్రువొకటి

చిన్నతనంలో
మా ఆఖరితమ్ముడి
ఆరోవేలొకటి

బాల్యంలో ఎత్తుకుతిప్పిన
వెంకట్రావు
ప్రమాదంలో చనిపోతే
రోడ్డుమీద దొరికిన
దంతమొకటి

ఎగ్జిబిషన్ లో
అమ్మ కొనిచ్చిన
నీలిపొడి ఉంగరమొకటి

ఎప్పుడో గోపాలపురం
సముద్రతీరంలో
దొరికిన గవ్వ ఒకటి

మిలట్రీ లైనులో
వీధిమిత్రులతో
ఆడుకున్న
గోళీకాయ ఒకటి

భాపూర్ బజార్
మస్జీద్ లో
మౌలానా అరిచే
కల్మాన్ స్వరమొకటి

రేకును వంచుతూ
నాన్నకొట్టిన
సుత్తి శబ్దం ఒకటి

చాలా చాలా దాచాను.
ఇప్పుడు భరణి కదులుతోంది
రెక్కలొచ్చాయేమో!
.

విజయచంద్ర
తెలుగు కవి

ఇద్దరు కవులెప్పుడైనా కలుసుకుంటే… హరీశ్ ఎడవన, మలయాళం

ఇద్దరు కవులెప్పుడైనా కలుసుకుంటే

వాళ్ల ఆత్మలు సమావేశాన్ని బహిష్కరిస్తాయి.

ఒకరికొకరు వీడ్కోలుచెప్పుకునేదాకా

వాళ్ల పద్యాలు విసుగుతో ఆవులిస్తూనే ఉంటాయి.

అక్షరాలు నిశ్శబ్దంగా ప్రార్థిస్తుంటాయి దేముడా

మమ్మల్ని ఈ హింసనుండి రక్షించమని.

పుకార్లకీ వ్యర్థప్రసంగాలకీ అధిదేవతలు

సైతానుని సంకీర్తనలతో స్తుతిస్తాయి.

ఇద్దరు కవులు ఎప్పుడైనా కలిస్తే

తమని తాము ఆకాశానికి ఎత్తేసుకుంటారు

పాపము శమించుగాక! ఒకచోట

ఇద్దరు కవులెన్నడూ కలవకుందురు గాక!

.

హరీశ్ ఎడవన

మలయాళం

.

Image Courtesy: Poetrans.wordpress.com
Image Courtesy: Poetrans.wordpress.com

.

If Two Poets were ever to Meet

If two poets were ever to meet,
the souls would stage a walkout.

Their poems would yawn,
until they bid goodbye to each other.

Letters would pray in silence,
to be freed from the deadly torture.

The angels of gossip
would sing paeans to the Devil.

If two poets were ever to meet,
they’d exalt themselves to greatness.

May poets never come together..
Never..!

Written by HARIS EDAVANA

Translation : Rahul Kochuparambil

Poem Courtesy: poetrans.wordpress.com

Confessions… Srinivas Vasudev, Telugu, Indian Poet

1

I came walking over the night

but could not collect a fistful of darkness!

The dreams beneath the eyes swimming in tears

could not make a legend.

2

Sitting in each grapheme

I converse with the rest.

For, each word  is a confession-box.

I put down my own episodes here.

3

Like the empty bottles rolling down

these memories trudge along encasing emptiness …

some never get interred,

while some others get hazy

like letters on a dampened paper …

4

Some enigmatic relations restrain emotions

like the weight on a paper.

Passion had long evaporated!

When shall the distinction between

wetting and moistening be clear?

5

The howling in the air

that the interred had no friends

shall not reach the other ear.

No boulder of the Pyramids

can either fill the hollowness of life

or block my view.

But then, what is it that I attempt to see,

after all!

6

Borrowed intellect shall not fit

like the misfitting borrowed garments

it looks so odd… so unnatural.

7

That all-pervading vacuum

does not spare even this confession box…

Doesn’t Life script its own screen play?

.

Srinivas Vasudev

Image Courtesy: Srinivas Vasudev

Mr. Srinivas Vasudev holds a Master’s Degree in English Literature from Andhra University, Waltair, Andhra Pradesh, India.  He is also a graduate in journalism from the same University.  He is a Senior Lecturer in the Ministry Of Education of Brunei, Darussalam since 2003. He had earlier worked for Ministry of Education in Oman  and as Senior Lecturer in English for about 2 years for the University of London in Singapore  before moving to Brunei. Some of his works are on the anvil.

He is running a blog http://vinaayakaveena.blogspot.com/

since Sept 11, 2010.

.

Confessions

రాత్రిపై నుంచి నడిచొచ్చానా

గుప్పెడంత చీకటినీ తెచ్చుకోలేకపోయాను!

కళ్ళకింద కలలన్నీ కన్నీళ్ళలో

కదులుతూ

కథలుగా మారలేకపోయాయి

2.

అక్షరంలో కూర్చుని మరొకదాంతో

చెప్పుకుంటూ ఉంటాను

ప్రతీపదం కన్ఫెషన్ బాక్స్ మరి

నా కథల్ని నేనే రాసుకుంటానిక్కడ

3.

దొర్లుకొస్తున్న ఖాళీ సీసాల్లా కొన్ని జ్ఞాపకాలు

ఖాళీలకి ఫ్రేముకట్టి మరీ మోస్తాయి..

సమాధికాబడని జ్ఞాపకాలు కొన్ని!

తడిసిన కాగితంలోని అలుక్కుపోయిన అక్షరాల్లా

జ్ఞాపకాలు….

4.

అర్ధంకాని బంధాలేవో

పేపర్ వెయిట్‌‌లా జీవితావేశాన్ని

అదిమిపెడుతుంటాయి

తేమకీ, తడికీ తేడాతెల్సెదెప్పుడు

ఆర్ద్రతెప్పుడో ఆవిరై ఆరిపోయిందిలె

 5.

సమాధిలో శవానికి మిత్రుల్లేరన్న

గాలిఊళల్లోని మాటలు కొన్ని చెవిదాటిపోవు

అవును

పిరమిడ్లలోని రాళ్ళేవీ

జీవితతంలోని డొల్లతనాన్నీ నింపలేవు

నా దృష్టినీ అడ్డుపెట్టలేవు

అయినా ఏం చూస్తున్నానని?

6.

అరువుతెచ్చుకున్న మేధోతనమేదీ నిలబడదు

చిన్న ఒంటికి పెద్ద అంగీలా

అసహజంగా, అసమానంగా….

 7.

విస్తరించుకుంటున్న శూన్యత

ఆఖరికి పాపనివేదన గదిలోనూ

జీవితం దాని కథల స్క్రీన్ ప్లే అది రాసుకుంటుందికదా

.

వాసుదేవ్

One Midnight in San Francisco… Afsar, Indian Poet

.

 “I left my heart in San Francisco…”

 Tony Bennett was walking away singing crazily…

 

Still…

This dead of night

Over the blue firmament of San Francisco

And over the whiff of hazy black mist of cold winds.

 

2

 

Forgive me, Tony!

Madly believing your song to be true

I ‘flotsam’med into this bay.

 

I am not able to hide under my eyelids

The cable cars you tied to stars

And your blue seas

 

I know you suspect my vision if I say

Your home looks to me

A walking skeleton donning lights.

 

3

For that matter, can any city be a home to anyone?

 

 

Who knows!  As I was walking

down the heart of downtown

It looks the drizzle of cold and fog

Has enveloped both the skin and the soul.

 

 Of what hue and savor is indigence, you can see

Come here once Tony!

And play your song in that hue and savor.

You said you floated lonely somewhere, but

 

4

Hiding the dark truth of homelessness 

Your song glitters like a funereal wreath

In the hunger’s forest-fire of mortal frames.

 

That amber-colored sun

is an untouchable … even here.

 

Forever!

.

Afsar

.

AfsarImage Courtesy: Kavisangamam
Afsar
Image Courtesy: Kavisangamam

.

 శాన్ ఫ్రాన్సిస్కోలో వో అర్ధ రాత్రి  

 .

1

 “I left my heart in San Francisco…”

 టోనీ బెన్నేట్ అలా పిచ్చిగా పాడుకుంటూ వెళ్లిపోతున్నాడు

 

ఇప్పటికీ ఈ రాత్రి కూడా

ఈ శాన్ ఫ్రాన్సిస్కో నీలి ఆకాశంలోంచి,

ఈ చలిగాలుల లేత చీకటి పొగమంచు మీదుగా.

 2

 

క్షమించెయ్ నన్ను, టోనీ!

నీ పాటని పిచ్చిగా నమ్మి ఈ ఆఖాతానికి కొట్టుకొచ్చా,

 

నువ్వు నక్షత్రాలకి కట్టిన కేబుల్ కార్లూ,

నీ నీలి సముద్రమూ

నా రెప్పల కింద దాచుకోలేకపోతున్నా.

 

నీ ఇల్లు నాకు దీపాల్ని తోడుక్కొని

తిరుగుతున్న అస్థిపంజరంలా అనిపిస్తోందని నేనంటే

నా కన్నునే నువ్వు శంకిస్తావనీ తెలుసులే!

 3

అస లే నగరమయినా ఎవరికయినా ఇల్లవుతుందా?

 

ఏమో, ఈ డౌన్ టౌన్ గుండెల్లోంచి నడుస్తున్నప్పుడు

 శరీరాన్నీ, గుండెని కూడా

పొగ మంచు, చలి చినుకులు ముసురుకున్నట్టే వుంది.

 

గరీబీకి ఏ రంగూ ఏ వాసనా వుంటాయో చూసిపోదువు కానీ,

వొక సారి ఇటు వచ్చి నీ పాటని

ఆ రంగులోంచి ఆ వాసనలోంచి వినిపించు టోనీ!

ఎక్కడో అతి ఏకాకినై ఇక్కడ తేలానని నువ్వు అన్నావే కానీ,

 4

 

ఈ ఆకలి తగలబెడ్తున్న శరీరారణ్యంలో

 నీ పాట చమ్కీ దండలా మిలమిలా మెరుస్తోంది,

నీడలేని తనపు చీకటి నిజాన్ని దాచేసి!

 

నీ / నా బంగారు వన్నె సూరీడు

ఇక్కడా అంటరాని వాడే,

 

ఎప్పటికీ.

.

అఫ్సర్

The Ultimate Survivor … Vinnakota Ravi Sankar, Indian Poet

.

Gradually
Life becomes
a reconciliation to death.
Instead of pigeons, now
Lapwings carry messages.

The smiling faces
of the childhood group-photo
leave one by one
searching for their own.

Not only the actors,
even the audience recede
one after another.
There will be nobody left
on either side,
to share tears
for the tragedy on the stage.

Besides shedding its leaves,
The deciduous Family Tree
sheds its roots as well
intermittently.

After all tangles are disentangled
and all strings are snapped,
a wizened spiritless frame remains
like the sole thread
connecting it to the Nature.
.

Photo Courtesy: Vinnakota Ravi Sankar

Vinnakota Ravi Sankar

Mr. Vinnakota Ravi Sankar is living in Columbia, South Carolina, USA for the last 14 years. He has to his credit three collections of poetry in Telugu published so far — kuMDeelO marri ceTTu (The Bunyan in a Flowerpot) (1993), vEsavi vaana(Summer Rain) (2002) & remDO paatra (The Second Role)(2010).

.

తెలుగు మూలం:

ఆఖరి మనిషి
.

క్రమక్రమంగా
మరణానికి అలవాటుపడటమే
జీవితంగా మారిపోతుంది.
పావురాలకి బదులు తీతువు పిట్టలు
ఉత్తరాలు మోసుకువస్తాయి.

చిన్నప్పటి గ్రూప్ఫోటోలో
చిరునవ్వులు చిందించినవారంతా
ఎవరి ఫొటో వారు వెతుక్కుని
వెళ్ళిపోతారు

నటులేకాదు, ప్రేక్షకులు కూడా
ఒకరొకరుగా నిష్క్రమిస్తారు.
రంగస్థలం మీది విషాదానికి
కలిసి కన్నీరు పెట్టటానికి
ఇరువైపులా ఎవరూ కనబడరు

ఆకులతోబాటు
ఈ “సంసారవృక్షం”
వేళ్ళు కూడా ఒకటొకటిగా
పోగొట్టుకుంటుంది

అన్ని ముడులూ విడిపోయాక
అన్ని తీగలూ తెగిపోయాక
ప్రపంచంతో కలిపే ఏకైక సూత్రంలా
శుష్కించిన ఒక శరీరం
మిగిలిపోతుంది.

.

విన్నకోట రవిశంకర్

%d bloggers like this: