Tag: HW Longfellow
-
ఈ రోజు గడిచింది… లాంగ్ ఫెలో, అమెరికను కవి
మొత్తానికి రోజు గడిచింది, రేయి రెక్కలనుండి చీకటి జాలువారుతోంది, ఎగురుతున్న గ్రద్ద ఈక ఒకటి ఊడి క్రిందకి తేలియాడుతూ రాలుతున్నట్టు. ఈ పొగమంచులోంచీ, రాలుతున్న తుంపరలోంచీ ఆ పల్లెలోని దీపాలు మిలమిలా మెరుస్తున్నాయి; నన్ను ముసురుకుంటున్న దుఃఖాన్ని నా మనసు నిగ్రహించలేకపొతోంది ఒక ఆవేదన, ఒక విషాద భావన అది పొగమంచుకీ తుంపరకి ఉన్న సామ్యంలా అది బాధ అని అనలేను గాని ఒక విషాదకరమైన మానసిక స్థితి. రండి, ఎవరైనా ఒక పద్యాన్ని […]
-
ప్రకృతి… HW లాంగ్ ఫెలో, అమెరికను కవి
నిద్రపుచ్చడానికి … సగం ఇష్టంగా, సగం అయిష్టంగా నేలమీద తను ఆడుకుంటూన్న వస్తువులనన్నీ నేలమీదే వదిలేసి, అయినా తెరిచిఉన్న తలుపులోంచి వాటిని చూస్తూ, పూర్తిగా ఊరడింపూలేక, వాటికి బదులు ఇస్తానన్నవి అంతకంటే మంచివైనా సంతోషం కలిగిస్తాయన్న హామీ లేక, బాధపడే చిన్న పిల్లాడిని ఆ రోజుకి ఆటముగిసేక ప్రేమగా లాలిస్తూ చెయ్యిపట్టుకుని లాక్కువెళ్ళే పిచ్చితల్లిలా ప్రకృతికూడా మనతో సంచరిస్తుంది, మన ఆటవస్తువుల్ని ఒక్కటొక్కటిగా లాక్కుంటూ, మనల్ని చెయ్యిపట్టుకుని మన విశ్రాంతి స్థలానికి నెమ్మదిగా నడిపించి తీసుకుపోతుంది కళ్ళమొయ్యా […]
-
అసుర సంధ్యవేళ… HW లాంగ్ ఫెలో, అమెరికను కవి
Hear this lovely poem here పగటికీ రాత్రికీ మధ్య మునిమాపులో చీకటి నలుదిక్కులా ముసురుకునే వేళ పగలుచేసే పనులకు విశ్రాంతి సమయం వస్తుంది దాన్నే (బాల)”అసుర సంధ్యవేళ” అంటారు. సరిగా నా నెత్తిమీది గదిలో పిల్లల పాదాల చప్పుడు వినిపిస్తోంది, తలుపు అప్పుడే తెరుచుకున్న ధ్వని చిన్నారుల తియ్యని మెత్తని గుసగుసలు. నే చదువుకునే గది దీపం వెలుగులో పెద్ద హాలులోని మెట్లు దిగుతూ గంభీరంగా ఏలిస్, నవ్వుతూ ఏలెగ్రా, బంగారు జుత్తులో ఈడిత్ […]
-
కవీ – అతని కవితలూ… లాంగ్ ఫెలో, అమెరికను కవి
వసంతం వచ్చేసరికల్లా పక్షులు ఎక్కడనుండి వస్తాయో తెలియనట్లు; సాయంత్రం అవడం తడవు రోదసికుహరాల్లోంచి చుక్కలు పొడిచినట్లు మేఘాల్లోంచి చినుకులు రాలినట్లు, భూమిలోంచి బుగ్గలు వాగులై ప్రవహించినట్లు అంత అకస్మాత్తుగానూ, నిశ్శబ్దంలోంచి చిన్నదో పెద్దదో చప్పుడు ఉత్పన్నమైనట్టు; ద్రాక్షతీగకి ద్రాక్షగుత్తులు వేలాడినట్లు; చెట్లకి పళ్ళు కాసినట్లు; దేవదారుకొమ్మల్లో గాలి చొరబడినట్లు; సముద్రం మీద అల్లలు ఉప్పొంగినట్లు; క్షితిజరేఖ మీద ఓడల తెల్లని తెరచాపలు లేచినట్లు; పెదాలమీద చిరునవ్వు మొలిచినట్లు, నురగలు ముందుకు తోసుకువచ్చినట్లు; అనంతాగోచర లోకాలకుచెంది స్పష్టాస్పష్ట ఆకృతులనుండి […]
-
బేయార్డ్ టేలర్ … హెన్రీ వాడ్స్ వర్త్ లాంగ్ ఫెలో, అమెరికను కవి
పుస్తకాలలో జీవన్మృతుడతడు అతని చూపుల్లో ప్రభువు వీక్షణాల ప్రశాంతత. 1మేక్జిమిలియన్ సమాధిస్థలాన్ని విగ్రహాలు విచారవదనాలతో తిలకిస్తుంటే… ఈ పుస్తకాలదొంతరలు కూడా బీరువా అరల్లోంచి తమలాగే మౌనంగా ఉన్న అతన్ని పరికిస్తున్నాయి అయ్యో! అతని చేతులు ఇక ఎన్నడూ భద్రపరచిన తమ పుటల్ని తిరగెయ్యవు కదా! తమ పాటలు ఎంత మధురంగా ఉన్నా, ఆ పెదవులు ఇకెన్నడూ పలుకబోవు కదా! జీవం లేని ఆ శరీరాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి! దాని అతిథి, […]
-
మనసులో శిశిరం… HW లాంగ్ ఫెలో, అమెరికను
ఇది శిశిరం; బయట ప్రకృతిలో కాదు, నా మనసులోనే ఉన్నది…ఈ అచేతన. యవ్వనం, వసంతమూ నన్నుఆవరించి ఉన్నా ఇక్కడ వయసు మీరినది కేవలం నేనొక్కడినే. . పక్షులు గాలిలో రివ్వునదూసుకుపోతున్నాయి, పాడుకుంటూ, విరామంలేక గూడుకట్టుకుంటూ; నలుదిక్కులా జీవం సందడిస్తోంది ఒక్క నా మనసులో తప్ప. . అంతా నిశ్శబ్దం; ముదురాకులు గలగలా రాలి కదలకుండా పడున్నై; ధాన్యం నూరుస్తున్న చప్పుళ్ళు వినరావు మిల్లు కూడా మూగపోయింది. . HW లాంగ్ ఫెలో (February 27, […]
-
పిల్లలు…. HW లాంగ్ ఫెలో, అమెరికను కవి
ఇదిగో పిల్లలూ! నా దగ్గరకి ఇలా రండి, మీరు ఆడుకుంటున్నారని నాకు తెలుస్తోంది, నన్నెప్పటినుండో వేధిస్తున్న సమస్యలు అన్నీ వాటంతట అవే మాయమయిపోయాయి. మీరు సూర్యుడి దిక్కు చూస్తున్న తూరుపు కిటికీలు తెరిచేరు ఆలోచనలు పిచ్చుకలై కిచకిచమంటున్నై వెలుగు వాగులై ప్రవహిస్తోంది. మీ మనసులే పిట్టలూ, వెలుతురూ మీ ఆలోచనలలో పిల్లవాగులు పరుగిడతై; నా మనసులో మాత్రం ఆకులురాల్చే వడిగాలి తొలి హిమపాతం చూసిన హేమంతం. అమ్మో! అసలు ఈ పిల్లలే గనకలేకుంటే […]
-
ఒక బానిస కల … H W లాంగ్ ఫెలో, అమెరికను కవి
ఇంకా కోతకొయ్యని వరిచేను గట్టున చేతిలో కొడవలితో అతను మోకరిల్లి ఉన్నాడు; అతని ఒంటిమీద బట్టలేదు, అట్టగట్టిన తల ఇసుకలో కూరుకుని ఉంది. పదే పది సార్లు కలత నిదుర మగతలో అతను తన మాతృభూమిని చూశాడు. . అతని విశాలమైన కలలప్రపంచంలో నైగర్ నది విలాసంగా ప్రవహిస్తోంది. దాని ఒడ్దున మైదానాలలోని తాటిచెట్లక్రింద మరొకసారి అతను మహరాజులా నడుస్తున్నాడు; కొండమీదనుండి దిగుతున్న సార్థవాహుల బండ్ల ఎద్దులమెడగంటలు వినిపిస్తున్నాయి. . మరొకసారి తన నీలికన్నుల రాణిని తన పిల్లలమధ్యలో […]
-
పాటా – బాణమూ … HW లాంగ్ ఫెలో. అమెరికను కవి
. నేను గాలిలోకి ఒక బాణం విసిరా అదెక్కడో పడిపోయుంటుంది; తెలీదు ఎందుకంటే, అదెంత జోరుగా దూసుకెళ్ళిందంటే దాని వేగాన్ని నా కళ్ళు అనుసరించలేక పోయాయి నేను గాలిలోకి ఒక పాట ఆలపించేను. అదికూడా ఎక్కడో పడిపోయింది; తెలీదు. అంత చురుకైన కళ్ళెవడికున్నాయి గనక పాట వేగంతో దృష్టి మరలించడానికి? చాలా చాలా కాలం తర్వాత, విరిగిపోకుండా సింధూరవృక్షానికి గుచ్చుకుని ఆ బాణం దొరికింది. మొదటినుండి చివరిదాకా పొల్లుపోకుండా ఆ పాట నా మిత్రుడి గళంలో మారుమ్రోగడం విన్నాను. . […]
-
వెఱపు ఛాయలు … HW లాంగ్ ఫెలో
. నాలో నే ననుకున్నా, “రేపు నాకేదైనా జరిగితే నా పిల్లల గతి ఏమిటి? సాయం, ప్రోత్సాహం కోసం ఇపుడు నా దిక్కు చూస్తున్న వీళ్ళ భవిష్యత్తు ఏం గాను? ఒక మహాగ్రంథం లాంటి వీళ్ల జీవితాలలో కేవలం తొలి అధ్యాయాలు మాత్రమే చదివేను, ఇంకెంత సౌందర్యమూ, విషాదమూ భవిష్యత్తులో మిగిలిఉన్నాయో చూడలేను కద!” మళ్ళీ నన్ను నేనే సముదాయించుకున్నా: “ఈ ప్రపంచము ఈనాటిదా! ఎన్ని తరాలు గతించేయి; సూర్యుణ్ణనుగమించే నీడల్లా ఇంకెన్ని తరాలు గతించనున్నాయి; బహుశా ఈ […]