అనువాదలహరి

నీవు లేక… హెర్మన్ హెస్, జర్మను కవి

సమాధి ఫలకంలా శూన్యంగా చూస్తుంటుంది

తలగడ రాత్రివేళ నా వైపు

నీ కురులలో తలవాల్చి నిద్రించకుండా

ఇలా ఒంటరిగా పడుకోవడం

ఇంత కఠినంగా ఉంటుందని ఊహించలేదు.

ఏ చప్పుడూ లేని ఇంటిలో నేను ఒంటరిని

వేలాడుతున్న లాంతరు మసిబారిపోయింది.

నీ చేతులు నా చేతిలొకి తీసుకుందికి

మెల్లగా చెయిజాచుతాను ,

కాంక్షాభరితమైన నా పెదవిని నీవైపు జాచి

నన్ను నేనే ముద్దుపెట్టుకుంటాను, నిరాశతో, నిస్సత్తువతో

చటుక్కున మేలుకుంటాను

నా చుట్టూ చలికప్పినచీకటి నిలకడగా ఆవహించి ఉంటుంది.

కిటికీలోంచి ఒక తారక స్పష్టంగా మెరుస్తుంటుంది…

సొగసైన నీ కురులేవీ?

మధురమైన నీ పెదవులెక్కడ?

ఇప్పుడు ప్రతి వేడుకలోనూ విషాదాన్నీ

ప్రతి మధువులోనూ విషాన్నీ దిగమింగుతున్నాను

నీవులేక ఇలా…

ఒంటరిగా, ఒక్కడినీ ఉండటం

ఇంతకష్టంగా ఉంటుందని ఎన్నడూ ఊహించలేదు.

.

హెర్మన్ హెస్

2 July 1877 – 9 August 1962

జర్మను కవి, నవలాకారుడు.

Hermann Hesse

Without You

.

My Pillow gazes upon me at night

Empty as a gravestone;

I never thought it would be so bitter

To be alone,

Not to lie down asleep in your hair.

I lie alone in a silent house,

The hanging lamp darkened,

And gently stretch out my hands

To gather in yours,

And softly press my warm mouth

Toward you, and kiss myself, exhausted and weak-

Then suddenly I’m awake

And all around me the cold night grows still.

The star in the window shines clearly-

Where is your blond hair,

Where your sweet mouth?

Now I drink pain in every delight

And poison in every wine;

I never knew it would be so bitter

To be alone,

Alone, without you.

.

Hermann Hesse

2 July 1877 – 9 August 1962

German Poet

Poem Courtesy:

http://famouspoetsandpoems.com/poets/hermann_hesse/poems/13707

నడిసముద్రంలో ఒక రాత్రి … హెర్మన్ హెస్

Image Courtesy: http://www.virtualcrate.com

.

రాత్రి, కడలి అలలఊయల ఊపుతున్నప్పుడు,

మిణుకుమిణుకుమనే ఓ చుక్క మసకవెలుతురు

దాని విశాలకెరటాలపై పరుచుకున్నప్పుడు,

నా పనులన్నీ చక్కబెట్టుకుని

బంధాలు విదుల్చుకుని ఒక్కడినీ, సడిచేయకుండా

గుండెనిండాస్వచ్ఛమైన గాలిపీలుస్తూ

వేలదీపాలప్రతిబింబాలతో, చల్లగా మౌనంగా

సముద్రపుటుయ్యాలకి నన్నునేనప్పగించుకుని నిలుచుంటాను.

అపుడు నా స్నేహితులు తలపులోకొస్తారు

నా చూపులు వాళ్ళ చూపులలతో కలుసుకుంటాయి

ఒకరివెంట ఒకరిని అడుగుతాను, ఏకాంతంగా, నెమ్మదిగా:

“నీకు నేనంటే ఇంకా ఇష్టమేనా?

నా కష్టం నీకు కష్టంగానూ,

నా మృతి నీకు శోకించదగినదిగానూ కనిపిస్తాయా?

నా ప్రేమలో నీకు ఉపశమనము లభించి,

నా దుఃఖములో నీ దుఃఖపు ప్రతిధ్వని వినిపిస్తుందా?” అని.

.

అపుడు సాగరము ప్రశాంతంగా, నా కళ్ళలోకి చూస్తూ,

చప్పుడుచేయని మొలకనవ్వునవ్వి అంది: “లేదు”అని.

మరెకెక్కడనుండీ కాదని గాని ఔననిగాని,

సమాధానాలు వినిపించలేదు.

.

Image Courtesy: http://en.wikipedia.org

హెర్మన్ హెస్

(2 జులై 1877 – 9 ఆగష్టు 1962)

1946 సంవత్సరానికి హెర్మన్ హెస్ కి సాహిత్యంలో నోబెల్ బహుమతి లభించింది. అతని నవల లన్నిటిలో ఆత్మకథ ఛాయలతోపాటు, మనిషి తన ఉనికి గురించీ, వాస్తవికత గురించీ, ఆత్మస్వరూపం గురించీ తెలుసుకుందికి చేసే ప్రయత్నం ఉంటుంది. అతనికి భాషపైన మక్కువ తండ్రినుండి సంక్రమిస్తే, సంగీతం, కవిత్వంమీద అభిమానం తల్లినుండి సంక్రమించింది. అతనికి చిన్నప్పుడే అనుప్రాసలపై వయసుకిమించిన సాధికారత పట్టుబడింది. అయితే మహామొండి మనిషని తల్లి వాపోయింది. మతసంబంధమైన పాఠశాలనుండి పారిపోయిన తను, తల్లిదండ్రులతో విభేదాలు, ఆత్మహత్యా ప్రయత్నం, మానసిక వైద్యశాలలో ఉండవలసిరావడం వంటి సమస్యలను అధిగమించి, చివరకు ఒక పుస్తకాల షాపులో Packer గ ఉద్యోగం ఇష్టపడి సంపాదించి, తన తీరిక సమయాలలో గేథే, షిల్లర్, లెస్సింగ్ వంటి కవులూ,కళాకారులగురించీ, వాళ్ళరచనలనీ చదవడంతోపాటు, జర్మను రొమాంటిసిజం తో మొదటిసారి పరిచయం ఏర్పరచుకున్నాడు. ఇక అతని సాహిత్యపిపాస,నిజజీవితంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా వెనుదిరిగిచూడలేదు. ఈ రోజు హెర్మన్ హెస్ అనగానే గుర్తొచ్చేవి సిధ్ధార్థ నవలతోబాటు, కార్ల్ యూంగ్ (Carl Jung) తో పరిచయం పురస్కరించుకుని వ్రాసిన మనోవైజ్ఞానిక నవల”Demian”, ఆత్మకథ ఛాయలున్న ” Steppenwolf”, అతని నోబెలు పురస్కార పత్రంలో పేర్కొన్న “The Glass Bead Game (also known as Magister Ludi) “.

.

At Night On The High Seas

.

At night, when the sea cradles me

And the pale star gleam

Lies down on its broad waves,

Then I free myself wholly

From all activity and all the love

And stand silent and breathe purely,

Alone, alone cradled by the sea

That lies there, cold and silent, with a thousand lights.

Then I have to think of my friends

And my gaze sinks into their gazes

And I ask each one, silent, alone:

“Are you still mine”

Is my sorrow a sorrow to you, my death a death?

Do you feel from my love, my grief,

Just a breath, just an echo?”

And the sea peacefully gazes back, silent,

And smiles: no.

And no greeting and no answer comes from anywhere.

.

Hermann Hesse

(July 2, 1877 – August 9, 1962)

German-Swiss Poet, Novelist, and Painter.

Hesse received Nobel Prize in Literature for the year 1946. All his novels, including Siddhartha (1922) his most famous, focus on the individual’s search for authenticity, self-knowledge and spirituality with a touch of autobiographical element. Hesse inherited taste for language from his father, and for poetry and music from his mother. He had a precocious ability to rhyme. As a rebel who ran away from a theological seminary and went through various ordeals including  intense conflicts with his parents, an attempted suicide, a stay in mental asylum, several misadventures with sundry jobs, till finally settling into a new apprenticeship with a book store with will, which changed the course of his life. He read Goethe, Lessing, Schiller and great German romantics there and his literary interests and career never looked back spite of some tragedies, problems and conflicts in the home front. Today Hesse is remembered for his novels Demian, one of the first few novels based on psychoanalysis, Steppenwolf with autobiographical under currents, and The Glass Bead Game (or, Magister Ludi) which was mentioned in the Nobel Prize citation.

%d bloggers like this: