అనువాదలహరి

బ్రాడ్వే… హెర్మన్ హేగ్డార్న్, అమెరికను కవి

(Note: బ్రాడ్వే న్యూయార్క్ లో ప్రసిద్ధిపొందిన సినిమాహాళ్ళకీ, నాటకశాలలకీ, రెస్టారెంట్లకీ నెలవైన ఒక వీధి.)

.

ఈ పేరులేని ముఖాలు చుక్కల్లా ఎలా ఉన్నాయో…

లెక్కనేనన్ని మడుతున్న నిప్పుకణికలివి!

విహాయస వీధిలో పేలవంగా నడిచే నక్షత్రాల ఊరేగింపు

ఈ ఆత్మల పాలపుంత!

ఒక్కొక్కటీ స్వయంప్రకాశమైన ఒక నీహారిక

ఓహ్, ప్రభూ! ప్రతి వదనమూ ఒక ప్రపంచం!

ఆరుబయట సడిలేని చీకటిలోకి నా చూపు సారిస్తాను:

ఆ దూర తారలలో, ఏ ఉద్యానాలు, ఏ భవంతులున్నాయో,

ఏ మానవ జిగీష తన ఆనందానికి వాటిని నిర్మించిందో,

ఏ అఖాతాలు, ఏ అడ్డుగోడలున్నాయో!

ఆత్మలు తిరిగే ఏ విశాల ప్రాసాదాలున్నాయో!

అది ఏ స్వర్గమో! లేక ఏ నరకమో!

.

హెర్మన్ హేగ్డార్న్

18 July 1882 – 27 July 1964

అమెరికను కవి

.

Broadway

.

How like the stars are these white, nameless faces—

  These far innumerable burning coals!

This pale procession out of stellar spaces,

  This Milky Way of souls!

Each in its own bright nebulæ enfurled,

Each face, dear God, a world!

I fling my gaze out through the silent night:

  In those far stars, what gardens, what high halls,

Has mortal yearning built for its delight,

  What chasms and what walls?

What quiet mansions where a soul may dwell?

What heaven and what hell?

.

Hermann Hagedorn

18 July 1882 – 27 July 1964

American Poet

Poem Courtesy:

The New Poetry: An Anthology.  1917.

Harriet Monroe, ed. (1860–1936).

http://www.bartleby.com/265/149.html

బార్జిస్ లో ఉషోదయం… హెర్మన్ హేగ్ డోర్న్, అమెరికను కవి

స్వచ్ఛమైన గాలి, పచ్చని మైదానం,
సెలయేటి పాట, గంగడోలుగంటల గణగణ…
ఓ మనిషీ! మనం ఎంత మూర్ఖులమి
జైలు గదుల్లో జీవితం గడపుతున్నాము!

పచ్చని దృశ్యాలూ, విశాలమైన
ఆకాశాలూ మనజీవితంలో భాగం కాకుండా
ఉరకలేసే హృదయాన్ని
అబద్ధాలతో కోసి చంపుతూ…

మెరిసే శిఖరాలు, ఒక్కసారిగా
ప్రశాంతమైన లోయలోకి వెలుగు వరద,
పచ్చని చేలు నా మోకాళ్ళు తడుముతున్నాయి:
మంచి దిగుబడి వస్తుంది
అంతా బాగానే ఉంది!
ఓ మనిషీ! మనం ఎంత మూర్ఖులమి
జైలు గదుల్లో జీవితం గడపుతున్నాము!

.

(* బార్జిస్ పర్వతాలు స్విట్జర్లాండులో ఉన్నాయి)

హెర్మన్ హేగ్ డోర్న్

1882 – 1964 

అమెరికను కవి

.

Early Morning at Bargis*

.

Clear air and grassy lea,  

  Stream-song and cattle-bell— 

Dear man, what fools are we    

  In prison-walls to dwell!         

To live our days apart     

  From green things and wide skies,    

And let the wistful heart  

  Be cut and crushed with lies!  

Bright peaks!—And suddenly  

  Light floods the placid dell,    

The grass-tops brush my knee: 

A good crop it will be,    

  So all is well!      

O man, what fools are we         

  In prison-walls to dwell!

.

 

(Note: The Bargis Mountain Valley is located in Switzerland)

Hermann Hagedorn

The New Poetry: An Anthology.  1917.

Harriet Monroe, ed. (1860–1936). 

http://www.bartleby.com/265/146.html

%d bloggers like this: