అనువాదలహరి

మంచు పలకలు … H W లాంగ్ ఫెలో, అమెరికను

మోడువారి, నగ్నంగా ఉన్న అటవీ సీమల మీంచి
కోతల తర్వాత ఉపేక్షించబడిన పంటభూములమీంచి
గాలి గుండె లోతుల్లోంచి,
దాని మొయిలు ఉడుపుల కదలికలలలోంచి,
నిశ్శబ్దంగా, నెమ్మదిగా, మెత్తగా
మంచు జాలువారుతోంది.

చిత్రమైన ఆకారాలు ధరించే ఈ మేఘాలు
అకస్మాత్తుగా దివ్యాకృతుల్లో కనిపించినా,
పాలిపోయిన వదనంతో కలతచెందిన మనసు
తన తప్పిదాలను ఒప్పుకుని మన్నించమని వేడుకుంటుంటే
ఉద్విగ్నమైన ఆకాశ శకలం
తన మనసులోని బాధను వ్యక్తం చేస్తుంది.

ఈ కవిత గాలి అంతరంగ వ్యధ
మౌనంగా సడిలేని శబ్దవర్ణాలతో లిఖించబడింది;
మేఘాలగుండె లోతుల్లో చిరకాలంనుండీ
పదిలంగా దాచుకున్న నిరాశా రహస్యం;
ఇన్నాళ్లకి అది వనభూములకీ, మైదానాలకీ
గుసగుసలువోతూ చెప్పుకొస్తోంది.
.
H W లాంగ్ ఫెలో
(February 27, 1807 – March 24, 1882)
అమెరికను.

.

Snow-flakes

.

Out of the bosom of the air,

Out of the cloud-folds of her garments shaken,

Over the woodlands brown and bare,

Over the harvest-fields forsaken,

Silent, and soft, and slow

Descends the snow.

Even as our cloudy fancies take

Suddenly shape in some divine expression,

Even as the troubled heart doth make

In the white countenance confession,

The troubled sky reveals

The grief it feels.

This is the poem of the air,

Slowly in silent syllables recorded;

This is the secret of despair,

Long in its cloudy bosom hoarded,

Now whispered and revealed

To wood and field.

.

Henry Wadsworth Longfellow

(February 27, 1807 – March 24, 1882)

American Poet

Poem Courtesy:

http://www.poemtree.com/poems/Snow-flakes.htm

ఇంటి మారాజు… హెన్రీ వాడ్స్ వర్త్ లాంగ్ ఫెలో, అమెరికను కవి

కూచుని ఆ ఇద్దర్నీ చూస్తుంటాను
కానీ ఒంటరిగా కాదు, వాళ్ళో దేవదూతని కూడా
అలరిస్తుంటారు తెలియకుండానే.
ముఖం అచ్చం చంద్ర బింబంలా
ఒక రాజ అతిథి వేంచేసేరు ఎగురుతున్న జుత్తుతో
తన సింహాసనం మీద ఆసీనుడై
చెంచాతో టేబిలుమీద వాయిద్యం వాయిస్తూ
నిర్లక్ష్యంగా దాన్ని క్రిందకు విసిరేసేడు,
మునుపెన్నడూ చూడనిదాన్ని అందుకునే ప్రయత్నంలో.
ఇవి స్వర్లోకపు మర్యాదలా? మనసు హరించే
మార్గాలూ, కళాకలాపాలా?
అహా! సందేహం లేదు. అతిథి ఏంచేసినా
ఆలోచించే చేస్తాడు, ఏం చేసినా బాగుంటుంది;
తను భగవద్దత్తమైన అశక్తత అనే
అధికారంతో ఏలుతుంటాడు; కొత్తగా ఈ మధ్యనే
ప్రభాతవేళలో పుట్టిన ఈ బాలుడు,
నీ మీదా నా మీదా ఆధిపత్యం చెలాయిస్తాడు;
అతను మాటాడడు; కానీ అతని కనులవెంట
సంభాషణ జరుగుతూనే ఉంటుంది;
నోరు మెదపని గ్రీకుల మౌనమూ
మహా మేధావుల లోతైన ఆలోచనా
అచ్చుపుస్తకాల్లో ఉన్న దానికంటే స్పష్టంగా
మాటల్లో లేకపోయినా చూపుల్లో తెలుస్తుంది,
ఏదో మాటాడగలిగినా మాటాడడం ఇష్టం లేనట్టు.
ఓ మహప్రభూ! తమ సర్వంసహాధికార శక్తి
ఇప్పుడు ఋజువు చెయ్యబడింది. అదిగో చూడండి!
దేన్నీ లక్ష్యం చెయ్యకుండా గంభీరంగా,
నెమ్మదిగా అడుగులేసుకుంటూ సముద్రంలా దాది వస్తోంది.
తమ కుర్చీనీ, తమనీ కొద్దిగా వెనక్కి తోస్తోంది.
మహా ప్రభూ! ఇక శలవా మరి. శుభరాత్రి.
.
హెన్రీ వాడ్స్ వర్త్ లాంగ్ ఫెలో
February 27, 1807 – mArci 24, 1882)
అమెరికను కవి

 

.

The Household Sovereign

.

Seated I see the two again,

But not alone; they entertain

A little angel unaware,

With face as round as is the moon;

A royal guest with flaxen hair,

Who, throned upon his lofty chair,

Drums on the table with his spoon,

Then drops it careless on the floor,

To grasp at things unseen before.

Are these celestial manners? these

The ways that win, the arts that please?

Ah, yes; consider well the guest,

And whatsoe’er he does seems best;

He ruleth by the right divine

Of helplessness, so lately born

In purple chambers of the morn,

As sovereign over thee and thine.

He speaketh not, and yet there lies

A conversation in his eyes;

The golden silence of the Greek,

The gravest wisdom of the wise,

Not spoken in language, but in looks

More legible than printed books,

As if he could but would not speak.

And now, O monarch absolute,

Thy power is put to proof; for lo!

Resistless, fathomless, and slow,

The nurse comes rustling like the sea,

And pushes back thy chair and thee,

And so good night to King Canute.

.

From “The Hanging of the Crane”

.

 

Henry Wadsworth Longfellow

(February 27, 1807 – March 24, 1882)

American

 

Poem Courtesy:

The World’s Best Poetry.

Eds. Bliss Carman, et al.

Volume I. Of Home: of Friendship.  1904.

Poems of Home: I. About Children

http://www.bartleby.com/360/1/19.html

అసుర సంధ్యవేళ … హెచ్. డబ్ల్యూ. లాంగ్ ఫెలో, అమెరికను

రోజు ముగిసి వెలుతురు పలచబడుతూ,

మెల్లగా చీకటి నలుచెరగులా కమ్ముతున్నప్పుడు

దైనందిన కార్యకలాపాలకి ఒకింత విశ్రాంతి

దొరికే ఘడియ వస్తుంది; అదే అసురసంధ్యవేళ. 

 

నా నెత్తిమీదనున్న గదిలో

చిన్ని పాదాల అడుగులు నాకు వినవస్తాయి

ఒక తలుపు తెరుచుకున్న చప్పుడుతో పాటు

గలగలమనే మెత్తని తియ్యని మాటలుకూడా

 

నా చదువుకునే గదిలోంచి దీపపు వెలుగులో

విశాలమైన హాలు లోని మెట్లమీదనుండి

గంభీరంగా ఏలిస్, నవ్వుతూ ఏలెగ్రా

పసిడితీవెలజుత్తుతో ఎడిత్ దిగడం కనిపిస్తుంది.

 

ఒక గుసగుస, వెంటనే కమ్ముకున్న నిశ్శబ్దం:

అయినా ఆనందంతో మెరిసే వాళ్ల కళ్ళలో

వాళ్లు జట్టుగా ఏదో కలాపన రచిస్తూ నన్ను

ఆశ్చర్యపరచాలనుకుంటున్నారని తెలిసిపోతుంది 

 

మెట్లమీదనుండి ఒక్కపరుగుతో

హాలులోంచి ఒక్క ఉదుకున దండెత్తుతూ

తెరిచిఉన్న నా గది మూడు తలుపులనుండి

నా కోటలోకి ప్రవేశిస్తారు వాళ్ళు.

 

నా కోట బురుజు మీదకి ఎగబ్రాకుతారు

నా చేతులమీంచీ, కుర్చీ వెనకనుంచీ,

నేను పారిపోడానికి ప్రయత్నించానా

అన్నిచోట్లా వాళ్ళే అయి నన్ను చుట్టుముడతారు.

 

నన్ను ముద్దులతో ముంచెత్తుతారు

వాళ్ళచేతుల్ని తీగల్లా పెనవేస్తారు

జర్మనీలోని రైన్ నదిలో “ఎలుకల-మేడ”

జానపద కథలో బిషప్ నాకు గుర్తొచ్చేలా.

 

ఓ నీలికళ్ల బందిపోటు పిల్లదానా!

నువ్వు గోడ ఎక్కివచ్చినంత మాత్రాన్న

నా లాంటి ముదిమి మీసాల మొనగాడు

మీ అందరితో సరితూగలేడనుకున్నావా?

 

క్షణంలో మిమ్మల్ని బందీలుగా చేస్తాను

బయటకి ఒక్క అడుగుకూడా వెయ్యనియ్యను

గుండ్రంగా నిటారుగా ఉండే నా గుండె గది…

చీకటి గూభ్యంలో … మిమ్మల్ని బంధిస్తాను.

 

మిమ్మల్ని అక్కడే శాశ్వతంగా బందీలు చేస్తాను

నిజంగానే.  పగలూ, రాత్రీ అన్న తేడా లేకుండా,

చివరికి ఈ గోడలు మెల్లగా శిధిలమై

చివికి చివికి మట్టిలో కలిసిపోయేదాకా!

.

హెచ్. డబ్ల్యూ. లాంగ్ ఫెలో

(February 27, 1807 – March 24, 1882)

అమెరికను

.

Henry Wadsworth Longfellow on the Isle of Wigh...
Henry Wadsworth Longfellow on the Isle of Wight, England in 1868 by Julia Margaret Cameron (1815 – 1879) (Photo credit: Wikipedia)

.
The Children’s Hour
.

Between the dark and the daylight,
When the night is beginning to lower,
Comes a pause in the day’s occupations,
That is known as the Children’s Hour.

I hear in the chamber above me
The patter of little feet,
The sound of a door that is opened,
And voices soft and sweet.

From my study I see in the lamplight,
Descending the broad hall stair,
Grave Alice, and laughing Allegra,
And Edith with golden hair.

A whisper, and then a silence:
Yet I know by their merry eyes
They are plotting and planning together
To take me by surprise.

A sudden rush from the stairway,
A sudden raid from the hall!
By three doors left unguarded
They enter my castle wall!

They climb up into my turret
O’er the arms and back of my chair;
If I try to escape, they surround me;
They seem to be everywhere.

They almost devour me with kisses,
Their arms about me entwine,
Till I think of the Bishop of Bingen
In his Mouse-Tower on the Rhine!

Do you think, o blue-eyed banditti,
Because you have scaled the wall,
Such an old mustache as I am
Is not a match for you all!

I have you fast in my fortress,
And will not let you depart,
But put you down into the dungeon
In the round-tower of my heart.

And there will I keep you forever,
Yes, forever and a day,
Till the walls shall crumble to ruin,
And moulder in dust away!

.

Henry Wadsworth Longfellow

(February 27, 1807 – March 24, 1882)

American Poet and Educator

%d bloggers like this: