అనువాదలహరి

అడవి పాట… హారియట్ మన్రో, అమెరికను కవయిత్రి

నా తల వాల్చడానికి చోటు లేదు
నా గుండెలమీద ఏ శిశువూ పడుక్కోదు
నా కోసం ఏ పెళ్ళి విందూ ఇవ్వబడదు
నేనీ నింగి కింద ఒంటరిగా నడవాల్సిందే.

నా అధికారం డబ్బూ త్యజించాను
కొండంత ఎత్తు బరువు దించుకుని తేలికపడ్డాను!
పగలంతా ఈ రాళ్ళగుట్టలమీద నడిచి
చీకటివేళకి పొయ్యి వెలిగించుకుంటాను.

వడగళ్ళకి కొండంతా విరగబూస్తుంది
శీతగాలి నా కన్నీరు తుడుస్తుంది
నేను బలహీనను, అయినా, మృగశిర నాభయాలు
పోగొట్టినపుడు, నేను బలం పుంజుకుంటాను.

వేకువ దుప్పటి తొలగించి
గోరుగిల్లుచంద్రుడితో నిద్రలేస్తాను.
సమవర్తి తండ్రి సమదృష్టితో చూసి
నా చెయ్యిపట్టుకుని నడిపిస్తాడు .

పడమటిదిక్కున మంటల రెక్కలు వ్యపిస్తున్నాయి.
నాకు దొరుకుతుందా? అసలు నాకు తెలుస్తుందా?
నా కాళ్ళు అన్వేషణకి కంకణం కట్టుకున్నాయి—
రెండు అనంతాలు విడదీసే దిగంతరేఖ వైపుకి
.
హారియట్ మన్రో
23 December 1860- Sept 26 1936
అమెరికను కవయిత్రి

.

.

Mountain Song

.

I have not where to lay my head:
Upon my breast no child shall lie;
For me no marriage feast is spread:
I walk alone under the sky.

My staff and scrip I cast away—
Light-burdened to the mountain height!
Climbing the rocky steep by day,
Kindling my fire against the night.

The bitter hail shall flower the peak,
The icy wind shall dry my tears.
Strong shall I be, who am but weak,
When bright Orion spears my fears.

Under the horned moon I shall rise
Up-swinging on the scarf of dawn.
The sun, searching with level eyes,
Shall take my hand and lead me on.

Wide flaming pinions veil the West—
Ah, shall I find? and shall I know?
My feet are bound upon the Quest—
Over the Great Divide I go.
.
Harriet Monroe
December 23, 1860 – September 26, 1936
American poet and Editor 

http://www.bartleby.com/265/260.html

జీవితంలో వింత… హేరియట్ మన్రో, అమెరికను కవయిత్రి

ఎంత విశృంఖలంగా, మాంత్రికురాల్లా ఎంత వింతగా ఉంటుందీ జీవితం!

చివరకి ఏ స్పందనలూ ఎరుగని రాయి కూడా కలగంటుంది,

ఎప్పటినుండో పగిలడం ప్రారంభించి …

ఒహోహో… ఎదగడం ప్రారంభిస్తుంది…

ఆకుపచ్చని ఉడుపులు ధరించి.
ఎంత స్పష్టమైన, వింతైన పదార్థం! ఇదేనా జీవితమంటే!

ఓహ్, అది పిచ్చెంకించే మార్మికత. ఆనంద హేల,

ధూళికణం ఎగిరి, ప్రాణంతో ఎగసి, అడుగులేసి పరిగెత్తుతుంది…

రెక్కవిప్పి ఎగురుతుంది, అరుపులతో అంతరాంతరాలు కదిలిస్తుంది…

ఓహ్… ఎక్కడెక్కడి లోతులు…

ఏమిటీ అందమైన ఆహార్యం? వింత ముసుగు? అదేనా జీవితమంటే!

.

హేరియట్ మన్రో

December 23, 1860 – September 26, 1936

అమెరికను కవయిత్రి

.

Harriet Monroe

.

The Wonder of It

How wild, how witch-like weird that life should be!

That the insensate rock dared dream of me,

And take to bursting out and burgeoning—

      Oh, long ago—yo ho!—

And wearing green! How stark and strange a thing

That life should be!

Oh, mystic mad, a rigadoon of glee,

That dust should rise, and leap alive, and flee

A-foot, a-wing, and shake the deeps with cries—

      Oh, far away—yo-hay!

What moony masque, what arrogant disguise

That life should be!

.

Harriet Monroe

(December 23, 1860 – September 26, 1936)

American Poetess and Editor

Poem Courtesy:

The New Poetry: An Anthology.  1917

Harriet Monroe, ed. (1860–1936).

http://www.bartleby.com/265/252.html

 

ఒక సాయంత్రం … ఫ్రెడెరిక్ మానింగ్, ఆస్ట్రేలియన్ కవి

ఎవరూ చప్పుడు చెయ్యొద్దు, నా బాబు పడుకున్నాడు
రొదచేస్తున్న ఓ వడి గాలీ! నువ్వు కూడా హుష్!
ధారాపాతంగా కురుస్తున్న వర్షమా! నువ్వూ హుష్!
రేపు పొద్దుపొడిచేదాకా బిడ్డని నిద్రపోనీండి.

మీరందరూ నెమ్మది! ఇకనుండి జీవితమంతా
అతను మూటగట్టుకునేది దుఃఖమే;
నవ్వులుండాల్సిన చోట కన్నీరుంటుంది
కనీసం నిద్రలోనైనా అతనికి శాంతి నివ్వండి.

హుష్ అంటుంటే?! జబ్బుతో బలహీనంగా ఉన్నాడు
అతని ఏడుపులో కొంతపాలు వాళ్ళమ్మతో పోనీండి.
అదిగో వడిగాలీ, హుష్! నీ రొద కొంచెం ఆపు!
ఎవరూ చప్పుడు చెయ్యొద్దు, నా బాబు పడుకున్నాడు.

.

ఫ్రెడెరిక్ మానింగ్,

ఆస్ట్రేలియన్- బ్రిటిష్ కవి

 View the image of the poet here

 At Even

Hush ye! Hush ye! My babe is sleeping.

  Hush, ye winds, that are full of sorrow!

Hush, ye rains, from your weary weeping!

  Give him slumber until to-morrow.

Hush ye, yet! In the years hereafter,

  Surely sorrow is all his reaping;

Tears shall be in the place of laughter,

  Give him peace for a while in sleeping.

Hush ye, hush! he is weak and ailing:

  Send his mother his share of weeping.

Hush ye, winds, from your endless wailing;

  Hush ye, hush ye, my babe is sleeping!

.

Frederic Manning

22 July 1882 – 22 February 1935

Australian- British poet

The New Poetry: An Anthology.  1917.

Harriet Monroe, ed. (1860–1936).

Poem Courtesy:

http://www.bartleby.com/265/210.html

బందీ… లిలీ ఏ లాంగ్, అమెరికన్ కవయిత్రి

“నేను” అనబడే ఈ ఒంటరి జైలులో

ఈ సృష్టి ప్రారంభానికి ముందునుండీ బందీని.

నేను విడుదలయేసరికి,  తెల్లని నక్షత్రధూళితో,

ఈ లోకాలన్నీ పరిగెత్తాల్సిందే, మొదట పరిగెత్తి నట్టు.

నేను గోడకేసి నాచేతులు బాదుకుంటాను, తీరా చూస్తే

కొట్టుకుంటున్నది నాగుండెకే. ఎంత గుడ్డితనం! ఏమీ సంకెల!

.

లిలీ ఎ లాంగ్

(1862 – 1927)

అమెరికను కవయిత్రి

.

Immured

.

Within this narrow cell that I call “me”,

I was imprisoned ere the worlds began, 

And all the worlds must run, as first they ran,         

In silver star-dust, ere I shall be free.     

I beat my hands against the walls and find            5

It is my breast I beat, O bond and blind!

.

Lily A. Long

(1862- 1927)

American Poetess

.

Poem Courtesy:

A Magazine of Verse. 1912–22

Ed: Harriet Monroe, (1860–1936)

http://www.bartleby.com/300/15.html

 

 

 

వీడ్కోలు… హారియట్ మన్రో, అమెరికను కవి

శలవు!  అంతా ముగిసిపోయిందని

దుఃఖించకు. ఇదే సరియైన సమయం.

ఆనందపు రెక్కల నికుంజవిహారి,

మధుపాయి పువ్వును వీడిందని వగవొద్దు.

అది ప్రకృతి ధర్మం.  ప్రేమ క్షణికం.

ఓహ్! ప్రేమేమిటి, అన్నీ క్షణికమే.

జీవితం ఆనందంగా గడిచింది.

మృత్యువుని కూడా పరమానందమే.

ఆకుల్ని రాలిపోనీ.

.

హారియట్ మన్రో

23 డిశంబరు 1860 – 26 సెప్టెంబరు 1936

అమెరికను కవి.

.

A Farewell

.

Good-by!—no, do not grieve that it is over,       

The perfect hour;        

That the winged joy, sweet honey-loving rover,  

Flits from the flower.  

Grieve not—it is the law. Love will be flying—         

Oh, love and all.

Glad was the living—blessed be the dying!

Let the leaves fall.

.

Harriet Monroe

(December 23, 1860 – September 26, 1936)

American Poet, Editor, Scholar, Literary Critic and Patron of Arts.

The New Poetry: An Anthology. 1917.

Ed. Harriet Monroe

http://www.bartleby.com/265/255.html

అంతరంగపు ప్రశాంతత … హారియట్ మన్రో, అమెరికను కవయిత్రి

గాలి ఊసులేని భూమి పొరల్ని

చీల్చుకుని ఎక్కడ నిశ్చలత ఉందో

అక్కడకి చొరబడాలని ప్రయత్నించే భీకర శబ్దాలూ,

యుద్ధాల కోలాహలమూ, ప్రార్థనలలోని సవ్వడీ,

అకస్మాత్తుగా కలిగే ఆనందాన్ని సున్నితంగా ప్రకటించే

అనురాగ నిస్వనాలూ, లజ్జ ఎరుగని నవ్వుల కంఠధ్వనులూ…

ఇవేవీ నన్ను ఎదిరించి అవమానించనూలేవు…

జ్ఞాపకాలై మనసులో పదేపదే మార్మోగనూ లేవు…

శాశ్వతమైన ప్రశాంతత నిండిన

నా అంతరాంతర కుహరాల్లోకి ప్రవేశించనూ లేవు.

బుగ్గకంటే మెత్తనైన ప్రశాంతత

పుష్పించబోతున్న మొగ్గలక్రింది నేలలో దాగుంది…

అది గంటలకొద్దీ నిర్విరామంగా మ్రోగిన

వీణియల నాదంకంటే ఉత్కృష్టమైన నిశ్శబ్దం…

అది మరుగుపడ్డ అనంతత్వంలాంటిది; అక్కడ

గొప్పగొప్ప సూర్యులు తమ ఉనికి నెమ్మదిగా చాటుతున్నా

తమకంటే శక్తిమంతమైన నిశ్శబ్దాన్ని చీల్చలేనట్టిది.

నేను అక్కడ శాశ్వతంగా వసిస్తాను…

అక్కడకి ఏ ఆలోచనా నన్ను వెంబడించలేదు…

కలతలేని కలల తూలికలు చేరనూ లేవు.

.

హారియట్ మన్రో

23 డిశంబరు 1860- 26 సెప్టెంబరు 1936

అమెరికను కవయిత్రి.

.

Harriet Monroe

 

.

The Inner Silence

.

Noises that strive to tear        

Earth’s mantle soft of air       

And break upon the stillness where it dwells:     

The noise of battle and the noise of prayer,        

The cooing noise of love that softly tells          

Joy’s brevity, the brazen noise of laughter—      

All these affront me not, nor echo after     

Through the long memories.   

They may not enter the deep chamber where      

Forever silence is.       

Silence more soft than spring hides in the ground        

Beneath her budding flowers; 

Silence more rich than ever was the sound

Of harps through long warm hours.

It’s like a hidden vastness, even as though       

Great suns might there beat out their measures slow,   

Nor break the hush mightier than they.     

There do I dwell eternally,      

There where no thought may follow me,   

Nor stillest dreams whose pinions plume the way.

.

Harriet Monroe

(December 23, 1860 – September 26, 1936)

American Poet, Editor, Scholar, Literary Critic and Patron of Arts.

The New Poetry: An Anthology. 1917.

Ed. Harriet Monroe

http://www.bartleby.com/265/253.html

బోనాపార్టే రోడ్డు … జోసెఫ్ వారెన్ బీచ్, అమెరికను కవి.

సాదా రొట్టెలూ, నీ కాఫీ మాత్రమే అడిగి తీసుకుని

నువ్వు బల్ల దాటి వస్తున్నపుడు, అక్కడ అన్నీ జాగ్రత్తగా

గమనిస్తున్న యజమానురాలిని పలకరించిన తర్వాత

మైధునంలో ఉన్న పక్షులని దాటేటంత నెమ్మదిగా

లోనకి ప్రవేశించి, వార్తాపత్రిక అంచుమీదుగా

వివేకంతో చూడమని అడ్గుతునాను. ఆదిగో ఆ మూల

అస్పష్టంగా, ఏ మాటూ లేని ఆ మేజాబల్ల వెనక

స్త్రీ పురుషులిద్దరు అనుకున్నట్టుగా కలుసుకుని

మౌన సంభాషణ కొనసాగ్ఫిస్తున్నారు.

బయట కాలిబాటమీద చక్కని వెలుగు వెల్లువెత్తుతోంది;

దూరంగా గుట్టమీద  పనిపిల్ల కిటికీ తలుపులు తెరుస్తోంది

ఏదో తెలియని పాత విషాద  జానపద గీతం పాడుతున్నట్టు

వీధిలో తిరుగుతూ అమ్ముకునేవాళ్ళు గొంతుమార్చి అరుస్తున్నారు.

లోపల  ఆలోచనలో మగ్నమైన ప్రేమికులు, దేన్నీ పట్టించుకోకుండా

చేతిలోచెయ్యి వేసుకునో, లేక సన్నగా గుసగుసలాడుతూనో

తమ ప్రేమని వ్యక్తపరచుకుంటున్నారు.

అప్పుడప్పుడు ఆమె గొలుసుతో ఆడుతుంటుంది,

అతని భుజం మీద సన్నగా వాలుతూ, పిల్లచేష్టలు చేస్తుంటుంది.

ఆమె ముందుంచిన పాలు ఆమె ముట్టనైనా ముట్తలేదు.

ఆమె ఫలహారమూ, లోనకి రావడానికి ప్రవేశ రుసుమూ అదే.

ఆమె చూపులో ఆరాధనా, విశ్వాసమూ కనిపిస్తున్నాయి.

జీవితం అంత కఠినంగా లేకపోతే, బహుశా, అందంగా కనిపించేది

అతను మాత్రం, ఆ టేబిలుకి ఆనించిన

తుప్పట్టిన అతని సైకిలులాగే, శుష్కించి

ముఖకవళికలు బొత్తిగా పీక్కుపోయి, బలహీనంగా ఉన్నాడు.

ఇలా కుదుర్చ్వుకోగలిగిన రహస్య సమావేశంలో వాళ్ళు

అపురూపంగా గడిపే మధుర క్షణాలు

తర్వాత రోజంతా ఆమెకి హాయిని గొలుపుతాయి.

అతనికి బహుశా మరింత కష్టంగా గడవొచ్చు.

జీవితంలో అసలు ప్రేమే లేక,  పొయ్యి ప్రక్కన

చేతులు వెచ్చజేసుకునే, ముదుసలులారా,

ఉదయమనే మీ డోమినోస్ ఆటని జాగ్రత్తగా ఆడండి.

.

జోసెఫ్ వారెన్ బీచ్

(January 14, 1880 – August 13, 1957)

అమెరికను కవి.

.

Rue Bonaparte

.

You that but seek your modest rolls and coffee,

When you have passed the bar, and have saluted

Its watchful madam, then pray enter softly

The inner chamber, even as one who treads

The haunts of mating birds, and watch discreetly

Over your paper’s edge. There in the corner,

Obscure, ensconced behind the uncovered table,

A man and woman keep their silent tryst.

Outside the morning floods the pavement sweetly;

Yonder aloft a maid throws back the shutters;

The hucksters utter modulated cries

As wistful as some old pathetic ballad.

Within the brooding lovers, unaware,

Sit quiet hand in hand, or in low whispers

Communicate a more articulate love.

Sometimes she plays with strings and, gently leaning

Against his shoulder, shows him childish tricks.

She has not touched the glass of milk before her,

Her breakfast and the price of their admittance.

She has a look devoted and confiding

And might be pretty were not life so hard.

But he, gaunt as his rusty bicycle

That stands against the table, and with features

So drawn and stark, has only futile strength.

The love they cherish in this stolen meeting

Through all the day that follows makes her sweeter,

And him perhaps it only leaves more bitter.

But you that have not love at all, old men

That warm your fingers by this fire, discreetly

Play out your morning game of dominoes.

.

Joseph Warren Beach

(January 14, 1880 – August 13, 1957)

American poet, novelist, critic, educator and literary scholar.

Poem Courtesy: The New Poetry: An Anthology.  1917.

Ed. Harriet Monroe, ed. (1860–1936)

http://www.bartleby.com/265/21.html

%d bloggers like this: