అనువాదలహరి

పెరటి పాట… గ్వెండొలీన్ బ్రూక్స్, అమెరికను కవయిత్రి

నా జీవితమంతా ముందరి వాకిట్లోనే గడిపాను.

నా కొకసారి పెరట్లోకి తొంగి చూడాలని ఉంది

అక్కడ ఏ సంరక్షణా లేక, గరుకుదేరి ఆబగా రొడ్డబలిసింది.

అక్కడ పూచిన గులాబికూడా అందంగా కనిపించదు.

 

నేనుప్పుడు ఆ పెరట్లోకి వెళ్దా మనుకుంటున్నాను.

అనాధపిల్లలు ఆడుకుంటున్న ఆ చోటుకి

వీలయితే వీధిచుట్టూ తిరిగైనా.

ఇవాళ నాకు ఆనందంగా గడపాలని ఉంది.

 

వాళ్ళు చాలా అద్భుతమైన పనులు చేస్తుంటారు.

వాళ్ళు హాయిగా కేరింతలాడుకుంటూ ఆనందంగా ఉంటారు.

మా అమ్మ అసహ్యించుకుంటుంది గాని, నే నైతే అది బాగుందంటాను.

వాళ్ళెంత అదృష్టవంతులో కదా! పావుతక్కువ తొమ్మిదికి

ఇంట్లోకి రావలసిన బలవంతం లేదు.

మా అమ్మ అంటుంటుంది జానీ మే

పెద్దయేక చెడుతిరుగుళ్ళు తిరుగుతుందని.

ఆ జార్జి నేడో రేపో జైలు కెళతాడనీని.

(ఎందుకంటే మా పెరటి తలుపు క్రిందటి చలికాలం అమ్మేసేడు)

 

నేను మాత్రం ఫర్వాలేదంటాను. నిజంగా! ఒట్టు!

నాకుకూడా కారునలుపు లేసులతో అల్లిన మేజోళ్ళు తొడుక్కుని,

ధైర్యంగా ముఖానికి రంగు పులుముకుని రోడ్లంబట తిరగాలనీ

చెడ్డపిల్లని అనిపించుకోవాలనీ ఉంది.

.

గ్వెండొలీన్ బ్రూక్స్

(June 7, 1917 – December 3, 2000)

అమెరికను కవయిత్రి

Gwendolyn Brooks

 

A Song in the Front Yard

I’ve stayed in the front yard all my life.

I want a peek at the back

Where it’s rough and untended and hungry weed grows.

A girl gets sick of a rose.

I want to go in the back yard now

And maybe down the alley,

To where the charity children play.

I want a good time today.

They do some wonderful things.

They have some wonderful fun.

My mother sneers, but I say it’s fine

How they don’t have to go in at quarter to nine.

My mother, she tells me that Johnnie Mae

Will grow up to be a bad woman.

That George’ll be taken to Jail soon or late

(On account of last winter he sold our back gate).

But I say it’s fine. Honest, I do.

And I’d like to be a bad woman, too,

And wear the brave stockings of night-black lace

And strut down the streets with paint on my face.

స్వేచ్ఛా పురుషుడు … గ్వెండొలీన్ బ్రూక్స్, అమెరికను కవయిత్రి

ఒక గదో, రెండు గదులో, మూడు గదులో
ఉన్న చిరు జీవితంలోకి నిన్ను తీసుకుపోయి
నిన్నొక సీసాలోని సారాయిలా పరిగణిస్తూ చాకచక్యంగా
ఎవరు నిన్ను బంధించగలరు? ఏ స్త్రీ, ఏ భార్యా చెయ్యలేదు.
పొంగిపొరలే రత్నంలాంటి ఆమెకు ఆనందాన్నివ్వడానికి
నిన్ను గిరగిరా తిప్పనిచ్చి మిత్రుడికి పరిచయంచేస్తావు.
ఆ గిరగిరా తిప్పడం ఒక బలహీనత. ఒకసారి స్వాతంత్య్రాన్ని
చవిచూసేక అప్పటినుండి నువ్వు ఏ బిరడాలూ అనుమతించలేవు.

ప్రతి స్త్రీ జాగ్రత్తగా ముందే ఆలోచించుకోవాలి.
వారానికి ఒకసారి తనే ప్రమాదఘంటికలు మ్రోగిస్తోందేమోనని.
.

గ్వెండోలీన్ బ్రూక్స్

అమెరికను కవయిత్రి

Photo Courtesy: https://www.poetryfoundation.org/poems-and-poets/poets/detail/gwendolyn-brooks

.

The Independent Man

.

Now who could take you off to tiny life

In one room or in two rooms or in three

And cork you smartly, like the flask of wine

You are? Not any woman. Not a wife.

You’d let her twirl you, give her a good glee

Showing your leaping ruby to a friend.

Though twirling would be meek. Since not a cork

Could you allow, for being made so free.

A woman would be wise to think it well

If once a week you only rang the bell.

.

Gwendolyn Brooks

June 7, 1917 – December 3, 2000

American

%d bloggers like this: