గాయపడిన మన్మధుడు… ఎనాక్రియన్, గ్రీకు కవి
ఒకసారి గులాబిదొంతరలలో పరున్న
మన్మధుణ్ణి ఒక తేనెటీగ కుట్టింది.
అంతే, కోపంతో వాళ్ళమ్మదగ్గరకి పరిగెత్తి,
ఏడ్చిగగ్గోలుపెడుతూ ఇలా అన్నాడు:
‘అమ్మా! కాపాడే! నీ కొడుకు ప్రాణం పోతోందే!”
“అరే నా బంగారు తండ్రీ! ఏమయిందమ్మా?”
అప్పుడు వెక్కి వెక్కి ఏడుస్తూ ఇలా అన్నాడు:
“రెక్కలున్న పామేదో నన్ను కరిచిందే,
జానపదులు దాన్ని తేనెటీగ అంటారే.
“దాని కామె పకపకా నవ్వి, ముద్దులతో,
కేశపాశంతో ముంచెత్తి, కన్నీరు తుడుస్తూ,
“అయ్యో నాయనా! నవ్వొస్తోందిరా!
దీనికేఉపద్రవం వచ్చినట్టు ఏడవాలిట్రా?
అలాగయితే నీ బాణాలతో అందర్నీ గాయంచేస్తావే
వాళ్ళకి ఎంత బాధగా ఉంటుందో చెప్పు మరి? “
.
(అనువాదం: రాబర్ట్ హెర్రిక్)
ఎనాక్రియన్
582 – 485 BC
గ్రీకు కవి
Portrait of the Greek poet Anacreon of Teos. Marble, Roman Imperial Period (2nd or 3rd century)
The wounded Cupid
.
Cupid, as he lay among
Roses, by a bee was stung.
Whereupon in anger flying
To his mother, said, thus crying,
Help! O help! Your boy’s a-dying.
And why, my pretty lad? Said she.
Then blubbering replied he:
A winged snake has bitten me,
Which country people call a bee.
At which she smiled, then with her hairs
And kisses, drying up his tears,
Alas! Said she, my wag, if this
Such a pernicious torment is;
Come, tell me then how great’s the smart
Of those thou woundest with your dart!
.
(Tr: Robert Herrick)
Anacreon
582- 485 BC
Greek Poet
Poem Courtesy:
https://archive.org/details/anthologyofworld0000vand/page/263/mode/1up
మాటల యుద్ధం … దిమిత్రిస్ వారోస్, గ్రీకు కవి
నేనొక ఎడారిలో జలపాతాన్ని
మేఘంలేకుండా కురిసిన చినుకుని
అందరికీ తెలిసిన, ఇంకాపుట్టని బిడ్డని
నువ్వు ఎన్నడూ అనుభూతిచెందని
ఒకానొక అనుభవాన్ని.
నేను నీ మనసుమీద పైచెయ్యి సాధించగలను
తలుపుతాళం తీసి,నువ్వు సముద్రాన్ని తలుచుకున్నపుడు
‘ఇది అని అనలేని’ జ్ఞాపకాన్నై నీ దరిజేరుతాను.
నువ్వు వాచీ చూసుకుని
సమయం మించిపోయిందనుకున్నప్పుడు
నేనొక క్షణికమైన భ్రాంతినై కనిపిస్తాను.
నేను నీ మనసుతో ఆడుకోగలను
నేను నీ కనులవెనుకే దాగి ఉన్నాను
నేను నీ కలలనిండా పరుచుకున్నాను
నన్ను నీ ప్రతి కోరికలోనూ చూడగలవు
నీలో ఇంకా చిగురించని కోరికలలో కూడా.
నేను నీ మనసుతో ఆటాడుకోగలను.
నువ్వు చేరలేని చోటుల్లో నేనుండగలను.
నువ్వు స్పృశించలేని ప్రదేశాలు నా ఉనికి.
అయితే, నువ్వు ఎప్పుడూ నిరీక్షించేది … నేనే
నీ జీవితాన్ని పట్టి ఉంచేదీ … నేనే.
నేను నీ మనసుతో ఎత్తుకుపైఎత్తులు వెయ్యగలను కానీ,
అది నాకేమీ సరదా కాదని ఒట్టేసి చెప్పగలను.
భరించలేని ఒంటరితనాన్ని అనుభవిస్తున్నాను
నాకో శరీరం అంటూ లేకపోవడం వల్ల,
శరీరం ఉన్న నువ్వు, నన్ను నీలో భాగంగా గుర్తించవు.
.
డిమిత్రిస్ వారోస్
(1949 – 7 Sept 2017)
గ్రీకు కవి
.
Mind Games
.
I am a waterfall in the desert.
A rain from a cloudless sky.
A well known but unborn child.
An instance of experience
that you never had.
I play mind games with your brain.
When you strike the keys and remember the sea
I come as indefinable memory.
When you look at your watch
and the time has passed
you feel me like a fleeting hallucination.
I play mind games with your brain.
I’m nesting behind your eyes.
I’m ranging through your dreams.
You are finding me in all of your desires.
In all of those are absent from you.
I play mind games with your brain.
I stand in the places that you cannot reach.
I exist where you cannot touch upon.
But I am what you always waiting for
I m what holds your life on.
I play mind games with your brain.
But I swear this is not a fun.
I feel unbearable loneliness.
Because I do not have a body
And you, that you have, refuse me yours.
.
Dimitris Varos
(1949 – 7 September 2017)
Greek Poet
Poem Courtesy:
http://famouspoetsandpoems.com/poets/dimitris_varos/poems/23550
గోడలు…. కన్స్టాంటిన్ కవాఫిజ్, గ్రీకు కవి
మరో ఆలోచనా, జాలి, బిడియమూ లేకుండా
వాళ్ళు నా చుట్టూ గోడలు కట్టేరు, ఎత్తుగా… మందంగా.
ఇప్పుడు నేనిక్కడ కూచుని నిస్సహాయంగా నిట్టూరుస్తున్నాను.
నేను మరొకటి ఆలోచించలేకున్నాను; ఈ దుస్థితి నా మనసు నమిలేస్తోంది
కారణం, ఆవల నేను చెయ్యవలసింది చాలా ఉంది.
వాళ్ళీ గోడలు కడుతున్నపుడు, నేనెలా పోల్చుకోలేకపోయానబ్బా!!!
నా కెన్నడూ మేస్త్రీలు కనిపించలేదు, పిసరంత చప్పుడైనా లేదు.
నేను గ్రహించలేనంత నేర్పుగా నన్ను బాహ్యప్రపంచానికి దూరం చేసేసేరు.
.
కన్స్టాంటిన్ కవాఫిజ్
April 29 1863 – April 29, 1933
గ్రీకు కవి
Poem Courtesy: http://cavafis.compupress.gr/kave_36.htm
Walls
.
With no consideration, no pity, no shame,
they have built walls around me, thick and high.
And now I sit here feeling hopeless.
I can’t think of anything else: this fate gnaws my mind –
because I had so much to do outside.
When they were building the walls, how could I not have noticed!
But I never heard the builders, not a sound.
Imperceptibly they have closed me off from the outside world.
Constantine P. Cavafy
April 29 1863 – April 29, 1933
Greek Poet
Poem Courtesy: Poem Courtesy: http://cavafis.compupress.gr/kave_36.htm
1800 th Post
మహానగరం… కన్స్టాంటిన్ కవాఫిజ్, గ్రీకు కవి
నువ్వు అన్నావు:”నేను వేరేదేశం వెళిపోతాను, మరో తీరానికి చేరుకుంటాను,
ఈ నగరం కంటే మెరుగైనది మరొకటి వెతుక్కుంటాను.
నేను ఏది ప్రయత్నించినా అది విఫలమౌతూనే ఉంది
నామనసు జవజీవాలు తప్పి, సమాధిచెయ్యబడినట్టుంది.
ఎన్నాళ్ళని ఇక్కడ నా మనసుని బూజుపట్టేలా ఉగ్గబట్టుకోను?
నేనెటు తిరిగినా, ఏ దిక్కుచూసినా,
చివికి జీర్ణమైన నా జీవితమే గోచరిస్తోంది.
నేను ఇన్నాళ్ళూ ఇక్కడే గడిపి నా జీవితాన్ని వృధాచేసుకున్నాను,
పూర్తిగా సర్వనాశనం చేసుకున్నాను.”
నీకెన్నడూ మరొక కొత్తదేశం కనిపించదు. మరో తీరమూ అందదు.
ఈ నగరమే నిన్ను వెంటాడుతుంది. నువ్వు అవే వీధులు తిరుగుతావు,
అవే పరిసరాల్లో పెరిగి పెద్దవాడివవుతావు,
అవే ఇళ్ళల్లో తలనెరిసి ముసిలివాడివవుతావు.
చివరకి మళ్ళీ ఈ నగరానికే తిరిగివస్తావు.
ఇంతకంటే మెరుగైన పరిస్థితులకోసం ఎక్కడో వెతక్కు:
నీకోసం ఏ నౌకా ఎదురుచూడదు, నీదంటూ ఏ రోడ్డూ ఉండదు.
ఇక్కడ, ఈ చిన్న మూల, నీ జీవితాన్ని వృధా చేసుకున్నావంటే,
ప్రపంచంలో ఏ మూలనైనా దాన్ని వృధా చేసుకున్నావు.
.
కన్స్టాంటిన్ కవాఫిజ్
April 29 1863 – April 29, 1933
గ్రీకు కవి
The City
.
You said: “I’ll go to another country, go to another shore,
find another city better than this one.
Whatever I try to do is fated to turn out wrong
and my heart lies buried as though it were something dead.
How long can I let my mind moulder in this place?
Wherever I turn, wherever I happen to look,
I see the black ruins of my life, here,
where I’ve spent so many years, wasted them, destroyed them totally.”
You won’t find a new country, won’t find another shore.
This city will always pursue you. You will walk
the same streets, grow old in the same neighborhoods,
will turn gray in these same houses.
You will always end up in this city. Don’t hope for things elsewhere:
there is no ship for you, there is no road.
As you’ve wasted your life here, in this small corner,
you’ve destroyed it everywhere else in the world.
(Translated by Edmund Keeley/Philip Sherrard)
.
Constantine Cavafy
Greek Poet
Poem Courtesy:
http://www.cavafy.com/poems/content.asp?id=58&cat=1
ఫోటో… కన్స్టాంటిన్ కవాఫిజ్, గ్రీకు కవి
Picasso ఒక సారి కళ గురించి చెబుతూ, “కళ గోడమీద తగిలిచుకునే అందమైన బొమ్మలకి పరిమితమైనది కాదు; వాటికన్నా అతీతమైనది,” అని అంటాడు. కనుక ఒకోసారి కళ అందవిహీనంగా ఉన్నది కూడా కావచ్చు.
దాని అర్థం ఏమిటి? అందవిహీనమైనదాన్ని ఏ కళాకారుడూ సృష్టించడు కదా?
అది ఒక నిరసన తెలిపే మార్గం. తన ఆగ్రహాన్ని ప్రకటించే తీరు.
దిగంబరకవులు తమ కవిత్వంలో అంతవరకు సంప్రదాయంగా వస్తున్న ఉపమానాలూ, మాటలూ కాకుండా వేరే భాష ఎందుకు ఉపయోగించినట్టు? కవిత్వం రహస్యాలు తెలీకనా? సమాజం నిద్రలో మునిగినపుడు దాన్ని లేపాలంటే, కొన్ని విపరీతమైన చర్యలు తీసుకోక తప్పదు. ఆ పదచిత్రాలు, ఆ భాష మనలో జుగుప్స కలిగించడం ద్వారా మన దృష్టిని ఆకర్షిస్తాయి. మనని ఒక రకమైన అశాంతి సృష్టిస్తాయి. ఆ అశాంతి మనల్ని అంతర్ముఖులుగా చేస్తుంది. మన తప్పుల్ని అవలోడనం చేసుకుని వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేసే మార్గాలు అన్వేషిస్తాం. ఆ అంతర్ముఖత్వం మనల్ని మనుషులుగా చేస్తుంది. ఈ విషయమే William Wordsworth తన Elegiac Stanzasలో చెబుతాడు.
ఈ కవిత అటువంటి కవిత.
***
అతి రహస్యంగా సందు చివరలో అమ్ముతున్న
ఈ అశ్లీలమైన ఫోటోలో (పోలీసులు దీన్ని చూడరాదు)
కలలు దోచుకునేంత అందమైన ముఖం
ఇంత పోకిరిగా ఉందేమిటి? “అసలిందులోకి ఎలా వచ్చేవు నువ్వు?”
నువ్వెంత నీచమైన, అశ్లీలమైన జీవితం గడుపుతున్నావో ఎవడికి తెలుసు?
ఈ చిత్రం తియ్యడానికి నువ్వీ భంగిమలో నిలుచున్నావంటే
నీ పరిసరాలు ఎంత దారుణంగా ఉండి ఉంటాయి?
నీది ఎంతటి దిగజారుడు మనస్తత్వమై ఉండి ఉండాలి?
అయినప్పటికీ, ఇంతకంటే కనికిష్టంగా ఉన్నా సరే,
నువ్వు నాకెప్పుడూ కలలు దోచుకునే ముఖానివే.
నీ తను సౌందర్యం, సౌష్టవం గ్రీకు ప్రజలకే అంకితం—
నువ్వు నాకు అలాగే ఎప్పుడూ కనిపిస్తావు
నా కవిత్వం నిన్నలాగే పరిచయం చేస్తుంది.
.
కన్స్టాంటిన్ కవాఫిజ్
(ఏప్రిల్ 29 1863 – ఏప్రిల్ 29, 1933)
గ్రీకు కవి
[గ్రీకు సాహిత్యంపట్ల దేశంలోనూ బయటా ఆసక్తి పునరుజ్జీవింపజెయ్యడంలో Cavafy పాత్ర ఎంతైనా ఉంది. కాని దురదృష్టవశాత్తూ, అతను చనిపోయిన తర్వాత, EM Forster, Arnold Toynbee and TS Eliot వంటి ప్రముఖులు చేపట్టేదాకా అతనికృషి ఇంగ్లీషుమాటాడేప్రపంచానికి దాదాపు తెలియదు. అతని సాహిత్యసృష్టిఅంతా గ్రీకుభాషలోనే జరిగింది. అయితే అతని అన్ని కవితలూ అనువాదం చెయ్యబడ్డాయి. కాకపోతే, అతని మాతృభాషలోని నైపుణ్యం అనువాదాలలో అంతగా కనిపించదు. అంత్యప్రాసలు లేకపోవడం, ఉన్నచోట వ్యంగ్యాన్ని సూచించడం, సంప్రదాయేతర విషయాలపై కవిత్వం రాయడం అతని ప్రత్యేకతలు. అగోచరమైనభవిషత్తు, మనసునివివశంచేసే ఆనందాలు, నైతిక ప్రవర్తన, వ్యక్తుల మానసిక ప్రవృత్తి, స్వలింగసంపర్కం, అతని కవిత్వాన్ని నిర్వచించే కొన్ని ముఖ్యమైన కవితావస్తువులు. అతనికి కవితలో ప్రతి పాదాన్నీ లోపరహితంగా రాయడం ఎంత అలవాటంటే, అది ఒక చాదస్తంగా గుర్తించవలసినంత.
1904 లో రాసిన “Waiting for the Barbarians” కవితా, 1911 లో వ్రాసిన Ithaca అన్న కవితలు కన్స్టాంటిన్ కవాఫిజ్ కి అమితమైన కీర్తిని తెచ్చిపెట్టాయి. అతను తన కవిత్వాన్ని పుస్తకరూపంలో తీసుకు రాలేదు. అతని మరణానంతరం 1935లో అతని 154 కవితలతో మొదటి కవితా సంకలనం వచ్చింది. ఇంకా చాలా సాహిత్యం అసంపూర్ణంగా ఉండిపోయింది.]
The Photograph.
.
In this obscene photograph secretly sold
(the policeman mustn’t see) around the corner,
in this whorish photograph,
how did such a dream-like face
make its way; How did you get in here?
Who knows what a degrading, vulgar life you lead;
how horrible the surroundings must have been
when you posed to have the picture taken;
what a cheap soul you must have.
But in spite of all this, and even more, you remain for me
the dream-like face, the figure
shaped for and dedicated to Hellenic love—
that’s how you remain for me
and how my poetry speaks of you.
–
Constantine Cavafy (Konstantinos P. Kabaphes)
(1863-1933)
Greek Poet
Translated from Greek by : Edmund Keeley and George Savidis
Poem Courtesy:
http://thewonderingminstrels.blogspot.com/2004/12/the-photograph-constantine-cavafy.html
వాయువు దాతృత్వము… పల్లడాస్, గ్రీకు కవి
మన నాసికలద్వారా పలుచని గాలి పీలుస్తూ మనం బ్రతుకుతాం
సూర్యుని కిరణాలు అతి సన్నని తావుల్ని పరికిస్తూ పోతాయీ…
బ్రతుకుతున్నవన్నీ… ప్రతిదీ ఒక సాధనం కనుక
దయాళువైన వాయువు తనజీవితాన్ని ఎరువిస్తుంది.
ఒక చేత్తో ఊపిరికై మన ఆర్తిని తీరుస్తూనే, పవనుడు
మరొక చేత్తో ఈ ఆత్మని వణుకుతూ మృత్యువుకు ఎర చేస్తాడు.
ఏపాటి విలువా చేయని మనల్ని మన అహంకారంతో మేపుతూ,
ఏమాత్రం ఊపిరి లేకున్నా, మనం మరణించేలా చూస్తూ.
.
పల్లడాస్
క్రీ. శ. 4వశతాబ్దం
గ్రీకు కవి
The Generous Air
.
Breathing the thin breath through our nostrils, we
Live, and a little space the sunlight see—
Even all that live—each being an instrument
To which the generous air its life has lent.
If with the hand one quench our draught of breath,
He sends the stark soul shuddering down to death.
We that are nothing on our pride are fed,
Seeing, but for a little air, we are as dead.
.
(From the Greek by William M. Hardinge)
Palladas (fl. 4th Century A.D.)
Greek Poet
The World’s Best Poetry.
Eds: Bliss Carman, et al,
Volume VI. Fancy. 1904.
Poems of Sentiment: II. Life
ఇల్లు… లియొనిడస్ ఆఫ్ అలెగ్జాండ్రియా, గ్రీకు కవి
నీ ఇంటిని అంటిపెట్టుకో! ఎంత పాడుబడ్డ పాక అవనీ,
నిన్ను తలదాచుకోనిస్తుంది, చలికాచుకుందికి ఒక పొయ్యిదొరుకుతుంది.
ఎంత పనికిరాని నేల అయినా కూరగాయలు పండకపోవు,
తినడానికి దేముడు ఏది అనుగ్రహిస్తే అనుగ్రహించనీ,
నది ఒడ్డున విచ్చలవిడిగా మొలిచినవో, కొండ వాలులో
అరకొరగా పండినవో, గింజలూ, కందమూలాలూ దొరకకపోవు;
ఎంత నిరాశక్తంగా కనిపించినా,ఆ పూరిగుడిశే,
ప్రపంచాన్ని పొందినా దొరకని మనశ్శాంతిని ఇస్తుంది సుమా!
.
(గ్రీకు నుండి అనువాదం: రాబర్ట్ బ్లాండ్)
.
లియొనిడస్ ఆఫ్ అలెగ్జాండ్రియా
గ్రీకు కవి
Home
.
Cling to thy home! If there the meanest shed
Yield thee a hearth and shelter for thy head,
And some poor plot, with vegetables stored,
Be all that Heaven allots thee for thy board,—
Unsavory bread, and herbs that scattered grow
Wild on the river brink or mountain brow,
Yet e’en this cheerless mansion shall provide
More heart’s repose than all the world beside.
.
Leonidas of Alexandria
(From the Greek by Robert Bland)
Poem Courtesy:
The World’s Best Poetry.
Eds: Bliss Carman, et al,
Volume I. Of Home: of Friendship. 1904.
Poems of Home: V. The Home
http://www.bartleby.com/360/1/179.html
వర్తమానాన్ని ఆశ్వాదించు… పల్లడాస్, గ్రీకు కవి
త్రాగి, ఆనందంగా ఉండు. రేపు ఏమిటి జరుగుతుందో
ఏ మర్త్యుడికీ తెలీదు. కాబట్టి, ఎందుకు ఆ శ్రమా, పరుగూ?
ఖర్చుపెట్టగలిగినప్పుడే ఖర్చుపెట్టు, తిను,
నీ కోరికలూ ఆశలూ ప్రస్తుత విషయాలమీదే లగ్నం చెయ్యి ;
జీవమూ, మృత్యువూ ఒక్కటే. ఒక్క క్షణం
జీవితానికి చెందిన వస్తువులకి ప్రాకులాడతావు; అవి నీ పాల బడతాయి;
మరణించేక నీకేం ఉండవు. అన్నీ ఇంకొకడి సొత్తు అవుతాయి.
.
పల్లడాస్,
గ్రీకు కవి
4 వ శతాబ్దం
.
Enjoy The Present
.
Drink and be merry. What the morrow brings
No mortal knoweth: wherefore toil or run?
Spend while thou mayst, eat, fix on present things
Thy hopes and wishes: life and death are one.
One moment grasp life’s goods; to thee they fall:
Dead, thou hast nothing, and another all.
.
Palladas
Greek Poet
4th Century AD.
(Translation: Goldwin Smith)
హార్బరులో… కన్స్టాంటిన్ కవాఫిజ్, గ్రీకు కవి
ఏమ్స్ అన్న యువకుడు, ఇరవై ఎనిమిదేళ్ళుంటాయి, టెనోజ్ రేవు నుండి
ఈ సిరియను హార్బరులో దిగేడు
అత్తరు వ్యాపారం లో మెలకువలు నేర్చుకుందామన్న తలపుతో.
కానీ, పాపం, ప్రయాణంలో రోగం పాలయ్యాడు.
అలా ఓడలోంచి దిగడమే తడవు, చనిపోయాడు.
అతని ఖననం, చాలా కనికిష్టమైనది, ఇక్కడే జరిగింది.
చనిపోవడానికి కొన్ని గంటలు ముందు,
“ఇంటి” గురించీ, “ముసలి తల్లిదండ్రులు” గురించీ ఏవో గొణిగాడు.
కానీ, వాళ్ళెవరో ఎవరికీ తెలీదు.
ఈ గ్రీకుప్రపంచానికి ఆవల అతనిది ఏదేశమో తెలీదు.
అదీ ఒకందుకు మంచిదే. ఎందుకంటే, దానివల్ల
అతను ఈ హార్బరులో మరణించి సమాధి అయినా,
అతని తల్లిదండ్రులు అతను జీవించే ఉన్నాడని ఆశిస్తారు.
.
కన్స్టాంటిన్ కవాఫిజ్
29 ఏప్రిల్ 1863- 29 ఏప్రిల్ 1933
గ్రీకు కవి.
.
.
In Harbor
.
A young man, twenty-eight years old, on a vessel from Tenos,
Emes arrived at this Syrian harbor
with the intention of learning the perfume trade.
But during the voyage he was taken ill. And as soon
as he disembarked, he died. His burial, the poorest,
took place here. A few hours before he died,
he whispered something about “home,” about “very old parents.”
But who these were nobody knew,
nor which his homeland in the vast Panhellenic world.
Better so. For thus, although
he lies dead in this harbor,
his parents will always hope he is alive.
.
Constantine P Cavafy
29th April 1863 – 29th April 1933
Greek Poet
ఆటవికులకోసం … కన్స్టాంటిన్ కవాఫిజ్, గ్రీకు కవి
[గ్రీకు సాహిత్యంపట్ల దేశంలోనూ బయటా ఆసక్తి పునరుజ్జీవింపజెయ్యడంలో Cavafy పాత్ర ఎంతైనా ఉంది. కాని దురదృష్టవశాత్తూ, అతను చనిపోయిన తర్వాత, EM Forster, Arnold Toynbee and TS Eliot వంటి ప్రముఖులు చేపట్టేదాకా అతనికృషి ఇంగ్లీషుమాటాడేప్రపంచానికి దాదాపు తెలియదు. అతని సాహిత్యసృష్టిఅంతా గ్రీకుభాషలోనే జరిగింది. అయితే అతని అన్ని కవితలూ అనువాదం చెయ్యబడ్డాయి. కాకపోతే, అతని మాతృభాషలోని నైపుణ్యం అనువాదాలలో అంతగా కనిపించదు. అంత్యప్రాసలు లేకపోవడం, ఉన్నచోట వ్యంగ్యాన్ని సూచించడం, సంప్రదాయేతర విషయాలపై కవిత్వం రాయడం అతని ప్రత్యేకతలు. అగోచరమైనభవిషత్తు, మనసునివివశంచేసే ఆనందాలు, నైతిక ప్రవర్తన, వ్యక్తుల మానసిక ప్రవృత్తి, స్వలింగసంపర్కం, అతని కవిత్వాన్ని నిర్వచించే కొన్ని ముఖ్యమైన కవితావస్తువులు. అతనికి కవితలో ప్రతి పాదాన్నీ లోపరహితంగా రాయడం ఎంత అలవాటంటే, అది ఒక చాదస్తంగా గుర్తించవలసినంత.
1904 లో రాసిన “Waiting for the Barbarians” కవితా, 1911 లో వ్రాసిన Ithaca అన్న కవితలు కన్స్టాంటిన్ కవాఫిజ్ కి అమితమైన కీర్తిని తెచ్చిపెట్టాయి. అతను తన కవిత్వాన్ని పుస్తకరూపంలో తీసుకు రాలేదు. అతని మరణానంతరం 1935లో అతని 154 కవితలతో మొదటి కవితా సంకలనం వచ్చింది. ఇంకా చాలా సాహిత్యం అసంపూర్ణంగా ఉండిపోయింది.
ఈ కవిత రోమను సామ్రాజ్య చరిత్ర నేపథ్యంగా వ్యంగ్యంగా రాయబడింది. ఏదైనా ఒక ప్రమాదమో, ఒక దండయాత్రో జరుగబోతుందంటే, ప్రజలూ, అధికారులూ, సామ్రాజ్యాధినేతలూ, శాశనసభ్యులూ, ప్రజలూ ఒక్కొక్కరూ ఒక్కొక్క విధంగా స్పందిస్తారు. చక్రవర్తి తన సార్వభౌమత్వాన్ని పదిలం చేసుకుందికీ, అధికారులు తమ అధికారాన్ని పదిలం చేసుకుందికీ ప్రయత్నిస్తుంటారు. ప్రజలు తమకు ఎప్పుడైనా ప్రస్తుతం ఉన్న దౌర్భాగ్యస్థితినుండి విముక్తి లభిస్తుందేమో నని ఆశగా చూస్తుంటారు. భయపెట్టో, ప్రలోభ పెట్టోరాజ్యాధినేతలూ, విధేయత కనబరిచి అధికారులూ, తమ పబ్బం గడుపుకోగలరు. ఎటొచ్చీ అమ్మకిచిక్కిన మేకల్లా ఏదో మంచి ఎక్కడినుండో, ఎవరివల్లనో జరుగుతుందని ఎదురుచూపులు చూసేది ప్రజలే. పరోక్షంగా, ఏ మార్పు అయినా తమవల్లనే జరగాలి తప్ప “ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురుచూసి మోసపోకురా” అని శ్రీ శ్రీ చెప్పిన సత్యం ఈ కవిత ప్రతిఫలిస్తుంది.]
.
అందరూ ఎందుకు బజారులో సమావేశమై,
ఎవరికోసం ఎదురు చూస్తున్నారు?
ఇవాళ ఆటవికులు వచ్చే రోజు. అందుకు.
చట్టసభలో ఏ కార్యకలాపాలూ జరగడం లేదెందుకు?
సభ్యులెందుకు ఖాళీగా కూర్చున్నారు చట్టాలు చెయ్యకుండా?
ఎందుకంటే, ఆటవికులీరోజు వస్తున్నారు కాబట్టి
ఇక చట్టసభ్యులేం చట్టాలు చెయ్యగలరు?
ఒకసారి ఆటవికులిక్కడకు వస్తే, వాళ్ళే చట్టాలు చేస్తారు
చక్రచర్తి ఎందుకు అంతపొద్దున్నే లేచి, నగర ముఖద్వారం దగ్గర
సింహాసనం మీద కిరీటం ధరించి రాజసంతో కూర్చున్నారు?
ఆటవికులు ఈరోజు వస్తున్నారు కాబట్టి,
వాళ్ళ నాయకుడిని ఆహ్వానించడానికి.
అతనికి బిరుదులూ, పదవులూ ఇవ్వడానికి
ఒక పట్టీ కూడా ఒకటి తయారుచేసి ఉంచేరు.
చక్కని చేతిపనిచేసిన ఎర్రని అధికారదుస్తులు వేసుకుని మరీ
మన ఇద్దరు సేనాధిపతులూ, న్యాయాధీశులూ వచ్చేరెందుకు?
అన్ని గరుడపచ్చలుపొదిగిన కంకణాలెందుకు వేసుకున్నారు?
వేళ్ళకి మరకతాలతో మెరుస్తున్న ఆ ఉంగరాలెందుకు?
ఎందుకంటే, ఇవాళ ఆటావికులు వస్తున్నారు కాబట్టి.
అలాంటివి వస్తువులు వాళ్ళ కళ్ళుచెదిరేలా చేస్తాయి.
అలవాటుగా చెప్పదలుచుకున్నదేదో చెప్పడానికి
మన ప్రముఖ వక్తలెవరూముందుకు రావడం లేదెందుకు?
ఎందుకంటే, ఇవాళ ఆటనికులు వస్తున్నారు కాబట్టి.
వాళ్ళు ఉపన్యాసాలన్నా, మాట్లాడడమన్నా విసుగెత్తిపోయారు.
***
అకస్మాత్తుగా ఎందుకింత గందరగోళం, అసంతృప్తి?
(చూసారా ప్రజలముఖాలెలా గంభీరంగా అయిపోయాయో!)
వీధులూ, పేటలూ ఎందుకు ఖాళీ అయిపోతున్నాయి?
ప్రజలందరూ ఎందుకు ఆలోచనల్లోపడి
ఇంటిముఖం పడుతున్నారు?
ఎందుకంటే, చీకటిపడిపోయింది, కానీ ఆటవికులు రాలేదు.
పొలిమేరలనుంచి ఇప్పుడే తిరిగి వచ్చినవాళ్ళు చెబుతున్నారు
అసలు ఆటవికులన్నవాళ్ళెవరూ ఇంక లేరుట.
అలా అయితే, ఆటవికులు లేకుండా ఇప్పుడు మనకెలా?
ఆ ఆటవికులు మనసమస్యలకి ఒకరకమైన సమాధానమేనే?
*
(ఎడ్మండ్ కీలీ అనువాదం)
*
కన్స్టాంటిన్ కవాఫిజ్
(29 ఏప్రిల్ 1863 – 29 ఏప్రిల్ 1933)
గ్రీకు కవి, పాత్రికేయుడు, ప్రభుత్వోద్యోగి
Waiting for the Barbarians
.
What are we waiting for, assembled in the forum?
The barbarians are due here today.
Why isn’t anything happening in the senate?
Why do the senators sit there without legislating?
Because the barbarians are coming today.
What laws can the senators make now?
Once the barbarians are here, they’ll do the legislating.
Why did our emperor get up so early,
and why is he sitting at the city’s main gate
on his throne, in state, wearing the crown?
Because the barbarians are coming today
and the emperor is waiting to receive their leader.
He has even prepared a scroll to give him,
replete with titles, with imposing names.
Why have our two consuls and praetors come out today
wearing their embroidered, their scarlet togas?
Why have they put on bracelets with so many amethysts,
and rings sparkling with magnificent emeralds?
Why are they carrying elegant canes
beautifully worked in silver and gold?
Because the barbarians are coming today
and things like that dazzle the barbarians.
Why don’t our distinguished orators come forward as usual
to make their speeches, say what they have to say?
Because the barbarians are coming today
and they’re bored by rhetoric and public speaking.
Why this sudden restlessness, this confusion?
(How serious people’s faces have become.)
Why are the streets and squares emptying so rapidly,
everyone going home so lost in thought?
Because night has fallen and the barbarians have not come.
And some who have just returned from the border say
there are no barbarians any longer.