అనువాదలహరి

అది లేని వాడు ఎంత అదృష్టవంతుడో కదా! … బెర్తోల్ట్ బెహ్ట్, జర్మను కవి

సాలమన్ రాజు ఎంత కుశాగ్రబుద్ధో చూసే ఉంటారు

అతనికేమయిందో మీరు గ్రహించే ఉంటారు.

అతనికి ఎంట జటిలసమస్యలైనా స్పష్టంగా కనిపించేవి

అంత తెలివైన వాడిగా ఎందుకు పుట్టేనా అని విచారించేవాడు

ఈ సృష్టిలో అన్నీ వృధా అని అతని భావన.

సాలమన్ రాజు ఎంత గొప్పవాడు, తెలివైనవాడు!

అయినా ప్రపంచం అతన్ని సహించలేదు

తర్వాత అతని జీవితంలో వచ్చిన మార్పు చూస్తూ ఊరుకుంది!

దీనికంతటికీ కారణం సాలమన్ రాజు తెలివితేటలే

అవి లేని వాడు ఎంత అదృష్టవంతుడో కదా!

రెండవది, మీరు సీజరు గురించి చదివే ఉంటారు

అతనెంత గొప్పవాడయ్యాడో మీకు తెలిసిందే.

అతని జీవితకాలంలో దేముడిగా కొలిచారు

అయినప్పటికీ నిర్దాక్షిణ్యంగా హత్యచేశారు.

అతన్ని పొడవడానికి కత్తిదూసినపుడు బ్రూటస్ ని చూసి

ఎంత గాఢంగా విలపించేడు: ‘నువ్వుకూడానా తండ్రీ’ అంటూ!

అయినా ప్రపంచం అతన్ని సహించలేదు

తర్వాత అతని జీవితంలో వచ్చిన మార్పు చూస్తూ ఊరుకుంది!

అతని పరాక్రమమే అతన్ని ఈ స్థితికి తీసుకు వచ్చింది

అది లేని వాడు ఎంత అదృష్టవంతుడో కదా!

మీరు సచ్ఛీలుడైన సోక్రటీసు గురించి వినే ఉంటారు

ఆ వ్యక్తి ఎన్నడూ అబద్ధం ఆడి ఎరుగడు.

అప్పటి పాలకులు మీరనుకుంటున్నంత కృతజ్ఞులు కారు

బదులుగా, అతనిపై నేరం మోపి, విచారణకి ఆదేశించారు.

తీర్పుగా చేతికి విషకలశం అందించారు.

ఆ పౌరు లభిమానించే వ్యక్తి ఎంత నిజాయితీపరుడని!

అయినా ప్రపంచం అతన్ని సహించలేదు

తర్వాత అతని జీవితంలో వచ్చిన మార్పు చూస్తూ ఊరుకుంది!

అతని నిజాయితీయే అతన్ని ఈ స్థితికి తీసుకు వచ్చింది

అది లేని వాడు ఎంత అదృష్టవంతుడో కదా!

ఇక్కడ మీరు గౌరవప్రదమైన వ్యక్తులు

దేముని ఆదేశాలను తప్పకుండా ఆచరించడం చూశారు.

అయినా అతనేమీ పట్టించుకో లేదు.

హాయిగా ఇంట్లో వెచ్చగా క్షేమంగా కూర్చుని

నిత్యం అవసరాలని తీర్చుకోవడం మీకు తెలుసు.

మనం ఎన్ని ఆదర్శాలతో జీవితాన్ని ప్రారంభించేం!

అయినా ప్రపంచం మనల్ని లక్ష్యపెట్టదు,

మనజీవితంలో రాబోయే మార్పుల్ని నిర్లిప్తంగా చూస్తుంటుంది!

దేముడిమీద మనకున్న భయమే ఈ స్థితికి తీసుకు వచ్చింది

అది లేని వాడు ఎంత అదృష్టవంతుడో కదా!

.

బెర్తోల్ట్ బెహ్ట్

(10 February 1898 – 14 August 1956)

జర్మను కవి.

.

How Fortunate The Man With None

.

You saw sagacious Solomon

You know what came of him,

To him complexities seemed plain.

He cursed the hour that gave birth to him

And saw that everything was vain.

How great and wise was Solomon.

The world however did not wait

But soon observed what followed on.

It’s wisdom that had brought him to this state.

How fortunate the man with none.

You saw courageous Caesar next

You know what he became.

They deified him in his life

Then had him murdered just the same.

And as they raised the fatal knife

How loud he cried: you too my son!

The world however did not wait

But soon observed what followed on.

It’s courage that had brought him to that state.

How fortunate the man with none.

You heard of honest Socrates

The man who never lied:

They weren’t so grateful as you’d think

Instead the rulers fixed to have him tried

And handed him the poisoned drink.

How Fortunate The Man With None

The world however did not wait

But soon observed what followed on.

It’s honesty that brought him to that state.

How fortunate the man with none.

Here you can see respectable folk

Keeping to God’s own laws.

So far he hasn’t taken heed.

You who sit safe and warm indoors

Help to relieve our bitter need.

How virtuously we had begun.

The world however did not wait

But soon observed what followed on.

It’s fear of god that brought us to that state.

How fortunate the man with none.

.

Bertolt Brecht

(10 February 1898 – 14 August 1956)

German Poet

Poem Courtesy:

http://famouspoetsandpoems.com/poets/bertolt_brecht/poems/3833

నీవు లేక… హెర్మన్ హెస్, జర్మను కవి

సమాధి ఫలకంలా శూన్యంగా చూస్తుంటుంది

తలగడ రాత్రివేళ నా వైపు

నీ కురులలో తలవాల్చి నిద్రించకుండా

ఇలా ఒంటరిగా పడుకోవడం

ఇంత కఠినంగా ఉంటుందని ఊహించలేదు.

ఏ చప్పుడూ లేని ఇంటిలో నేను ఒంటరిని

వేలాడుతున్న లాంతరు మసిబారిపోయింది.

నీ చేతులు నా చేతిలొకి తీసుకుందికి

మెల్లగా చెయిజాచుతాను ,

కాంక్షాభరితమైన నా పెదవిని నీవైపు జాచి

నన్ను నేనే ముద్దుపెట్టుకుంటాను, నిరాశతో, నిస్సత్తువతో

చటుక్కున మేలుకుంటాను

నా చుట్టూ చలికప్పినచీకటి నిలకడగా ఆవహించి ఉంటుంది.

కిటికీలోంచి ఒక తారక స్పష్టంగా మెరుస్తుంటుంది…

సొగసైన నీ కురులేవీ?

మధురమైన నీ పెదవులెక్కడ?

ఇప్పుడు ప్రతి వేడుకలోనూ విషాదాన్నీ

ప్రతి మధువులోనూ విషాన్నీ దిగమింగుతున్నాను

నీవులేక ఇలా…

ఒంటరిగా, ఒక్కడినీ ఉండటం

ఇంతకష్టంగా ఉంటుందని ఎన్నడూ ఊహించలేదు.

.

హెర్మన్ హెస్

2 July 1877 – 9 August 1962

జర్మను కవి, నవలాకారుడు.

Hermann Hesse

Without You

.

My Pillow gazes upon me at night

Empty as a gravestone;

I never thought it would be so bitter

To be alone,

Not to lie down asleep in your hair.

I lie alone in a silent house,

The hanging lamp darkened,

And gently stretch out my hands

To gather in yours,

And softly press my warm mouth

Toward you, and kiss myself, exhausted and weak-

Then suddenly I’m awake

And all around me the cold night grows still.

The star in the window shines clearly-

Where is your blond hair,

Where your sweet mouth?

Now I drink pain in every delight

And poison in every wine;

I never knew it would be so bitter

To be alone,

Alone, without you.

.

Hermann Hesse

2 July 1877 – 9 August 1962

German Poet

Poem Courtesy:

http://famouspoetsandpoems.com/poets/hermann_hesse/poems/13707

భవిష్య వాణి… వాల్టర్ వాన్ దెర్ వొగెల్వైడ్, జర్మను కవి

సందేహాలు చుట్టుముట్టి, సతమతమౌతూ,

నేను ఒక్కడినే చాలాసేపు ప్రశాంతంగా కూచుని ఆలోచించేను

ఆమె ఆలోచనలనుండి ఎలా విముక్తి పొందాలా అని

చివరికి ఒక ఆలోచన సాంత్వననిచ్చేదాకా.

నిజానికి దీన్ని పూర్తిగా సాంత్వన అని అనలేము,

చిన్నపిల్లలు కూడా దీనికి శాంతించరేమో, అంత చిన్నది;

అదేమిటో మీకు చెబితే, నన్ను మీరు వెక్కిరిస్తారు:

అయినా ఏ కారణం లేకుండా ఎవ్వరూ సుఖంగా ఉండలేరు కద!

ఇవాళ ఒక పూరిపుడక నాకు ఆనందాన్నిచ్చింది;

అలాంటి ఆనందాన్ని నేనింతవరకు ఎరగను

ఆటలో ఇవాళ నేనొక గడ్డిపుడకతో కొలిచేను,

చాలాసార్లు పిల్లలు ఇలా ఆడడం చూసేను

అయితే వినండి, ఆమె నా ప్రేమ అంగీకరిస్తుందో లేదో

“ఆమె ప్రేమిస్తుంది- లేదు-ప్రేమిస్తుంది!” అనుకుంటూ దాన్ని నాల్గువేళ్లతో కొలిచేను,

చివరకి ఎప్పుడూ “ఆమె ప్రేమిస్తుంది” తోనే ముగిసేది.

అందుకని ఆనందంగా ఉన్నాను; దేనికయినా, నమ్మకమే ప్రధానం.
.
వాల్టర్ వాన్ దెర్ వొగెల్వైడ్,

(1170–1228)

జర్మను కవి

.

The Oracle

.

Beset with doubts, in agony      

I sat quite long alone and thought       

How from her service I might be free,

Until a comfort gladness brought.       

This thing a comfort I can hardly call,

’Tis scarce a baby comfort—oh, so small!    

And if I tell you, you’ll be mocking me:       

Yet without cause no one can happy be.       

A little stalk has made me glad to-day;

It promised happiness I never knew:  

I measured with a stalk of straw in play,       

As I had often seen the children do.    

Now listen, if her heart my love has heeded:

“She loves—loves not—she loves!” Which way my hands would bend,        

“She loves me!” always was the end.  

So I am happy; only—faith is needed!

.

Walter von der Vogelweide

German Poet

(1170–1228)

A Harvest of German Verse.  1916.

Ed., trans: Margarete Münsterberg,

http://www.bartleby.com/177/5.html

సాయంవేళ … జార్జ్ హీమ్, జర్మను కవి

కెంపులా మెరిసిన రోజు … ఊదారంగు వన్నెల్లోకి మునిగిపోయింది
అద్భుతమైన తళతళలతో ఏరు స్వచ్ఛంగా పారుతోంది
అలలమీద జోరుగా పోతున్న పడవ తెరచాప… ఊగిసలాడుతోంది
మెరుస్తున్న నీటిమీద సరంగు నీడ నల్లగా కనిపిస్తోంది.

ప్రతి ద్వీపం మీదా శరత్కాలపుటడవులు రోదసి తన రెక్కలు
బారజాపినంత మేరా తమ కుందనపు తలలు తాటిస్తున్నాయి.
చీకటి కనుమల్లోంచి మంద్రంగా ఆకుల గుసగుసలు తేలివస్తున్నాయి
గిరిసీమలనుండి సన్నగా వినవచ్చే తంత్రీ వాదనంలా

అశ్రద్ధగా పట్టుకున్న చేతులనుండి చిక్కని మద్యం
ఒలికిపోయినట్లు, తూరుపు ఇప్పుడు పెల్లుబికిన చీకటిలో
తడిసిపోయింది; దూరంగా … శోక వస్త్రాలు ధరించి 
క్రీనీడల జోళ్లు ధరించి నిశాసుందరి మౌనంగా వేచి ఉంది.

 .

జార్జ్ హీమ్

30 October 1887– 16 January 1912

జర్మను కవి

.

Georg Heyn

.

 

Evening

The Crimson day is steeped in Tyrian dyes;

The stream runs white, washed with a fabulous glaze.

A sail: one with the flying vessel, flies

The skipper’s silhouette, black on the blaze.

On every island autumn’s forests lift

Their ruddy heads where space spreads wide her wings.

From dark defiles low leafy murmurs drift—

Of woodland’s music soft as cithern strings.

With outpoured darkness now the east is soaked,

Like blue wine from an urn that careless hands

Have broken. And afar, in mourning cloaked,

Tall night on shadowy buskins mutely stands.

.

Georg Heym

30 October 1887– 16 January 1912

German Poet

(From “Modern German Poems”

Translated by Babette Deutsch and Avrahm Yarmolinsky)

Poem Courtesy:

Poetry: A Magazine of Verse.  1912–22.

Ed: Harriet Monroe,   (1860–1936).

Volume XXI. No. 3. December, 1922

http://www.bartleby.com/300/2819.html

 

%d bloggers like this: