అనువాదలహరి

సివిల్ ఇంజనీర్లు… ఫీబీ హాఫ్ మన్, జర్మను-అమెరికను కవయిత్రి

వాళ్ళు ప్రకృతి కోటగోడలపై దాడి చేశారు
మందుగుండు, రంధ్రాలువేసే యంత్రాలతో కదిలారు
ఆమె కొండ బురుజులపైకి, చిత్తడి నేలల్లోకి
ఆమె శక్తికి దీటుగా వాళ్ళ నైపుణ్యంతో.

కొండగొర్రె కొమ్ములు మెలితిరిగినట్టు
వాళ్ళ వంతెనలను ఎగసిపడే కెరటాలతో మెలితిప్పినా
వాళ్ళ జలాశయాల దన్ను గోడలమీద
ఆకలిగొన్న పులిలా ఆమె లంఘించినా

వాళ్ళు బీవర్ (Beaver) కళను అనుకరిస్తూ
అడ్డుగోడల్ని సాలెపురుగుల్లా అల్లేరు
గుండెతడిలేని ఏడారిలో పూలు విరబూయించి
ఎడారి నిద్రమత్తుని వదలగొట్టేరు

ప్రకృతి హైమహస్తాల్లోంచి సొరంగాలు తవ్వో
లేక పాములా వంపులు పోయో
దాన్ని ఇనుప దూలాలమధ్య బంధించారు
త్యాగధనుడైన వీరుణ్ణి శిలువకి కట్టినట్టు.

వెన్నెముకలాంటి ఆమె శిఖరాల్ని
భూసంధుల్లో ఒడ్డునుండి ఒడ్డుదాకా విడదీసి
ఆమె కొందచరియలతో ముంచెత్తుతుంటే
వాళ్ళ శక్తిమంతమైన త్రవ్వోడలతో శ్రమించేరు.

నిలకడలేని ప్రియురాల్లా ఆమె కఠినం
ఆగ్రహించిన దేవతలా కర్కశం
అంతలోనే తల్లి ఒడిలా మెత్తన
కొత్త ప్రదేశాలని ఒక్కొక్కటీ వాళ్ళు జయిస్తుంటే.

ఆర్కిటిక్ వృత్త ప్రదేశాలు మొదలుకుని
కర్కటక మకరరేఖల వరకూ
చైనాలోని Yellow Sea ప్రవాహాలనుండి
స్విట్జర్ లాండ్ లోని Matterhorn పర్వతం దాకా

ఇంతవరకు మచ్చికచేయని భూమాతని జయించారు;
ఆమె అప్పుడప్పుడు అగ్నిపర్వత ఫిరంగులు ఎక్కుపెట్టినా
వాళ్ళు ఆమెను తాము చెప్పినట్టు నడుచుకునేలా చేస్తారు
తిరుగుబాటు చేసే నేర్పరులైన కొడుకుల్లా.

.

ఫీబీ హాఫ్ మన్

3rd Oct 1851- 4th July 1927

జర్మను-అమెరికను కవయిత్రి

.

The Civil Engineers

.

They stormed the forts of Nature,

And marched with blast and drill

On her bulwark cliffs and sapping swamps,—

Her strength against their skill.

Though her torrents twisted their bridges

Like the horns of a mountain ram

And burst like a hungry tiger

Through the buttressed walls of their dam;

They threw out new spans like spiders,

And copied the beaver’s art,

And broke the desert’s slumber

With bloom in its rainless heart.

They tunneled her snowy shoulders,

Or wriggled up like a snake,

And laced her with iron girders

Like a martyr lashed to a stake.

And clove her spine-like ridges

From isthmus shore to shore,

And plied their mighty dredges

As she let the landslides pour,

She was harsh as a fickle mistress,

And stern as an angered god,

Then soft as the lap of a mother,

As they conquered her great untrod.

From the circles around the Arctics

To Cancer and Capricorn,

From the yellow streams of China

To the base of the Matterhorn;

They have vanquished their untamed Mother;

Though she thunders volcanic guns,

They force her to do their bidding,

Like masterful rebel sons.

.

Phœbe Hoffman

3rd Oct 1851- 4th July 1927

German-American Poetess

Poem Courtesy:

http://www.bartleby.com/273/92.html

  Contemporary Verse, October 1919.

ముగింపు… ఛార్ల్స్ బ్యుకోవ్ స్కి, అమెరికను

మనమందరం విరిసి ఉండవలసిన వేళలో

విరియడానికి ఎన్నడూ తొందరపడని గులాబుల్లాంటి వాళ్ళమి

ఎంతగా అంటే

చివరికి సూర్యుడు కూడా ఎదురుచూసి చూసి

విసిగెత్తిపోయేడేమోననిపిస్తుంది.

.

ఛార్ల్స్ బ్యుకోవ్ స్కి,

ఆగష్టు 16, 1920 – మార్చి 9, 1994

జర్మన్-అమెరికను కవి

.

Charles Bukowski

.

Finish

.

We are like roses that have never bothered to

bloom when we should have bloomed and

it is as if

the sun has become disgusted with

waiting

.

Charles Bukowski

August 16, 1920 – March 9, 1994

German-American Poet

గుర్తుంచుకోదగ్గ నవ్వు… ఛార్ల్స్ బ్యుకోవ్ స్కీ, జర్మన్- అమెరికను

మా ఇంట్లో అందమైన కర్టెన్లు వేలాడుతూ మరుగుపరిచే
వెడల్పు ఏకాండీ కిటికీ ముందున్న మేజాబల్ల మీద అక్వేరియంలో
“గోల్డ్ ఫిష్” గుండ్రంగా తిరుగుతూ ఉండేవి;
మా అమ్మ, ఎప్పుడూ నవ్వుతూ, మేమందరం
ఆనందంగా ఉండాలని  చెబుతూ ఒకసారి
” హెన్రీ! ఆనందంగా ఉండరా!” అంది.
నిజమే. ఉండగలిగితే
ఆనందంగా ఉండడం మంచిదే.
కానీ మా నాన్న నన్నూ మా అమ్మనీ వారంలో ఎన్నోసార్లు
కొడుతూ ఉండేవాడు, ఆరడుగుల రెండంగుళాల విగ్రహం
లోపల కోపంతో రగిలిపోతూ, ఎందుకంటే అతన్ని లోపలనుండి
ఏది ప్రేరేపిస్తోందో అతనికే అర్థమయేది కాదు.

మా అమ్మ ఒక వెర్రి చేప.
వారానికి రెండుమూడుసార్లు దెబ్బలు తింటున్నా
ఆనందంగా ఉండాలనుకునేది,  నన్నుకూడా ఆనందంగా ఉండమని చెబుతూ,
“హెన్రీ, ఏదీ నవ్వు? ఒక్కసారికూడా నవ్వవేమిరా?”

అని అంటూ తనుకూడా నవ్వేది, ఎలానవ్వాలో నాకు చూపించడానికి.
కానీ, అంత విషాదకరమైన నవ్వు నేనెన్నడూ చూడలేదు.

ఓ రోజు ఆ గోల్డ్ ఫిష్ ఐదూ చచ్చిపోయాయి
పక్కకి వాలిపోయి నీటిమీద తేలాయి
కళ్ళు అలా తెరుచుకుని;
మా నాన్న ఇంటికి వచ్చిన తర్వాత వాటిని పిల్లికి
వంటగది గుమ్మదగ్గర నేలమీదకి విసిరేసాడు
మా అమ్మ అదిచూసి నవ్వింది.
.
ఛార్ల్స్ బ్యుకోవ్ స్కీ
August 16, 1920 – March 9, 1994)

జర్మన్- అమెరికను

ఈ కవితలో అద్భుతమైన శిల్పం ఉంది.  గొప్పకవులెప్పుడూ ప్రతీకలనీ, వాటిని వేటికి అనువర్తిస్తున్నారో ఆ వస్తువుకీ మధ్య గల సారూప్యాన్నీ  చక్కగా వాడుకుంటారు.

తల్లి నవ్వు మొదట చెప్పినప్పుడు, అంతటి విషాదకరమైన నవ్వు ముందెప్పుడూ చూడలేదన్నాడు.  ఆమె తన తండ్రి చేతిలో తన్నులు తింటున్నా ఆనందంగా ఉండాలని తాపత్రయపడేది.  కానీ, చాలా చమత్కారంగా, ఏ పోలికా పైకి చెప్పకుండానే,  అక్వేరియంలో చేపలనీ, అవి గుండ్రంగా ఆ పాత్ర పరిధిలోనే గుడుగుడుగుంచంలా తిరగడాన్నీ పేర్కొన్నాడు.  తన తల్లిది ఆ చేపల్లా ఎంత  మొనాటనస్ జీవితమో సూచించాడు దానిద్వారా.  ఆమెని, “Poor Fish” అని వర్ణిస్తాడు.  ఆ మాటని వినియోగించడంలో కవి ఎంత మెలకువగా, నేర్పుగా  తల్లికీ చేపలకీ సామ్యాన్ని సూచించాడో గమనించవచ్చు. చివరకి “గోల్డ్ ఫిష్” చనిపోయి  పిల్లికి విసిరెస్తే తల్లి నవ్వుతుంది. ఎందుకు? వాటికి విముక్తి కలిగిందికదా అన్న సంతోషంతో. అంటే, తనకి మృత్యువుతప్ప వేరే విముక్తి మార్గం లేదని.  అందుకే ఆ నవ్వు గుర్తుంచుకోవలసిన నవ్వు అని కవి తాత్పర్యం…

Charles Bukowski
Charles Bukowski (Photo credit: Wikipedia)

.

.

A Smile To Remember

.

We had goldfish and they circled around and around
in the bowl on the table near the heavy drapes
covering the picture window and
my mother, always smiling, wanting us all
to be happy, told me, “be happy Henry!”
and she was right: it’s better to be happy if you
can
but my father continued to beat her and me several times a week while
raging inside his 6-foot-two frame because he couldn’t
understand what was attacking him from within.

My mother, poor fish,
wanting to be happy, beaten two or three times a
week, telling me to be happy: “Henry, smile!
why don’t you ever smile?”

And then she would smile, to show me how, and it was the
saddest smile I ever saw

One day the goldfish died, all five of them,
they floated on the water, on their sides, their
eyes still open,
and when my father got home he threw them to the cat
there on the kitchen floor and we watched as my mother
smiled.

.

Charles Bukowski

August 16, 1920 – March 9, 1994)

German-born American Poet, Novelist and short-story Writer.

%d bloggers like this: