అనువాదలహరి

నానావర్ణ సౌందర్యం… గెరార్డ్ మేన్లీ హాప్కిన్స్, ఇంగ్లీషు కవి

                                                                                            Trout

                                                                              Brinded Cow

                                                                                   Finch

ఇన్ని వన్నెచిన్నెలుగల ప్రకృతిని సృష్టించిన దైవానికి నుతులు.
పొడల ఆవులా జంట రంగుల్లో కనిపించే ఆకాశమూ;
విలాసంగా ఈదే చుక్కలచుక్కల జల్లచేపకి పక్కలో గులాబిరంగు మెరుపులూ;
అప్పుడేవెలిగించిన బొగ్గులా చెట్లనుండి రాలిన బాదంలూ; ఫించ్ పక్షుల బారజాచిన రెక్కలూ;
పంటపొలాలతో, చవిటినేలలతో, రకరకాలచెట్లతో కనుచూపుమేరా అలంకరించే ప్రకృతిదృశ్యాలూ
అన్ని రకాల వృత్తులూ, వాటి పరికరాలూ, పనిముట్లూ వగైరా వగైరా. ఓహ్! ఏం చెప్పను!

అందులో మళ్ళీ సహజమైనవీ, అనుకరణలూ, చిత్రమైనవీ, అరుదైనవీ,
చంచలమైనవన్నీ వింత వింత వన్నెల్లో (అవెందుకలా ఉన్నాయో ఎవరు చెప్పగలరు?)
వడియైనవీ, నెమ్మదియైనవీ, తియ్యనివీ, పుల్లనివీ, మెరిసేవీ, అస్పష్టమైనవీ ;
ఇన్నింటి సౌందర్యం మార్పుకి అతీతంగా తీర్చిదిద్దిన ప్రభువు అతను.
అతనికి జేజేలు పలకండి.
.

గెరార్డ్ మాన్లీ హాప్కిన్స్

(28 July 1844 – 8 June 1889)

ఇంగ్లీషు కవి

.

.

Pied Beauty

.

Glory be to God for dappled things

For skies of couple-colour as a brinded cow;

For rose-moles all in stipple upon trout that swim;

Fresh-fire coal chestnut-falls; finches’ wings;

Landscapes plotted and pieced—fold, fallow, and plough;

And all trades, their gear and tackle and trim.

All things counter, original, spare, strange;

Whatever is fickle, freckled (who knows how?)

With swift, slow; sweet, sour; adazzle, dim;

He fathers-forth whose beauty is past change:

Praise Him.

.

Gerard Manley Hopkins

(28 July 1844 – 8 June 1889)

English Poet

Poem Courtesy:

http://www.poemtree.com/poems/PiedBeauty.htm

భగవంతుని వైభవం… గెరార్డ్ మేన్లీ హాప్కిన్స్, ఇంగ్లీషు కవి

ఈ సృష్టి అంతా భగవంతుని వైభవంతో నిండి ఉంది…
కంపించే బంగారు రేకునుండి వెలువడే కాంతిపుంజంలా;
అది గానుగలోంచి ఊరే నూనెలా కొద్దికొద్దిగా వస్తూనే అఖండమౌతుంది.
మరి మనుషులెందుకు అతని అధికారాన్ని లెక్కపెట్టరు?

తరాలు నడచి పోయాయి, నడుచుకుని పోయాయి, నడుచుకుంటూపోయాయి
అందరూ తమ పనుల్లో, శ్రమలో, వేదనల్లో మునిగి తేలేరు;
మనుషులుగా తమ ముద్ర వేసుకున్నారు, కీర్తి ప్రతిష్ఠలు సంపాదించుకున్నారు:
ఇప్పుడామట్టి అంతా ఖాళీ; పాదరక్షలుండడంతో కాళ్ళు తగిలినా పోల్చుకోలేవు.

అయినప్పటికీ, ప్రకృతికిలో “నిండుకుంది” అన్న భావన లేదు;
ప్రతి వస్తువులోనూ అపురూపమైన అంతరాంతరాల్లో తాజాదనం ఇంకా మిగిలే ఉంది
పడమటి దిక్కున చివరి వెలుగులు అంతరించి చీకటి ముసిరినా
ఆహ్! తెల్లవారుతూనే తూరుపుదిక్కున గోధుమవన్నె పొడుస్తుంది …
దానికి కారణం పవిత్రాత్మ ఈ సృష్టిగురించి గుండెనిండా
ప్రేమతో తలపోస్తుంది. అంతే, దానికి రెక్కలొస్తాయి.
.
గెరార్డ్ మేన్లీ హాప్కిన్స్
(28 July 1844 – 8 June 1889)
ఇంగ్లీషు కవి

.

.

God’s Grandeur

The world is charged with the grandeur of God.

It will flame out, like shining from shook foil;

It gathers to a greatness, like the ooze of oil

Crushed.  Why do men then now not reck his rod?

Generations have trod, have trod, have trod;

And all is seared with trade; bleared, smeared with toil;

And wears man’s smudge and shares man’s smell: the soil

Is bare now, nor can foot feel, being shod.

And for all this, nature is never spent;

There lives the dearest freshness deep down things;

And though the last lights off the black West went

Oh, morning, at the brown brink eastward, springs—

Because the Holy Ghost over the bent

World broods with warm breast and with ah! bright wings.                                             

.

Gerard Manley Hopkins

(28 July 1844 – 8 June 1889)

English Poet

Poem Courtesy:

http://www.poemtree.com/poems/GodsGrandeur.htm

నానావర్ణ సౌందర్య జగతి… గెరార్డ్ మేన్లీ హాప్కిన్స్, ఇంగ్లీషు కవి

ఇంత చిత్రవిచిత్రమైన జగతిని ప్రసాదించిన దేవునికి నమస్సులు!

కపిలధేనువులాంటి రంగు రంగుల ఆకాసామూ,

రంగు వేసినట్టు నీటిలో ఈదే చేపపిల్లలూ,

రాక్షసిబొగ్గు మంటలాంటి రాలిపడ్ద చెస్ట్ నట్ పళ్ళూ,

భిన్న వర్ణాల చారల రెక్కలున్న పిట్టలూ,

పశులమందలతో, పంటలతో, దుక్కిదున్నీ, బీడుపడీ నేలా,

జాలరీ, దర్జీ, మొదలైన ఎన్నో వృత్తిపనుల వారి పనిముట్లూ,

ప్రకృతి సిద్ధమూ, మానవ నిర్మితమూ, అరుదైనవీ, చిత్రమైన వస్తువులూ,

ఊసరవెల్లిలా స్థిరంలేని రంగులుగల జీవులూ (ఎలా మారుస్తాయో ఎవరికెరుక?)

కొన్ని వేగవంతమూ, కొన్ని నెమ్మది; కొన్ని తీయన, కొన్ని పుల్లన;

కొన్ని మిరుమిట్లు గొలుపుతూ, కొన్ని కాంతి విహీనంగా

ఇన్నిటినీ సృష్టించగల ఆ దేముని సౌందర్యం … మార్పుకి అతీతం

అతన్ని కీర్తించండి!

.

గెరార్డ్ మేన్లీ హాప్కిన్స్

28 July 1844 – 8 June 1889

ఇంగ్లీషు కవి

.

.

Pied Beauty

.

Glory be to God for dappled things,

For skies of couple-color as a brinded cow,

For rose-moles all in stipple upon trout that swim;

Fresh-fire coal chestnut-falls, finches’ wings;

Landscape plotted and pieced, fold, fallow and plough,

And all trades, their gear and tackle and trim.

All things counter, original, spare, strange,

Whatever is fickle, freckled (who knows how?)

With swift, slow; sweet, sour; adazzle, dim.

He fathers-forth whose beauty is past change;

Praise him.

.

Gerard Manley Hopkins

28 July 1844 – 8 June 1889

English Poet

Poem Courtesy:

http://wonderingminstrels.blogspot.in/1999/06/pied-beauty-gerard-manley-hopkins.html

%d bloggers like this: