అనువాదలహరి

స్నేహగీతం … టాగోర్

గతించిన మధురక్షణాల జ్ఞాపకాలు

ఎన్నడైనా మనస్మృతిపథం వీడగలవా? 

స్వయంగా అనుభవించినవి; మన జీవనాడి; 

అవి ఎన్నడు మరువగలం? 

.

మిత్రమా! ఒక సారి మరలిరా!

వచ్చి నా జీవితాన్ని పంచుకో.

చిరునవ్వులూ, కన్నీళ్ళూకలబోసుకుందాం

అదొక తీపిగురుతుగా మిగుల్చుకుందాం 

.

వేకువనే మనిద్దరం కలిసి పూలు కోసేవాళ్ళం

ఇద్దరం గంటలకొద్దీ ఉయ్యాలలూగేవాళ్ళం

వంతులువారీగా ఇద్దరం వేణువూదుకున్నాం   

చెట్లనీడన పాటలు పాడుకున్నాం  

.

మధ్యలో ఎప్పుడో విడిపోయాం

ఒకరి చిరునామా ఒకరికి తెలియకుండా.

మళ్ళీ జీవితంలో ఎప్పుడైనా నాకెదురైతే

వింతగా చూడకు… రా! స్నేహాన్ని తిరిగి చిగురించు.  

.

 టాగోర్

Rabindranath Tagore won the Nobel prize for li...
Rabindranath Tagore won the Nobel prize for literature. It is the first Nobel prize won by Asia. (Photo credit: Wikipedia)

.

The memories of the good old days

Can you ever forget it?

It was seen by our eyes, was voice of our life

Can it ever be forgotten?

.

Come back once more, my friend

Come and be a part of my life

We will talk of smiles and tears

And will feel very good about it

.

Together we have plucked flowers in the dawn

Together we have spent hours on the swing

Together we have played the flute

Sang the songs under the shade

We parted in between, never knew where we went

If again I see you someday,

Come and be a part of my life.

.

Tagore

(English Translation of the Poem courtesy: Usharani of maruvam.blogspot.com)

స్నేహం— హెన్రీ డేవిడ్ థొరో

http://t2.gstatic.com/images?q=tbn:ANd9GcTWj1kOr9ezu9cvkTWnu05-p9NX5OuCplQjTZakuVkQp8go_9K9
Image Courtesy: http://t2.gstatic.com

.

నేనో క్షణం ప్రేమను గురించి ఆలోచిస్తాను,

అలా ఆలోచిస్తుంటే,

అదొక లోకంలా,

అమృతాశనంలా,

భూమినీ – స్వర్గాన్నీ దగ్గరచేసే వారథిలా కనిపిస్తుంది.

.

అది నాకు అన్నిటికంటే ఎక్కువ ఆనందాన్నిస్తుందని తెలుసు గాని,

ఎందుకో, ఎలాగో చెప్పమంటే మాత్రం

నా తరం కాదు,

చచ్చినా చెప్పలేను.

.

నేను నా నేస్తాన్ని అడగాలనుకుంటాను అదెలాఉంటుందో…

తీరా సమయం వచ్చేవేళకి

అన్నిటికంటే నాకు ప్రేమే ఎంతో మనోహరంగా ఉంటుంది.

దాంతో నేను మూగనైపోతాను.

.

నిజం తెలుసుకోగలిగితే,

ప్రేమ మూగది… మాట్లాడలేదు.

కాని ఆలోచిస్తుంది, అన్నీ చేస్తుంది,

అది తనని తాను ఏ భాష

అవసరమూ లేకుండా ప్రకటించుకో గలదు.

మనిషి సత్యాన్ని ప్రేమించి, ఆచరణలో పెట్టవచ్చు,

సౌందర్యాన్ని ప్రశంసించవచ్చు,

మంచిదనాన్ని వదిలిపెట్టకపోవచ్చు…

గౌరవించడానికి యోగ్యత ఉన్నంతమేరకు.

.

కాని, ఈ మూడూ కలగలిసి,

కలవడం వాటి సహజ లక్షణం,

ఒక ఆత్మను కేంద్రంగా చేసుకుని,

లావణ్యానికి ఆశ్రయంగా మలుచుకుంటే,

.

అదే సారూప్యతతో, రాగద్వేషాల్లా

మమ్మల్ని జంటగా కుదిర్చి,

ఇద్దరికీ శాశ్వతంగా

ఒకే భవితవ్యాన్ని వ్రాసి విడిచిపెడితే,

.

ఒకరికొకరు సాయం చేసుకుంటూ,

సేవలు చేస్తూ, చేసిన సేవలకు బాధపడక,

ప్రేమ తంత్రులను ఇంకా బిగువుగా పట్టి ఉంచి, 

ఎవరికివారుగాకాక, ఇద్దరూ ఒకటైనపుడు మాత్రమే,

.

మనిషి,  మనిషికి మాత్రమే సాధ్యమైన

తన సమర్థతని ఋజువుచేసుకోగలడు.

ప్రేమకు ఏ శక్తి అయితే ఉందో,

అది నిరంతరాయంగా

అతని ఆత్మకి ప్రేరణనిస్తూనే ఉంటుంది.

————————————

రెండు సింధూర వృక్షాలు, ఒకదాని పక్కనొకటి,

భీకరమైన తుఫానులు, పెనుగాలులూ,ఉప్పెనలూ తట్టుకుని

మైదానానికంతటికీ గర్వకారణంలా,

రెండూ ఏపుగా, ఆరోగ్యంగా పెరుగుతాయి.

.

బయట మాత్రం ఒకదానినొకటి తగిలీ తగలనట్టుగా ఉంటాయి.  

కాని, భూమిలోపల, అట్టడుగుపొరల్లో,

వాటీ వేర్లు ఒకదానినొకటి

ఎంత విడదీయలేనంతగా పెనవేసుకుపోతాయంటే,

నువ్వు ఆశ్చర్యపోక మానవు.

.

హెన్రీ డేవిడ్ థొరో

(July 12, 1817 – May 6, 1862)

Please Hear the poem here:

.

Friendship

.

I think awhile of Love, and while I think,
Love is to me a world,
Sole meat and sweetest drink,
And close connecting link
Tween heaven and earth.
I only know it is, not how or why,
My greatest happiness;
However hard I try,
Not if I were to die,
Can I explain.

I fain would ask my friend how it can be,
But when the time arrives,
Then Love is more lovely
Than anything to me,
And so I’m dumb.

For if the truth were known, Love cannot speak,
But only thinks and does;
Though surely out ’twill leak
Without the help of Greek,
Or any tongue.

A man may love the truth and practise it,
Beauty he may admire,
And goodness not omit,
As much as may befit
To reverence.

But only when these three together meet,
As they always incline,
And make one soul the seat,
And favorite retreat,
Of loveliness;

When under kindred shape, like loves and hates
And a kindred nature,
Proclaim us to be mates,
Exposed to equal fates
Eternally;

And each may other help, and service do,
Drawing Love’s bands more tight,
Service he ne’er shall rue
While one and one makes two,
And two are one;

In such case only doth man fully prove
Fully as man can do,
What power there is in Love
His inmost soul to move
Resistlessly.

________________________________

Two sturdy oaks I mean, which side by side,
Withstand the winter’s storm,
And spite of wind and tide,
Grow up the meadow’s pride,
For both are strong

Above they barely touch, but undermined
Down to their deepest source,
Admiring you shall find
Their roots are intertwined
Insep’rably.
.

Henry David Thoreau

(July 12, 1817 – May 6, 1862)

American author, poet, philosopher, abolitionist, naturalist, tax resister, development critic, surveyor, historian, and leading transcendentalist.

ఇంతేనా… ఏన్ బ్రాంటి (Anne Bronte)

 

http://cdn.elev8.com/files/2010/08/a-prayer-for-times-like-these.jpg
Image Courtesy: http://cdn.elev8.com

.

ఓ దైవమా! జీవితం

నాకు చూపగలిగింది ఇంతే అయినపుడు,

వేదనాభరితమైన నా నుదిటిని,

సేదదీర్చే నీ చల్లని చెయ్యి తాకనపుడు

.

ఇంతకంటే కాంతివంతంగా

ఈ ఆశాదీపము జ్వలించలేనపుడు

నేను బ్రహ్మానందాన్ని కేవలం కలగంటూ,

శోకమయ జీవితంలోకి కళ్ళు తెరవవలసివచ్చినప్పుడు

.

అన్ని సుఖాలూ సెలవుతీసుకున్నాక,

సాంత్వననిచ్చే స్నేహంకూడా కనుమరుగవుతున్నప్పుడు

నేను ప్రేమకై తిరుగాడుతుంటే 

ఎప్పుడూ అది అందనంతదూరంలోనే ఉన్నప్పుడు

.

ఇతరుల ఆదేశాలకు బానిసలా బ్రతుకుతూ,

తిరిగే తిరుగుడుకీ, పడే పాటుకీ ఫలితం శూన్యమైనపుడు,

ఇతరుల నిత్య సంరక్షణలో, పదే పదే బాధపడుతూ,

అసహ్యించుకోబడుతూ, అయినా, జ్ఞాపకానికి నోచుకోనపుడు

.

నేరాల్నీ, పాపాల్నీ చూసి బాధపడుతూ,

లోపల అంతర్లీనంగానూ, బయటా ప్రవాహంలానూ

పెల్లుబుకుతున్న  బాధను

నిర్మూలించడానికి అశక్తులమైనపుడు

.

నేను నేర్పిన మంచీ,

నేను పంచుకున్న హృదయానుభూతులూ

నాకే తిప్పికొడితే,

నేనది దిగమింగుకోలేనపుడు

.

సూర్యుడి ప్రకాశమెప్పుడూ మేఘాఛ్ఛాదితమై,

వెలుగురేక కనరానపుడు,

వేసవి రాకముందే

శిశిరం అనుభవించవలసివచ్చినపుడు

.

జీవితమంతా దుఃఖభాజనమైనపుడు,

దేవా! నన్ను నీ దగ్గరికి త్వరగా తీసుకుపో!

లేదా,

నా దౌర్భాగ్యాన్ని భరించగలిగే శక్తిని ప్రసాదించు.

.

ఏన్ బ్రాంటి

బ్రిటిషు కవయిత్రి, నవలాకారిణి

(17 January 1820 – 28 May 1849)

.


ఒక కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు ఒకే కళలో పేరుప్రఖ్యాతులు  సంపాదించడం అరుదు. అటువంటి ఘనత బ్రాంటి సిస్టర్స్ సాధించారు .  ఎమిలీ 
బ్రాంటి (Wuthering Heights), చార్లెట్ బ్రాంటి (Jane Eyre) మరియు ఏన్ బ్రాంటి (Agnes Grey). ఈ ముగ్గురు వ్రాసిన నవలలూ, ఇంగ్లీషు సాహిత్యంలో క్లాసిక్స్ గా కీర్తి గడించాయి. 29 ఏళ్ళకే గుండెసంబంధమైన  క్షయవ్యాధితో మరణించిన ఏన్, తన అక్కలలా రొమాంటిక్ శైలిలో కాకుండా, వాస్తవానికి దగ్గరగా, విమర్శనాత్మక పధ్ధతిలో   వ్రాసింది. ఈమె మంచి కవయిత్రి కూడ. అందుకు ఈ ఒక్క కవిత చాలు

.

If This Be All

.

O God! if this indeed be all
That Life can show to me;
If on my aching brow may fall
No freshening dew from Thee, —

If with no brighter light than this
The lamp of hope may glow,
And I may only dream of bliss,
And wake to weary woe;

If friendship’s solace must decay,
When other joys are gone,
And love must keep so far away,
While I go wandering on, —

Wandering and toiling without gain,
The slave of others’ will,
With constant care, and frequent pain,
Despised, forgotten still;

Grieving to look on vice and sin,
Yet powerless to quell
The silent current from within,
The outward torrent’s swell:

While all the good I would impart,
The feelings I would share,
Are driven backward to my heart,
And turned to wormwood, there;

If clouds must ever keep from sight
The glories of the Sun,
And I must suffer Winter’s blight,
Ere Summer is begun;

If life must be so full of care,
Then call me soon to Thee;
Or give me strength enough to bear
My load of misery.

(1846)

ANNE BRONTE

British Poet and Novelist

%d bloggers like this: