అనువాదలహరి

పాప… ఎజ్రా పౌండ్, అమెరికను కవి

ఈ కవిత నేపథ్యం గురించి అందులోని గ్రీకు పౌరాణిక పాత్రలు గురించి, దాన్ని ఏ రకంగా వ్యాఖ్యానించుకోవచ్చు నన్న విషయం గురించి చాలా చర్చలే ఉన్నాయి. .. స్పష్టత, సంక్షిప్తత, నిర్దుష్టత, మాటలపొదుపు లక్ష్యంగా గతశతాబ్దం తొలినాళ్లలో వచ్చిన ఇమేజిజం అన్న కవిత్వోద్యమంలో ఒక ముఖ్యపాత్రధారి ఐన ఎజ్రా పౌండ్ వ్రాసిన ఈ కవిత ఆ ఉద్యమ స్ఫూర్తిని ప్రతిబింబించే కవిత. దీనికి నాకు తోచిన వ్యాఖ్యానం ఈ అనువాదం. ఇది అతని ఉద్దేశ్యం కాదు, కానక్కరలేదు.

అప్పుడే పుట్టిన పాపని చేతిలోకి తీసుకుంటున్నప్పుడు కలిగిన అనుభవంగా దీన్ని నేను వ్యాఖ్యానిస్తున్నాను.

.

నా చేతిలోకి ఒక చెట్టుని అందుకున్నాను.

దాని సారం నా చేతులలోకి ప్రాకుతోంది.

నా గుండెలో ఒక చెట్టు మొలిచింది

అధోముఖంగా.

ఇప్పుడు చేతులుచాచినట్టు నానుండి కొమ్మలు వ్యాపిస్తున్నాయి.

పాపా, నువ్వు మహావృక్షానివే!

నిన్ను ఆనుకుని నాచులాటివెన్నో బ్రతుకుతై.

పిల్లగాలికి తల ఊచే ఊదారంగుపువ్వువీ నువ్వే.

ఎంతో ఉన్నతమైనదానివి నువ్వు.

నిన్ను పసిపాపగా చూడడం ఈ లోకపు దృష్టిలోపం.

.

ఎజ్రా పౌండ్

(30 October 1885 – 1 November 1972)

అమెరికను కవి

.

Ezra Pound
Image Courtesy: http://en.wikipedia.org/wiki/File:Ezra_Pound_2.jpg

.

A Girl 

.

The tree has entered my hands,

The sap has ascended my arms,

The tree has grown in my breast-

Downward,

The branches grow out of me, like arms.

Tree you are,

Moss you are,

You are violets with wind above them.

A child – so high – you are,

And all this is folly to the world.

.

Ezra Pound

(30 October 1885 – 1 November 1972)

Expat American Poet

Poem Courtesy:

http://famouspoetsandpoems.com/poets/ezra_pound/poems/18774 

అనైతికం … ఎజ్రా పౌండ్, అమెరికను కవి

మనం ప్రేమకోసం, తీరుబడికోసం అర్థిస్తాం
మిగతావి ఏవీ అర్రులుజాచేంత గొప్పవి కావు

నేను చాలా దేశాలు తిరిగినా
జీవితంలో ప్రత్యేకత ఏదీ కనిపించలేదు.

గులాబిరేకలు వాడికృశిస్తేనేం
నేను నా ఇష్టమైనది ఆరగిస్తాను

హంగేరీలో ఘనకార్యాలు చేసేకంటే
అందరి నమ్మకాలూ దాటి ముందుకెళతాను.
.
ఎజ్రా పౌండ్

(30 October 1885 – 1 November 1972)

అమెరికను కవి.

Ezra Pound
Image Courtesy: http://en.wikipedia.org/wiki/File:Ezra_Pound_2.jpg

.

An Immorality

.

Sing we for love and idleness,

Naught else is worth the having.

Though I have been in many a land,

There is naught else in living.

And I would rather have my sweet,

Though rose-leaves die of grieving,

Than do high deeds in Hungary *

To pass all men’s believing.

Ezra Pound

(30 October 1885 – 1 November 1972)

American Poet

Notes for students:

* high deeds in Hungary = I believe this refers to heroic deeds in Hungary

                                         during World War I

Poem Courtesy:

http://www.poemtree.com/poems/Immortality.htm

జానపదగీతిక … ఎజ్రా పౌండ్, అమెరికను కవి

వెలుగు ఆమె హేలగా మారి, కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ

మనుషాకృతుల్లో ఎన్నో క్రీనీడలను ప్రాకిస్తోంది. 

చూడు, వెలుగు మనసు దోచి మనచే ఎలా కూనిరాగాలు తీయిస్తోందో! 

ఆమె క్షణకాలం సూర్యుడి వెలుగుని ధరిస్తుంది

నా మనసు ఎన్నడో ఆమె అధీనమైపోయింది .

కీకారణ్యాల్లో ఏ జింకపిల్లలూ, దుప్పులూ సంచరించవు

అంత నిశ్శబ్దంగా ప్రాకుతోంది సూర్యరశ్మి;

ఆమె నడుస్తున్నంత మేరా, తలవాల్చిన పచ్చిక మీద

మెరుస్తున్న పచ్చలు ఎక్కడ త్వరగా ఇగిరిపోతాయోనని సూరీడు

వాటిని క్రిందకి తరుముతున్నాడు; సాలీడు సైతం

ఆమె అంత నాజూకుగా, సన్నగా తన పట్టునెయ్యలేదు.

.

ఎజ్రా పౌండ్

(30 October 1885 – 1 November 1972)

అమెరికను కవి .

Ezra Pound
Image Courtesy: http://en.wikipedia.org/wiki/File:Ezra_Pound_2.jpg

.

Ballatetta *

The light became her grace and dwelt among

Blind eyes and shadows that are formed as men;

Lo, how the light doth melt us into song:

The broken sunlight for a healm* she beareth

Who has my heart in jurisdiction.

In wild-wood never fawn nor fallow* fareth

So silent light; no gossamer* is spun  

So delicate as she is, when the sun

Drives the clear emeralds from the bended grasses

Lest they should parch too swiftly, where she passes.

Ezra Pound 

(30 October 1885 – 1 November 1972)

American Poet and Critic

[Notes:   Ballatetta = “little ballad” in Italian

                  healm = helm

                 fallow = a type of deer

                gossamer = spider web]

Poem Courtesy:

http://www.poemtree.com/poems/Ballatetta.htm

ఒడంబడిక … ఏజ్రా పౌండ్, అమెరికను కవి

వాల్ట్ వ్హిట్మన్! నేను నీతో ఒడంబడిక చేసుకుంటున్నాను —

నిన్ను చాలా కాలం అసహ్యించుకున్నాను.

నేను నీ దగ్గరకి ఒక వయసొచ్చిన కొడుకు

మూర్ఖుడైన తండ్రిదగ్గరకి వచ్చినట్టు వచ్చేను

ఇపుడునాకు నీతో స్నేహం చెయ్యగల విజ్ఞత వచ్చింది

కొత్త చెట్లను నరికింది నువ్వు; వాటిని వస్తువులుగా

మలచవలసిన సమయం ఆసన్నమయింది.

మనదగ్గిర ఒక చేవగల కర్ర, వేర్లూ ఉన్నాయి

మనిద్దరం ఒక అంగీకారానికి వద్దాం.
.

ఎజ్రా పౌండ్

(30 October 1885 – 1 November 1972)

అమెరికను కవి

.

Ezra Pound
Image Courtesy: http://en.wikipedia.org/wiki/File:Ezra_Pound_2.jpg

A Pact

I make a pact with you, Walt Whitman—
I have detested you long enough.
I come to you as a grown child
Who has had a pig-headed father;
I am old enough now to make friends.
It was you that broke the new wood
Now is a time for carving.
We have one sap and one root—
Let there be commerce between us.

.

Ezra Pound

(30 October 1885 – 1 November 1972)

American Poet

poem courtesy

http://2dayspoem.blogspot.com/2009/02/pact.html

కొరదా సూచనలు… ఎజ్రా పౌండ్, అమెరికను కవి

ఓ నా కవితలారా! రండి, మనిషి బలహీనతలు బయటపెడదాం
భవిషత్తు గురించి చింతలేని, స్థిరమైన ఉద్యోగం ఉన్న మనిషంటే మనకున్న అసూయ వెళ్ళగక్కుదాం.
నా కవితలారా! మీకు చాలా బద్ధకస్తులు.
ఇలా అయితే మీ జీవితం దారుణంగా ముగుస్తుంది.
మీరు రోడ్లంబట తిరుగుతారు, సందుమలుపుల్లోనూ, బస్సు స్టాపుల్లోనూ పచార్లు చేస్తారు,
మీరు ఊరికే పనీపాటా లేకుండా ఉన్నారు.
కనీసం మీరు మనిషి అంతరాంతరాలలోని ఉదాత్తతనైనా బయటపెట్టరు.
మీకు చివరి రోజులు మరీ దుర్భరంగా గడవడం ఖాయం.

నా సంగతొ అడుగుతున్నారా? నేనిప్పటికే సగం పిచ్చెక్కి ఉన్నాను.
నేను మీతో ఎంతగా వాగి వాగి ఉన్నానంటే నా చుట్టూ మీరే కనిపిస్తున్నారు.
కొవ్వెక్కి బలిసిన పశువులు. దిగంబరులు! మీకు సిగ్గు లేదు.

కానీ, ఇదిగో, అన్నిటిలోకీ కొత్త కవితా!
నీకు బాగా పెంకితనం చెయ్యడానికి అట్టే వయసు రాలేదు.
నేను చైనా నుండి సర్పచిహ్నాలు అల్లిన
ఆకుపచ్చకోటు ఒకటి కొనితెస్తానులే.
ఈటలీ నుండి శాంతా మేరియా చర్చి లో బాలయేసు విగ్రహానికి తొడిగే
ఎర్రని పట్టు పంట్లాలు తీసుకొస్తానులే.

లేకపోతే మనకి మంచి అభిరుచులు లేవనుకుంటారు
మన వంశంలో ఏ కోశానా ఆ జాడలు లేవంటారు.
.
ఎజ్రా పౌండ్

30 October 1885 – 1 November 1972

అమెరికను కవి.

Ezra Pound
Image Courtesy: http://en.wikipedia.org/wiki/File:Ezra_Pound_2.jpg

.

Further Instructions

.

Come, my songs, let us express our baser passions.

Let us express our envy for the man with a steady job and no worry about the future.

You are very idle, my songs;

I fear you will come to a bad end.

You stand about the streets. You loiter at the corners and bus-stops,

You do next to nothing at all.

You do not even express our inner nobility;

You will come to a very bad end.

And I? I have gone half cracked.

I have talked to you so much that I almost see you about me,

Insolent little beasts! Shameless! Devoid of clothing!

But you, newest song of the lot,

You are not old enough to have done much mischief.

I will get you a green coat out of China

With dragons worked upon it.

I will get you the scarlet silk trousers

From the statue of the infant Christ at Santa Maria Novella;

Lest they say we are lacking in taste,

Or that there is no caste in this family.

.

Ezra Pound

30 October 1885 – 1 November 1972

American Poet

The New Poetry: An Anthology.  1917.

 Harriet Monroe, ed. (1860–1936).

పీసా గీతం LXXXI … ఎజ్రా పౌండ్ , అమెరికను

నువ్వు ప్రేమించిందే శాశ్వతం, మిగతాదంతా పనికిమాలినదే

నువ్వు ప్రేమించించింది నీనుండి వేరుచెయ్యబడలేదు

నువ్వు ప్రేమించేదే నీ అసలైన వారసత్వం,

ఈ సృష్టి ఎవరిది, నాదా, నీదా, లేక ఎవరికీ చెందదా?

ముందుగా గ్రహించేది దృశ్యమానం, తర్వాతే స్థూలప్రపంచం

స్వర్గం… అది నరకలోకలోకపు చావడులలో ఉన్నా

నువ్వు ప్రేమించేదే నీ అసలైన వారసత్వం

నువ్వు ప్రేమించేది నీ నుండి లాక్కోబడలేదు.

.

ఎజ్రా పౌండ్

30 October 1885 – 1 November 1972

అమెరికను

.

Ezra Pound
Image Courtesy: http://en.wikipedia.org/wiki/File:Ezra_Pound_2.jpg

.

Pisan Cantos, LXXXI

What thou lovest well remains, the rest is dross

What thou lov’st well shall not be reft from thee

What thou lov’st well is thy true heritage

Whose world, or mine or theirs or is it of none?

First came the seen, then thus the palpable

Elysium, though it were in the halls of hell,

What thou lovest well is thy true heritage

What thou lov’st well shall not be reft from thee

.

Ezra Pound 

30 October 1885 – 1 November 1972

British Expat Poet

Pisan Cantos… LXXXI… Ezra Pound, American Poet

నువ్వు దేన్ని బాగా  ఇష్టపడతావో


అదే నీతో నిలిచేది, మిగతాది అంతా రద్దే;


నువ్వు దేన్ని గాఢంగా ప్రేమిస్తావో


దాన్ని నీనుండి ఎవరూ లాక్కో లేరు;


నువ్వు దేన్ని అమితంగా కాంక్షిస్తావో,


అదే నీ నిజమైన వారసత్వం.


ఈ ప్రపంచం ఎవరిది? నాదా?


వాళ్ళదా?  ఎవరిదీ కాదా?


మొదటగా తెలిసేది దృశ్యమాన జగత్తు,


తర్వాతే అనుభూతిమయ నందనవనాలు


అవెంత నరకంలో ఉన్నా.


నువ్వు దేన్ని అమితంగా కాంక్షిస్తావో,


అదే నీ నిజమైన వారసత్వం.


నువ్వు దేన్ని గాఢంగా ప్రేమిస్తావో


దాన్ని నీ నుండి ఎవరూ లాక్కో లేరు;


.


ఎజ్రా పౌండ్

30 October 1885 – 1 November 1972

అమెరికను

.

 

English: Ezra Pound in 1913
English: Ezra Pound in 1913 (Photo credit: Wikipedia)

.

Pisan Cantos…  LXXXI

What thou lovest well remains,
the rest is dross
What thou lov’st well shall not be reft from thee
What thou lov’st well is thy true heritage
Whose world, or mine or theirs
or is it of none?
First came the seen, then thus the palpable
Elysium, though it were in the halls of hell,
What thou lovest well is thy true heritage
What thou lov’st well shall not be reft from thee
.

Ezra Pound

30 October 1885 – 1 November 1972

American Expatriate Poet

ఒక మెట్రో స్టేషనులో… ఎజ్రా పౌండ్, అమెరికను

జన సమూహంలో ఈ వదనాల దివ్య సందర్శనం…

తడిసిన గుబురుపొదలలో కవటాకుల సౌందర్యం. 

.

ఎజ్రా పౌండ్

 (30 October 1885 – 1 November 1972)

అమెరికను

ఈ కవిత చిన్నదే గాని, దీని వెనక పెద్ద కథ ఉంది.

ఎజ్రాపౌండ్… కవిత్వానుభవం.  

ఒక రోజు పారిస్ లో “Concorde” మెట్రో స్టేషన్ లోంచి బయటకి వస్తూ  ఎజ్రా పౌండ్ ఒక అందమైన ముఖాన్ని చూశాడు. తర్వాత మరొకటి, మరొకటి, ఇంకొకటి చూశాడు. ఆ తర్వాత ఒక అందమైన చిన్నపిల్ల ముఖం, తర్వాత ఒక అందమైన స్త్రీ ముఖం చూశాడు. తర్వాత రోజల్లా వాటి అర్థం ఏమిటి అని తర్కించాడు. ఆ అనుభూతిని ప్రకటించడానికి తగిన మాటలు దొరకలేదు. ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళుతున్నప్పుడుకూడా ప్రయత్నిస్తునే ఉన్నాడు. అకస్మాత్తుగా అతనికి సరియైన అభివ్యక్తి దొరికింది. “అంటే మాటలు కాదు, ఒక సమీకరణం, మాటల్లో కాదు, రంగులకలబోతలో. అంటే వివిధవర్ణాలమిశ్రమంలా. నేనే గనక ఒక చిత్రకారుడు అయిఉంటే, నాకే గనక తరుచుగా అటువంటి అనుభవాలు జరిగిఉంటే, లేదా నాకే గనక తగిన రంగులూ, కుంచెలూ సమీకరించగల ఓపిక ఉండి ప్రయత్నం చెయ్యగలిగి ఉంటే, నేను ఆ అనుభూతిని ‘ఒక క్రమంలో ప్రకటించిన రంగులద్వారా’ అంతవరకు ఎవరూ ప్రయత్నించని ఒక కొత్త ఉద్యమానికి  తెరలేపేవాడిని” అంటాడు. దాన్ని అతడు “ఏక ప్రతీక పద్యం” (Single Image Poem) అన్నాడు… ఒకదానిమీద ఒకటిగా రంగులు ముంచెత్తుతూ. (నిజానికి ఇలాంటి కవితలు పాతతరంలో ఆదూరి సత్యవతీ దేవి, సిద్ధార్థ, సౌభాగ్య లాంటి వాళ్ళు రాసేరు). ఆ మెట్రో స్టేషనునుండి బయటపడినప్పటినుండి తనుచిక్కుకున్న విషమస్థితిలోంచి బయటపడడానికి అదొక మార్గం అనుకున్నాడు. దానిప్రభావంలో ఒక ముప్ఫైపాదాల కవిత రాసేడు.  కానీ ఆ కవితని చింపిపారేసేడు. ఎందుకంటే, అది “work of Second Intensity” అవడం వల్ల అంటాడు. ఆరునెలలు పోయాక అందులో సగం నిడివి ఉన్న కవిత, ఏడాది గడిచేక ఒక హైకూలాంటి పైన పేర్కొన్నకవిత రాసేడట. దానికి వ్యాఖ్యానం రాస్తూ తన “ఇమేజిజం” ఉద్యమానికి మూలకందమైన మాటలు అంటున్నాడు ఇలా: ఒక ఆలోచనా స్రవంతిలోకి కొట్టుకుపోకపోతే ఇది చాలా అర్థ రహితంగా కనిపిస్తుందని ఘంటాపథంగా చెప్పగలను. ఇలాంటి కవితలలో ఒకడు (కవి)ఒకానొక క్షణాన్ని (అప్పటి అనుభూతిని… నా అభిప్రాయం) రికార్డుచెయ్యడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆ క్షణంలో తటస్థమైన బాహ్యవస్తువు (ప్రేరకం)సూటిగా లోనికి పోయి ఒక ఆత్మాశ్రయమైన వస్తువుగా రూపుదిద్దుకుంటోంది. 

.

  

English: Ezra Pound in 1913
English: Ezra Pound in 1913 (Photo credit: Wikipedia)

.

In a Station of the Metro

.

The apparition of these faces in the crowd;

Petals on a wet, black bough.

.

Ezra Pound 

(30 October 1885 – 1 November 1972)

American

[Pound’s own words about its composition:

“Three years ago in Paris I got out of a `metro’ train at La Concorde, and saw suddenly a beautiful face, and then another and another, and then a beautiful child’s face, and then another beautiful woman, and I tried all that day to find words for what this had meant to me, and I could not find any words that seemed to me worthy, or as lovely as that sudden emotion. And that evening, as I went home along the Rue Raynouard, I was still trying, and I found, suddenly, the expression. I do not mean that I found words, but there came an equation… not in speech, but in little splotches of colour. It was just that — a  `pattern’, or hardly a pattern, if by `pattern’ you mean something with a `repeat’ in it. But it was a word, the beginning, for me, of a language in colour. I do not mean that I was unfamiliar with the kindergarten stories about  colours being like tones in music. I think that sort of thing is nonsense. If you try to make notes permanently correspond with particular colour, it is like tying narrow meanings to symbols.

That evening, in the Rue Raynouard, I realized quite vividly that if I were like a painter, or if I had, often, that kind of emotion, or even if I were a painter, or if I had the energy to get paints and brushes and keep at it, I might found a new school of painting, of `non-representative’ painting, a painting that would speak only by arrangements in colour… The `one image poem’ is a form of super-position, that is to say, it is one idea set on top of another. I found it useful in getting out of the impasse in which I had been left by my metro emotion. I wrote a thirty-line poem, and destroyed it because it was what we called work `of second intensity.’ Six months later I made a poem half that length; a year later I made the following hokka-like sentence [In a Station of the Metro]. I dare say it is meaningless unless one has drifted into a certain vein of thought. In a poem of this sort one is trying to record the precise instant when a thing outward and objective transforms itself, or darts into a thing inward a subjective.”

Ezra Pound, quoted in A Guide to Ezra Pound’s Personae (1926). K. K. Ruthven (1969).]

Poem and Commenatary reference Courtesy: http://wonderingminstrels.blogspot.in/2000_01_01_archive.html

నదీ వర్తకుని భార్య ప్రేమలేఖ… ఎజ్రా పౌండ్, అమెరికను క

నా నుదిటిమీద పడుతున్న ముంగురులని

తిన్నగా కత్తిరిస్తున్న రోజుల్లో

ఇంటి ముందరగేటు దగ్గర

పూలు కోస్తూ ఆడుకుంటున్నాను;

నువ్వు వెదురుబొంగు ఊతకర్రలమీద  

గుర్రంలా గెంతుకుంటూ వచ్చి

నేరేడుపళ్ళతో ఆడుకుంటున్న నా చుట్టూ తిరిగేవు.

తర్వాత మనం “చోకాన్” గ్రామం వెళ్ళేం … జీవించడానికి

ఇద్దరు బాలలం… ఏ సందేహాలూ అయిష్టాలూ లేకుండా.

 

పధ్నాలుగో ఏట నిన్ను నా స్వామిగా చేసుకున్నాను.

సిగ్గుముంచెత్తడం వల్ల ఎప్పుడూ నవ్వేదాన్ని కాదు;

తల వాల్చుకుని, గోడవైపు అలా చూస్తుండేదాన్ని

ఎన్నిసార్లు పిలిచినా, వెనుదిరిగి చూడకుండా.

 

పదిహేనో ఏట నా భయాలన్నీ తొలగిపోయాయి

ఎన్నటికైనా…ఎప్పటికైనా… శాశ్వతంగా…

నీతోపాటే నా శరీరమూ మట్టిపాలవాలని కోరుకున్నాను

నేనెందుకు అనుమానపు అగడ్తలెక్కాలి?

 

పదహారో ఏట నువ్వు వెళ్లిపోయావు

ఎక్కడికో చాలా దూరంగా ఉన్న

సుడిగుండాల “కూ-టో-ఎన్” నది మీదకి. 

నువ్వెళ్ళి అప్పుడే అయిదునెలలు కావస్తోంది

నెత్తిమీద కోతులు విషాదంగా అరుస్తున్నాయి.

 

నువ్వు వెళ్తున్నప్పుడు అయిష్టంగా వెళ్ళేవు

ఇప్పుడు గేటుదగ్గర నాచు పెరిగిపోయింది

ఎన్నిరకాల నాచో, పెరకలేనంతగా!

గాలికి, ఆకులు ముందుగానే రాలడం ప్రారంభించేయి శరత్తులో.

 

పడమటితోటలో గడ్డిమీద పచ్చగా

జతగూడిన సీతాకోకచిలుకలు అందగిస్తున్నాయి;

అవి నన్ను బాధిస్తున్నాయి. నాకు వయసు మీరుతోంది.

“కియాంగ్” నది సన్నని పాయలగుండా తిరిగివస్తుంటే

నాకు ముందుగా కబురురంపడం మరిచిపోకు.

నిన్ను కలవడం కోసం “చో-ఫ్యూ-సా” దాకా వస్తాను. 

ఎజ్రా పౌండ్.

(30 October 1885 – 1 November 1972)

ప్రవాస అమెరికను కవి 

.

ఈ కవితలో చక్కని ప్రతీకలతో, బాల్య వివాహం, అమాయకత్వం, ప్రేమా, విరహం, సమాగమాకాంక్షా ఇందులో అద్భుతంగా తీసుకు రాగలిగేడు కవి.  ఇది విశ్లేషణాత్మకంగా చదువుతున్న కొద్దీ దీనిలోని సౌందర్యం మనకి అవగతమౌతుంటుంది.

.

Ezra Pound, cropped mug shot
Ezra Pound, cropped mug shot (Photo credit: Wikipedia)

.

The River-Merchant’s Wife

.

While my hair was still cut straight across my forehead
I played about the front gate, pulling flowers.
You came by on bamboo stilts, playing horse,
You walked about my seat, playing with blue plums.
 And we went on living in the village of Chokan:
Two small people, without dislike or suspicion.

At fourteen I married My Lord you.
I never laughed, being bashful.
Lowering my head, I looked at the wall.
Called to, a thousand times, I never looked back.

At fifteen I stopped scowling,
I desired my dust to be mingled with yours
Forever and forever and forever.
Why should I climb the look out?

At sixteen you departed,
You went into far Ku-to-en, by the river of swirling eddies,
And you have been gone five months.
The monkeys make sorrowful noise overhead.

You dragged your feet when you went out.
By the gate now, the moss is grown, the different mosses,
Too deep to clear them away!
The leaves fall early this autumn, in wind.

The paired butterflies are already yellow with August
Over the grass in the West garden;
They hurt me. I grow older.
 If you are coming down through the narrows of the river Kiang,
Please let me know beforehand,
And I will come out to meet you
As far as Cho-fu-Sa.

Ezra Pound

(30 October 1885 – 1 November 1972)

American Expatriate Poet

For an interesting analysis of this poem pl.visit:

http://www.english.illinois.edu/maps/poets/m_r/pound/letter.htm

వీడ్కోలు… ఎజ్రా పౌండ్, నిర్వాసిత అమెరికను కవి

ప్రహారీకి ఉత్తరాన అవిగో నీలి నీలి గిరులు,

వాటికి ప్రదక్షణం చేస్తూ పరుగులుతీస్తున్న స్వచ్ఛమైన నది;

ఇక్కడ మనం ఆగి ఎవరిత్రోవన వారు పోవలసిందే

వేల మైళ్లుపరుచుకున్న నిర్జీవమైన పచ్చికలో నడుచుకుంటూ.

 

మనసొక నిలకడలేక తిరిగాడే వెర్రి మేఘం,

వీడ్కోలుముందు కలిపిన చేతులపై తలవాల్చి

శలవుతీసుకుంటున్న పాతమిత్రుల్లా సూర్యాస్తమయం; 

మనిద్దరం ఒకరికొకరు దూరమవుతుంటే

మన గుర్రాలుకూడా సకిలిస్తూ… ఒకదానికొకటి…

. 

ఎజ్రా పౌండ్,

నిర్వాసిత అమెరికను కవి  

(30 October 1885 – 1 November 1972)

.

Ezra Pound
Image Courtesy: http://en.wikipedia.org/wiki/File:Ezra_Pound_2.jpg

.

“Parting”

Blue mountains to the north of the wall,
White river winding about them;
Here we must make separation
And go out through a thousand miles of dead grass.

Mind like a floating wide cloud,
Sunset like the parting of old acquaintances
Who bow over their clasped hands at a distance
Our horses neigh to each other
as we are departing.

Ezra Pound

(30 October 1885 – 1 November 1972)

American Expatriate Poet 

.

It looks the poem was inspired by a poem by the great Chinese poet Li Po and its translation by Sam Hamill 

(Courtesy:

http://wonderingminstrels.blogspot.in/2001/04/parting-li-po.html:

.

Parting

.

Green mountains rise to the north;

white water rolls past the eastern city.

Once it has been uprooted,

the tumbleweed travels forever.

 

Drifting clouds like a wanderer’s mind;

sunset, like the heart of your old friend.

We turn, pause, look back and wave,

Even our ponies look back and whine.

.

And that is not all.

Amy Lowell and Florence Ayscough have also done a translation of the poem in their own unique way:

 “Parting”

Clear green hills at a right angle to the North Wall,
White water winding to the East of the city.
Here is the place where we must part.
The lonely water-plants go ten thousand li;
The floating clouds wander everywhither as does man.
Day is departing–it and my friend.
Our hands separate. Now he is going.
“Hsiao, hsiao,” the horse neighs.
He neighs again, “Hsiao, hsiao.”

        — Amy Lowell and Florence Ayscough

*

Several other translations of this particular poem can be found on Ken Hope’s impressive website at: 

http://www.northshore.net/homepages/hope/LiboLeaving.html

Don’t miss the interesting responses to the poem at: http://wonderingminstrels.blogspot.in/2001/04/parting-li-po.html

%d bloggers like this: