అనువాదలహరి

తల్లీ- బిడ్డా…. యూజీన్ ఫీల్డ్ అమెరికను

ఒక రాత్రి చిన్న మంచు బిందువొకటి

గులాబి ఎదమీద పడింది…

“ఓ చిన్ని చుక్కా! నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాలే

ఇక్కడ నిశ్చింతగా సేదదీరు” అని ఆదరించింది

అనురాగముతో మెరుస్తున్న గులాబిని చూసి

ఆకసానికి ఈర్ష్యతో ముఖం నల్లబడింది

వెంటనే వేడి వెలుగుల దూతను పంపి

మంచు బిందువును హరించింది.

“ఓహ్! దైవమిచ్చిన నా బిడ్డని నాకిచ్చీ!

అది నా ప్రాణం…” అని గులాబి బాధతో ఆక్రోశించింది

కానీ, ఆకసం విజయ గర్వంతో నవ్వింది

పాపం, గులాబి తల్లి, గుండె పగిలి నేల రాలింది.

.

యూజీన్ ఫీల్డ్

September 2, 1850 – November 4, 1895

అమెరికను

Mother and child

.

One night a tiny dewdrop fell

Into the bosom of a rose,–

“Dear little one, I love thee well,

Be ever here thy sweet repose!”

 

Seeing the rose with love bedight,

The envious sky frowned dark, and then

Sent forth a messenger of light

And caught the dewdrop up again.

 

“Oh, give me back my heavenly child,–

My love!” the rose in anguish cried;

Alas! the sky triumphant smiled,

And so the flower, heart-broken, died.

.

Eugene Field

September 2, 1850 – November 4, 1895

American Writer

Poem Courtesy:

http://famouspoetsandpoems.com/poets/eugene_field/poems/9217.html

 

చిన్ని నీలవర్ణుడు … యుజీన్ ఫీల్డ్, అమెరికను కవి

.

ఆ చిన్న కుక్క బొమ్మ నిండా దుమ్ము పేరుకుంది,

అయినా అది బలంగా స్థిరంగా నిలబడి ఉంది;

ఆ చిన్న బొమ్మ సిపాయి తుప్పుపట్టి ఎర్రగా ఉన్నాడు

అతనిచేతిలో తుపాకీ బూజుపడుతోంది.

ఒకప్పుడు ఆ కుక్క బొమ్మ కొత్తది గానూ

ఆ బొమ్మ సిపాయి అందంగా ఉన్న రోజులున్నాయి

అదెప్పుడంటే, మన నీలిరంగు బుజ్జాయి

వాటితో ఆడి ముద్దుపెట్టుకున్న రోజుల్లో.

“నువ్విప్పుడు నేను తిరిగివచ్చేదాకా ఎక్కడికీ కదలకేం?

నువ్వుకూడా ఏ చప్పుడూ చెయ్యకు!” అని వాటితో అని.

చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ చక్రాలపరుపుమీద పడుక్కున్నాడు.

.

తన అందమైన ఆటవస్తువుల్నే కలగన్నాడు;

అలా కలగంటూంటే, ఒక దివ్య గానం

మన నీలవర్ణుడిని నిద్రలేపింది—

ఓహ్!ఎన్ని సంవత్సరాలు! ఎంతదీర్ఘకాలం గడిచిపోయింది,

అయినా ఆ చిన్న బొమ్మలే నిజమైన మిత్రులు.

అవును, ఆ చిన్నకుర్రాడికి విధేయతతో, వాటి స్థానాల్లో

అతనెక్కడ ఉంచేడో అక్కడ కదలకుండా నిలబడి ఉన్నాయి

ఆ చిన్ని చేతుల స్పర్శకోసమూ,

ఆ చిన్నారి ముఖం నవ్వుకోసమూ ఎదురుచూస్తూ;

ఆ చిన్న కుర్చీలో దుమ్ముకొట్టుకుపోతూ

ఇన్ని ఏళ్ల బట్టీ ఎదురుచూస్తూ ఆశ్చర్యపోతున్నాయి,

వాటికి ముద్దుపెట్టి అక్కడ ఉంచిన తర్వాత

ఆ నీలి వర్ణపు బుజ్జాయికి ఏమయిందబ్బా అని !

.

యుజీన్  ఫీల్డ్

September 2, 1850 – November 4, 1895

అమెరికను కవి

.

కరుణ రసం చిప్పిలే ఈ రసవత్తరమైన కవిత కళ్ళంబడి నీళ్ళు పెట్టకుండా ఉండనీదు. ఒక సంఘటనని వాచ్యం చెయ్యకుండా ప్రతీకల ద్వారా ఎంత రసవత్తరంగా చిత్రించవచ్చునో అని చెప్పడానికి ఈ కవిత చక్కని ఉదాహరణ. నీలము అమెరికన్ సివిల్ వార్ సమయంలో సంయుక్త రాష్ట్రాల యుధ్ధబలగాల సైనిక దుస్తుల రంగు. దీనికి ఇంతకంటే వ్యాఖ్యానం అక్కరలేదనుకుంటాను.

.

Eugene Field

Little Boy Blue

.

The little toy dog is covered with dust,

But sturdy and staunch he stands;

The little toy soldier is red with rust,

And his musket moulds in his hands.

Time was when the little toy dog was new,

And the soldier was passing fair;

And that was the time when our Little Boy Blue

Kissed them and put them there.

“Now don’t you go till I come,” he said,

“And don’t you make any noise!”

So, toddling off to his trundle bed,

He dreamt of the pretty toys;

And, as he was dreaming, an angel song

Awakened our Little Boy Blue—

Oh! the years are many, the years are long,

But the little toy friends are true!

Ay, faithful to Little Boy Blue they stand,

Each in the same old place,

Awaiting the touch of a little hand,

The smile of a little face;

And they wonder, as waiting the long years through

In the dust of that little chair,

What has become of our Little Boy Blue,

Since he kissed them and put them there.

.

Eugene Field 

September 2, 1850 – November 4, 1895

American Children’s Poet

చీకట్లో నీడలు … యుజీన్ ఫీల్డ్, అమెరికను కవి

.

నాకు పాములన్నా, కప్పలన్నా, పురుగులన్నా, క్రిములన్నా, ఎలుకలన్నా

ఆడపిల్లలు జడుసుకేనేవి ఏవన్నా భయం లేదు;  అవెంతో మంచివి.

నాకు తెలిసి నేను మహాధైర్యవంతుణ్ణి; అయితే పక్క ఎక్కాలంటేనే చికాకు

ఎందుకంటే, నా ప్రార్థనలు చదువుకుని, దుప్పట్లో వెచ్చగా ఒదిగిపోగానే

అమ్మ “కమ్మగా పడుక్కో” అని చెప్పి దీపం తీసేస్తుంది, రాత్రి చీకట్లో

నన్నొకడినే పడుకోమని వదిలేస్తుంది, ఏవేవో ఆకారాలు కనిపిస్తుంటే.

ఒక్కోసారి అవి గది మూలనీ, మరోసారి తలుపువెనకా నక్కి ఉంటాయి;

ఇంకొక్కసారి గది మధ్యలో నేలమీద అన్నీ నిలుచుంటాయి,

లేదా అన్నీ మఠంవేసుకు కూర్చుంటాయి, లేపోతే తిరుగుతూ ఉంటాయి

ఎంత నెమ్మదిగా పాకురుతుంటాయంటే ఒక్క పిసరు చప్పుడు చెయ్యవు.

ఒకసారి అన్నీ సిరాలా నల్లగానూ, మరోసారి అన్నీ తెల్లగానూ—

రాత్రిపూట అలా కనిపిస్తూ ఉంటే, ఏ రంగు అయితే నేమిటి?

ఓ రోజు మా వీధిలో ఎవడో వెళుతుంటే వాణ్ణి కొట్టేనని

ఆ రాత్రి నాకు తిండిపెట్టకుండా నాన్న పక్కమీదికి తగిలేసేరు,

అర్థరాత్రి నేను లేచి చూద్దును: అవన్నీ వరసగా నిలుచున్నాయి,

మెల్లకన్నుపెట్టి నా వంక జాలిగా చూస్తున్నట్టు — అనిపించింది.

ఓరి నాయనో! ఎంత భయమేసిందంటే రాత్రి కన్ను రెప్ప పడలేదు…

నేను ఏరోజు పెంకితనం చేస్తే ఆరోజురాత్రి అలాగే కనిపిస్తుంటాయి.

అదృష్టంకొద్దీ నేను ఆడపిల్లని కాదు; లేకుంటే భయంతో హడలి చద్దును!

మొగపిల్లడిని గనక ఊపిరి గట్టిగా బిగబట్టి దుప్పట్లో తల దాచుకుంటాను.

నిజమే, నేను చాలా పెంకివాణ్ణి. అయితే, ఇకమీదటనుండీ

మంచిగా ఉంటానని ఒట్టు వేసుకుని,నా ప్రార్థనలు చదువుకుంటాను.

అమ్మమ్మ చెప్పుతుంటుంది: అల్లరి పిల్లలకి రాత్రిపూట ఏవేవో

కనిపిస్తున్నాయంటే, దాన్ని చక్కదిద్దుకునే మార్గం అదొక్కటేనని.

ఇకమీదట మిగతా అల్లరి పిల్లలు ఎవరైనా పెంకితనం చెయ్యడానికి

నన్ను రేపెడితే, నా ఉబలాటాన్ని మనసులో అణుచుకుంటాను;

రాత్రి భోజనంలోకి మంచి మంచి అప్పాలూ, పెద్దపెద్ద కేకులులాంటివుంటే

నాకు అడగాలనిపించినా, ఎవరినీ అడగడానికి రెండోసారి కంచం జాచను,

పోతే పోనీ, ఆకలి వేసి వేసి … నెమ్మదిగా చచ్చిపోవడం ఉత్తమం

బతికి ఉంటూ అలా రాత్రిపూట ఏవేవో చూస్తూ ఉండడం కంటే!

.

యుజీన్ ఫీల్డ్

September 2, 1850 – November 4, 1895

అమెరికను కవి.

ఈ కవిత చిన్నపిల్లల మనస్తత్వాన్ని చాలా బాగా ఆవిష్కరిస్తుంది. అందులో మగపిల్లలకి  తాము ఆడపిల్లలకంటే ధైర్యవంతులమనో, అలా ఉండాలనో పెద్దవాళ్ళు అనుకోవడమో, చెప్పడమో, మనసులో నాటుకున్నప్పుడు, దానికి వ్యతిరేకమైన సందర్భాలు తటస్థించినపుడు వాళ్ళని వాళ్లు సముదాయించుకుందికి చేసుకునే ప్రయత్నాన్నీ, వాళ్ల మానసిక సంఘర్షణనీ కవి హాస్యస్ఫోరకంగా చిత్రించేడు. ఈ కవిత  మగపిల్లలలో Male chauvinism కిసంబంధించి బీజాలు ఎప్పుడు ఎలా నాటుకుంటాయో చెప్పకపోయినా, వాటి ప్రభావం ఎలా పనిచేస్తుందో తెలుపుతోంది.

.

Eugene Field
Eugene Field (Photo credit: Wikipedia)

.

Seeing Things

.

I Ain’t afraid uv snakes or toads, or bugs or worms or mice,

An’ things ‘at girls are skeered uv I think are awful nice!

I’m pretty brave I guess; an’ yet I hate to go to bed,

For, when I’m tucked up warm an snug an’ when my prayers are said,

Mother tells me “Happy Dreams” an’ takes away the light,

An’ leaves me lyin’ all alone an’ seein’ things at night!

Sometimes they’re in the corner, sometimes they’re by the door,

Sometimes they’re all a-standin’ in the middle uv the floor;

Sometimes they are a-sittin’ down, sometimes they’re walkin’ round

So softly and so creepy-like they never make a sound!

Sometimes they are as black as ink, an’ other times they’re white—

But color ain’t no difference when you see things at night!

Once, when I licked a feller ‘at had just moved on our street,

An’ father sent me up to bed without a bite to eat,

I woke up in the dark an saw things standin’ in a row,

A-lookin’ at me cross-eyed an’ p’intin’ at me—so!

Oh, my! I wuz so skeered ‘at time I never slep’ a mite—

It’s almost alluz when I’m bad I see things at night!

Lucky thing I ain’t a girl or I’d be skeered to death!

Bein’ I’m a boy, I duck my head an’ hold my breath.

An’ I am, oh so sorry I’m a naughty boy, an’ then

I promise to be better an’ I say my prayers again!

Gran’ma tells me that’s the only way to make it right

When a feller has been wicked an’ sees things at night!

An’ so when other naughty boys would coax me into sin,

I try to skwush the Tempter’s voice ‘at urges me within;

An’ when they’s pie for supper, or cakes ‘at’s big an’ nice,

I want to—but I do not pass my plate f’r them things twice!

No, ruther let Starvation wipe me slowly out o’ sight

Than I should keep a-livin’ on an’ seein’ things at night!

.

Eugene Field

September 2, 1850 – November 4, 1895

American Poet, Writer

For more information about the poet please visit:  http://en.wikipedia.org/wiki/Eugene_Field

.

%d bloggers like this: