Tag: English
-
సానెట్ 24 … షేక్స్పియర్
నా నేత్రాలు చిత్రకారుడి పాత్ర ధరించి నీరూపు రేఖవిలాసాన్ని నా గుండేలోకి దోచుకున్నాయి; ఈ శరీరపు చట్రంలో దానిని బిగించాయి. చిత్రకారుడి ఆలోకనంలో అది కళాత్మక సృష్టి. నీ నిజమైన చిత్రం ఎక్కడ ఉందో నువ్వు చూడాలని చిత్రకారుడు అభిలషిస్తునప్పటికీ; నా మనో మందిరంలో ఇప్పటికీ వేలాడుతున్న చిత్రానికి తలుపులు తెరిచేవి నీ మెరిసే కళ్ళే. ఇప్పుడు చూడు కళ్ళు కళ్లకి ఏమి ఉపకారం చేశాయో: నా కళ్ళు నీ చిత్రాన్ని గీసాయి; నీ కళ్ళు నాకు…
-
సానెట్ 21… షేక్స్పియర్ ఇంగ్లీషు కవి
కవితా కన్యలాగే నేనూను అందమైన బొమ్మని చూడగానే కవిత్వం అల్లలేను; నిన్ను ప్రకృతే ఒక అలంకారంగా సింగారించుకుంటోంది. ప్రతి అందమూ నీ అందంతో సరిపోల్చుకుంటున్నాయి గర్వంగా చెప్పుకునే అందాల జంటలు ఏర్పడుతున్నై, సూర్యుడూ-చంద్రుడూ, ఈ భూమీ-రత్నగర్భయైన సముద్రం, వసంతంలో చిగిర్చే తొలిపూలవంటి అపురూపమైన వస్తువులతో మేదినీవలయ పరివేష్టితమైన ఈ రోదసి నిండి ఉంది. నా ప్రేమ ఎంత సత్యమో అంత సత్యంగా రాస్తాను నా మాట నమ్ము, ఏ తల్లి కన్న బిడ్డైనా అందంగా ఉన్నట్టు నా…
-
సానెట్ 10…. షేక్స్పియర్
ఇది షేక్స్పియర్ 400వ వర్థంతి సంవత్సరం (ఈ సానెట్ లు వివాహానికి విముఖత చూపించే అందమైన యువకుణ్ణి ఉద్దేశించి రాసినవి) సిగ్గు సిగ్గు! ఎవరిమీదా నీకు ప్రేమలేదని ఒప్పుకో నువ్వంటే ఇష్టపడని తెలివితక్కువవాళ్ళెవరుంటారు? నిన్ను ఇష్టపడే వాళ్లు అసంఖ్యాకం, నికిష్టమయితే ఒప్పుకో. కానీ, నీకు ఎవరిమీదా ప్రేమ లేదన్నది మాత్రం స్పష్టం. నీకు అందరిపట్లా ఎంత ఏవగింపు అంటే, నిన్నుకూడా నువ్వు ద్వేషించుకుందికి వెనుకాడవు. మీ వంశాన్ని నిలబెట్టడం ఎలాగా అని కోరుకోవడం పోయి దానిని అంతం…
-
సానెట్ 9…. షేక్స్పియర్, ఇంగ్లీషు కవి
ఇది షేక్స్పియర్ 400వ వర్థంతి సంవత్సరం * ఒక భర్తృవిహీనచే కంట తడిపెట్టించవలసి వస్తుందేమోనని నిన్ను నువ్వు ఒంటరి జీవితంతో దహించుకుంటున్నావా? అలాగైతే, నువ్వు పిల్లలు లేక కనుమూయవలసి వస్తే, ఈ ప్రపంచం నీకోసం శోకిస్తుంది, సంతు లేని భార్యలా; తన కన్న బిడ్డల కన్నుల్లో భర్త రూపాన్ని చూసుకుని లోకంలో ప్రతి వితంతువూ భర్తకై శోకిస్తే, నీ ప్రతిరూపాన్ని మిగల్చకుండా పోయావని ప్రపంచమే అనాథయై నీకోసం విలపిస్తుంది. ఈ లోకంలో దూబరామనిషి ఖర్చు చేసేదంతా చేతులు…
-
రేపటి కి… సామ్యూల్ జాన్సన్, ఇంగ్లీషు రచయిత
(ఐరీన్(Irene) నాటకం నుండి) . రేపు చేద్దామనుకుంటున్న పని! వయసుతోపాటు సంపాదించుకున్న అపురూపమైన జ్ఞానం రేపటికి మిగులుతుందా? యవ్వనానికి నెచ్చెలి… వాయిదా తత్త్వం… పిరికితనం, తెలివితక్కువదనం, ఓటమి విధిలిఖితమై రేపటికోసం ఎదురుచూస్తూ జీవితాన్ని వృధా చేస్తుంది. ఆశగా, కోరికలునిండినకళ్ళతో రేపటికై గుడ్లప్పగించి చూస్తుంది మధ్యలో మృత్యువు చొరబడి ఆ అవకాశాన్ని తన్నుకుపోయేదాకా! చిత్రం ప్రతి రోజూ అనవరతంగా ఈ మోసం జరుగుతూనే ఉన్నా అది గ్రహించలేని దౌర్భాగ్యులతో నిండి ఉంది ఈ ప్రపంచం చలికాలంలో మంచులో కవాతు…
-
స్త్రీల ఔన్నత్యము… సీ ఫ్రై ససూన్, ఇంగ్లీషు కవి
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్త్రీలందరికీ శుభాకాంక్షలతో . మేము గొప్పపనులు చేస్తే ప్రేమిస్తారు, శలవులకి ఇంటికి వచ్చినా, లేక చెప్పలేని చోట గాయాలపాలై తిరిగొచ్చినా. మీరు పతకాల్ని ఆరాధిస్తారు; మీకు గొప్ప నమ్మకం యుద్ధంలోని కళంకాన్ని శౌర్యం కప్పిపుచ్చుతుందని. మమ్మల్ని ఉక్కు కవచాల్లా తయారు చేస్తారు. మహాసంతోషంగా వింటారు, మట్టికొట్టుకుపోతూ ప్రమాదాల్నెదిరించిన మా కథలకి పులకిస్తారు. దూరంగా ఎక్కడో యుద్ధం చేస్తున్నపుడు మా లోపలి ఉద్రేకం మీరే మేము మరణిస్తే, జ్ఞాపకాలను పచ్చగా ఉంచుకుంటూమరీ శోకిస్తారు.…
-
ఈ బ్రతుకు… ఫ్రాన్సిస్ బేకన్, ఇంగ్లీషు రచయిత
ఈ సృష్టి ఒక బుడగ, మనిషి జీవితకాలం అందులో ఒక లిప్త: తల్లి కడుపులోంచి, భూమి కడుపులో దాకా అన్నీ దౌర్భాగ్యపు ఆలోచనలే; ఉయ్యాలనాటినుండి శాపగ్రస్తుడై బాధలతో, భయాలతో జీవీతకాలం ఎదగడమే. ఇక ఎప్పుడు మృత్యువు వస్తుందా అని ఎదురుచూస్తాడు నీటిమీద బొమ్మలేస్తూ, బుగ్గిలో రాసుకుంటూ మనం బాధతో కుంచించుకు పోయి బ్రతుకుతాం గాని ఏ జీవితం బాగుంది గనక? రాజసభలు చూడబోతే మూర్ఖుల్ని బుజ్జగించడానికి పనికొచ్చే పాఠశాలలు; పల్లెలు చూడబోటే ఆటవికులకు ఆలవాలాలుగా మారిపోయాయి ఇక…
-
నామకరణం… మేరీ లాంబ్, ఇంగ్లీషు రచయిత్రి
నాకో చెల్లెలు పుట్టింది; ఆమెను మొదటముద్దాడినవారి పక్కన నేనున్నాను. నర్సు పొత్తిళ్ళలోపెట్టి తెచ్చి నాన్నకిచ్చినపుడు, ఆ చిన్నిపాపని చూసి నాన్నకళ్ళలో ఎంతవెలుగు కనిపించిందో! దానికి త్వరలోనే పేరుపెట్టాలి. నాన్న నాకు అవకాశం ఇచ్చారు మా చెల్లికి నన్నే పేరుపెట్టమని. ఏ పేరు పెడితే తనకు నచ్చుతుంది చెప్మా! చార్లెట్, జూలియా, లేక లూయిజా? ఏన్, లెదా మేరీ? అవి అందరూ పెట్టుకునేవే. జోన్ అంటే, ఆడవాళ్ళకి మరీ సాంప్రదాయకంగా ఉంటుంది, పైగా జేన్ అంతకంటే బాగుంటుంది. కానీ…
-
శిసుస్తవం… విలియం కాంటన్, ఇంగ్లీషు కవి
శిశుస్తవంగా నే చెప్పదలుచుకున్నదేమంటే దేముడు ముందు మనిషిని సృష్టించాడు, రెండోసారి అంతకంటే మెరుగుగా స్త్రీనీ, మూడోసారి అత్యుత్తమైనదీ సృష్టించేడు. అతని సృష్టిలో అన్నిటిలోకీ అందమైనవీ దివ్యత్వం తొణికిసలాడేదీ శిశువులే. ఇక్కడి ఏ వస్తువూ అంతకంటే ప్రియమైనదీ,సుందరమైనదీ కాదు. భగవంతుడు తన సృష్టి అంతా సంతృప్తిగా చూసినా శైశవాన్ని మించిన గులాబి పువ్వు మరొకటి లేదు. తర్వాత రోజుల్లో పిల్లలగురించి ఇలా చెప్పబడింది: వాళ్ళవంటివారికి తప్ప స్వర్గంలో ప్రవేశం లేదు. ఓ చిన్ని పాపాయీ! ముళ్ళు వికసించడం చూస్తున్న…
-
భావనా పటిమ… షేక్స్పియర్, ఇంగ్లీషు కవి
ఇది షేక్స్పియర్ 400 వ వర్ధంతి సంవత్సరం ఒక పిచ్చివాడు, ఒక ప్రేమికుడు, ఒక కవీ ముగ్గురూ గాఢంగా, నిగూఢంగా ఆలోచించగలరు; నరకం పట్టగలిగినదానికంటే కూడా భూతాల్ని పిచ్చివాడు చూస్తే, ఒక ప్రేమికుడు అంత మైమరపుతోనూ ఒక ఈజిప్టు భామ కనుబొమల్లో హెలెన్ సౌందర్యాన్ని చూడగలడు; ఇక కవి కన్నులు, ఒక పూనకం వచ్చినట్టు ఆవేశంలో ఊగిపోతూ భూమ్యాకాశాలని అట్నించి ఇటూ ఇట్నించి అటూ పరీక్షిస్తూ గమనిస్తే, తనకి తెలియని ఆకారాలకి కవి కలం ఒక రూపాన్నిచ్చి,…