Tag: English
-
పచ్చని చెట్టు నీడలో… షేక్స్పియర్
. పచ్చని చెట్టు నీడలో, నాతోపాటు విశ్రమిద్దామనుకుంటున్నవాళ్ళు; కమ్మని పక్షిపాటకి అనుగుణంగా తమ ఆనందరాగా లాలపిద్దామనుకున్నవాళ్ళు, ఇక్కడకు రండి… రండి… రండి, మీకు విరోధులెవరూ ఉండరు, ఒక్క శీతకాలం, తుఫాను వాతావరణం తప్ప. . ఎవనికైతే అత్యాశ ఉండదో, ఎండలో పనిచెయ్యడం ఇష్టమో, తినేదే కోరుకుంటూ, దొరికినదానితో సంతృప్తి పడగలడో, ఇక్కడకి రండి … రండి … రండి, మీకు విరోధులెవ్వరూ ఉండరు, ఒక్క శీతకాలం, తుఫాను వాతావరణం తప్ప. . షేక్స్పియర్ . Under the…
-
మాట నేర్చిన కోళ్ళు… బెంజమిన్ జెఫానియా, ఇంగ్లీషు కవి
(గమనిక: సారూప్యత, సందర్భం (ఇవి దసరారోజులు కదా), దేశీయతల కోసం, ఇంగ్లీషు టర్కీ కోళ్లని నాటుకోళ్ళుగానూ (అవే ఎక్కువగా బలి అవుతాయని నే ననుకుంటున్నాను), క్రిస్మస్ పండుగను దసరా పండుగగానూ మార్చి వ్రాసేను. తదనుగుణంగా మరికొన్ని మార్పులుకూడా అక్కడక్కడ చెయ్యడం జరిగింది.) . ఈ దసరాకి కోళ్ళతో మంచిగా ప్రవర్తించండి ఎందుకంటే, వాటికి కూడా దసరాసరదాల్లో పాల్గోవాలనుంటుంది. కోళ్ళు చాలా సరసంగా ఉంటాయి, కొన్ని చెడ్డవుండొచ్చు, అయినా, ప్రతి కోడి నోరుమూసుకుని పడి ఉంటుంది కదా! మీ…
-
కాలం… యదార్థమూ, మిధ్యా … S T కోలరిడ్జ్
చదునుగా విశాలంగా ఉన్న ఆ పర్వతాగ్రం మీద (అదెక్కడో సరిగ్గా తెలీదు గాని, గంధర్వలోకం అయిఉండొచ్చు) ఆస్ట్రిచ్ లా తమ రెండు రెక్కలూ తెరచాపల్లా జాపుకుంటూ ఇద్దరు ముచ్చటైన పిల్లలు ఒక అక్కా, తమ్ముడూ అనంతంగా పోటీపడుతూ పరిగెత్తుతున్నారు . అక్క అతన్ని మెడ్డాయించింది అయినా వెనక్కి తిరిగిచూస్తూ పరిగెడుతోంది ఎప్పుడూ తమ్ముడివంకే చూస్తూ, అతని మాటలు వింటూ ఎందుకంటే, పాపం! అతనికి చూపులేదు. గరుకుతోవైనా, మెత్తని నేల అయినా ఒక్కలాగే అడుగులు వేసుకుంటూ సాగుతున్నాడు. అతనికి…
-
డోవర్ బీచ్ … మాథ్యూ ఆర్నాల్డ్, ఆంగ్ల కవి
ఈ నిశీధిని సాగరం ప్రశాంతంగా ఉంది. కెరటాలు నిండుగా, చందమామ అందంగా కనిపిస్తున్నైజలమార్గాల్లో; ఫ్రాన్సు సముద్రతీరంలో దీపాలు చీకటి-వెలుగులు చిమ్ముతున్నై; ప్రశాంతంగా ఉన్న అఖాతం నుండి చూస్తుంటే ఇంగ్లండువైపు సుద్దకొండల కొనకొమ్ములు కనుచూపుమేరా నిటారుగా, ప్రకాసిస్తూ కనిపిస్తున్నై. . ప్రేయసీ! కిటికీదగ్గరకి రా, వచ్చి చూడు వెన్నెలమలాముచేసిన సైకతశ్రేణులమీద భంగపడిన కెరటాల తెలినురుగులమీదుగా రాత్రిపవనం ఎంత సువాసన మోసుకొస్తోందో! ఒకసారి విను! కెరటాలు లోపలికిలాగి ఒక్కసారి ఒడ్డుకి విసిరికొట్టినప్పుడు గులకరాళ్ళు చేసే హోరుని; వెనక్కి మరలుతున్నప్పుడు అదిగో,…
-
ఎక్కడో ఒక చోట… క్రిస్టినా రోజెటి, ఆంగ్ల కవయిత్రి
ఎక్కడో ఒక చోట, నేను ఇప్పటివరకూ చూడని వదనమూ, వినని స్వరమూ, నా మాటకి ఇంకా స్పందించ వలసిన హృదయమూ నా అదృష్టం ఎలా ఉందో — తప్పకుండా ఉంటాయి . ఎక్కడో ఒకచోట, దగ్గరో దూరమో ఖండాలూ, సముద్రాలూ దాటి, కంటికి కనిపించనంతదూరంలో, చంద్రుణ్ణి దాటి, తనని ప్రతి రాత్రీ గమనించే నక్షత్రానికావల… . ఎక్కడో ఒక చోట, దూరమో దగ్గరో, కేవలం ఒక గోడ, ఒక కంచె, మధ్యలో అడ్డుగా; పచ్చగా పెరిగిన పచ్చికమీద…
-
పేరు … కేరొలీన్ నార్టన్
. పేరులో ఏముంది?… షేక్స్పియర్ . నీ పేరొకప్పుడు సమ్మోహనమంత్రం, ఆలోచనలన్నీ దాని చుట్టూతిరిగేవి. తపించే కలలనుండీ, కోరికలనుండీ ఆ ధ్వని మేల్కొలిపేది. కొత్తవాళ్ళెవరయినా నీ పేరు ఊరికే పొగడడానికో, నిందించడానికో ఉఛ్ఛరించినపుడల్లా, నాకు శరీరం గగుర్పొడిచి, అంతరాంతరాలలో చెప్పనలవికాని ఆనందానుభూతి ఎగసిపడేది. . ఎన్ని సంవత్సరాలు… ఎన్ని సంవత్సరాలు దొర్లిపోయాయి; నువ్వూ మనిషి మారిపోయేవు; ఒకప్పుడు సంతోషంగా కలుసుకునే మనం, ఇప్పుడు అపరిచితుల్లా కలుసుకోవాలి; మన పాత స్నేహితులు నన్ను కలుస్తుంటారప్పుడప్పుడు, కానీ, ఇపుడు ఎవరూ…