Tag: English
-
ఎలిజబెత్ మహరాణి స్మృతిలో… బెన్ జాన్సన్, ఇంగ్లీషు కవి
మనిషి సంక్షిప్తంగా ఏమి చెప్పగలడో వినాలనుందా? అయితే, పఠితా! నిలు, నిలు! ఎంత అందం మట్టిలో కలవగలదో అంత అందమూ ఈ రాతికింద మట్టిలో కలిసి పోయి ఉంది. అది జీవితానికిచ్చినదానికంటే ఎక్కువ పాలు శీలానికి తననితాను ధారపోసుకుంది. ఆమెలో మచ్చుకి ఏదైనా లోపం కనిపిస్తే దాన్ని ఈ సమాధిలోనే విడిచిపెట్టండి. ఆ అందానికి ఉన్నది ఒక్కటే పేరు: ఎలిజబెత్ శరీరాన్ని మృత్యువుతో శయనించనీయండి. మృతిలోకూడా ఆజ్ఞనీయగల సమర్థురాలు ఆమె పేరుకి జీవించి ఉన్నప్పటికంటే. శలవు! .…
-
కాలిపోతున్న ఓడ… జాన్ డన్ ఇంగ్లీషు కవి.
. ఇది చాలా సందేశాత్మకమైన కవిత. మనం జీవితాలు కాలి మునిగిపోతున్న ఓడలాంటివి. మరణాన్నించి ఎవ్వరమూ తప్పించుకోలేం. అలా తప్పించుకుందికి ప్రయత్నంచేసిన వారికి మరణకారణం మారుతుందేమో గాని మరణాన్నుంచి మినహాయింపు మాత్రం దొరకదు. జాన్ డన్ 17 వ శతాబ్దపు ప్రముఖ ఆధిభౌతిక (Metaphysical) కవుల పరంపరకి చెందినవాడు. . సముద్రంలో మునిగిపోవడంవల్ల తప్ప మంటలనుండి తప్పించుకోలేని కాలిపోతున్న ఓడ లోంచి కొందరు మనుషులు ఒక్కసారి బయటకు గెంతారు , వాళ్ళు శత్రుఓడలదరికి జేరగానే వాళ్ళతూటాలకు బలైపోయారు;…
-
చిలిపిచేష్టల గాలి… విలియమ్ హోవిట్, ఇంగ్లీషు కవి
ఓ ఉదయం గాలి నిద్రనుంచి లేచి తనలో ఇలా అనుకుంది, ‘ఇవాళ మనం వేడుక చేసుకోవాలి! ఒకసారి ఇలా గెంతాలి మరో సారి పిచ్చిగా గుర్రపుదాట్లు వేసుకుంటూ వెంటతరమాలి! వెళ్ళిన ప్రతిచోటా ఇవాళ కలకలం సృష్టించాలి! ‘ అనుకుంటూ. అనుకోడమే తడవు, ఊరు ఊరంతా కోలాహలంగా ఊడుస్తూ పోయింది దారిగురుతుల్ని చెరిపి, షట్టర్లని చెల్లాచెదరు చేసింది, నిర్దాక్షిణ్యంగా గాలిదుమారం లేపి మనుషుల్ని తోసుకుంటూ పోయి మిఠాయిల షాపు, వృద్ధస్త్రీల టోపీ అన్న తేడాలేకుండా ఎగరేసుకుపోయింది ఇంతకు ముందెన్నడూ…
-
శాంతికిరణపు వెలుగులో… ఎడిలేడ్ ఏన్ ప్రాక్టర్, బ్రిటిషు కవయిత్రి
ప్రభూ! నా జీవితం ఆహ్లాదకరమైన రాజమార్గంలా ఉండాలని నిన్ను అభ్యర్థించను; ఆ భారంలో లవలేశమైనా నిన్ను భరించమని కోరను; నా పాదాలక్రింద ఎప్పుడూ పువ్వులు విరియాలని నిన్ను అడుగను; వెగటుపుట్టేంత తియ్యగా ఉండే జీవితంలోని విషాదమూ, చేసే గాయాలూ నాకు బాగా అనుభవమే. ప్రభూ! పరమాత్మా! నేను నిన్ను కోరుకునేదొక్కటే: శరీరంలో శక్తి సన్నగిల్లనీ, హృదయం రక్తమోడనీ శాంతికిరణపు వెలుగులో నేను సరియైన దారిలో నడవగలిగేలా అనుగ్రహించు! ప్రభూ! ఇక్కడ నీ పరిపూర్ణమైన వెలుగులు ప్రసరించాలని కూడా…
-
స్థూలంగా చూసినపుడు … లార్డ్ టెన్నిసన్, ఇంగ్లీషు కవి
ప్రేమలో, ప్రేమ నిజంగా ప్రేమ అయి, ఆ ప్రేమ మనదైనపుడు విశ్వాసమూ, విశ్వాసఘాతమూ సమ ఉజ్జీలు ఎన్నడూ కాలేవు; స్థూలంగా చూసినపుడు అన్నిచోట్లా విశ్వాసఘాతం అంటే, అపనమ్మకమే. వీణలో ఎక్కడో అతి చిన్న బీట, క్రమక్రమంగా దానిలోని సంగీతాన్ని హరిస్తూ, క్రమంగా వ్యాపిస్తూ వ్యాపిస్తూ,దాన్ని పూర్తిగా మూగబోయేట్టు చేస్తుంది. అలాగే, ప్రేమిక మదివీణియలోని చిన్న బీట లేదా ఏరినపండ్లమధ్య కనిపించని ఒక చిన్న ముల్లు, లోలోపలే కుళ్ళిపోయి దానిచుట్టూ బూజుపేరుకునేలా చేస్తుంది ఇక అది దాచుకుందికి పనికి…
-
రసగీతి… విలియం ఓల్డిస్ , ఇంగ్లండు
క్షణం తీరికలేక, కుతూహలంతో, దాహంతో తిరిగే ఓ ఈగా, నేను తాగుతున్నట్టుగానే, నెమ్మదిగా ఈ పానీయం తాగు; నా కప్పు మీదకి నిన్ను సాదరంగా ఆహ్వానిస్తున్నాను, నువ్వు దీన్ని తాగగలిగితే, సొక్కి సోలు; నీ జీవితంనుండి పొందగలిగినంత పొందు, జీవితం చాలా క్షణికం, త్వరగా కరిగిపోతుంది. నీదీ నాదీ ఒక్క తీరే, కాలం త్వరగా అస్తమదిక్కుకి పరిగెడుతుంది; నీది ఒక్క వసంతమే, నాదీ అంతకంటే ఎక్కువేం కాదు, కాకపొతే అది మూడు ఇరవైల వసంతాలు తిరుగుతుంది; ఆ…
-
భగవంతుని వైభవం… గెరార్డ్ మేన్లీ హాప్కిన్స్, ఇంగ్లీషు కవి
ఈ సృష్టి అంతా భగవంతుని వైభవంతో నిండి ఉంది… కంపించే బంగారు రేకునుండి వెలువడే కాంతిపుంజంలా; అది గానుగలోంచి ఊరే నూనెలా కొద్దికొద్దిగా వస్తూనే అఖండమౌతుంది. మరి మనుషులెందుకు అతని అధికారాన్ని లెక్కపెట్టరు? తరాలు నడచి పోయాయి, నడుచుకుని పోయాయి, నడుచుకుంటూపోయాయి అందరూ తమ పనుల్లో, శ్రమలో, వేదనల్లో మునిగి తేలేరు; మనుషులుగా తమ ముద్ర వేసుకున్నారు, కీర్తి ప్రతిష్ఠలు సంపాదించుకున్నారు: ఇప్పుడామట్టి అంతా ఖాళీ; పాదరక్షలుండడంతో కాళ్ళు తగిలినా పోల్చుకోలేవు. అయినప్పటికీ, ప్రకృతికిలో “నిండుకుంది” అన్న…
-
గతించినవన్నీ… వాల్టర్ డి లా మెర్, ఇంగ్లీషు కవి
ఈ వనాళి అతి పురాతనమైనది; ముళ్ళపొదల్లోంచి పైకిలేచే లేతీవెలపై కుసుమిస్తున్న మొగ్గలు, వసంతాగమన సూచీ వీచికలకు, ఎంత అందంతో ఇనుమడిస్తున్నాయో— ! ఈ గులాబి ఎన్ని అజ్ఞాత శతాబ్దులుగా నలుచెరగులా విరబూస్తున్నాదో ఏ మనిషీ చెప్పలేడు. ఈ సెలయేళ్ళూ పురాతనమైనవే; నీలాలనింగి క్రింద చల్లగా నిద్రించే హిమపాతాలనుండి ఉద్భవించే కొండవాగులు గతంలోకి జారుకున్న చరిత్రని ఎంతగా ఆలపిస్తాయంటే సాలమన్ చక్రవర్తికంటే వివేకవంతంగా వాటి ప్రతి పదమూ పలుకుతుంది. మనుషులం మనందరం పురాతనులమే; ఈవ్ కి చెలికత్తెలైన నైటింగేల్…
-
వసంతఋతు ప్రశాంతత … క్రిస్టినా రోజేటి, ఇంగ్లీషు కవయిత్రి
హేమంతము ఇలా గతించింది వసంతం అలా అడుగుపెట్టింది నేనొక రహస్యప్రదేశంలో దాక్కుని అక్కడి కలకూజితాలు వింటాను. అక్కడ మావి చిగురుల్లో కోయిల మనోహరంగా పాడుతుంది అక్కడ పూల పొదల్లో మైనా కమ్మగా ఆలపిస్తుంటుంది ఆ చల్లని ఇంటికప్పుమీదకి దట్టంగా ఎగబాకిన లతలు గుబురుపొదలై మొగ్గతొడుగుతూ నెత్తావులు పరుచుకుంటున్నాయి సుగంధాలు నింపుకున్న అల్లరిగా తిరిగే చిరుగాలి మెల్లగా గుసగుసలాడుతోంది: “ఇక్కడ ఏ ఉచ్చులూ పన్నలేదు; “ఇక్కడ క్షేమంగా వసించు ఒంటరిగా నివసించు స్వచ్ఛంగా పారుతున్న సెలయేరు నాచుపట్టిన బండరాయీ…