అనువాదలహరి

ఆగష్టు 1968… ఆడెన్, ఇంగ్లీషు-అమెరికను కవి

ఆ రాక్షసుడు రాక్షసులేం చెయ్యగలరో

అదే చేస్తాడు; అది మనుషులకి సాధ్యం కాదు;


కానీ ఒక అమూల్యవస్తువు మాత్రం వాడికి చిక్కదు:


రాక్షసుడు మాటను వశపరచుకోలేడు.


దాసోహం అన్న నేల మీద,


అక్కడి హతాసులూ, నిహతులూ మధ్య


ఆ రాక్షసుడు నడుం మీద చేతులేసుకుని


పెదాలంట చొంగకారుతుంటే అసహనంగా కదులుతుంటాడు.


.


వ్యుస్టన్ హ్యూ ఆడెన్ (W H Auden)


21 ఫిబ్రవరి- 29 సెప్టెంబరు 1973


బ్రిటిషు-అమెరికను కవి

.

ఈ కవిత కమ్యూనిష్టు రష్యా 1968 ఆగష్టు 20 వతేదీ రాత్రి తన వార్సా ఒప్పందంలోని ఇతర అనుచర దేశాలతో కలిసి చెకోస్లొవేకియా మీద జరిపిన దాడికి నిరసనగా రాసింది. కమ్యూనిష్టు దేశంగా ఉంటూనే, కొంత ప్రజాస్వామిక దృక్పథమూ, వాక్స్వాతంత్ర్యమూ, పత్రికలకి స్వేచ్ఛా మొదలైన అంశాలపై ప్రజల అభీష్టం మేరకు స్పందించి Prague Spring గా పిలవబడ్డ ఒక విప్లవాత్మకమైన ఆలోచనలకి కారకుడైన  అలెగ్జాండర్ డూబ్ చెక్ చేసిన సంస్కరణలకు వ్యతిరేకంగా ఈ దాడి జరిగింది.

అధికారానికి మించిన దాహం మరొకటిలేదు. రాచరికాల్లోనూ, ప్రజాస్వామ్యాల్లోనూ అయితే ఒక వ్యక్తితో తీరదు… అది వంశానుగతమై/ పరంపరాగతమై వర్ధిల్లాలి. చేవలేని నాయకులూ, ప్రమత్తులైన ప్రజలూ, యువతరం ఉన్నంతవరకూ మాట ఎప్పుడూ జీవితకాల జైలు శిక్ష అనుభవిస్తుంది. కనీసం కవులైనా గొంతెత్తి తమ అభిప్రాయాల్ని ప్రకటించగలగాలి.

 

.

Portrait of W.H. Auden
Portrait of W.H. Auden (Photo credit: Wikipedia)

 

.

August 1968   

.

The Ogre does what ogres can,

Deeds quite impossible for Man,


But one prize is beyond his reach:

The Ogre cannot master speech.

 


About a subjugated plain,

Among it’s desperate and slain,

The Ogre stalks with hands on hips,

While drivel gushes from his lips.

.

W H Auden
21 February 1907 – 29 September 1973
British American Poet.

As the title suggests, this is a poem in protest against the invasion of Czechoslovakia by Russia on the night of 20th August 1968 to crush “Prague Spring”  a reform movement initiated by the First Secretary Alexander Dubcek which included among other things… freedom of speech, religion, and democratic elections.

Nothing can satiate a thirst like thirst for power. In democracies and aristocracies, if people and youth are not alert and there is no alternate leadership, it extends to perpertuating it for generations to come.  At least, the poet should be able to voice his opinion without any fretters.

 

లిన్ మౌత్ విడో… అమీలియా జోసెఫ్ బర్, అమెరికను

అతను పొడవుగా బలిష్ఠంగా ఉండేవాడు, అతని కళ్ళు వేసవి పొద్దు
దిగంతాలకొసల నింగీ, కడలీ కలిసినంత నీలంగా ఉండేవి.
నను పెళ్ళి చేసుకున్నపుడు అతని బుగ్గల ఎరుపుముందు
ఆ ఎర్రని కొండశిఖరాల రంగు వెలవెలబోయింది.

ఆ పిచ్చుకలు కాపురముండే వసారా దాటేము
ఆ చిన్న కావిరంగు చర్చిని వీడి బయటకి వచ్చేము,
అవసరం లేకపోయినా, అతని భుజానికి ఆనుకున్నాను
కేవలం అతని దారుఢ్యాన్నీ, అనునయాన్నీ ఆస్వాదించడానికే.

ఒక్కటి మాత్రం ఎంతప్రయత్నించినా మరిచిపోలేకున్నాను;
నేను ప్రార్థన చేద్దామనుకున్నపుడల్లా గొంతు పట్టుకుంటుంది;
ఆ రోజు ఆ చర్చి గోడల మీద ఆరబెట్టిన
చేపల వల నుంచి వచ్చిన ఘాటైన ఉప్పువాసన.

బహుశా అతను చాలా పొడుగైన సమాధి తీసుకుని ఉంటాడు
చాలా చాలా పొడవైన సమాధి, ఎందుకంటే అతనంత పొడుగు…
అయ్యో, దైవమా! అదిగో మింటికెగసి విరిగిన కెరటం చప్పుడు,
మళ్ళీ చర్చి గోడలమీద ఆరవేస్తున్న వలల ఉప్పు వాసన.
.
అమీలియా జోసెఫ్ బర్
అమెరికను
(19 జనవరి 1878 – 15 జూన్ 1968)

.

1952 సంవత్సరం ఆగష్టు 15-16, అర్థరాత్రి ఒక గొప్ప ఉప్పెన వచ్చి ఇంగ్లండులో Devon అన్న గ్రామంలో చాల భాగం నష్టపోవడమే గాక, 34 మంది చనిపోయి, 420 మంది నిరాశ్రయులయ్యారు.  బహుశా ఈ కవితకి అది ప్రేరణ కావచ్చు.

మన రాష్ట్రంలో  మేఘమధనం పేరున జరిగే ప్రహసనాలే ఇంగ్లండులోనూ 1950ల్లో జరిగేయి. కొందరు ఈ మేఘమధనంవల్లే ఆ రోజు రాత్రి తుఫాను వచ్చిందని (వాళ్ళు మనసోదరులే అయి ఉంటారు) వాదనలు కూడ చేశారట.  ఈ ప్రకృతివైపరీత్యం, మేఘమధనాల వెనకనున్న కథ, అసలు సమాచారం ఇక్కడ కొంత చదవొచ్చు: 

http://www.woweather.com/reports/philip-eden/Lynmouth-Flood-man-made.htm .

.  

 

A Lynmouth Widow

.

He was straight and strong, and his eyes were blue

As the summer meeting of sky and sea,

And the ruddy cliffs had a colder hue

Than flushed his cheek when he married me.

.

We passed the porch where the swallows breed,

We left the little brown church behind,

And I leaned on his arm, though I had no need,

Only to feel him so strong and kind.

.

One thing I never can quite forget;

It grips my throat when I try to pray—

The keen salt smell of a drying net

That hung on the churchyard wall that day.

.

He would have taken a long, long grave —

A long, long grave , for he stood tall…

Oh, God, the crash of the breaking wave,

And the smell of the nets on the churchyard’

.

Amelia Josephine Burr

(19 November 1878 – 15 June 1968)

American Poet

Poem Courtesy:  The Second Book of Modern Verse … a Selection of the Work of Contemporaneous …  Edited by Jessie Rittenhouse.

On the night of  Aug-15th-16th 1952,  a devastating flood swept Devon village in UK killing 34 people and rendering 420 homeless.  It is my wild guess that it could be the inspiration for the poem.  More than that, there was some interesting information about cloud seeding, which some of the meteorologists unduly claimed credit for the rain that day, which was efficiently countered in the following article you may find interesting:

http://www.woweather.com/reports/philip-eden/Lynmouth-Flood-man-made.htm

ఏదీ రెండుసార్లు జరగదు… జిష్వావా షింబోర్స్కా, పోలిష్ కవయిత్రి.

ఏదీ రెండుసార్లు జరగదు.
దానివల్ల, విచారించవలసిన పర్యవసానం
మనం ఇక్కడకి ఉన్నపాటుగా వచ్చేస్తాము,
సాధన చేసే అవకాశం లేకుండా వెళిపోతాము.
మనకంటే తెలివితక్కువవాడు లేడనుకున్నా
ఈ భూమ్మీద మనమే చవట రాచ్చిప్ప అనుకున్నా
వచ్చే సెమిస్టరులో పరీక్షకి కూర్చుందికి లేదు
ఈ పాఠం ఈ ఒక్కసారే బోధించ బడుతుంది.
ఏ రోజూ నిన్నని అనుకరించదు.
ఏ రెండు రాత్రుళ్ళూ బ్రహ్మానందమటే ఏమిటో
సరిగ్గా ఒక్కలా చెప్పలేవు
సరిగ్గా అవే ముద్దులతో.
బహుశ ఏ పనీ లేనివాడు ఒకడు
నీ పేరు ప్రసంగవశాత్తూ ఉటంకించవచ్చు
ఎవరో నా గదిలోకి ఒక గులాబీ విసిరినట్టూ, అది
రంగులతో, సువాసనలతో నిండినట్టనిపించొచ్చు.
రెండో రోజు నువ్వు నా చెంతనే ఉన్నా, నే మాటిమాటికీ
గడియారంవైపు చూడకుండా ఉండలేక పోవచ్చు.
ఒక గులాబీనా? ఒక గులాబీ? అంటే ఏమిటి?
అదొక పువ్వా లేక పాషాణమా?
ఇలా వచ్చి అలా పోయే రోజుని మనం ఎందుకంత
అవసరంలేని భయంతో, విచారంతో వెళ్ళదీస్తాము?
నిలకడగా ఉండలేకపోవడం దాని ప్రకృతి:
రేపువచ్చేసరికి ఇవాళ ఎప్పుడూ వెళ్లిపోతుంది.
సూర్యుడున్నంత కాలం ఈ నేలమీద
నవ్వులతో, ముద్దులతో ఐకమత్యంగా ఉందాం;
మనిద్దరిమీ రెండు నీటిచుక్కల్లా
ఒకదాన్నొకటిపోలకపోయినా (ఇందులో మన అభిప్రాయం ఒకటే).
.
జిస్వావా షింబోర్స్కా

(2 July 1923 – 1 February 2012)

పోలిష్ కవయిత్రి.

.

కాలం చలన శీలత గురించి చెబుతున్నప్పుడు, You can’t step into the same river twice అన్న హెరాక్లిటస్ ఆఫ్ యూఫ్యూస్ సూక్తి గుర్తు రాకమానదు. ఇది నిరాశలోనో, నిస్పృహలోనో కూరుకుపోకుండా, మనిషికూడా కాలంతోపాటే ప్రవహించడానికి చెప్పిన సూక్తి. ప్రకృతి ధర్మాన్ని చిన్న మాటలలో బంధించిన తత్త్వవేత్త మేధో మధన ఫలం.  సృష్టిలో ఏదీ శాశ్వతం కాకపోయినా, ఈ చలనశీలత మాత్రం శాశ్వతం. అదే, ఈ కవితలో కవయిత్రి చెపుతోంది.

.

Image Courtesy: http://upload.wikimedia.org
Image Courtesy: http://upload.wikimedia.org

.

Nothing Twice

.

Nothing can ever happen twice.

In consequence, the sorry fact is


that we arrive here improvised


and leave without the chance to practice.


Even if there is no one dumber,


if you’re the planet’s biggest dunce,


you can’t repeat the class in summer:


this course is only offered once.


No day copies yesterday,


no two nights will teach what bliss is


in precisely the same way,


with precisely the same kisses.


One day, perhaps some idle tongue


mentions your name by accident:


I feel as if a rose were flung


into the room, all hue and scent.


The next day, though you’re here with me,


I can’t help looking at the clock:


A rose? A rose? What could that be?


Is it a flower or a rock?


Why do we treat the fleeting day


with so much needless fear and sorrow?


It’s in its nature not to stay:


Today is always gone tomorrow.


With smiles and kisses, we prefer


to seek accord beneath our star,


although we’re different (we concur)


just as two drops of water are.


.

Wislawa Szymborska,

(2 July 1923 – 1 February 2012)

Polish Poet.

Translated from the Polish by Clare Cavanagh and Stanislaw Baranczak.

 

దీపం… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి.

సుదీర్ఘమైన చీకటి దిగుడు బాటపట్టి నేను పోతున్నపుడు
నీ ప్రేమని ఒక దీపంలా నా ముందు పట్టుకో గలిగితే
అంతులేని నీడలు నను చుట్టుముట్టినా భయపడను;
భీతితో కెవ్వుమని కేకలూ పెట్టను.  

నేను దేవుడ్ని కనుక్కోగలిగితే, కనుక్కుంటాను.
ఎవరికీ అతను కనిపించకపోతే, నిశ్చింతగా నిద్రిస్తాను…
భూమి మీద ఉన్నప్పుడు నీ ప్రేమ ఒక్కటే సరిపోలేదా
చిమ్మ చీకటిలో దీపంలా…  

.

సారా టీజ్డేల్
(August 8, 1884 – January 29, 1933)
అమెరికను కవయిత్రి

.

English: Filsinger, Sara Teasdale, Mrs., portr...
English: Filsinger, Sara Teasdale, Mrs., portrait photograph. (Photo credit: Wikipedia)

.

 The  Lamp

.

If I can bear your love like a lamp before me,
When I go down the long steep Road of Darkness,
I shall not fear the everlasting shadows,
Nor cry in terror.

If I can find out God, then I shall find Him,
If none can find Him, then I shall sleep soundly,
Knowing how well on earth your love sufficed me,
A lamp in darkness.

.

Sara Teasdale 

(August 8, 1884 – January 29, 1933

నిర్బంధించబడిన ఆత్మ … వాల్ట్ విట్మన్, అమెరికను కవి

చివరకి, తేలిపోతూ
 
కోటలా సురక్షితమైన ఈ ఇంటిగోడల మధ్యనుండీ
   
దగ్గరా మూసిన తలుపులనుండీ, పకడ్బందీగా వేసిన తాళాలనుండీ 
 
నన్ను ఎగిరిపోనీ…
 

 
నన్ను చప్పుడు చెయ్యకుండా జారుకోనీ…
 
సుతి మెత్తని గుసగుసలతో తాళాలు తీసుకుంటూ …
 
ఓ నా జీవమా! ద్వారాలు తెరుచుకోనీ.
 

 
ఓహో, నెమ్మదిగా! అంత అసహనం కూడదు..
 
ఎంత బిగువైనది నీ పట్టు, నశ్వరమైన శరీరమా!
 
ఎంత బలీయము ఈ వ్యామోహము, ప్రేమా!

.

వాల్ట్ విట్మన్


31 మార్చి, 1819 – 26 మార్చి 1892


అమెరికను కవి

.

Walt Whitman's use of free verse became apprec...
Walt Whitman’s use of free verse became appreciated by composers seeking a more fluid approach to setting text. (Photo credit: Wikipedia)

 

The Imprisoned Soul

.

At the last, tenderly,

From the walls of the powerful, fortress’d house,

From the clasp of the knitted locks—from the keep of the well-closed doors,

Let me be wafted.

 

Let me glide noiselessly forth;

With the key of softness unlock the locks—with a whisper

Set ope the doors, O soul!

 

Tenderly! be not impatient!

(Strong is your hold, O mortal flesh!

Strong is your hold, O love!)

.

Walt Whitman

(May 31, 1819 – March 26, 1892)

American Poet

(Poem Courtesy: http://www.bartleby.com/101/742.html

The Oxford Book of English Verse: 1250–1900, Arthur Quiller-Couch, ed. 1919.)

మనం ఒక మొక్కని నాటుతున్నామంటే … హెన్రీ ఏబీ, అమెరికను కవి

మనం ఒక మొక్కని నాటుతున్నామంటే ఏమిటి నాటుతున్నాం?

మనం సంద్రాలు అవలీలగా దాటగల ఓడని నాటుతున్నాం,

దాని తెరచాపలు ఎగరేసే నిలువెత్తు వాడస్థంభాన్ని నాటుతున్నాం;

తుఫానులను ఎదుర్కోగల చెక్కలని నాటుతున్నాం,

దాని వెన్నుని, దూలాల్ని, లో దూలాల్ని, కీళ్ళని,

మనం ఒక మొక్కని నాటుతున్నామంటే ఒక ఓడని నాటుతున్నాం.

 మనం ఒక మొక్కని నాటుతున్నామంటే ఏమిటి నాటుతున్నాం?

నువ్వూ నేనూ ఉండడానికి ఒక ఇల్లుని నాటుతున్నాం,

ఇంటివాసాల్ని, పట్టీల్ని, మిద్దెల్ని, నాటుతున్నాం,

గుబ్బమేకుల్ని, పెండెబద్దల్ని, తలుపుల్ని నాటుతున్నాం,

దూలాల్ని, ద్వారబంధాల్ని, ఎన్ని అవసరాలో అన్నిటినీని

మనం ఒక మొక్క నాటుతున్నామంటే ఒక ఇంటిని నాటుతున్నాం.

 మనం ఒక మొక్క నాటుతున్నామంటే ఏమిటి నాటుతున్నాం?

మనం రోజూ చూసే వేలరకాల వస్తువుల్ని;

మన గోపురాలని తలదన్నే మెట్లని నాటుతున్నాం,

మన దేశపతాకాన్ని ఎగరేసే  జండాకొయ్యని నాటుతున్నాం,

ఎండనుండి రక్షించే ఒక ఒక నీడని నాటుతున్నాం

మనం ఒక మొక్కనాటుతూ ఇవన్నీ నాటుతున్నాం.

.

 హెన్రీ ఏబీ

జులై 11, 1842 – జూన్ 7, 1911

అమెరికను కవి.

సాహిత్యంలో ఒకే ఒక్క కవితతో అజరామరమైన కీర్తి సంపాదించిన వాళ్ళు చాలా తక్కువ. అటువంటి  అతితక్కువమంది కవుల్లో  హెన్రీ ఏబీ ఒకడు.

మనకి తెలిసిన విషయాలే అవొచ్చు. కానీ, చెప్పే విధానంలోనే తేడా. చిత్రకారులందరికీ అవే కుంచెలు, అవే రంగులు; ఒక భాషకి చెందిన కవులందరికీ అదే వర్ణమాల, అవే పదాలూ అవే ప్రయోగాలూ. కానీ జాషువాలూ, కరుణశ్రీలూ, రవివర్మలూ, వడ్డాది పాపయ్యలూ, బాపూలు వందలకొద్దీ పుట్టుకురారేమి? జాషువా, కరుణశ్రీ పద్యాలు చదువుతుంటే మనకి బుర్రకొట్టుకున్నా పలకని శబ్దాలు, వాళ్ళకేమిటి, అడుగులకి మడుగులొత్తుతూ పడుతున్నాయా అనిపిస్తుంది. రవివర్మదో, వ.పా.దో, బాపూదో బొమ్మ చూస్తుంటే వీళ్ళ కళ్ళకీ, వేళ్ళకీ మధ్య ఏదో తెలియని పురాకృత సంబంధం ఉందేమోననిపిస్తుంది.

కొన్ని కవితలు పైన చెప్పిన ఏ సొగసులూ లేకపోయినా, వాటిలోని అంతర్లీనమైన సౌందర్యానికి, తాత్త్విక భావనకి, అభివ్యక్తి వెనక ఉన్న ఉదాత్తమైన పరిశీలనకి, దానికి మనం ఎన్ని రకాలుగా వ్యాఖ్యానించదలుచుకుంటే, అన్నిరకాలుగా వ్యాఖ్యానించడానికి అనువుగా ఉంటూనే, ప్రతి వ్యాఖ్యానమూ మనోరంజకంగా ఉండడంలోనే వాటి నిరాడంబర సౌందర్యం ఉంటుంది. అదిగో సరిగ్గా అలాంటి కవితే ఇది. ఇక్కడ ఉపమలూ, ఉత్ప్రేక్షలూ, రూపకాలూ మొదలైన ఏ అలంకారాలూ లేవు; గంభీరమైన పదప్రయోగాలూ లేవు; కవి చాలా ప్రశాంతంగా ఉన్నది ఉన్నట్టుగా చెప్పేడు. కేవలం సహజోక్తి. అరే. సహజోక్తిలో ఇంత ప్రభావం ఉంటుందా అని ఆశ్చర్యపోయేట్టు చేశాడు కవి.

దీన్నిప్పుడు కవిత్వానికి అన్వయించి చూడండి.

మీరు కవితని నాటుతున్నారంటే ఏమిటి నాటుతున్నారు? మీ సున్నితమైన స్పందనని నాటుతున్నారు, మీ కన్నీళ్ళని నాటుతున్నారు. మీ బాధల్ని నాటుతున్నారు. మీ విరహాల్ని నాటుతున్నారు. మీ ఆనందాల్ని, మీ సంతోషాల్ని, మీ సమస్యలని, మీ అవగాహనని, మీ వైరుధ్యాల్ని, మీ వైషమ్యాల్ని, మీ సంస్కారాన్ని… మీరొక వ్యక్తిత్వాన్ని నాటుతున్నారు.

మీరు ఒక కవితని నాటుతున్నారంటే ఏమిటి నాటుతున్నారు? మీ స్మృతిపథంలో బంధించిన ఒక కాలరేఖని నాటుతున్నారు. మీరు చేదుకున్న అనుభవాన్ని నాటుతున్నారు. ఒక జాతి సంస్కృతిని నాటుతున్నారు. మీ వారసత్వాన్ని నాటుతున్నారు. మీరు దర్శించిన ప్రకృతిని నాటుతున్నారు. మీ వివేచనని, మీ కల్పనని, మీ అధ్యయనాన్ని, మీ ఊహా చిత్రాల్ని, మానవాళి మహోన్నత ఆశయాల్ని, మీరు కంటున్న అపూర్వమైన కలని నాటుతున్నారు. మీరొక పరిణతి చెందిన మనీషిని, విశ్వనరుడ్ని నాటుతున్నారు.

సాహిత్య ప్రక్రియ ఏది కానీండి, ఇది గుర్తుంచుకుంటే, మన సమిష్ఠి కృషి, చేతన అయిన సాహిత్యం మానవకళ్యాణానికి ఉపకరించే దిశలో వెళుతుందని నా ప్రగాఢమైన విశ్వాసం.

.

Henry Abbey
Henry Abbey (Photo credit: Wikipedia)

What Do We Plant…

.

What do we plant when we plant a tree?

We plant the ship, which will cross the sea

We plant the mast to carry the sails;

We plant the plank to withstand the gales,

The keel, kalson, and beam and knee;

We plant the ship when we plant the tree.

 

What do we plant when we plant the tree?

We plant the houses for you and me,

We plant the rafters, the shingles, the floors,

We plant the studding, the lath, and the doors,

The beams and sidings, all parts that be;

We plant the house when we plant the tree.

 

What do we plant when we plant the tree?

A thousand things that we daily see;

We plant the spire that out towers the crag,

We plant the staff for our countries’ flag,

We plant the shade, from the hot sun free;

We plant all these when we plant the tree.

 

Henry Abbey

July 11, 1842 – June 7, 1911

American Poet

తరాలు … ఏమీ లోవెల్, అమెరికను కవయిత్రి

నువ్వు


బంగారు రంగు చివురులు తొడుగుతూ


తిన్నగా ఎదుగుతూ కొమ్మలతో ఊగిసలాడే


చిన్ని బాదాం (1) చెట్టు మొలకవి .


నీ నడక కొండగాలికి రివ్వున


కొమ్మలు జాచే బాదం చెట్టు వంటిది.


నీ గొంతు సడి ఆకులమీద

 


తేలికగా విహరించే దక్షిణగాలి ఒరిపిడి;


నీ నీడ నీడకాదు, విరజిమ్మిన వెలుతురుపొడ;


రాత్రివేళ నువ్వు ఆకాశాన్ని క్రిందకి దించుకుని


నక్షత్రాలను చుట్టూ కప్పుకుంటావు.

నేను మాత్రం, తనపాదాల చెంత పెరుగుతున్న పిల్ల బాదం మొక్కని

మేఘావృతమైన ఆకాశం క్రింద  పరిశీలించే ఓక్ చెట్టుని

.

ఏమీ లోవెల్,

ఫిబ్రవరి 9, 1874 – మే 12, 1925

(1) (గమనిక:  బీచ్ చెట్టు  అంటే బాదం చెట్టు కాదు.  బీచ్ చెట్టుకు కాసే  పళ్ళలో తినదగిన గట్టి సీడ్ ఉంటుంది. ఈ చెట్టు విశాలంగా కొమ్మలతో  పొడవుగా ఎదగుతుంది. సామ్యానికి దగ్గరగా ఉంటుందని బీచ్ చెట్టుని  బదం  చెట్టుగా మార్చడం జరిగింది. అంతే. )

ఎజ్రాపౌండ్ ప్రారంభించిన  ఇమేజిజం అనే సాహిత్య ఉద్యమాన్ని అమెరికాలో బాగా ముందుకి తీసుకు వెళ్ళిన కవయిత్రి  ఏమీ లోవెల్. తక్కువ వర్ణనలతో, ప్రతీకలకి, స్పష్టమైన పదప్రయోగానికి ప్రాధాన్యతనిచ్చిన ఒక ఉద్యమం ఈ ఇమేజిజం.  ఈమెకు మరణానంతరం పులిట్జరు బహుమతి వచ్చింది.  పౌండ్ లాంటి వాళ్ళు ఆ మార్గాన్ని వదిలేసినా, ఏమీ లోవెల్ మాత్రం ఈ ఉద్యమాన్ని కొనసాగించింది.

.

TIME Magazine cover from March 2, 1925 featuri...
TIME Magazine cover from March 2, 1925 featuring Amy Lowell (Photo credit: Wikipedia)

.

Generations

.

You are like the stem

Of a young beech-tree,

Straight and swaying,

Breaking out in golden leaves.

Your walk is like the blowing of a
beech-tree

On a hill.

Your voice is like leaves

Softly struck upon by a South wind.

Your shadow is no shadow, but a
scattered sunshine;

And at night you pull the sky down
to you

And hood yourself in stars.

 

But I am like a great oak under a
cloudy sky,

Watching a stripling beech grow up
at my feet.

.

Amy Lowel

February 9, 1874 – May 12, 1925)

American poet of the imagist school

Amy Lowell won the Pulitzer Prize for Poetry in 1926.

విచికిత్స .. డొరతీ పార్కర్, అమెరికను కవయిత్రి

నేనే మెత్తనిదాన్నై ఉండి,  అందంగా ఉండి

నా మనసు నీ పాదాలముందు పరిచితే;


నా మనసులోని ఆలోచనలన్నీ నీతో చెప్పుకుని


నువ్వు తేలికగా చెప్పే అబద్ధాలన్నీ నిజమని పొగిడితే;


“నిజం సుమీ” అని నెమ్మదిగా మనసులోనే అనుకుని


“ప్రియా! ఎంత నిజం చెప్పావు,” అని పదేపదే చెపుతూ;


సందర్భానికి తగ్గట్టు కళ్ళువాల్చుకుని


నీ నొసలుచిట్లింపులకు ముఖంపాలిపోయేలా భయపడుతూ,


నా మాటల్లో నిన్నెక్కడా ప్రశ్నించనంతవరకు


ప్రియతమా, అప్పుడు నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తావు.

అదే నేను బలహీనురాల్నై, పిచ్చి దానిలా

నా మనసు ప్రతి కుర్రాడితో పంచుకుంటే,


నువ్వు నా గడపదాటిన ప్రతిసారీ


అడుగుల్ని తలకద్దుకుంటే ఫర్వాలేదు;


కానీ, నేను నిను అనుమానించినా, నిను చీదరించుకున్నా,


“నీకో నమస్కారం” అని గట్టిగా అరిచి, నా కాళ్లమీద నిలబడినా


నీ ఆనందానికి విఘాతం కలిగించి, నమ్మకాన్ని వమ్ముచేసినా


బ్రతికుండగా నువ్వు నా వంక చూడవు.


.


డొరతీ పార్కర్

(August 22, 1893 – June 7, 1967)

అమెరికను

.

American writer Dorothy Parker (1893-1967)
American writer Dorothy Parker (1893-1967) (Photo credit: Wikipedia)

.

Dilemma

.

If I were mild, and I were sweet,
And laid my heart before your feet,
And took my dearest thoughts to you,
And hailed your easy lies as true;
Were I to murmur “Yes,” and then
“How true, my dear,” and “Yes,” again,
And wear my eyes discreetly down,
And tremble whitely at your frown,
And keep my words unquestioning
My love, you’d run like anything!

Should I be frail, and I be mad,
And share my heart with every lad,
But beat my head against the floor
What times you wandered past my door;
Were I to doubt, and I to sneer,
And shriek “Farewell!” and still be here,
And break your joy, and quench your trust
I should not see you for the dust!

.

Dorothy Parker

(August 22, 1893 – June 7, 1967)

American Poetess

కాలమొక ఒడిదుడుకుల ప్రవాహం… రాబర్ట్ సౌత్ వెల్, ఇంగ్లీషు కవి

కొమ్మలు నరికినచెట్టు మళ్ళీ పెరగవచ్చు,

మోడులైన మొక్కలు తిరిగి పుష్పించి ఫలించవచ్చు;


దౌర్భాగ్యుడికి కష్టాలు తొలగిపోవచ్చు,


ఎండి బీడైననేల కూడా చిరుజల్లులోని తేమ గ్రహించవచ్చు


కాలచక్రం క్రిందుమీదవుతుంటుంది, అదృష్టం చంచలమైనది


కష్టాన్నుండి సుఖానికీ, మంచిరోజులనుండి గడ్డురోజులకీ మారుతుంది.


.

అదృష్టసాగరం నిరంతరం ప్రవహించదు

అణగారినవారిని అది ఒకోసారి అనుగ్రహిస్తుంటుంది

దాని ఆటుపోటులు సమాన అంతరంలో కొనసాగుతాయి


ముతక, సన్నని కలనేతల నేతపని దానిది.


చివరిదాకా కొనసాగిన ఏ గొప్ప సుఖమూ లేదు,


గతిమారని అలవిమాలిన కష్టమూ లేదు.

.

నిత్యమూ శిశిరము కాదు, నిత్యవసంతమూ ఉండదు,

అంతం లేని కాళరాత్రీ ఉండదు, పొద్దుపోని రోజూ ఉండదు,


విషాదములో మునిగిన పక్షులకుకూడా, తియ్యగా పాడే ఋతువు వస్తుంది


ఎంతపెద్ద తుఫానునైనా మరపించే ప్రశాంతత వెన్నంటి వస్తుంది.


అలా భగవంతుడు కష్టసుఖాలు పెనవేసి మనిషిని రాటుదేరుస్తాడు


మనిషికి ఎప్పుడూ లేవగల ఆశనిస్తూ, పడిపోతామేమోనన్న భయాన్నిస్తాడు.   

.


దురదృష్టంతో పోగొట్టుకున్నది అదృష్టం తిరిగి సంపాదించిపెట్టవచ్చు,


బలహీనమైన వలకూడా చిన్నచిన్న చేపలని పట్టుకోవచ్చు;


అందరికీ అందనిదేదో ఒకటుంటుంది, ఏదీ అందనివాళ్ళెవరూ ఉండరు;


కొందరికి అవసరమైనవన్నీ దక్కుతాయి, కాని ఎవరికీ అడిగినవన్నీదొరకవు;


ఏ ఒక్క మనిషికీ అకళంకమైన ఆనందం దొరకమన్నా దొరకదు,


మితంగా కోరు, కొన్ని దక్కుతాయి; అదుపులేదూ, ఎప్పుడూ ఏదీ దొరకదు.


.

రాబర్ట్ సౌత్ వెల్,


1561 – 21 February 1595

ఇంగ్లీషు కవి, కేథలిక్ ప్రీస్టు.  

ఈ కవిత సుమారు 500 సంవత్సరాల క్రిందటిది అంటే  మనలో చాలా మంది నమ్మకపోవచ్చు.  కాలం గురించి ఇంత అవగాహన ఉందా అప్పటి ఇంగ్లీషు కవులకి అని. ఎందుకంటే, ఎలిజబెత్ మహారాణి కాలం నాటికి ఇంకా గ్రీకూ లాటినే రాజభాషగా గౌరవాన్ని అందుకోవడంతో పాటు, ఇంగ్లీషు అప్పుడప్పుడే తనకాళ్ళమీద నిలబడడనికి ప్రయత్నిస్తున్న రోజులు.  పునరుద్ధరణ (Renaissance)  పుణ్యమా అని, గ్రీకు లాటిను, ఇటాలియన్ భాషల సాహిత్య వాసనలు సంపుటీకరించుకుని, ఇంగ్లీషుకి ఒక గుర్తింపు తీసుకు వచ్చిన మహామహులు చాలా మంది పుట్టారు 16వ శతాబ్దంలో.

 

కాలమహిమ గురించి సౌందరనందం కావ్యంలో పింగళి కాటూరి కవులు చాలా హృద్యంగా చెప్పారు:

“కాలవశమ్మునన్ విసరుగాడ్పులకున్ ముదురాకుపుట్టముల్

రాలగ, బాటసారుల పరామరిసింపగ లేక సంపదల్

దూలిన దాతవోలె జిగిదూలిన ఆ యెలమావి గున్న యా

కాలవశమ్ము చేతనె సఖా! వికసించెడి సౌరు గంటివే…  “

అంటారు.  ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవడం అన్నది కాలమహిమ. కాలం ఎంత భీతావహమో అంతఆశావహము కూడా. ఈ సత్యాన్ని మనం గుర్తుంచుకుంటే, మనకి మనమున్న స్థితికి  మన శక్తి యుక్తులు కారణం కావన్న నిజం అర్థం అయి, విర్రవీగకుండా, వినయంగా ఉండగలుగుతాము.


.

Times Go By Turns

.

The lopped tree in time may grow again,
Most naked plants renew both fruit and flower;
The sorriest wight may find release of pain,
The driest soil suck in some moistening shower.
Times go by turns, and chances change by course,
From foul to fair, from better hap to worse.

The sea of Fortune doth not ever flow,
She draws her favours to the lowest ebb.
Her tides hath equal times to come and go,
Her loom doth weave the fine and coarsest web.
No joy so great but runneth to an end,
No hap so hard but may in fine amend.

Not always fall of leaf, nor ever spring,
No endless night, yet not eternal day;
The saddest birds a season find to sing,
The roughest storm a calm may soon allay.
Thus, with succeeding turns, God tempereth all,
That man may hope to rise, yet fear to fall.

A chance may win that by mischance was lost;
The net, that holds no great, takes little fish;
In some things all, in all things none are crossed;
Few all they need, but none have all they wish.
Unmeddled joys here to no man befall;
Who least, hath some; who most, hath never all.

.

Robert Southwell 

c. 1561 – 21 February 1595

England

చాడీలు… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి

వాళ్ళు నీ మీద నేరాలు చెప్పడానికి వచ్చేరు

ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకుంటూ పోయేరు.

చెప్పడం పూర్తయేక గట్టిగా ఫక్కున నవ్వేను

అవన్నీ నాకు ఇంతకుముందే తెలుసు.

ఓహ్! వాళ్లు ఎదురుగుండా కనిపిస్తున్నా చూడలేని గుడ్డివాళ్ళు

ఆ నీ తప్పులే  నిన్నింకా గాఢంగా ప్రేమించేలా చేసేయి.

 
.

సారా టీజ్డేల్

August 8, 1884 – January 29, 1933

అమెరికను కవయిత్రి

సారా టీజ్డేల్ అపురూపమైన కవయిత్రి.  ఆమె  ఎంత సరళంగా రాస్తుందో, అందులో అంత భావ గాంభీర్యతనీ చొప్పిస్తుంది.  ఒక వ్యంగ్యమో, ఒక ఉపమానమో, ఒక ఆకాంక్షో, నైరాశ్యమో, విరహమో  … ఏదైనా సరే ఆమె చాలా అలవోకగా పలికించగలదు ఆమె పదాల్లో.  అక్కడ నేర్పుకంటే, తాదాత్మ్యం చెందిన అనుభూతిని అక్షరాలలోకి వొలికించగల సహజమైన శక్తి ఉంది.  ప్రతీ ఒక్కరూ మమేకమవగలిగేలా ఉంటాయి  ఆమె ప్రేమకవితలు.

.

English: Filsinger, Sara Teasdale, Mrs., portr...
English: Filsinger, Sara Teasdale, Mrs., portrait photograph. (Photo credit: Wikipedia)

.

Faults

.

They came to tell your faults to me,
they named them over one by one;

I laughed aloud when they were done,
I knew them all so well before

Oh, they were blind, too blind to see,
Your faults had made me love you more.

.

Sara Teasdale

August 8, 1884 – January 29, 1933

American

 

%d bloggers like this: