
సంధ్యాగమనము … జాన్ మిల్టన్, ఇంగ్లీషు కవి
నిశ్శబ్దాన్ని తోడు గొని, మత్తుగొలిపే చీకటి ముసుగు
ప్రకృతి యెల్లెడలా అంచెలంచెలుగా పరచుకుంటూ
ప్రశాంతంగా అడుగు మోపింది సాయంసంధ్య; పశుపక్ష్యాదులు
తమ తమ పసరిక నెలవులకూ, గూళ్ళకూ చేరుకున్నాయి;
ఎటుజూసినా నిశ్శబ్దమే, వనప్రియ కోకిలారవం మినహా;
తను రాత్రంతా శృంగారగీతికల నాలపిస్తూనే ఉంది;
నిశ్శబ్దపు గుండె పరవశించింది. ఇపు డాకసమునిండా
ఇంద్రనీలమణులప్రభలే; ఆ నక్షత్రాతిథులమధ్య
రేచుక్క అరుణిమతో జేగీయమానంగా వెలుగులీనుతోంది;
ఇంతలో మొయిలుదొంతరల తెరలుమాటుచేసి రాజోచిత దర్పంతో
అసమాన తేజస్వియైన రేరాజు తొంగిచూసాడు. అంతే!
అంతటి రజనీ నీలాంబరమూ … వెండివలిపమై భాసించింది.
.
జాన్ మిల్టన్
(9 December 1608 – 8 November 1674)
ఇంగ్లీషు కవి
An Evening
.
Now came still evening on, and twilight gray
Had in her sober livery all things clad;
Silence accompany’d; for beast and bird,
They to their grassy couch, these to their nests,
Were slunk, all but the wakeful nightingale;
She all night long her amorous descant sung;
Silence was pleas’d. Now glow’d the firmament
With living sapphires; Hesperus, that led
The starry host, rode brightest, till the moon,
Rising in clouded majesty, at length
Apparent queen unveil’d her peerless light,
And o’er the dark her silver mantle threw.
.
John Milton
(9 December 1608 – 8 November 1674)
English Poet
From: Paradise Lost IV Book

జీవన కెరటం … ఆల్ఫ్రెడ్ టెన్నిసన్ ఇంగ్లీషు కవి
కాన్రాడ్! నీ జీవితం ఏ మార్పూలేక విసుగ్గా ఉందంటావేమి?
లంగరువేసి ఆలోచనలో పడ్డావెందుకు? అన్నిపక్కలా పాకిరిపోయిన
ఈ కలుపు తగ్గేది కాదు, పైపెచ్చు, నీటివాలు అంతా అల్లుకుంటుంది.
జీవిత నౌక చేరడానికి అందమైన తీరాలు అనేకం ఉన్నాయి
కానీ, నువ్వెప్పుడూ ఒక్క తీరాన్నే చేరాలని ఆరాటపడుతుంటావు.
ఆ తెడ్లని పైకిలాగి పడవకి అడ్డంగా గిరాటు వేశావేమి?
ప్రయత్నం లేకుండా పడవ దానంతట అది వాలులోకి ప్రయాణించదు.
ఈ జీవన కెరటాన్ని వెంటతరిమి ముందుకు తోసే అల ఉండదు.
మన మనుగడే అవరోధాల్ని అధిగమించి ముందుకు సాగడం మీద ఉంది.
జీవితంలో ఉత్తమ పార్శ్వమంతా మన కోరికల ఆరాట ఫలితమే.
మహా అయితే, ఎగుబోటు లేని నీ పడవ కాసేపు నిలకడగా ఉంటుందేమో గాని
ఆగిపోదు. దాన్ని రెండుపక్కలనుండి అశాంతి తాడిస్తూనే ఉంటుంది.
విను! ఆ ప్రశాంతతని నిర్లిప్తంగా సాగే కెరటాలకు విడిచిపెట్టి
బద్ధకంనుండిపుట్టిన కలుపుని వివేకంతో ముందుకు సాగుతూ జయించు.
.
ఆల్ఫ్రెడ్ టెన్నిసన్
(6 August 1809 – 6 October 1892)
ఇంగ్లీషు కవి
.
Conrad! Why call thy life monotonous?
Why brood above thine anchor? The woven weed
Calms not, but blackens, the slope water bed.
The shores of life are fair and various,
But thou dost ever by one beach abide.
Why hast thou drawn thine oars across the boat?
Thou canst not without impulse downward float,
The wave of life hath no propelling tide.
We live but by resistance, and the best
Of life is but the struggle of the will:
Thine unresisting boat shall pause – not still
But beaten on both sides with swaying Unrest.
Oh! Cleave this calm to living eddies, breast
This sloth-sprung weed with progress sensible.
.
Alfred Lord Tennyson
(6 August 1809 – 6 October 1892)
English Poet
Poem Courtesy: Rhythm and Will in Victorian Poetry by Matthew Campbell
Copyright Cambridge University Press
From Google Books:
https://books.google.co.in/books?id=EGHJriLBYYcC&pg=PA157&lpg=PA157&dq=The+rhythm+of+oars+by+tennyson&source=bl&ots=5t2wS1up1B&sig=ACfU3U1MVV20XuPSvPLZnBeWnOoNGHx8OA&hl=en&sa=X&ved=2ahUKEwjA1fO1vrvpAhXlzDgGHULBDdkQ6AEwBnoECAkQAQ#v=onepage&q=The%20rhythm%20of%20oars%20by%20tennyson&f=false
తోటమాలి … రబీంద్రనాథ్ టాగోర్, భారతీయ కవి
ఈ రోజు రబీంద్రనాథ్ టాగోర్ 159 వ జన్మదిన వార్షికోత్సవం
నీకు అదే ఇష్టమనిపితే
నా పాటని ఇప్పుడే ఆపేస్తాను.
నీ గుండె ఉద్వేగానికి లోనవుతోందంటే
నీ ముఖంలోకి చూడడం విరమించుకుంటాను.
నడుస్తూ నడుస్తూ, ఆశ్చర్యంతో అడుగు తడబడితే
నేను ప్రక్కకి తొలగి, వేరే దారి చూసుకుంటాను.
పూదండ గ్రుచ్చుతూ తడబడుతున్నావంటే
అలికిడిలేని నీ తోటవంక కన్నెత్తైనా చూడను.
ఈ కొలనునీరు తుంటరిగా నీపైకి ఎగురుతోందంటే
ఈ ఒడ్డున నా పడవ నడపడమే మానుకుంటాను.
.
రబీంద్రనాథ్ టాగోర్
(7 May 1861 – 7 August 1941)
భారతీయ కవి

The Gardener
If you would have it so,
I will end my singing.
If it sets your heart aflutter,
I will take away my eyes from your face.
If it suddenly startles you in your walk,
I will step aside and take another path.
If it confuses you in your flower-weaving,
I will shun your lonely garden.
If it makes the water wanton and wild,
I will not row my boat by your bank.
.
Rabindranath Tagore
(7 May 1861 – 7 August 1941)
Indian Poet
Poem Courtesy: Contributed by Nirupama Ravindra
అన్న పెత్తనం… హాత్రే, ఇంగ్లీష్ కవయిత్రి
ఈ కవితలో చమత్కారం అంతా అమ్మకి ఇద్దరం సాయం చెయ్యాలని ఒకప్రక్క చెబుతూనే, కష్టం అంతా సోదరికీ, సుఖం
అంతా తనకీ ఉండేట్టు పని పంచుకోవడంలో అన్న చూపించిన నేర్పు.
***
సూసన్! నువ్వు ఇంట్లో
బుద్ధిగా ఉంటానని మాటివ్వు!
అమ్మకి ఒంట్లో బాగులేదు, నీరసంగా విచారంగా
ఉంది; అమ్మని ఆనందంగా ఉండేట్టు మనం చూడాలి;
బంగాళాదుంపలు ఒలిచిపెట్టు, బియ్యం అత్తెసరు పెట్టు,
రాత్రి భోజనం వేడిగా, రుచిగా ఉండేట్టు చేసిపెట్టు.
కుర్ర చేష్టలు కట్టిపెట్టి మనం
ఇంటిపట్టున ఉండి ఆమెకి సాయం చెయ్యాలి;
నేను కొండవార పొలానికి వెళ్ళాలి, దున్ని
మొక్కలు నాటడానికీ, విత్తులు జల్లడానికీ.
కాబట్టి ఈ రోజల్లా అమ్మను జాగ్రత్తగా చూసుకునే
బాధ్యత నీకు అప్పగిస్తున్నాను.
సాయంత్రం సూర్యాస్తమయం వేళకి
ఇంటికి తిరిగి వచ్చేస్తాను
అమ్మకి టీ కాచి ఇవ్వు,
నాకు కొంచెం బ్రెడ్,చీజ్ సిద్ధంగా ఉంచు
నువ్వు అల్లుతుంటే, నే చదువుతుంటాను
సాయంత్రం ఇట్టే గడిచిపోతుంది.
.
హాత్రే, 18th Century
ఇంగ్లీషు కవయిత్రి
.
The Brother’s Charge
.
Susan, promise that you’ii stay
Quietly at home today;
Mother is ill, and weak, and sad,
We must try and make her glad;
Peel potatoes, boil the rice,
Get the dinner hot and nice.
We must be her help and stay,
Putting childish things away;
To the hill side I must go,
Plants to set and beans to hoe;
So to you I leave the care,
All this day, of mother dear.
When the sunset gilds the pane,
I shall be at home again;
You’ii get mother’s cup of tea,
And some bread and cheese for me;
You shall knit, I’ll read the while,
And the evening hours beguile.
.
Mrs. Hawtrey
Poem Courtesy:
https://archive.org/stream/easypoetryforch00poetgoog?ref=ol#page/n19/mode/1up

కరెంటు తీగలు… ఫిలిప్ లార్కిన్., ఇంగ్లీషు కవి
ఈ కవితలో గొప్ప సౌందర్యం ఉంది. ఒకలా చూస్తే నిరాశావాదంలా కనిపిస్తున్నా, అది కవి లక్ష్యంకాదు. ఇక్కడ తీగెలు
నిజం తీగెలు కానక్కరలేదు. అవి ప్రతీకలు మాత్రమే. సమాజంలో పాతుకు పోయిన మూఢనమ్మకాలూ, ఆచారాలూ,
సంప్రదాయం పేరిట చలామణీ అయే ఏ అలవాట్లైనా కావచ్చు. ఇవి మానసికంగా ఒక గోడను, ఒక బలహీనతను
యువతలో సృష్టిస్తాయి. అంతేకాదు, ఈ రకమైన ఆచరణలకీ, జీవితంలో మనంచేసే కృషికి లభించే ఫలితాలకీ ఏ రకమైన
సమసంబంధ సామ్యం లేకపోయినా, ఏదో రకంగా ఈ రెండింటికీ ముడివేసి కోడెవయసులో ఉన్నవాళ్లని తెగువ/ సాహసం
లేనివారిగా చేస్తాయి. ఈ విషయాన్నే కవి చాలా అందంగా చెప్పాడు తక్కువమాటల్లో. నిజానికి జీవితంలో వచ్చే
సమస్యలకంటే, మానసికంగా ఇవి సృష్టించే అడ్దుగోడలను ఎదుర్కోవడం చాలా కష్టం.
* * *
సువిశాలమైన ప్రెయిరీల్లో పొలాలచుట్టూ కరెంటు తీగలుంటాయి
అక్కడ ఉన్న ముసలి పశువులకి ఆ హద్దు దాటకూడదని తెలిసినా
కోడె వయసులో ఉన్నవి ఇక్కడే కాదు ఎక్కడ మంచినీళ్ళున్నా
ఇట్టే పసిగడతాయి, ముఖ్యంగా ఆ తీగలకి ఆవల ఉన్నవి.
ఆ నేర్పు ఆ హద్దుల దగ్గర తప్పుచెయ్యడానికి ప్రేరేపిస్తుంది.
తమ కండలు చీరుకున్నా దాటాలని చేసే ప్రయత్నం ఫలించదు.
ఆ రోజునుండీ ఆ కోడె దూడలు ముసలిదూడలైపోతాయి.
కరెంటు వాటి ఆవేశపూరితమైన ఆశలకి అడ్డుకట్ట వేస్తాయి.
.
ఫిలిప్ లార్కిన్
(9 August 1922 – 2 December 1985)
ఇంగ్లీషు కవి.
.
.
Wires
.
The widest prairies have electric fences,
For though old cattle know they must not stray
Young steers are always scenting purer water
Not here but anywhere. Beyond the wires
Leads them to blunder up against the wires
Whose muscles-shredding violence gives no quarter.
Young steers become old cattle from that day,
Electric limits to their widest senses.
.
Philip Larkin
(9 August 1922 – 2 December 1985)
English poet, novelist, and librarian.
Poem Courtesy:
http://wonderingminstrels.blogspot.com/search/label/Submitted%20by%3A%20Vikram%20Doctor
ఉదాత్త స్వభావము… బెన్ జాన్సన్ , ఇంగ్లీషు కవి
చెట్టులా ఏపుగా బలంగా పెరగడం
మనిషిని మెరుగైనవాడిగా చెయ్యదు;
ఓక్ చెట్టులా మూడు వందల ఏళ్ళు బ్రతికినా అంతే.
చివరకి ఎండి, నిస్సారమై, బోడి మానై, రాలి ముక్కలవాల్సిందే.
లిల్లీపువ్వు జీవితం ఒకరోజే
వేసవిలో బహుసుందరంగా ఉంటుంది.
పగలుపూచినది రాత్రికి వాడి, రాలిపోవచ్చు. ఐతేనేం,
మన రోజంతటినీ దేదీప్యమానం చేసే పువ్వు అది.
మనం సౌందర్యాన్ని చిన్నచిన్న మోతాదుల్లోనే చూస్తాం.
చిన్న చిన్న ప్రమాణాల్లోనే జీవితం పరిపూర్ణమై ఉంటుంది.
.
బెన్ జాన్సన్
(11 June 1572 – 6 August 1637)
ఇంగ్లీషు కవి.
.
Ben Johnson
.
The Noble Nature
.
It is not growing like a tree
In bulk, doth make man better be;
Or standing long an oak three hundred year,
To fall a log at last, dry, bald, and sere;
A lily of a day
Is fairer far in May,
Although it fall and die that night-
It was the plant and flower of Light.
In small poportions we just beauty see;
And in short measures life may perfect be.
.
Ben Johnson
English poet
Poem Courtesy:
https://archive.org/details/childrensgarlan01unkngoog/page/n362
జంటబాసిన పులుగు… షెల్లీ, ఇంగ్లీషు కవి
జంటబాసిన పులుగొకటి శీతవేళ
కొమ్మపై కూర్చుని రోదిస్తున్నది ;
పైన గడ్డకట్టిన శీతగాలి కోత
క్రింద గడ్దకడుతున్న సెలయేటి పాత.
ఆకురాలిన అడవిలో మచ్చుకైన లేదు చిగురు
నేలమీద వెతికితే దొరకదు పూలతొగరు
గాలిలో లేదు సన్ననిదైన విసరు
ఉన్నదొక్కటే మిల్లు చక్రపు విసురు.
.
P. B. షెల్లీ
(4 August 1792 – 8 July 1822)
ఇంగ్లీషు కవి
.

Image Courtesy:
http://www.theguardian.com/books/2010/jan/28/percy-bysshe-shelley-christopher-hitchens
.
The Widow Bird
.
A widow bird sate mourning for her love
Upon a wintry bough;
The frozen wind crept above,
The freezing stream below.
There was no leaf upon the forest bare,
No flower upon the ground,
And little motion in the air
Except the mill-wheel’s sound.
.
PB Shelly
English Poet
Poem Courtesy:
https://archive.org/details/childrensgarlan01unkngoog/page/n351
మరణశయ్య… థామస్ హుడ్, ఇంగ్లీషు కవి
రాత్రంతా ఆమె ఊపిరితియ్యడాన్ని గమనిస్తూ గడిపాం,
పోల్చుకోలేనంత నెమ్మదిగా ఆమె ఊపిరి తీస్తూనే ఉంది
ఆమెగుండెలో కొట్టుకుంటున్నట్టే
ప్రాణం అటూ ఇటూ కొట్టుమిట్టాడుతోంది.
మేం ఎంత నెమ్మదిగా మాటాడుకున్నామంటే
ఎంత నెమ్మదిగా ఆమె చుట్టూ కదలాడేమంటే
ఆమెకి ఊపిసితీయగలశక్తి నివ్వడానికి
మా శక్తులన్నీ ధారపోస్తున్నామేమో అనిపించేంతగా.
మా ఆశలు మా భయాల్ని వమ్ము చేశాయి
మా భయాలు మా ఆశల్ని వమ్ము చేశాయి;
ఆమె పడుకున్నప్పుడు చనిపోయిందనుకున్నాం,
చనిపోయినపుడు పడుకుందనుకున్నాం.
ఎందుకంటే, చిన్న చినుకులతో, చలితో,
మసకమసకగా, నిరాశగా పొద్దుపొడిచినపుడు
ఆమె కనురెప్పలు శాశ్వతంగా మూసుకున్నాయి
మనదికాని వేరొక సూర్యోదయంలోకి ఆమె మేలుకుంది.
.
థామస్ హుడ్,
(23 May 1799 – 3 May 1845)
ఇంగ్లీషు కవి
.
.
The Deathbed
.
We watched her breathing through the night,
Her breathing soft and low,
As in her breast the wave of life
Kept heaving to and fro.
So silently we seemed to speak,
So slowly moved about,
As we had lent her half our powers,
To eke her being out.
Our very hopes belied our fears,
Our fears our hopes belied;
We thought her dying when she slept
And sleeping when she died.
For when the morning came dim and sad,
And chill with early showers,
Her quiet eyelids closed- she had
Another morn than ours.
.
Thomas Hood
(23 May 1799 – 3 May 1845)
English Poet
Poem Courtesy:
https://archive.org/details/WithThePoets/page/n258
విషాద గీతిక… ఫెలీషియా హెమన్స్, ఇంగ్లీషు కవయిత్రి
ఫెలీషియా హెమన్స్ పేరు వినగానే గుర్తొచ్చేది ఒకప్పుడు పాఠ్యభాగంగా ఉండే ఆమె కవిత Casabianca… The Boy who stood on the burning deck.
కన్యాశుల్కం చదివిన వారికి గుర్తు ఉండొచ్చు: వెంకటేశం తల్లి వెంకమ్మ “మా అబ్బాయీ మీరూ ఒక పర్యాయం యింగిలీషు మాటాడండి బాబూ!” అని బతిమాలినపుడు – గిరీశానికీ- వెంకటేశానికీ మధ్య జరిగిన సంభాషణలో ఇద్దరూ ఇష్టం వచ్చిన ఇంగ్లీషుముక్కలు మాటాడతారు. అందులో గిరీశం పై మాటలు … Casabianca పద్యానికి మొదటి పాదం …. అంటాడు.
.
ఓ సుందరాకృతీ! ఇప్పుడిక
నువ్వు విశ్వసించిన దైవం గుండెలమీద హాయిగా నిదురపో!
నువ్వు మా మధ్య నడయాడినపుడు కూడా
నీ నుదిటిపై అతని ముద్రలుండేవి.
మిత్తికా, నువ్వు తిరిగి క్రిందనున్న నేలలో కలిసిపో!
దివ్యాత్మా! ఊర్ధ్వలోకాల్లో నీ నివాసం చేరుకో!
మరణశయ్యమీద నీ ముఖం తిలకించిన వారెవ్వరూ
ఇకపై మరణమంటే ఎంతమాత్రం భయపడరు.
.
ఫెలీషియా హెమన్స్
(25 September 1793 – 16 May 1835)
ఇంగ్లీషు కవయిత్రి
.
.
A Dirge
.
Calm on the bosom of thy God,
Fair spirit rest thee now!
E’en while with ours thy footsteps trod
His seal was on thy brow.
Dust, to its narrow house beneath!
Soul, to its place on high !
They that have seen thy look in death
No more may fear to die.
.
Felicia Hemans
(25 September 1793 – 16 May 1835)
English Poet

గ్రంథాలయం… రాబర్ట్ సదే, ఇంగ్లీషు కవి
నేను మృతుల్లో ఒకడిగా ఉండే రోజులు గతించాయి
ఇప్పుడు నే నెటుచూసినా
నా దృష్టి యాదృచ్చికంగా దేనిమీద పడినా
నా కంటికి గతంలోని మేథావులు కనిపిస్తున్నారు.
ఎన్నడూ నన్ను తిరస్కరించని స్నేహితులు వాళ్ళు
ప్రతిరోజూ నేను సంభాషించేది వాళ్లతోనే.
నా ఆనందం వాళ్లతో పంచుకోవడం ఇష్టం,
నా బాధలకి ఉపశాంతి కోరేదీ వాళ్ళ దగ్గరే;
నేను వాళ్లకి ఎంత ఋణపడి ఉన్నానో
నాకు అర్థమై, అనుభూతి చెందుతున్న కొద్దీ
కృతజ్ఞతా భావంతో నిండిన కన్నీళ్ళతో
నా చెంపలు తరచు తడిసిపోతుంటాయి.
నా ఆలోచనలన్నీ ఆ మృతజీవులతోనే,
వాళ్లతో నేను భూతకాలంలో జీవిస్తుంటాను
వాళ్ళ మంచి ఇష్టపడతాను, చెడు నిరసిస్తాను
వాళ్ల ఆశనిరాశలలో భాగస్వామినౌతాను,
వాళ్ళు ఇచ్చిన సందేశాలను విని, జ్ఞానార్థినై
వినమ్రతతో దాన్ని అందుకునే ప్రయత్నం చేస్తాను.
ఇక నా ఆశలన్నీ వాళ్లమీదే. ఎందుకంటే
త్వరలోనే నేను వాళ్ళ చెంత చేరబోతున్నాను.
వాళ్లతో పాటే నేనుకూడా ప్రయాణం చెయ్యాలి
అంతులేని భవిష్యత్కాలమంతా.
కాకపోతే, ఇక్కడ నా పేరు విడిచిపెట్టగలననీ
అది నాతో పాటు మట్టిపాలవదనీ నా నమ్మకం.
.
రాబర్ట్ సదే
12 August 1774 – 21 March 1843
ఇంగ్లీషు కవి

http://www.greatthoughtstreasury.com/author/robert-southey