అనువాదలహరి

సైనికుడు… రూపర్ట్ బ్రూక్, ఇంగ్లీషు కవి

నేను మరణించడం జరిగితే, నా గురించి ఇలా తలపోయండి:

ఎక్కడో దేశంకాని దేశంలో ఓ మూల ఒకింత జాగా ఉంటుంది

అది ఎప్పుడూ ఇంగ్లండునే తలపోస్తుంది. అక్కడ ఆ

అపురూపమైన నేలలో అంతకంటే విలువైన మట్టి దాగుంది.

ఆ మట్టి ఇంగ్లండులో పుట్టి, రూపుదిద్దుకుని, జ్ఞానం సంపాదించింది,

ఇంగ్లండు ఒకప్పుడు ప్రేమించడానికి పూలనీ, తిరగడానికి త్రోవల్నీ ఇచ్చింది,

అది ఇంగ్లండులో ఒక భాగం, అది అన్నిరకాలుగా ఇంగ్లండునే ప్రతిఫలిస్తుంది,

అక్కడి నదుల్లో ములిగి, అదృష్టం కొద్దీ అక్కడి సూర్యుడి వెలుగుని అనుభవించింది.

భగవంతుని కల్పనలో ఒక క్షణికమైన ఊహ, ఇంగ్లండు

ఇచ్చిన ఆలోచనలనే ఏదో మేరకు తిరిగి ప్రతిబింబిస్తుంది;

అక్కడి ప్రకృతిసౌందర్యాలూ, ఆమె నిశ్చింతగా కన్న కలలూ;

మిత్రుల నుండి నేర్చుకున్న అకళంకమైన హాసమూ, సౌమ్యత,

ఇంగ్లండు ఆకాశంక్రింద అక్కడ ఆ గుండెలో పదిలంగా ఉండేవని.

.

రూపర్ట్ బ్రూక్

3 August 1887 – 23 April 1915

ఇంగ్లీషు కవి

.

.

The Soldier

 .

IF I should die, think only this of me:

  That there’s some corner of a foreign field

That is for ever England. There shall be

  In that rich earth a richer dust concealed;

A dust whom England bore, shaped, made aware,

  Gave, once, her flowers to love, her ways to roam,

A body of England’s, breathing English air,

  Washed by the rivers, blest by suns of home.

And think, this heart, all evil shed away,

  A pulse in the eternal mind, no less

Gives somewhere back the thoughts by England given;

  Her sights and sounds; dreams happy as her day;

And laughter, learnt of friends; and gentleness,

  In hearts at peace, under an English heaven.

.

Rupert Brooke

3 August 1887 – 23 April 1915

The New Poetry: An Anthology.  1917.

Harriet Monroe, ed. (1860–1936).

http://www.bartleby.com/265/40.html

స్తుతి గీతం 14… ఎలిజబెత్ మహారాణి 1, ఇంగ్లండు

నిజమైన నమ్మకం ఎన్నడూ లేని వాళ్ళు
వాళ్ల మనసుల్లో దేముడు లేడంటారు.
వాళ్ళ నడవడి అంతా రోతగా ఉంటుంది
అందులో ఒక్కడికీ దైవత్వం అంటే తెలీదు.
స్వర్గంనుండి  దేముడు వాళ్లని గమనించేడు
వాళ్ల నడవడి ఎలా ఉంటుందో చూద్దామని.
ఎందులోనూ నిశ్చయం లేక, పక్కతోవలు పట్టి
ఏ ఒక్కడూ కూడా ఋజుమార్గంలో పోయినవాడు లేడు.
వాళ్ల మనసుల్లో, మాటల్లో అంతా కపటమే.
పెదవి విప్పితే విషపూరితమైన లాలూచీ మాటలు
వాళ్ళ మనసులు చెడిపోయాయి; నోర్లు తాటిపట్టెలు,
వాళ్ళు చిటికెలో రక్తపాతానికి ఒడిగట్టగలరు.
వాళ్ళు ఎంతగుడ్డివాళ్ళంటే, సత్యాన్ని తెలుసుకోలేరు
వాళ్ళలో ఎన్నడూ దేముడంటే భయం పుట్టదు.
అటువంటి దుర్మార్గులు మంచివాళ్ళెలా అవుతారు?
వాళ్ళు భగవంతుడి నెత్తురుకూడా తాగగల సమర్థులు.
వాళ్లు భగవంతుని నిజంగా సేవించలేరు
వాళ్ళ మనసులు కలవరంతో దిక్కుతోచక ఉంటాయి.
భగవంతుడెప్పుడూ న్యాయంగా నడిచేవారితో ఉంటాడు
ఎందుకంటే, వాళ్ళు అతనిమీద విశ్వాసం ఉంచుతారు.
అందుకే భగవంతుడు వాళ్ళకి
ఆకాశంనుండి వేలాడే ఇజ్రాయేలు ఇచ్చాడు
భగవంతుడు అతని బాధలన్నీ తొలగించినపుడు
జాకొబ్ మనస్ఫూర్తిగా ఆనందంతో ఉంటాడు.
భగవంతునికి జేజేలు.
.
ఎలిజబెత్ మహారాణి 1
7 సెప్టెంబరు 1533 – 24మార్చి  1603
ఇంగ్లండు.

.

.

Psalm XIV

.

Fools, that true faith yet never had,

Say in their hearts, there is no God!

Filthy they are in their practice,

Of them not one is godly wise.

From heaven the Lord on man did look,

To know what ways he undertook:

All they were vague, and went astray,

Not one he found in the right way;

In heart and tongue have they deceit,

The lips throw forth a poisoned bait;

Their minds are mad, their mouths are wood,

And swift they be in shedding blood:

So blind they are, no truth they know,

No fear of God in them will grow.

How can that cruel sort be good?

Of God’s their folk which suck the blood?

On him rightly shall they not call;

Despair will so their hearts appal.

At all times God is with the just,

Because they put in him their trust.

Who shall therefore from Sion gave

That health which hangs on our b’leue? (blue?)

When God shall take from his the smart,

Then will Jacob rejoice in heart.

               Praise to God.

.

(Note: The poem is converted to present day  readable form by the translator within his limitations of understanding. The exact text is available at the link provided. The liberty taken by the translator may be forgiven.)

Queen Elizabeth I

7 September 1533 – 24 March 1603

England

Poem Courtesy:

Select Poetry of the Reign of Queen Elizabeth. 1845.

Ed: Edward Farr.

http://www.bartleby.com/261/1.html

వరుడు వెళ్ళిపోయాక… ఎలిజబెత్ మహారాణి 1

నేను దుఃఖించాలి, నా అసంతృప్తి ప్రకటించకూడదు
నేను ప్రేమిస్తున్నాను, కానీ ద్వేషిస్తున్నట్టు నటించాలి
నేను ఏ పనిచేసినా, మనసులోమాట చెప్పలేను
నేను ఉత్త మూగగా ఉంటూ లోలోపలే మాటాడుకోవాలి
నేను ఉన్నాను, కానీ లేను; వణుకుతున్నట్టున్నా దహించుకుపోతున్నాను
నేను నానుండి మరో మనిషిలా ఎప్పుడో మారిపోయాను.

నా ఇష్టాలన్నీ ఎండలో నీడలాటివి,
వెళుతుంటే వెంబడిస్తాయి, నేను వెంటాడితే దొరక్క పరిగెడతాయి
ఎప్పుడూ నా పక్కనే నిలబడి ఉంటాయి, నే చేసేది అనుకరిస్తూ.
అతను చూపించిన శ్రద్ధ తలుచుకుంటే విచారమేస్తుంది
నా మనసులోంచి అతన్ని రూపాన్ని తొలగించే మార్గం కనిపించదు
జీవితం ముగిసిన తర్వాత అణగారిపోవలసిందే.

ఏదో ఒక చిలిపి తలపు మనసులో తొంగిచూస్తుంది,
కరిగే మంచులాంటి మెత్తని నా మనసులో.
పోనీ, కఠినంగా ఉందునా? ప్రేమగానా, దయతోనా?
నేనలా తేలిపోదునా? మునిగిపోదునా? ఔన్నత్యమా? పతనమా?
మరికొంచెం హాయిగా సంతృప్తితో కాలం వెళ్ళబుచ్చుదునా?
లేక అసలు ప్రేమంటే ఏమిటో మరిచి, జీవితం చాలిద్దునా?
.
ఎలిజబెత్ మహారాణి 1

7 September 1533 – 24 March 1603
ఇంగ్లండు.

.

.

On Monsieur’s Departure

.

I grieve and dare not show my discontent,

I love and yet am forced to seem to hate,

I do, yet dare not say I ever meant,

I seem stark mute but inwardly to prate.

I am and not, I freeze and yet am burned.

Since from myself another self I turned.

My care is like my shadow in the sun,

Follows me flying, flies when I pursue it,

Stands and lies by me, doth what I have done.

His too familiar care doth make me rue it.

No means I find to rid him from my breast,

Till by the end of things it be supprest.

Some gentler passion slide into my mind,

For I am soft and made of melting snow;

Or be more cruel, love, and so be kind.

Let me or float or sink, be high or low.

Or let me live with some more sweet content,

Or die and so forget what love ere meant.

.

Queen Elizabeth I

7 September 1533 – 24 March 1603

England

కాలమొక ఒడిదుడుకుల ప్రవాహం… రాబర్ట్ సౌత్ వెల్, ఇంగ్లీషు కవి

కొమ్మలు నరికినచెట్టు మళ్ళీ పెరగవచ్చు,

మోడులైన మొక్కలు తిరిగి పుష్పించి ఫలించవచ్చు;


దౌర్భాగ్యుడికి కష్టాలు తొలగిపోవచ్చు,


ఎండి బీడైననేల కూడా చిరుజల్లులోని తేమ గ్రహించవచ్చు


కాలచక్రం క్రిందుమీదవుతుంటుంది, అదృష్టం చంచలమైనది


కష్టాన్నుండి సుఖానికీ, మంచిరోజులనుండి గడ్డురోజులకీ మారుతుంది.


.

అదృష్టసాగరం నిరంతరం ప్రవహించదు

అణగారినవారిని అది ఒకోసారి అనుగ్రహిస్తుంటుంది

దాని ఆటుపోటులు సమాన అంతరంలో కొనసాగుతాయి


ముతక, సన్నని కలనేతల నేతపని దానిది.


చివరిదాకా కొనసాగిన ఏ గొప్ప సుఖమూ లేదు,


గతిమారని అలవిమాలిన కష్టమూ లేదు.

.

నిత్యమూ శిశిరము కాదు, నిత్యవసంతమూ ఉండదు,

అంతం లేని కాళరాత్రీ ఉండదు, పొద్దుపోని రోజూ ఉండదు,


విషాదములో మునిగిన పక్షులకుకూడా, తియ్యగా పాడే ఋతువు వస్తుంది


ఎంతపెద్ద తుఫానునైనా మరపించే ప్రశాంతత వెన్నంటి వస్తుంది.


అలా భగవంతుడు కష్టసుఖాలు పెనవేసి మనిషిని రాటుదేరుస్తాడు


మనిషికి ఎప్పుడూ లేవగల ఆశనిస్తూ, పడిపోతామేమోనన్న భయాన్నిస్తాడు.   

.


దురదృష్టంతో పోగొట్టుకున్నది అదృష్టం తిరిగి సంపాదించిపెట్టవచ్చు,


బలహీనమైన వలకూడా చిన్నచిన్న చేపలని పట్టుకోవచ్చు;


అందరికీ అందనిదేదో ఒకటుంటుంది, ఏదీ అందనివాళ్ళెవరూ ఉండరు;


కొందరికి అవసరమైనవన్నీ దక్కుతాయి, కాని ఎవరికీ అడిగినవన్నీదొరకవు;


ఏ ఒక్క మనిషికీ అకళంకమైన ఆనందం దొరకమన్నా దొరకదు,


మితంగా కోరు, కొన్ని దక్కుతాయి; అదుపులేదూ, ఎప్పుడూ ఏదీ దొరకదు.


.

రాబర్ట్ సౌత్ వెల్,


1561 – 21 February 1595

ఇంగ్లీషు కవి, కేథలిక్ ప్రీస్టు.  

ఈ కవిత సుమారు 500 సంవత్సరాల క్రిందటిది అంటే  మనలో చాలా మంది నమ్మకపోవచ్చు.  కాలం గురించి ఇంత అవగాహన ఉందా అప్పటి ఇంగ్లీషు కవులకి అని. ఎందుకంటే, ఎలిజబెత్ మహారాణి కాలం నాటికి ఇంకా గ్రీకూ లాటినే రాజభాషగా గౌరవాన్ని అందుకోవడంతో పాటు, ఇంగ్లీషు అప్పుడప్పుడే తనకాళ్ళమీద నిలబడడనికి ప్రయత్నిస్తున్న రోజులు.  పునరుద్ధరణ (Renaissance)  పుణ్యమా అని, గ్రీకు లాటిను, ఇటాలియన్ భాషల సాహిత్య వాసనలు సంపుటీకరించుకుని, ఇంగ్లీషుకి ఒక గుర్తింపు తీసుకు వచ్చిన మహామహులు చాలా మంది పుట్టారు 16వ శతాబ్దంలో.

 

కాలమహిమ గురించి సౌందరనందం కావ్యంలో పింగళి కాటూరి కవులు చాలా హృద్యంగా చెప్పారు:

“కాలవశమ్మునన్ విసరుగాడ్పులకున్ ముదురాకుపుట్టముల్

రాలగ, బాటసారుల పరామరిసింపగ లేక సంపదల్

దూలిన దాతవోలె జిగిదూలిన ఆ యెలమావి గున్న యా

కాలవశమ్ము చేతనె సఖా! వికసించెడి సౌరు గంటివే…  “

అంటారు.  ఓడలు బండ్లు, బండ్లు ఓడలు అవడం అన్నది కాలమహిమ. కాలం ఎంత భీతావహమో అంతఆశావహము కూడా. ఈ సత్యాన్ని మనం గుర్తుంచుకుంటే, మనకి మనమున్న స్థితికి  మన శక్తి యుక్తులు కారణం కావన్న నిజం అర్థం అయి, విర్రవీగకుండా, వినయంగా ఉండగలుగుతాము.


.

Times Go By Turns

.

The lopped tree in time may grow again,
Most naked plants renew both fruit and flower;
The sorriest wight may find release of pain,
The driest soil suck in some moistening shower.
Times go by turns, and chances change by course,
From foul to fair, from better hap to worse.

The sea of Fortune doth not ever flow,
She draws her favours to the lowest ebb.
Her tides hath equal times to come and go,
Her loom doth weave the fine and coarsest web.
No joy so great but runneth to an end,
No hap so hard but may in fine amend.

Not always fall of leaf, nor ever spring,
No endless night, yet not eternal day;
The saddest birds a season find to sing,
The roughest storm a calm may soon allay.
Thus, with succeeding turns, God tempereth all,
That man may hope to rise, yet fear to fall.

A chance may win that by mischance was lost;
The net, that holds no great, takes little fish;
In some things all, in all things none are crossed;
Few all they need, but none have all they wish.
Unmeddled joys here to no man befall;
Who least, hath some; who most, hath never all.

.

Robert Southwell 

c. 1561 – 21 February 1595

England

ఓ భాగ్యమా! నువ్వెప్పుడూ ఇంతే… జేమ్స్ థామ్సన్, ఇంగ్లండు

ప్రేమకి రాజీలేని శత్రువువి!
మేము రెండు మనసులు ఒకటిగా కలుస్తుంటే
మధ్యలో దూరి వేరు చేస్తుంటావు.

యవ్వనం, స్వారస్యమూ హరించుకుపోయి
జీవితంలో జీవం ఉడిగిపోయేదాకా
ఏ రోజుకి ఆ రోజు నిట్టూరుస్తూ
జీవితాంతమూ నీకోసం అపేక్షించేలా చేస్తావు

అయినా, నువ్వు చాలా చురుకుగా ఉంటూనే ఉంటావు
ప్రేమ, ఆనందమూ లేని ప్రమాణాలను చేయిస్తూ
మనసుల్ని సుఖాలతో వంచిస్తూ
సున్నితమైనవాళ్ళని మొరటువాళ్ళకి జతగూరుస్తూ.

ఆడంబరాలకీ, వేడుకలకీ, అర్థంలేని డంబాలకీ
లొంగి, సహజమైన ఆనందాలకి దూరమయేలా చేస్తావు.
బంగారపు శృంఖలాలను తగిలించి
అధికారపు ఆనందం క్రింద మూల్గేలా చేస్తావు.

ఓ భాగ్యమా! ఈ ఒక్క సారి నా ప్రార్థనని ఆలకించు.
భవిష్యత్తులో నీ ప్రాపకాన్ని వదులుకుంటాను.
నే కోరుకునే కోరికలన్నిటినీ ఉపసంహరించుకుంటాను.
కాని, ప్రియమైన అమందాని నా దానిగా చెయ్యి.
.

జేమ్స్ థామ్సన్
 1700- 1748
ఇంగ్లండు.

.

James Thomson, from the 1779 edition of Samuel...
James Thomson, from the 1779 edition of Samuel Johnson’s Lives of the English Poets. (Photo credit: Wikipedia)

 

.

For ever, Fortune, wilt thou prove

.
An unrelenting foe to Love,

And when we meet a mutual heart

Come in between, and bid us part?

Bid us sigh on from day to day,

And wish and wish the soul away;

Till youth and genial years are flown,

And all the life of life is gone?

But busy, busy, still art thou,

To bind the loveless joyless vow,

The heart from pleasure to delude,

To join the gentle to the rude.

For pomp, and noise, and senseless show,

To make us Nature’s joys forego,

Beneath a gay dominion groan,

And puts the golden fetter on!

For once, O Fortune, hear my prayer,

And I absolve thy future care;

All other blessings I resign,

Make but the dear Amanda mine.

.

James Thomson

(1700–1748)

Poem Courtesy:  http://www.bartleby.com/333/40.html

The Book of Georgian Verse.  1909. Ed. William Stanley Braithwaite

ఎవరికి వర్తిస్తే వారికి… ఏడ్రియన్ మిచెల్, ఇంగ్లీషు కవి

.

Hear the poem in poet’s voice: To Whom It May Concern

.

ఒకరోజు సత్యం నన్ను తొక్కుకుంటూ నా మీంచి వెళ్ళిపోయింది

ఆ ప్రమాదం జరిగిన దగ్గరనుండి ఇలా కుంటుతున్నాను.  

నా కాళ్ళకి ప్లాస్టర్ వెయ్యండి

వియత్నాం గురించి అబద్ధాలు చెప్పండి.

 

అలారం గంట బాధతో మూలగడం వినిపించింది

నాకు నేను కనిపించక మళ్ళీ తిరిగి పడుక్కున్నాను.

నా చెవుల్లో సీసం పొయ్యండి.

కాళ్ళకి ప్లాస్టర్ వెయ్యండి.

వియత్నాం గురించి అబద్ధాలు చెప్పండి.

 

కళ్ళు మూసుకున్నప్పుడల్లా నాకు కనిపించేవి మంటలు

నాపరాయి పలకలతో ఫోనుబుక్కు చేసి పేర్లన్నీ చెక్కేను

నా కళ్ళకి వెన్నరాయండి

నా చెవుల్లో సీసం పొయ్యండి.

కాళ్ళకి ప్లాస్టర్ వెయ్యండి.

వియత్నాం గురించి అబద్ధాలు చెప్పండి.

ఏదో మండుతున్న వాసనేస్తోంది. బహుశా నా మెదడే అయి ఉంటుంది

అబ్బే, వాళ్ళు పిప్పరమెంట్లూ, డెయిజీ పూలగుత్తులూ వర్షిస్తున్నారు. 

నా ముక్కులో వెల్లుల్లి కుక్కండి

కళ్ళకి వెన్న రాయండి

చెవుల్లో సీసం పొయ్యండి

కాళ్ళకి ప్లాస్టరు వెయ్యండి

వియత్నాం గురించి అబద్ధాలు చెప్పండి.

 

నేరం జరిగినప్పుడు నువ్వెక్కడున్నావు?

స్మారక చిహ్నం పక్క నిల్చుని మట్టిగొట్టుకుంటున్నా.

నా నోరు విస్కీతో మూసెయ్యండి

నా ముక్కులో వెల్లుల్లి కుక్కండి

కళ్ళకి వెన్న రాయండి

చెవుల్లో సీసం పొయ్యండి

కాళ్ళకి ప్లాస్టరు వెయ్యండి

వియత్నాం గురించి అబద్ధాలు చెప్పండి.

 

నువ్వు నీ బాంబర్లనివినియోగిస్తావు, అంతరాత్మని చంపుకుంటావు

మనిషిశరీరాన్ని తీసుకుని ఎన్నిరకాలుగానైన మెలిబెట్టగలవు.

నా చర్మాన్ని స్త్రీలతో రుద్దు.

నా నోరు విస్కీతో మూసెయ్యండి

నా ముక్కులో వెల్లుల్లి కుక్కండి

కళ్ళకి వెన్న రాయండి

చెవుల్లో సీసం పొయ్యండి

కాళ్ళకి ప్లాస్టరు వెయ్యండి 

వియత్నాం గురించి అబద్ధాలు చెప్పండి.

.

ఏడ్రియన్ మిచెల్

24 October 1932 – 20 December 2008

ఇంగ్లీషు కవి.

యుద్ధవ్యతిరేక కవితలు చాలా వచ్చాయి. కానీ ఈ కవితకి అందులో ప్రత్యేకత ఉంది. మొదటిది ఈ కవితా శిల్పం. రెండవది అందులో ఉపయోగించిన ప్రతీకలు.  మొదటి పద్యం నాలుగు లైన్లు ఉంటే, రెండోది అయిదు, మూడవది ఆరు… ఇలా సాగుతుంది కవిత. మొదట పద్యంలో చెప్పినవి రెండవదానిలో, రెండవదానిలో చెప్పినవి మూడవదానిలో చెబుతూ, కవిత చివరికి వచ్చేసరికి ఉవ్వెత్తుగా ఎగిసి ఒక ఆవేశాన్ని రగిలించ గలుగుతుంది. యుద్ధానికి వ్యతిరేకంగానే కాదు, యుద్ధోన్మాది చేస్తున్న దురాగతాలకి కూడా వల్లమాలిన కోపం వస్తుంది.

ప్రతీకల విషయంలోకి వస్తే, “నాపరాయిపలకలతో చేసిన ఫోనుబుక్కూ అందులో చెక్కిన పేర్లూ” సమాధుల పరంపరలకి సంకేతాలు. ఆ ప్రతీక వాడడంలో భావతీవ్రతతో పాటు, బాధ తీవ్రతకూడా మనకి అందుతుంది. అలాగే, “వాళ్ళు పిప్పరమెంట్లూ, డెయిజీ పూలగుత్తులే వర్షిస్తున్నారు” అన్న మాటలో ఎంత వ్యంగ్యం ఉందో చూడొచ్చు. వాళ్ళు కురిపిస్తున్న బాంబులనీ, శ్రద్ధాంజలి ఘటించడానికి ఉపయోగించే డెయిజీ పూలనీ ఏకకాలంలో ఉపయోగించడం భావసాంద్రతని చెప్పకనే చెబుతున్నాయి. “నువ్వు అంతరాత్మని చంపుకోగలవు, మనిషి శరీరాన్ని ఎన్ని రకాలుగానైనా మెలిబెట్టగలవు” అనడంలో శత్రువుచేసే శారీరక మానసిక హింసలని రెండూ చెబుతున్నాడు కవి. ఒకపక్క నీతులు వల్లిస్తూనే, హిపోక్రిటికల్ గా ప్రవర్తించడానికి శత్రువుకి సిగ్గు లేదు. (ఈ శత్రువు తమ ప్రభుత్వమే అయి ఉండొచ్చు… ఒక్కోసారి). మానవతకి కట్టుబడిన వ్యక్తికి, తప్పు ఎవరుచేసినా తప్పుగానే కనిపిస్తుంది.

మంచి భావమూ, ఆవేశమూ, కవితాప్రయోగాలూ ఉన్న చక్కని కవిత ఇది. చదివిన తర్వాత మనల్ని తప్పకుండా అలజడికి గురిచేస్తుంది.

.

Adrian Mitchell
Adrian Mitchell
Image Courtesy:
http://en.wikipedia.org/wiki/Adrian_Mitchell

.

To Whom It May Concern

.

I was run over by the truth one day.

Ever since the accident I’ve walked this way

So stick my legs in plaster

Tell me lies about Vietnam.

Heard the alarm clock screaming with pain,

Couldn’t find myself so I went back to sleep again

So fill my ears with silver

Stick my legs in plaster

Tell me lies about Vietnam.

Every time I shut my eyes all I see is flames.

Made a marble phone book and I carved out all the names

So coat my eyes with butter

Fill my ears with silver

Stick my legs in plaster

Tell me lies about Vietnam.

I smell something burning, hope it’s just my brains.

They’re only dropping peppermints and daisy-chains

So stuff my nose with garlic

Coat my eyes with butter

Fill my ears with silver

Stick my legs in plaster

Tell me lies about Vietnam.

Where were you at the time of the crime?

Down by the Cenotaph drinking slime

So chain my tongue with whisky

Stuff my nose with garlic

Coat my eyes with butter

Fill my ears with silver

Stick my legs in plaster

Tell me lies about Vietnam.

You put your bombers in, you put your conscience out,

You take the human being and you twist it all about

So scrub my skin with women

Chain my tongue with whisky

Stuff my nose with garlic

Coat my eyes with butter

Fill my ears with silver

Stick my legs in plaster

Tell me lies about Vietnam.

.

Adrian Mitchell

(24 October 1932 – 20 December 2008)

English poet, novelist and playwright.

Adrian Mitchell was born in 1932 and educated at Oxford. After coming down in 1955 he worked for some years on the staff of the Oxford Mail, and subsequently with the London Evening Standard. Mitchell’s early poetry showed a fondness for tight stanzas and a use of myth, but there was always a kind of agonised human concern about his writing which marked him off sharply from his more tight-lipped contemporaries. This concern has developed over the years into a full-fledged political commitment, and there is no other poet in England who has more steadily focussed his aesthetic aims through his social ones. It would not be too much to say that a poem such as ‘To Whom It May Concern’ altered the conscience of English poetry, and for many younger writers Mitchell is already the elder statesman of literary protest. He has made enemies through this, and there are still critics who refuse to accept his importance. But there are few poets now writing who can command a wider general audience, and none who can swing such an audience more effectively from public laughter to near tears.

poem and bio  courtesy:

http://wonderingminstrels.blogspot.in/1999/03/to-whom-it-may-concern-adrian-mitchell.html

అందమైన అబద్ధం… షెనా ప్యూ, ఇంగ్లండు

ఇది చాలాకాలం క్రిందటి మాట,

 బహుశా అప్పుడు వాడికి నాలుగేళ్ళుంటాయేమో…

 పెరట్లో, బటాణీ పాదుల మాటున ఏదో పెంకితనం…

 సరిగ్గా గుర్తులేదుగాని, ఒక కొమ్మ విరిచెయ్యడమో,

 పాదుకి ఆసరాగాపెట్టిన కర్రలాగేడమో ఏదో చేశాడు…

 వాళ్ళ అమ్మమ్మ వచ్చి చూసి, ఇలా అడిగింది:

 “ఏరా, నువ్వేనా ఈ పాడుపని చేసింది?”

 

ఆమె వాణ్ణి “నువ్వెందుకిలా చేశావ్?”

అని అడిగి ఉండి ఉంటే, కాదనేవాడు కాదేమో.

కాని ఆమె వాడికిప్పుడు తప్పుకునే సందు చూపించింది;

వాడి కళ్ళలో వేరే సమాధానం చెప్పడానికి

ఉన్న అవకాశం అవగాహనవగానే ముఖం వెలిగిపోతోంది: 

మాటకీ చేతకీ పొంతన ఉండనక్కరలేదనీ, తనకి

అనుగుణంగా లోకానికి జవాబుచెప్పొచ్చనీ తెలిసింది.

 

వాడు “నేను కాదు” అన్నప్పుడు,

నేను ఘంటాపథంగా చెప్పగలను, వాడిలో

పసిపిల్లవాడు ఆసరాగా పిడికిలితో వేలుపట్టుకున్నట్టు, 

తొలిసారి పండురుచిచూచినట్టు… అనుభూతి కలిగి ఉంటుంది.

వాడి కళ్ళు ఒక కిటికీలోంచి, రంగూ రూపూ

నిర్దిష్టంగా లేని ఒక కొత్త ప్రపంచాన్ని 

చూస్తున్న అనుభూతి నాకు అవగతమౌతోంది. 

 

ఆ ప్రపంచం ఒక ప్రవాహంలా, పాములా వంకరలు తిరుగుతూ

ఉత్తరధృవ కాంతుల్లా అంచులంట ప్రకంపిస్తూ,

శబ్దాన్నిబట్టి ఆకృతులు మార్చుకుంటూండడం ఊహిస్తున్నాను.

చెవుల్లో ఏదో అస్పష్ట సముద్రఘోష వింటూ

ఇసుకగడియారంలా తను నిండుతుండడం గ్రహిస్తున్నాను;

పాటలు రాయాలన్నా, పాత్రలు సృష్టించాలన్నా,

బొమ్మలువెయ్యాలన్నా, కథలుచెప్పాలన్నా కావలసింది ఈ కల్పనే.  

 

నేను బఠాణీ పాదులన్నానుగాని అవి కాకపోవచ్చు

బహుశా అవి చిక్కుడు పాదులయి ఉండొచ్చునేమో;

నిజానికి అసలక్కడ ఏ పాదూ లేకపోయైనా ఉండవచ్చు;

ఎందుకో, అక్కడ ఏదో ఒకటున్నట్టనిపించింది. అంతే!  

అన్నట్టు వాడెవరో కాదు… లేదు, చెప్పి ప్రయోజనం లేదు. 

ఆ పొదల మాటు అన్నది నా కల్పనే గాని,

వాడు ఏమి చేశాడో నాకు స్పష్టంగా తెలుసు.

 . 

షెనా ప్యూ

ఇంగ్లండు

కవిత్వాన్ని ప్రజలకి చేరువగా తీసుకురావాలన్న ఆలోచన అమెరికను కవి Judith Chernaik ది. 1986లో ప్రారంభమైన ఈ ప్రోజెక్టులో మరోముగ్గురుకవులు జతకూడి, (ఆ ముగ్గురు కవుల్లో షెనా ప్యూ ఒకరు ) లండనులో భూగర్భ రైలుమార్గంలో ప్రయాణంచేసే రైళ్లలో కొన్ని అత్యుత్తమమైన కవితలను/ పాదాలను అడ్వర్టైజ్ మెంటు బోర్డుల మీద రాసేవాళ్ళు (ఇప్పటికీ కొనసాగుతోంది). ఆ రాసే జాగాకి అయే ఖర్చుని కొన్ని కంపెనీలు / వ్యక్తులు భరిస్తారు. ఈ ప్రయోగంలో వచ్చిన అపురూపమైన ప్రాచీన, ఆధునిక కవుల కవితలలో ఈ కవిత ఒకటి. (మనందరం, ప్రపంచంలో ఎక్కడో ఒకచోట అటువంటి ఒక ప్రయోగం జరిగినందుకూ, అతి ఫలవంతంగా నడుస్తూ, జనసామాన్యానికి కవిత్వం అందుబాటులోకి వస్తున్నందుకూ సంతోషించాలి. ఆ తర్వాత, ఈ కవితల్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాటిని సంకలనాలుగా తీసుకు వస్తున్నారు.)

చాలా కాలం తర్వాత నాకు కవిత్వంలో  జీవితాన్ని నిర్వచించగల ఒక సంఘటన జరిగినపుడు మానసిక విశ్లేషణ చేస్తూ, దాన్ని వ్యాఖ్యానించిన కవిత దొరికింది. ఇందులో, జీవితంలో మొదటిసారి అబద్ధం చెప్పడం కూడా ఒక సంక్లిష్టమైన సందర్భమే … మరీ ముఖ్యంగా పిల్లలకి. అందులోనూ, వాళ్ళు తెలివిగలపిల్లలైతే, మంచిచెడుల నైతికవిశ్లేషణలమధ్య పెరిగినవారైతే, మొదటిసారి అబద్ధం ఆడవలసి రావడం, లేదా అబద్ధమూ, నిజమూ కాకుండా చెప్పుకుని తప్పించుకోగలమన్న అవగాహన రావడమూ, జీవితంలో గ్రాడ్యుయేషన్ క్రింద జమ.

.

The Beautiful Lie

.

He was about four, I think… it was so long ago.
In a garden; he’d done some damage
behind a bright screen of sweet-peas
– snapped a stalk, a stake, I don’t recall,
but the grandmother came and saw, and asked him:
“Did you do that?”

Now, if she’d said why did you do that,
he’d never have denied it. She showed him
he had a choice. I could see, in his face,
the new sense, the possible. That word and deed
need not match, that you could say the world
different, to suit you.

When he said “No”, I swear it was as moving
as the first time a baby’s fist clenches
on a finger, as momentous as the first
taste of fruit. I could feel his eyes looking
through a new window, at a world whose form
and colour weren’t fixed

but fluid, that poured like a snake, trembled
around the edges like northern lights, shape-shifted
at the spell of a voice. I could sense him filling
like a glass, hear the unreal sea in his ears.
This is how to make songs, create men, paint pictures,
tell a story.

I think I made up the screen of sweet peas.
Maybe they were beans; maybe there was no screen,
it just felt as if there should be, somehow.
And he was my – no, I don’t need to tell that.
I know I made up the screen. And I recall very well
what he had done.

Sheenagh Pugh:

Poem Courtesy: http://wonderingminstrels.blogspot.in/2001/05/beautiful-lie-sheenagh-pugh.html

సరికొత్త సరళి … గవిన్ ఏవార్ట్, ఇంగ్లండు

స్త్రీత్వం మూర్తీభవించినట్లు కనపడే ఆ స్త్రీని

నేను ఏ దేవకన్యలతోనూ సరిపోల్చను.

Pope తో విభేదించి ఆమెకోసం మతం మార్చుకోను,

ఆమెని ఒక అలౌకిక వ్యక్తిగా కీర్తించను,

మడోనా(Madonna) గా భావించను.

ఇతరులలో ఆమె లక్షణాలు వెదకను


ఈ కోరికను అణచుకుందికి మృత్యువును ఆహ్వానించను


ప్రేమని ఒక విలుకాడుగా ఊహించను,


అపోలో(Apollo)కౌగిలినుండి తప్పించుకు పారిపోయి


తీవల-తలపాగగా మారిన


డఫ్నే(Daphne)గా భావించను

నేను వర్జిల్ (Virgil) మోహాటవుల్లో తప్పిపోను.


నేను అంత్యప్రాసల భేషజాలతో కూడిన


ఆలంకారిక భాషవాడకపోయినా,


నా ప్రేమ మాత్రం గాఢమైనదే,


అదికూడా ఆ వ్యక్తికే పరిమితం.


ఎంతైనా మనుషులు మనుషులే కదా!


ఆమె తనువును ఆలింగనం చేసుకోగలిగినందుకు


ఆమె స్నానించిన నీటినిచూసి


దానిపై ఒకడు ఈర్ష్య పడవచ్చు;


నా ప్రేమకూడా ఆమెను ఆలింగనం చేసుకోవాలనుకుంటుంది.


పెట్రార్క్ ఇక తనప్రేమగురించేచెప్పి చెప్పివిసిగించక 


అంతగాఢమైనది మరొకటి ఉంటుందని బహుశా, అంగీకరించవచ్చు…

.

గవిన్ ఏవార్ట్

(4 February 1916 – 25 October 1995)

ఇంగ్లండు  

ఈ కవితలో నాకు కనిపించిన ప్రత్యేకత, స్త్రీని స్త్రీగానే చూడడం; ఆమె ఆమెగానే గుర్తించి

గౌరవించడం. కవి దృష్టిలో ఒకరితో పోలిక …  మనం చూసే పవిత్రత, సౌందర్యం, దివ్యత్వ

భావన … ఒకరిలోవి ఆమెలో గాని, ఆమెవి ఒకరిలో గాని చూడడం … ఆమె పట్ల అపచారం. 

ప్రేమని వ్యక్తీకరించడంలో భాషాపరమైన పరిమితులుండవచ్చునేమో గాని, భావనాపరమైన

పరిమితులుండవని బహుశా కవి భావన. ఎవరికి వారే తమ ప్రేమ గొప్పదనుకోవచ్చు వర్జిల్ లా.

కాని, అందరిదీ ఒకే రకమైన తీవ్రత… అని అతని థీసిస్.

.

Gavin Ewart
Gavin Ewart
Image Courtesy: http://www.poetryarchive.org/poetryarchive/singlePoet.do?poetId=17248

.

 Sonnet: Dolce stil novo (“sweet new style”)

.

That woman who to me seems most a woman

I do not compare to angels —

or digress on schismatic Popes —

or exalt above the terrestrial

or consider a Madonna.

Nor do I search in others for her lineaments,

or wish for Death to free me from desire,

or consider Love an archer;

or see her as a Daphne,

fleeing the embraces of Apollo,

transformed into a laurel.

I am not lost in the amorous wood of Virgil.

 

But although I do not rhyme

or use the soft Italian,

my love is a strong love,

and for a certain person.

Human beings are human;

I can see a man might envy

her bath water

as it envelops her completely.

That’s what my love would like to do;

and Petrarch can take

a running jump at himself —

or (perhaps?) agree.

.

Gavin Ewart

(4 February 1916 – 25 October 1995)

British Poet

 

Ewart first published poems at the age of 17 in Geoffrey Grigson’s New Verse of 1933. After graduating from Christ’s College, Cambridge, he served in the Royal Artillery from 1940 to 1946, and worked for the British Council from 1946 to 1952, and then as a copywriter in advertising until 1971, when he became a full-time freelance writer. He became a Fellow of the Royal Society of Literature in 1981. His works include Be My Guest (1975), Where a Young Penguin Lies Screaming (1978), All My Little Ones (1978), The First Eleven (1977) and No fool Like an Old Fool (1976).  

You can read a good bio of the Poet here:

http://www.poetryarchive.org/poetryarchive/singlePoet.do?poetId=17248

ఒక్కోసారి… షెనా ప్యూ

.

ఏదైతేనేం, చివరకి కొన్నిసార్లు పరిస్థితులు క్లిష్టం నుండి 

మరీ అంత కనికిష్టంగా మారిపోవు; ద్రాక్షతీగ మంచు తట్టుకుంటుంది;  

పచ్చదనం వెల్లివిరుస్తుంది; పంటలు పుష్కలంగా పండుతాయి;  

మనిషి స్వర్గానికి నిచ్చెనలు వేస్తే అన్నీ అనుకూలంగా జరుగుతాయి.  

 

ఇక చాలు అని నిర్ణయించుకుని కొన్ని దేశాలు యుద్ధవిరమణ చేసి

వెనక్కి తొలగిపోతాయి; ఒక నిజాయితీ పరుణ్ణి ఎన్నుకుని,

ఆ దేశంలో ఏ అపరిచితవ్యక్తీ ఆకలితో అలంటించకుండా చూసుకుంటాయి; 

కొందరు వ్యక్తులు వాళ్లు ఎందుకు పుట్టేరో అది సాధించగలుగుతారు.

 

ఒక్కొసారి మనం మనఃస్ఫూర్తిగా కోరుకున్నది వృధాపోదు;ఒక్కొసారి  

మనం ఏది ఎలా చేద్దామనుకుంటామో అది అలా చేయగలుగుతాం;  

సూర్యుడు ఒక్కోసారి ఘనీభవించిన దుఃఖభూమిని సైతం

కరిగించగలుగుతాడు; నీకు అలా జరగాలని కోరుకుంటున్నాను.

.

షెనా ప్యూ

ఇంగ్లండు 

కవిత్వాన్ని ప్రజలకి చేరువగా తీసుకురావాలన్న ఆలోచన అమెరికను కవి Judith Chernaikది. 1986లో ప్రారంభమైన ఈ ప్రోజెక్టులో మరో ముగ్గురు కవులు జతకూడి,(ఆ ముగ్గురు కవుల్లో షెనా ప్యూ ఒకరు )లండనులో భూగర్భ రైలు మార్గంలో ప్రయాణంచేసే రైళ్లలో కొన్ని అత్యుత్తమమైన కవితలను/ పాదాలను అడ్వర్టైజ్ మెంటు బోర్డుల మీద రాసేవాళ్ళు (ఇప్పటికీ కొనసాగుతోంది). ఆ రాసే జాగాకి అయే ఖర్చుని కొన్ని కంపెనీలు / వ్యక్తులు భరిస్తారు. ఈ ప్రయోగంలో వచ్చిన అపురూపమైన ప్రాచీన, ఆధునిక కవుల కవితలలో ఈ కవిత ఒకటి. (మనందరం, ప్రపంచంలో ఎక్కడో ఒకచోట అటువంటి ఒక ప్రయోగం జరిగినందుకూ, అతి ఫలవంతంగా నడుస్తూ, జనసామాన్యానికి కవిత్వం అందుబాటులోకి వస్తున్నందుకూ సంతోషించాలి. ఆ తర్వాత, ఈ కవితల్లో అత్యంత ప్రజాదరణ పొందిన వాటిని సంకలనాలుగా తీసుకు వస్తున్నారు.)

.
 Sometimes… Shenagh Pugh
.
 Sometimes Sometimes things don’t go, after all,
 from bad to worse. Some years, muscadel
faces down frost; green thrives; the crops don’t fail.
Sometimes a man aims high, and all goes well.

A people sometimes will step back from war,
 elect an honest man, decide they care
enough, that they can’t leave some stranger poor.
Some men become what they were born for.

Sometimes our best intentions do not go
amiss; sometimes we do as we meant to.
The sun will sometimes melt a field of sorrow
that seemed hard frozen; may it happen for you.

.

Sheenagh Pugh

English Poet

For the open and honest opinion of the poetess about the poem and how the keyboard sometimes comes into the creative process of a poem please visit:
http://wonderingminstrels.blogspot.in/2001/08/sometimes-sheenagh-pugh.html

(I am extremely sorry for the wrong link provided earlier)

[One of the finest  and simplest poems admired by London Underground Metro Commuters.  You should only see the comments on this poem in the link http://wonderingminstrels.blogspot.in/2001/08/sometimes-sheenagh-pugh.html  Sometimes, more than what a poet writes, it is the reader’s identification with it  makes it a great poem. Poems of the Underground was a project initiated  in 1986 to make poetry to reach out to people by posting them on the  advertisement boards of London Underground Metro. ]

She has a website : http://www.geocities.com/sheenaghpugh/

ప్రాణం…… అనా లీటీటియా బర్బో. ఇంగ్లండు.

ప్రాణమా! నువ్వేమిటో నాకు తెలీదు.

కానీ, నువ్వూ నేనూ ఎడబాటు కాకతప్పదని తెలుసు.

మనం ఎప్పుడు ఎక్కడ ఎలా కలిసేమో

అది ఇప్పటికీ నాకు తెలియని రహస్యమే.

కాని, ఇది మాత్రం బాగా తెలుసు, నువ్వు నన్ను వీడేక

ఈ శిరస్సూ, ఈ అవయవాలూ ఎక్కడున్నప్పటికీ

మట్టిపాలైన నా అవశేషాల్లో

అంత పనికిమాలినవి మరేవీ ఉండవు.

.

అరే! ఎక్కడికి, ఎక్కడికి అలా ఎగిరిపోతున్నావు?

అగోచరమైన నీ మార్గం ఏ కనపడని వంపులు తిరుగుతోంది?

చిత్రమైన మనిద్దరి ఈ ఎడబాటులో, “నేను” అనబడే

రసాయనికపదార్థం ఎక్కడ వెతుక్కోవాలో చెప్పు?

హేయమైన ఈ శరీరపు చెరనుండి విముక్తి లబించగానే

నీ సత్వము ఎక్కడనుండి వెలువడ్డదో ఆ తేజోమయమైన

అనంతార్ణవపు జ్వాలవైపేనా నీ ప్రస్థానం కొనసాగుతున్నది?

లేక, నువ్వు కంటికి కనిపించకుండా,

మంత్రశక్తివశమైన ఒక యోధుడిలా,

కొన్ని సంవత్సరాలు కాలం ఊసులేకుండా గడిపి,

నీకు నచ్చిన సమయంలో నీ సమాధిస్థితి వీడి

నీ శక్తిని తిరిగి పరిగ్రహిస్తావా?

ఏం, నీకు ఎన్నడూ ఆలోచనలూ, అనుభూతులూ ఉండవా?

నువ్వు నువ్వు కానప్పుడు, నువ్వెలా ఉంటావో చెప్పు?

.

ఓ ప్రాణమా! మనిద్దరం చాలా కాలం కలిసి ఉన్నాం.

ఆనందంలోనూ, విషాదం కమ్ముకున్నప్పుడూ.

ఒకసారి ఆప్తమిత్రులమయ్యేక విడిపోవడం చాలా కష్టం.

బహుశా ఒక నిట్టూర్పు, ఒక అస్రువు వీడాలేమో!

అదే నిజమైతే, దొంగలా జారుకో;ఏ హెచ్చరికా ఇవ్వకు;

నీ కెప్పుడు వెళ్ళాలనుంటే అపుడు వెళిపో;

నాకు వీడ్కోలు చెప్పకు. కాని, ఏదో ఒక మంచిరోజున

నాకు శుభోదయం మాత్రం చెప్పు!

.

అనా లీటీటియా బర్బో

(20 June 1743 – 9 March 1825)

ఇంగ్లీషు కవీ, వ్యాసకర్తా, సాహిత్య విమర్శకు రాలూ, సంపాదకురాలూ.

ఈ కవితలోని సౌందర్యం అందరూ మరణం గురించి చెప్పేటప్పుడు మృత్యువుని సంభోదిస్తూ కవిత్వం చెబితే, ఈమె మరణం గురించి చెబుతున్నప్పుడు, ప్రాణాన్ని సంభోదిస్తూ ఈ కవితని రసవత్తరంగా చెప్పింది. ప్రాణం అంటే ఏమిటో ఇప్పటికీ అగోచరమైన విషయాన్ని ఎంతో సున్నితంగా చెప్పింది ఈ కవితలో. ప్రాణం స్వభావం తెలీదని ఎంత చక్కగా ప్రారంభించిందో, మళ్ళీ పునర్జన్మ అంటూ ఉంటే కలుసుకుందాం అన్నట్టు ఆశావహంగా ముగించింది.

.

English: Portrait of Anna Laetitia Barbauld, s...
English: Portrait of Anna Laetitia Barbauld, stipple engraving, cropped from original, 5 1/2 in. x 3 3/8 in. (142 mm x 87 mm) (Photo credit: Wikipedia)

.

Life

.

Life! I know not what thou art,
But know that thou and I must part;
And when, or how, or where we met,
I own to me ‘s a secret yet.
But this I know, when thou art fled,
Where’er they lay these limbs, this head,
No clod so valueless shall be
As all that then remains of me.

O whither, whither dost thou fly?
Where bend unseen thy trackless course?
And in this strange divorce,
Ah, tell where I must seek this compound I?
To the vast ocean of empyreal flame
From whence thy essence came
Dost thou thy flight pursue, when freed
From matter’s base encumbering weed?
Or dost thou, hid from sight,
Wait, like some spell-bound knight,
Through blank oblivious years th’ appointed hour
To break thy trance and reassume thy power?
Yet canst thou without thought or feeling be?
O say, what art thou, when no more thou’rt thee?

Life! we have been long together,
Through pleasant and through cloudy weather;
‘Tis hard to part when friends are dear;
Perhaps ’twill cost a sigh, a tear;—
Then steal away, give little warning,
Choose thine own time;
Say not Good-night, but in some brighter clime
Bid me Good-morning!
.
Anna Laetitia Barbauld
(20 June 1743 – 9 March 1825)

English Poet, Essayist, Literary Critic and Editor.

Poem Courtesy: Arthur Quiller-Couch, ed. 1919. The Oxford Book of English Verse: 1250–1900

%d bloggers like this: