ప్రాణపాశాల్ని గట్టిగా ముడివెయ్యి, ప్రభూ… ఎమిలీ డికిన్సన్, అమెరికను కవయిత్రి
ప్రభూ, ఈ ప్రాణపాశాల్ని గట్టిగా ముడివెయ్యి
నేను నా చివరి ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాను.
ఒకసారి గుఱ్ఱాలసంగతి చూడు…
త్వరగా! అది సరిపోతుంది.
నన్ను స్థిరంగా ఉండేవైపు కూర్చోబెట్టు
అప్పుడు నేను పడిపోతే అవకాశం ఉండదు.
మనం ఇప్పుడు కడపటి తీర్పు వినడానికి పోవాలి
అది నా అభిమతమూ, నీ అభిమతమూ.
నాకు వాలు ఎక్కువున్నా ఫర్వాలేదు
సముద్రతీరమైనా ఫర్వా లేదు
ఎడతెగని పరుగుపందెంలో చిక్కుకున్నా
నా ఇష్టమూ, నీ అభీష్టం కొద్దీ
ఇన్నాళ్ళూ బ్రతికిన నా జీవితానికీ
ఈ ప్రపంచానికి వీడ్కోలు
నా తరఫున ఆ కొండల్ని ఒకసారి
ముద్దాడండి, ఇపుడు నేను సర్వసన్నద్ధం.
.
ఎమిలీ డికిన్సన్
( 10 December 1830 – 15 May 1886)
అమెరికను కవయిత్రి
Tie the strings of my Life, My Lord,
.
Tie the Strings to my Life, My Lord,
Then, I am ready to go!
Just a look at the Horses
Rapid! That will do!
Put me in on the firmest side
So I shall never fall
For we must ride to the Judgment
And it’s partly, down Hill
But never I mind the steeper
And never I mind the Sea
Held fast in Everlasting Race
By my own Choice, and Thee
Goodbye to the Life I used to live
And the World I used to know
And kiss the Hills, for me, just once
Then — I am ready to go!.
Emily Dickinson
( 10 December 1830 – 15 May 1886)
American Poet
Poem Courtesy:
https://100.best-poems.net/tie-strings-my-life-my-lord.html

మరొక ఆకాశం… ఎమిలీ డికిన్సన్, అమెరికను కవయిత్రి
కవిత్వమనే సరికొత్తలోకంలోకి ఆహ్వానిస్తూ ఎమిలీ డికిన్సన్
తన సోదరుడు ఆస్టిన్ కి రాసిన ఉత్తరంతో జతచేసిన కవిత.
***
ఆస్టిన్!
ఎపుడుచూసినా అందంగా, నిర్మలంగా ఉండే
కొత్త ఆకాశం ఇక్కడొకటి ఉంది.
అక్కడ ఎప్పుడైనా చీకటి ఉంటుందేమో గాని
ఇక్కడ ఎల్లవేళలా చక్కని ఎండ వెలుగే.
అక్కడి రంగువెలిసిన అడవుల ఊసు ఎత్తకు,
నిశ్శబ్దం రాజ్యమేలే పొలాలని మరిచిపో,
ఇక్కడ ఒక చిట్టడివి ఉంది
దాని ఆకులు నిత్యం పచ్చగా ఉంటాయి;
వెచ్చనివెలుగులు విరజిమ్మే ఈ అడివిలో
మచ్చుకైనా ఎన్నడూ మంచు కురియదు;
అక్షయమైన ఇక్కడి పూలగుత్తులలో విహరించే
తుమ్మెదల ఝంకారం నాకు వినిపిస్తూంటుంది.
తమ్ముడూ! నిన్ను బ్రతిమాలుకుంటున్నాను
నా తోటలోకి ఒక్కసారి రావూ!.
.
ఎమిలీ డికిన్సన్
December 10, 1830 – May 15, 1886
అమెరికను కవయిత్రి.
.
.
There is another sky
.
There is another sky,
Ever serene and fair,
And there is another sunshine,
Though it be darkness there;
Never mind faded forests, Austin,
Never mind silent fields –
Here is a little forest,
Whose leaf is ever green;
Here is a brighter garden,
Where not a frost has been;
In its unfading flowers
I hear the bright bee hum:
Prithee, my brother,
Into my garden come!
.
Emily Dickinson
December 10, 1830 – May 15, 1886
American Poet
Poem Courtesy:
http://famouspoetsandpoems.com/poets/emily_dickinson/poems/5212
ముఖంలో గొప్ప ఆకర్షణ ఉంటుంది… ఎమిలీ డికిన్సన్ అమెరికను కవయిత్రి
సరిగ్గా కనీ కనిపించని ముఖంలో
ఎదో తెలియని గొప్ప ఆకర్షణ ఉంటుంది.
పాపం, అది కోల్పోతుందేమోనని
ఆ పిల్ల ముసుగు తొలగించసాహసించదు
కానీ ముసుగుకావల ఏముందో చూస్తుంటుంది
కాసేపు కోరుకుంటూ కాసేపు వద్దనుకుంటుంది.
ఆకారం అందంగా ఉన్న వ్యక్తితో సంభాషణ
కోరికని అణచివేస్తుందేమోనన్న భయంతో
.
ఎమిలీ డికిన్సన్
(December 10, 1830 – May 15, 1886)
అమెరికను కవయిత్రి
Emily Dickinson
Photo Courtesy:
Poetry Foundation
.
A Charm Invests A Face
A charm invests a face
Imperfectly beheld.
The lady dare not lift her veil
For fear it be dispelled.
But peers beyond her mesh,
And wishes, and denies,
Lest interview annul a want
That image satisfies.
.
Emily Dickinson
(December 10, 1830 – May 15, 1886)
American
Poem Courtesy:
http://www.famousliteraryworks.com/dickinson_a_charm_invests_a_face.htm
ఆశ ఒక రెక్కలుతొడిగిన జీవి. … ఎమిలీ డికిన్సన్, అమెరికను కవయిత్రి
ఆశ ఒక రెక్కలుతొడిగిన జీవి
అది మనసుమీద అలవోకగా వాలుతుంది.
మాటలులేని మౌనగీతాన్ని ఆలపిస్తుంది
ఆ పాటకి ముగింపు లేదు.
అందులో మలయమారుతపు తియ్యందనాలు వినిపిస్తాయి
తుఫానుల ప్రచండ ఝంఝ నినదిస్తుంది
ఆ పిట్టని విహ్వలము చెయ్యవచ్చునేమో గాని
దానిపాట మాత్రం ఎందరి ఎదలనో రగుల్కొలుపుతుంది.
అతిశీతలదేశంలో ఆ పాట నేను విన్నాను
ఎన్నడూ ఎరుగని సముద్ర తరంగాలమీదా విన్నాను;
కానీ, ఎన్నడూ, ఎంత దైన్యంలోనూ
“నాకో రొట్టెముక్క పెట్టవా?” అని యాచించలేదు.
.
ఎమిలీ డికిన్సన్
(December 10, 1830 – May 15, 1886)
అమెరికను కవయిత్రి
.
.
Hope Is The Thing With Feathers
.
Hope is the thing with feathers
That perches in the soul,
And sings the tune without the words,
And never stops at all.
And sweetest in the gale is heard;
And sore must be the storm
That could abash the little bird
That kept so many warm.
I’ve heard it in the chilliest land
And on the strangest sea;
Yet, never, in extremity,
It asked a crumb of me.
.
Emily Dickinson
(December 10, 1830 – May 15, 1886)
American
చెట్లు (606) … ఎమిలీ డికిన్సన్, అమెరికను కవయిత్రి
చెట్లు ఒకటొకటి ఒరుసుకు ఊగుతున్నాయి
జడకుచ్చుల్లా; సూర్యుడిని అనుసరిస్తూ
లేస్తున్న అల్ప ప్రాణుల్లో
సంగీతం నిదురలేస్తున్నట్టుంది.
వీనుల విందు చేస్తున్న
సుదూర ప్రభాతస్తుతి గీతాలు
దూరాన ఉండబట్టే, మధురంగా ఉన్నా
మనసుతీరా వినిపించడం లేదు.
సూర్యుడు దోబూచులాడుతున్నాడు, ముందు పూర్తిగా
తర్వాత సగం, పిమ్మట అసలు కనిపించకుండా
తనకి ఇష్టమైనప్పుడే కనిపించాలనుకుంటున్నట్టు;
అతని దగ్గర ఎంత వనసంపద ఉందంటే
అది అతన్ని పూర్తిగా మూసెయ్యగలదు.
శాశ్వతంగా కనిపించనీకుండా
కాకపోతే అలా ఫలవృక్షాలను ఎదగనీడం
అతనికి ఒక సరదా క్రీడ.
ఒక పిట్ట దడిమీద నిర్లక్ష్యంగా కూచుంది
ఒకటి కొమ్మల బాటల్లో కబుర్లాడుతోంది
అప్పుడే ఒక రాతిని చుట్టివస్తున్న పాము
వెండిలా మెరుస్తున్న చెట్లను చూసి విస్తుపోయింది
రక్షకపత్రాలు ఛేదించుకుని కొమ్మలమీద
పూలు విరగబూచి నిగనిగ మెరుస్తున్నాయి
డీలాపడ్ద జండాలు గాలికి రెపరెపలాడినట్టు
కొంగుకిరాసిన అత్తరులా, సువాసన గుప్పుమంది.
ఇంకా చాలా ఉంది— నా శక్యం కాదు వర్ణించడం
చూసేవాళ్లకి అది ఎంట హీనంగా కనిపిస్తుందంటే
అసలైన వేసవి ప్రకృతిదృశ్యం ముందు
వాన్ డైక్* వేసిన చిత్రం దిగదుడుపైనట్టు.
.
ఎమిలీ డికిన్సన్
December 10, 1830 – May 15, 1886
అమెరికను కవయిత్రి
[Note: Anthony Van Dyck (22 March 1599 – 9 December 1641) was a famous Flemish Baroque artist who became a leading court painter in England. He was more noted for the paintings of King Charles I. He was also an innovator in water colors and etching.]
.
Trees (606)
The Trees like Tassels—hit—and swung
There seemed to rise a Tune
From Miniature Creatures
Accompanying the Sun
Far Psalteries of Summer
Enamoring the Ear
They never yet did satisfy
Remotest—when most fair
The Sun shone whole at intervals
Then Half—then utter hid
As if Himself were optional
And had Estates of Cloud
Sufficient to enfold Him
Eternally from view
Except it were a whim of His
To let the Orchards grow
A Bird sat careless on the fence
One gossipped in the Lane
On silver matters charmed a Snake
Just winding round a Stone
Bright Flowers slit a Calyx
And soared upon a Stem
Like Hindered Flags—Sweet hoisted
With Spices—in the Hem
‘Twas more—I cannot mention
How mean—to those that see
Vandyke’s Delineation
Of Nature’s—Summer Day!
.
Emily Dickinson
December 10, 1830 – May 15, 1886
American Poet
దారీ తెన్నూ లేక… ఎమిలీ డికిన్సన్, అమెరికను కవయిత్రి
చిత్తడినేల అంటే ఏమిటో తెలీదు,
సముద్రాన్ని ఎన్నడూ చూసి ఎరగను
కానీ, నాకు అడవిపొదలెలా ఉంటాయో తెలుసు
కెరటం అంటే ఊహించుకోగలను.
నేను దేవుడితో ఎప్పుడూ మాటాడలేదు
స్వర్గాన్ని ఎన్నడూ చూడలేదు
కానీ నాకు పటం చూసినంత స్పష్టంగా
అదెక్కడుంటుదో ఖచ్చితంగా తెలుసు.
.
ఎమిలీ డికిన్సన్
December 10, 1830 – May 15, 1886
అమెరికను కవయిత్రి
.
Chartless
I never saw a moor,
I never saw the sea;
Yet now I know how the heather looks,
And what a wave must be.
I never spoke with God,
Nor visited in Heaven;
Yet certain am I of the spot
As if the chart were given.
.
Emily Dickinson.
December 10, 1830 – May 15, 1886
Modern American Poetry. 1919.
Ed. Louis Untermeyer, (1885–1977).
http://www.bartleby.com/104/1.html
నువ్వు నాకు విడిచిపెట్టినవి… ఎమిలీ డికిన్సన్, అమెరికను
ప్రియా! నువ్వు నాకు రెండు వారసత్వంగా వదిలావు;
మొదటిది ప్రేమ
భగవంతునికి ఆ వారసత్వం లభించి ఉంటే
అతను మిక్కిలి సంతృప్తిచెందేవాడు.
కాలానికీ శాశ్వతత్వానికీ మధ్య,
నాకూ, నీ స్మృతికీ నడుమ
సముద్రమంత విశాలమయిన
దుఃఖపు పరిమితులు మిగిల్చావు
.
ఎమిలీ డికిన్సన్
December 10, 1830 – May 15, 1886
అమెరికను కవయిత్రి
.
.
You left me
.
You left me, sweet, two legacies,—
A legacy of love
A Heavenly Father would content,
Had He the offer of;
You left me boundaries of pain
Capacious as the sea,
Between eternity and time,
Your consciousness and me.
.
Emily Dickinson
December 10, 1830 – May 15, 1886
American Poet
Poem Courtesy:
http://users.telenet.be/gaston.d.haese/dickinson_love.html
XXXI ఎమిలీ డికిన్సన్, అమెరికను కవయిత్రి
భవిష్యత్తు ఎన్నడూ మాటాడలేదు;
మూగవాళ్ళలా కనీసం ఎన్నడూ
చేష్టలతోనో, సంజ్ఞలతోనో నిగూఢమైన
భావి విషయాలను తెలియపరచనూలేదు.
కానీ, సరియైన సమయం వచ్చినపుడుమాత్రం
వాటిని అక్షరాలా ఆచరణలో చూపిస్తుంది…వాటిని
తప్పించుకుందికీ, ప్రతిక్షేపించడానికీ
చెయ్యగల అన్ని అవకాశాలని ముందే వమ్ముచేస్తూ.
సంపదలైనా, సర్వనాశనమైనా
రెంటిపట్లా దానికి ఒకే అనాశక్తత;
విధి దానికి ఆదేశించిన శాసనాన్ని
తు.చ. ఆచరించడమే దాని కర్తవ్యం.
.
ఎమిలీ డికిన్సన్
December 10, 1830 – May 15, 1886
అమెరికను కవయిత్రి.
XXXI
.
The Future never spoke,
Nor will he, like the Dumb,
Reveal by sign or syllable
Of his profound To-come.
But when the news be ripe,
Presents it in the Act–
Forestalling preparation
Escape or substitute.
Indifferent to him
The Dower as the Doom,
His office but to execute
Fate’s Telegram to him.
.
Emily Dickinson
December 10, 1830 – May 15, 1886
American Poetess
(From: The Single Hound, Poems of a Lifetime)
http://digital.library.upenn.edu/women/dickinson/hound/hound.htmlXXXI
XXVI … ఎమిలీ డికిన్సన్, అమెరికను కవయిత్రి
ఇల్లు పూర్తయేదాకా
దాని ప్రాపులు అండగా ఉంటాయి,
తర్వాత వాటిని తొలగిస్తారు…
నిటారుగా, సమర్థవంతమై ఇల్లు
పునాదులపై తనంతతాను నిలబడుతుంది;
బరమానీ, వండ్రంగినీ
గుర్తుచేసుకోవడం మరచి.
సంపూర్ణమైన జీవితానికి
అటువంటి సింహావలోకనం అవసరం.
బల్లచెక్కా, మేకుల గతం
తాపీగా తయారవడం, ఆధారాలు కూలిపోవడం…
అవి ఆత్మగా స్థిరపరుస్తాయి.
.
ఎమిలీ డికిన్సన్
December 10, 1830 – May 15, 1886
అమెరికను కవయిత్రి
Emily Dickinson
.
XXVI
.
The props assist the house
Until the house is built,
And then the props withdraw–
And adequate, erect,
The house supports itself;
Ceasing to recollect
The auger and the carpenter.
Just such a retrospect
Hath the perfected life,
A past of plank and nail,
And slowness,–then the scaffolds drop–
Affirming it a soul.
.
Emily Dickinson
December 10, 1830 – May 15, 1886
American Poet
Poem Courtesy:
http://digital.library.upenn.edu/women/dickinson/hound/hound.html#XXVI
నేనో అనామికని… మరి నీ సంగతి?… ఎమిలీ డికిన్సన్, అమెరికను కవయిత్రి
నేనో అనామికని… మరి నీ సంగతి?
నువ్వు కూడా… అనామికవేనా, ఆ?
అలాగయితే మనిద్దరం జంట, సరేనా ?
ష్! ఎవరికీ చెప్పకు! చెబితే దండోరా వేస్తారు. తెలుసుగా!
ఎంత రసహీనం: ఏదో ఒకటవడం !
ఎంత బట్టబయలు… ఒక కప్పలాగ…
మన పేరు చెప్పుకోవడం… జీవితం సాగదియ్యడం…
బాడవ నేలలు మెచ్చుకుంటూండడం!
.
ఎమిలీ డికిన్సన్
December 10, 1830 – May 15, 1886
అమెరికను కవయిత్రి.
.