అనువాదలహరి

కొత్త సంవత్సరం… ఎలా వ్హీలర్ విల్ కాక్స్, అమెరికను కవయిత్రి

I WISH

ALL MY FRIENDS

A VERY HAPPY AND PROSPEROUS

NEW YEAR 2020

MAY THIS YEAR

USHER IN

NEW FRIENDSHIPS,

SOOTHE OLD PAINS,

FULFILL YOUR DREAMS

AND

INSPIRE YOU TO ASPIRE FOR MORE.

ఇప్పటికే వేలసార్లు చెప్పి, చెప్పకుండా మిగిలినదేముందని

నూతన సంవత్సరంలో కొత్తగా కవితలో చెప్పడానికి?

కొత్త సంవత్సరాలు వస్తూంటాయి, పాతవి వెళుతూంటాయి,

మనం కలగంటామని తెలుసు, అయినా ఎన్నో కలలు కంటాం.

మనం వేకువతో నవ్వుతూ నిదుర మేల్కొంటాం,

చీకటితోపాటే శోకిస్తూ … నిద్రకుపక్రమిస్తాం.

మనల్ని కాటువేసేదాకా, లోకాన్ని హత్తుకుంటాం, 

అప్పుడు శపిస్తాం, ఎగిరిపోడానికి రెక్కలులేవే అని నిట్టూరుస్తాం.

మనం జీవిస్తూ, ప్రేమిస్తాం, కామిస్తాం, పెళ్ళిళ్ళు చేసుకుంటాం,

పెళ్ళికూతుళ్ళను సింగారిస్తాం, మృతులను దుప్పటిలో చుడతాం.

మనం నవ్వుతాం, ఏడుస్తాం, ఎన్నో ఆశిస్తాం, ఎన్నిటికో భయపడతాం,

ఆ మాటకొస్తే, ఏ సంవత్సరానికైనా పల్లవి అదే!

.

ఎలా వ్హీలర్ విల్ కాక్స్

(November 5, 1850 – October 30, 1919) 

అమెరికను కవయిత్రి

.

The Year

.

What can be said in New Year rhymes,

That’s not been said a thousand times?

The new years come, the old years go,

We know we dream, we dream we know.

We rise up laughing with the light,

We lie down weeping with the night.

We hug the world until it stings,

We curse it then and sigh for wings.

We live, we love, we woo, we wed,

We wreathe our brides, we sheet our dead.

We laugh, we weep, we hope, we fear,

And that’s the burden of the year.

.

Ella Wheeler Wilcox

(November 5, 1850 – October 30, 1919)

American Poet

Poem Courtesy:

https://www.familyfriendpoems.com/poem/the-year-by-ella-wheeler-wilcox

ఇసుకమీద… ఎలా వీలర్ విల్ కాక్స్, అమెరికను కవయిత్రి

స్నేహం పునాదిగా లేని ప్రతి ప్రేమా

ఇసకమీద కట్టిన భవంతిలాంటిది.

దాని గోడలు దేశంలో దేనికీ తీసిపోనంత గట్టివైనా

వాటి శిఖరాలు ఆకాశంలోకి నిటారుగా హుందాగా తలెత్తినా;

అనుభవజ్ఞులూ, నిపుణులైన పనివారు

అన్నిచోట్లా అందమైన అలంకరణలతో తీర్చిదిద్దినా

చీకటి మూలల్లో తళతళలాడే విగ్రహాలు నిలబడినా,

పూలుదాగున్న చోటుల్లో జలయంత్రాలు నీరు చిమ్ముతున్నా,

తూర్పునుండి ఆగ్రహోదగ్రమైన ఒక్క పెనుగాలి వీచితే చాలు,

విధి వక్రించి, పగలనక రాత్రనక ఒక తుఫాను

ముంచుకొస్తే చాలు, దాని గోడలు దాసోహం అంటాయి.

పాపం! అంత అందమైన హర్మ్యమూ నేలమట్టం అయిపోతుంది.

ప్రేమ జీవితంలోని విషాదాన్నీ, ఆధిభౌతికమైన విపత్తుల్నీ

తట్టుకు నిలబడాలంటే, స్నేహమనే దృఢమైన పునాది అవసరం.

.

ఎలా వీలర్ విల్ కాక్స్

November 5, 1850 – October 30, 1919

అమెరికను కవయిత్రి

.

Upon The Sand.

.

All love that has not friendship for its base,

Is like a mansion built upon the sand.

Though brave its walls as any in the land,

And its tall turrets lift their heads in grace ;

Though skilful and accomplished artists trace

Most beautiful designs on every hand,

And gleaming statues in dim niches stand,

And fountains play in some flow’r-hidden place :

Yet, when from the frowning east a sudden gust

Of adverse fate is blown, or sad rains fall

Day in, day out, against its yielding wall,

Lo ! the fair structure crumbles to the dust.

Love, to endure life’s sorrow and earth’s woe,

 Needs friendship’s solid masonwork below.

.

Ella Wheeler Wilcox

November 5, 1850 – October 30, 1919

American

Poems of Passion, P24

Belford –Clarke Co. Chicago, 1890

కవిహృదయం… ఎలా వీలర్ విల్ కాక్స్, అమెరికను

(మనవి : ఈ కవితకి శీర్షిక లేదు. ఎలా వీలర్ విల్ కాక్స్ తన Poems of Passion అన్న పుస్తకంలో ముందుమాటకంటే  ముందుగా ఈ కవితని పెట్టుకుంది.)

***

ఓ పాఠకుడా!నేను పాడుకున్న ఏదో గీతాన్ని చదివినంతమాత్రాన

ఏ హృదయపులోతులలోంచి వచ్చిందో నువ్వు పసిగట్టగలవా?

కవి కన్న కల ఎన్నడైనా బయటకు గట్టిగా చెబుతుందా

దాని రహస్యపుటాలోచనలను వింటున్న జనసమూహానికి?

ఏదీ, లేచి సముద్రపుటొడ్డునున్న ఒక శంఖుని తీసుకో—

నీకేమిటి కనిపిస్తుంది? దాని ఆకారం, రంగూ. అంతే!

విశాలమైన మహాసాగరపు అట్టడుగున దాగున్న

రహస్యాలలో ఏ ఒక్కటైనా నీకు చెబుతుందా?

మనగీతాలన్నీ అలాటి శంఖులే, లోచనాసముద్రాలు ఒడ్దుకు విసిరినవి;

ఇప్పుడు నీకు ఏది ఆనందాన్నిస్తే దాన్ని ఏరుకో; అంతేగాని

నువ్వు సముద్రపు అలలదిగువనంతా చూసేనని పొరబడకు.

అక్కడ మునకలేసిన ఓడలేకాదు, పగడపు దీవులుంటాయి.

.

ఎలా వీలర్ విల్ కాక్స్

November 5, 1850 – October 30, 1919

అమెరికను కవయిత్రి

.

.

Oh, you who read some song that I have sung—

What know you of the soul from whence it sprung?

Dost dream the poet ever speaks aloud

His secret thought unto the listening crowd?

Go take the murmuring sea-shell from the shore—

You have its shape, its color —and no more.

It tells not one of those vast mysteries

That lie beneath the surface of the seas

Our songs are shells, cast out by waves of thought,

Here, take them at your pleasure; but think not

You’ve seen beneath the surface of the waves,

Where lie our shipwrecks, and our coral cave.

.

Ella Wheeler Wilcox

November 5, 1850 – October 30, 1919

American

Page 7, Poems of Passion,

Belford-Clarke Co. Chicago, 1890.

ఏం చేద్దాం మనం ?… ఎలా వీలర్ విల్ కాక్స్, అమెరికను కవయిత్రి

ఇప్పుడిక, ఎప్పటికన్నాకూడా, మనజీవితాలు విడిపోకతప్పదు
నా దారి అటు వెళుతోంది, నీదారి ఇంకోవైపుకు పోతోంది.
ఓ మనసా! మనం ఈ ప్రాణప్రదమైన ప్రేమని ఏం చేద్దాం?
అది రోజు రోజుకీ భరించలేని భారమౌతోంది.

దాచెద్దామా? ఈ భూమిమీద అన్ని మాళిగలలో, శూన్యమూ, రోదసిలో
ప్రియా, దాన్ని దాచడానికి సరిపడినంత జాగా దొరకదే ;
గతమంతటి ఘనమైన అంతులేని గిడ్డంగి కూడా
మనకళ్ళకి కనిపించకుండా దాన్ని దాచలేదని నా భయం.

పోనీ దేన్లోనో ముంచెద్దామా? అన్ని సముద్రాలలోని
నీళ్ళనూ కలిపి మహాసముద్రం చేసినా, ఆ నీళ్ళు
ఈ ఆవేశాన్ని మరి పైకి లేవకుండా ముంచెత్తాలంటే
సరిపోవు, అవి మరీ అరికాలుబంటి లోతుకూడా రావు

పోనీ తగలేద్దామా? భూమిమీది అన్ని అగ్నిగుండాలూ, జ్వాలలూ
వెయ్యి సంవత్సరాలయినా దాన్ని పూర్తిగా దహించలేవు;
అంతేకాదు!అది బతకడమేగాక, మరింతగా ఉత్సాహంతో వర్ధిల్లుతుంది
ఎందుకంటే, అది పుట్టినప్పటినుండీ నిప్పులమీదే బ్రతికింది.

పోనీ ఆకలితోమాడ్చెద్దామా! అవును. అవును. అదొక్కటే మార్గం.
దానికి తిండిపెట్టొద్దు, అటుచూడోద్దు, మాటాడొద్దు, నిట్టూర్చొద్దు.
ఏ జ్ఞాపకాలుగాని, కనీసం నిన్నటిగుర్తులైనా సరే వెయ్యవద్దు.
నిష్ఫలమైన ఏ పశ్చాత్తాపాల రొట్టెముక్కలూ వద్దు… దాన్నలా చావనీ.

.

ఎలా వీలర్ విల్ కాక్స్

(November 5, 1850 – October 30, 1919)

అమెరికను కవయిత్రి

 .

Ella Wheeler Wilcox
Ella Wheeler Wilcox
Photo Courtesy: http://en.wikipedia.org/wiki/Ella_Wheeler_Wilcox

.

WHAT SHALL WE DO?

.

Here now, forevermore, our lives must part.

My path leads there, and yours another way.

What shall we do with this fond love, dear heart?

It grows a heavier burden day by day.

Hide it? In all earth’s caverns, void and vast,

There is not room enough to hide it, dear;

Not even the mighty storehouse of the past

Could cover it, from our own eyes, I fear.

Drown it? Why, were the contents of each ocean

Merged into one great sea, too shallow then

Would be its waters, to sink this emotion

So deep it could not rise to life again.

Burn it? In all the furnace flames below,

It would not in a thousand years expire.

Nay! it would thrive, exult, expand and grow,

For from its very birth it fed on fire.

Starve it? Yes, yes, that is the only way.

Give it no food, of glance, or word, or sigh.

No memories, even, of any bygone day;

No crumbs of vain regrets—so let it die.

.

Ella Wheeler Wilcox

(November 5, 1850 – October 30, 1919)

American Poet

Poem Courtesy:

Poems of Passion : PP27-28

https://ia600308.us.archive.org/22/items/poemsofpassion00wilc/poemsofpassion00wilc.pdf

https://refer.wordpress.com/r/719/wordpress-com/

అగాథ జలాలు… ఎలా వ్హీలర్ విల్ కాక్స్, అమెరికను కవయిత్రి

నిపుణుడైన నావికుడిననీ, చాలా తెలివైనవాడిననీ,

చాలా ఆశ్చర్యంగా నాకు వచ్చింది పేరు.

అంత ప్రశాంత సాగరం మీద నేర్పరియైన నావికుడు

అనువైన గాలివాటు, అనాచ్చాదితమైన నీలి ఆకాశం

త్రోవచూపే విశ్వాసపాత్రమైన ప్రేమనిండిన కన్నులు;

మిట్టపల్లాలు దాటిపోయాయి, నా జీవన నౌక యధేచ్చగా,

ప్రశాంతమైన కెరటాలపై, క్రిందన ఏ గండశిలలు దాగున్నాయన్న

చింతలేకుండా, ఏ మార్పులకీ బెదరకుండా సాగుతోంది.

స్వర్ణప్రభాతం; అయినా అకస్మాత్తుగా బిగుసుకున్నాయి

తుఫానుకి చెదిరినట్టు నా పడవ తెరచాపలు …

తెలియని ఏ అదృశ్య కెరటాల ప్రభావానికో ఎదురొడ్డుతూ;

గతమనే అల్లకల్లోలమైన జలసంధిలోకి మేము

రాత్రి బాగా చీకటిగా ఉండగానే ప్రవేశించాం;

ప్రేమపూరితమైన కనుల ఆసరా లేకుంటే, దారి తప్పేవాడిని.

.

ఎలా వ్హీలర్ విల్ కాక్స్

 November 5, 1850 – October 30, 1919

అమెరికను కవయిత్రి.

.

 

.

The Gulf Stream

.

Skilled mariner, and counted sane and wise,

That was a curious thing which chanced to me,

So good a sailor on so fair a sea.

With favoring winds and blue unshadowed skies,

Led by the faithful beacon of Love’s eyes,

Past reef and shoal, my life-boat bounded free

And fearless of all changes that might be

Under calm waves, where many a sunk rock lies.

A golden dawn; yet suddenly my barque

Strained at the sails, as in a cyclone’s blast;

And battled with an unseen current’s force,

For we had entered when the night was dark

That old tempestuous Gulf Stream of the Past.

But for love’s eyes, I had not kept the course.

.

(From Poems of Progress)

Ella Wheeler Wilcox

November 5, 1850 – October 30, 1919

American

 

Poem Courtesy:

http://www.fullbooks.com/Poems-of-Progress1.html

 

 

 

మృగతృష్ణ… ఎలా వీలర్ విల్ కాక్స్, అమెరికను కవయిత్రి

మార్గమధ్యంలో దప్పికతో అతను ఆగేడు

కనుచూపుమేర ఆవరించిన వేడి బంజరులమీంచి

అకస్మాత్తుగా, చల్లని తళతళ మెరుస్తున్న నీటితో

దూరాన అందంగా ఒక పచ్చని బీడు కనిపించింది.

ఎన్నాళ్ళనుండో మనసులో పదిలపరచుకున్న కోరిక

పాదాలక్రింద ప్రేమపూర్వకంగా పచ్చని తివాచీ పరిచింది;

ఊసరక్షేత్రాలు ఒక్కసారిగా రాజనాల చేలుగా మారిపోయేయి.

ఆలస్యమైనవాళ్ళదే నష్టం అన్నట్టు త్రోవ ఎంతో హాయిగా ఉంది. 

అతని మనసులో ఆ అపురూపమైన స్త్రీ ఒకసారి మెరిసింది;

మగాళ్ళందరూ కష్టించి ఎదురుచూసే… ఉద్యానం

ప్రతి హృదయమూ కోరుకునే ప్రశాంత మందిరం;

చివరకి ఎలాగయితేనేం, తన తేజోమయమైన గమ్యం చేరుకోగానే,

హతవిధీ! ఎంత దారుణమైన మాయ!

అదంతా ఎడారి ఇసుకమీద ఎడారి సూర్యుడి విలాసం.

.

ఎలా వీలర్ విల్ కాక్స్

November 5, 1850 – October 30, 1919

అమెరికను కవయిత్రి

 .

Love’s Mirage

.

Midway upon the route, he paused athirst

And suddenly across the wastes of heat,

He saw cool waters gleaming, and a sweet

Green oasis upon his vision burst.

A tender dream, long in his bosom nursed,

Spread love’s illusive verdure for his feet;

The barren sands changed into golden wheat;

The way grew glad that late had seemed accursed.

She shone, the woman wonder, on his soul;

The garden spot, for which men toil and wait;

The house of rest, that is each heart’s demand;

But when, at last, he reached the gleaming goal,

He found, oh, cruel irony of fate,

But desert sun upon the desert sand.

.

(From Poems of Progress)

Ella Wheeler Wilcox 

November 5, 1850 – October 30, 1919

American Poetess

http://www.fullbooks.com/Poems-of-Progress1.html

స్త్రీజాతి శాసనం … ఎలా వ్హీలర్ విల్ కాక్స్, అమెరికను కవయిత్రి

(ఈ కవిత సుమారు వంద సంవత్సరాల క్రింద వ్రాసినా, అందులో ప్రకటించిన ఆవేదనకి కారణమైన యుద్ధోన్మాదం ఎంతమాత్రం తగ్గుముఖం పట్టలేదు, సరికదా, విజృంభిస్తోంది అన్నిచోట్లా, అన్ని రకాలుగా. ఈ కవిత దాని సందర్భాన్ని కోల్పోకపోవడం ఒక పక్క ఆనందకరం, రెండోపక్క విచారకరం.

ప్రపంచశాంతికి ఇంతకంటే గొప్పకవిత ఎవరూ రాయలేరేమో   )

.

క్రీస్తు జన్మించి అప్పుడే 2 వేల సంవత్సరాలు గడిచిపోయాయి.

సాగరంలోకి భూమ్మీద ఉన్న నదులన్నీ చేరినట్టు

ఒక్కసారిగా  కొన్ని కోట్లమంది స్త్రీలు

ఒక కేంద్రస్థానంవైపు చేరుకుంటున్నారు.

వాళ్లు కొండలలోంచి, కోనల్లోంచి, తీరాలవెంబడి

అన్ని దేశాలనుండీ, ప్రాంతాలనుండీ,

అన్ని హోదాలకు చెందినవారూ

అన్ని భాషలు మాట్లాడేవారూ…

కానీ వాళ్ళు ఆలోచిస్తున్నదీ, మాటాడేదీ ఒక్కటే భాష… విశ్వశాంతి.

“వినండి,” అని వారు ప్రకటించిన ఉత్తరక్షణం

ప్రపంచమంతా నిశ్శబ్దమైపోయింది.

మగవాళ్ళు మూగగా, వెరగుతో, చోద్యంగా చూస్తున్నారు.

“ఓ ప్రపంచనాయకులారా! వినండి!

ఈ స్త్రీజాతి ప్రకటించే శాసనాన్ని వినుకొండి:

సాటిమనుషుల్ని ప్రేమించండి అని క్రీస్తు కొత్త సందేశాన్నిచ్చి

అప్పుడే రెండువేల సంవత్సరాలు పూర్తవుతున్నాయి,

కానీ,ఈ భూమంతా ఇప్పటికీ రక్తమోడుతోంది… 

మేము యుద్ధాలు ఎప్పుడు అంతమౌతాయని అడిగితే

ప్రపంచాన్ని ఏలే మగధీరులు తమ బలహీనత ప్రదర్శిస్తున్నారు.

కనుక ఈ ప్రపంచంలోని అబలలమంతా తమ శక్తిని చాటుతూ

యుద్ధం తక్షణం ముగుస్తుందని ప్రకటిస్తున్నాము.

“ఇదే మా శాసనం. వినండి.  ఈ రోజు మొదలు

ఈ భూమండలం మీద ఏ స్త్రీ కూడా

సైనికుడికీ జన్మనివ్వదు.  మేమందరం 

ఒట్టుపెట్టుకున్నాం.  యుద్ధం కోసం

బలవంతులైన కొడుకులను కనేకంటే,

సమాధులు చేరేదాకా గొడ్రాళ్ళుగానే ఉందామని.  

అవును! పిల్లలు లేక మానవ జాతి అంతరించిపోతే, పోనీ

అంతులేని యుద్ధాలకంటే, సంతానంలేక నశించడం మెరుగు.

సేనలహాహాకారాలతో, ఫిరంగులమ్రోతతో దద్దరిల్లే దానికంటే

నిశ్శబ్దంగా ఉండే ప్రపంచమే ఎన్నోరెట్లు మెరుగు.

“మేం ఎప్పటినుండో శాంతికోసం అర్థిస్తున్నాం,

ప్రతిసారీ మాట ఇస్తూనే, యుద్ధాలు కొనసాగిస్తున్నారు.

మానవజాతిని ఆయుధరహితం చెయ్యమని  ఎన్నాళ్ళనుండో

అడుగుతుంటే, చివరకి, మా కోరికకి హేళనగా నవ్వుతూ,

“మగాడన్నవాడు” బ్రతికున్నంతకాలం యుద్ధమనివార్యమన్నారు.

అది విన్నాక మా మనసుల్లో ప్రపంచశాంతికోసం

ఒక తీవ్రమైన కోరిక బయలుదేరింది…

పెద్ద దావానలం ప్రపంచాన్ని వెలిగించినట్టు

అది ఒక  నేలనుండి మరొక నేలకీ, ఒక కడలినుండి మరో కడలికీ పాకి 

చివరకి స్త్రీలు అందరూ ఏకమై, ముక్త కంఠంతో, మనసులోమాటచెబుతునారు

ఒక్క సారి చూడండి! తిరుగులేని నిశ్చయంతో నలుదిక్కులూ ఆవరిస్తున్న

అద్భుతమైన ఈ శాంతి పోరాట  సమితిని ఒకసారి గమనించండి. 

ఓ పురుషులారా! యుద్ధాన్ని అంతంచేస్తామని మాకు మాటివ్వండి;

ప్రపంచాన్ని అస్త్ర రహితం చెయ్యండి. అప్పుడు మీకు కొడుకులని కంటాం—

నిర్మాణానికి కొడుకుల్నీ,  అలంకరించడానికి కూతుళ్ళనీ …

ఎక్కడ తక్కువమందైనా దివ్యమైన వ్యక్తులూ,

సమృద్ధీ,  అందరికీ అవకాశాలూ, శాంతీ నెలకొని ఉంటాయో

అటువంటి ఒక కొత్త ధరిత్రిని  పునర్నిర్మిద్దాం.

మీరు శాంతి వాగ్దానం చేసేదాకా

ఏ పురిటి కేకలూ ఈ వృద్ధభూమిమీద వినిపించవు.

మీ సమాధానం కోసం ఎదురుచూస్తున్నాం”

మగవాళ్ళు తమలో తాము తర్కించుకుంటుంటే

ప్రపంచం నిశ్శబ్దంగా ఉంది.

.

ఎలా వ్హీలర్ విల్ కాక్స్

(November 5, 1850 – October 30, 1919)

అమెరికను కవయిత్రి .

.

(Poems usually get outdated in no time.

In a world being divided and continuously destroyed by war under every possible pretext, it is unfortunate that this poem, written over 100 years ago, has not lost its relevance….

While it is tribute to the poet, it is a sad comment on the mindset of the present day rulers of the world.

Translator.)

.

The Edict Of The Sex

.

Two thousand years had passed since Christ was born,
When suddenly there rose a mighty host
Of women, sweeping to a central goal
As many rivers sweep on to the sea.
They came from mountains, valleys, and from coasts,
And from all lands, all nations, and all ranks,
Speaking all languages, but thinking one.
And that one language–Peace.

‘Listen,’ they said,
And straightway was there silence on the earth,
For men were dumb with wonder and surprise.
‘Listen, O mighty masters of the world,
And hear the edict of all womankind:
Since Christ His new commandment gave to men,
LOVE ONE ANOTHER, full two thousand years
Have passed away, yet earth is red with blood.
The strong male rulers of the world proclaim
Their weakness, when we ask that war shall cease.
Now will the poor weak women of the world
Proclaim their strength, and say that war shall end.
Hear, then, our edict: Never from this day
Will any woman on the crust of earth
Mother a warrior. We have sworn the oath
And will go barren to the waiting tomb
Rather than breed strong sons at war’s behest,
Or bring fair daughters into life, to bear
The pains of travail, for no end but war.
Ay! let the race die out for lack of babes
Better a dying race than endless wars!
Better a silent world than noise of guns
And clash of armies.

‘Long we asked for peace,
And oft you promised–but to fight again.
At last you told us, war must ever be
While men existed, laughing at our plea
For the disarmament of all mankind.
Then in our hearts flamed such a mad desire
For peace on earth, as lights the world at times
With some great conflagration; and it spread
From distant land to land, from sea to sea,
Until all women thought as with one mind
And spoke as with one voice; and now behold!
The great Crusading Syndicate of Peace,
Filling all space with one supreme resolve.
Give us, O men, your word that war shall end:
Disarm the world, and we will give you sons –
Sons to construct, and daughters to adorn
A beautiful new earth, where there shall be
Fewer and finer people, opulence
And opportunity and peace for all.
Until you promise peace no shrill birth-cry
Shall sound again upon the aging earth.
We wait your answer.’

And the world was still
While men considered.

.

(From: Poems Of Progress)

Ella Wheeler Wilcox
(November 5, 1850 – October 30, 1919)

American author and poet

(http://www.fullbooks.com/Poems-of-Progress1.html)

కొత్త సంవత్సరం… ఎలా వ్హీలర్ విల్ కాక్స్, అమెరికను

           2014

మిత్రులకీ బ్లాగు సందర్శకులకీ నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు

My Hearty Greetings to all Friends and visitors

for a very Happy and Prosperous New Year .

May the New Year fill your Homes

with Health, Prosperity and Happiness.

.

కొత్తసంవత్సరంలో కవితల్లో చెప్పడానికేముంటుంది

ఇంతకుముందు కొన్నివేల సార్లు చెప్పింది కాకుండా?

కొత్తసంవత్సరాలొస్తుంటాయి, పాతవి వెళ్తుంటాయి

మనం కలలు కంటుంటాం, అవి గాలిమేడలని తెలిసి కూడా

వేకువతోపాటు నవ్వుతూ లేవడం,

రాత్రితో పాటు దుఃఖిస్తూ పడుకోవడం పరిపాటే

ప్రపంచం మనని కాటువేసేదాకా హత్తుకుంటాం,

కాటువేసాక, శపించి, రెక్కలకై అల్లల్లాడతాం.

బతికేస్తూ, ప్రేమించుకుంటూ, బ్రతిమాలుకుంటూ, పెళ్ళిచేసుకుంటూ

మన అహంకారాలని హారాలుగా అల్లుకుని, మృతులని సమాధిచేస్తూ,

నవ్వుతూ, ఏడుస్తూ, ఆశపడుతూ, భయపడుతూ గడుపుతాం

ప్రతిసంవత్సరం ఇదే పల్లవి పాడుతూ ఉంటాం.

.

ఎలా వ్హీలర్ విల్ కాక్స్

(November 5, 1850 – October 30, 1919)

అమెరికను.

.

Ella Wheeler Wilcox
Ella Wheeler Wilcox
Photo Courtesy:http://en.wikipedia.org/wiki/Ella_Wheeler_Wilcox

.

The Year

.

What can be said in New Year rhymes,

That’s not been said a thousand times?

The new years come, the old years go,

We know we dream, we dream we know.

We rise up laughing with the light,

We lie down weeping with the night.

We hug the world until it stings,

We curse it then and sigh for wings.

We live, we love, we woo, we wed,

We wreathe our prides, we sheet our dead.

We laugh, we weep, we hope, we fear,

And that’s the burden of a year.

.

Ella Wheeler Wilcox

(November 5, 1850 – October 30, 1919)

American Author and Poet

సరైన జీవనమార్గం ఏది?… ఎలా వ్హీలర్ విల్ కాక్స్, అమెరికను కవయిత్రి

ఏది సరైన జీవన విధానం?

ఏదోలా చేసెయ్యడం సులువుగా కనిపించినప్పుడు

కష్టమైనా నీశక్తిమేరకు సవ్యమైనదే చెయ్యడం;

దైనందిన జీవితంలోని ఈతి బాధలని

పదే పదే నెమరువేసుకుని కాలంవృధా చేసేకంటే,

తాలిమితో, చిరునవ్వుతో స్వీకరించడం;

ప్రశ్నార్థకాలు ముసురుకుంటున్నా

మాటలలో ఆశావాదాన్ని వీడకపోవడం;

తరచు నీ అదృష్టాన్ని తలుచుకుంటూ,

కృతజ్ఞతకలిగి, నీ కష్టాల్ని మౌనంగా అంగీకరించడం;

నాకీ కష్టాలెందుకని ప్రశ్నించకపోవడం;

జీవితం అంతా ఒక అత్యుత్తమమైన ప్రణాళికగా మన్నించి

ప్రతి సందర్భాన్నీ అందులో ఒక భాగంగా ఆహ్వానించడం;

కష్టపడి పనిచెయ్యడం, చేసే పనిని ప్రేమించడం

దేవునిపై* నమ్మకముంచి, పదిమందికి ఉపయోగపడేందుకూ,

స్పష్టమైన ముందుచూపు ప్రసాదించమనీ ప్రార్థించడం;

ఇదే సరియైన జీవనమార్గం, భగవంతునికి ప్రీతిపాత్రమైనది

నువ్వు యూదువో, అన్యమతస్థుడివో, నాస్తికుడవో ఎవరివైనా సరే…

.

ఎలా వ్హీలర్ విల్ కాక్స్

(November 5, 1850 – October 30, 1919)

అమెరికను కవయిత్రి

.

*(Note:  ఇక్కడ కవయిత్రి భావన క్రీస్తు. అందుకే ఆఖరిపాదంలో ఈ మతప్రస్తావన రాదు.)

English: Portrait of Ella Wheeler Wilcox, with...
English: Portrait of Ella Wheeler Wilcox, with signature. Frontispiece from Custer and other Poems (1896). (Photo credit: Wikipedia)

.

What Is Right Living?

.

What is right living? 

Just to do your best

when worst seems easier;

To bear the ills of daily life

with patient cheerfulness;

Nor waste dear time recounting them;

To talk  Of hopeful things

when doubt is in the air;

To count your blessings often, giving thanks,

and to accept your sorrows silently;

Nor question why you suffer;

To accept  the whole of life

as one perfected plan,

And welcome each event as part of it;

To work, and love your work;

to trust, to pray 

for larger usefulness and clearer sight;

This is right living, pleasing in God’s eyes,

Though you be heathen, heretic or Jew.

.

(From : Poems of Progress)

Ella  Wheeler Wilcox

(November 5, 1850 – October 30, 1919)

American Poet and Author.

“Laugh, and the world laughs with you;
Weep, and you weep alone.
For the sad old earth must borrow its mirth
But has trouble enough of its own”
 
is her most famous quote.

Text Courtesy:

http://archive.org/stream/poemsofprogress03228gut/pmprg10.txt

దేముడి సమాధానం … ఎలా వ్హీలర్ విల్కాక్స్, అమెరికను కవయిత్రి

ఒక సారి చాలా కష్టాలు పడుతూ, మంచంపట్టినపుడు,

నా బాధగురించి దేముడితో మాటాడినట్టు కలగన్నాను;

కలల సీమల్లో సహజంగా ఉండే ధైర్యంతో నాకు అన్యాయమూ,

దయారహితమని అనిపించినవి మొరపెట్టుకున్నాను

“స్వామీ! నేను పాదాలతో పాకురుతూన్నపుడు కూడా

ప్రతి క్షణం నీనామం జపిస్తూ వేడుకున్నాను; అయినా నిష్ఫలం.

నే నందుకోగల ఎత్తులకి లేవనెత్తడానికి ఏ చెయ్యీ ముందుకురాలేదు

ఈ నిరాశలోనుండి కడతేరే మార్గం ఎవ్వరూ చూపించలేదు.”

.

అప్పుడు దేముడిలా బదులిచ్చాడు: “నేను నీకు మూడు వరాలిచ్చేను

ఆలోచించగల మెదడూ, సాహసించగల సంకల్పం, శారీరక,మానసిక శక్తీ,

మూడుసాధనాలూ దివ్యమైనవే, త్రోవ చూపి నడిపించగలిగినవే.

అటునుంచి ఇటు, తిరిగి నేరాన్ని నా మీద ఎందుకు మోపుతావు?

శక్తివంచనలేకుండా కడదాకా తనవంతుప్రయత్నాలన్నీ పూర్తిచేసేదాకా,

ఏ మనిషీ ఇకనుండి నన్ను ప్రార్థించే సాహసం చెయ్యొద్దు.

.

ఎలా వ్హీలర్ విల్కాక్స్

(November 5, 1850 – October 30, 1919)

అమెరికను కవయిత్రి

నవ్వు, ప్రపంచం నీతో నవ్వుతుంది; ఏడువు, నువ్వొక్కడి(తె)వే ఏడవాలి… అన్నది ఈమె ప్రఖ్యాతి వహించిన  కొటేషన్ (http://www.library.wisc.edu/etext/wireader/WER0109.html)

.

English: Photograph of American writer Ella Wh...
English: Photograph of American writer Ella Wheeler Wilcox (1850-1919). From her book An Erring Woman’s Love. Chicago: W. B. Conkey Company, 1892. (Photo credit: Wikipedia)

.

GOD’S ANSWER

.

Once in a time of trouble and of care
I dreamed I talked with God about my pain;
With sleepland courage, daring to complain
Of what I deemed ungracious and unfair.
‘Lord, I have grovelled on my knees in prayer
   Hour after hour,’ I cried; ‘yet all in vain;
   No hand leads up to heights I would attain,
No path is shown me out of my despair.’

Then answered God:  ‘Three things I gave to thee –
   Clear brain, brave will, and strength of mind and heart,
      All implements divine, to shape the way.
Why shift the burden of thy toil on Me?
   Till to the utmost he has done his part
      With all his might, let no man DARE to pray.’

(From: Poems Of Progress)

Ella Wheeler Wilcox
(November 5, 1850 – October 30, 1919)

American author and poet

(Text Courtesy: http://archive.org/stream/poemsofprogress03228gut/pmprg10.txt)

For more info about the poetess pl. visit: http://www.library.wisc.edu/etext/wireader/WER0109.html

%d bloggers like this: