Tag: Elizabeth Jennings
-
నీరు … ఫిలిప్ లార్కిన్, ఇంగ్లీషు కవి
అన్ని మతాల్లోనూ నీటిప్రాముఖ్యత గురించి కవి ఈ కవితలో పరోక్షంగా చెబుతున్నాడు. . నన్నే గనక ఒక మతాన్ని స్థాపించమని చెబితే నేను నీటిని ఉపయోగించాల్సి వస్తుంది. చర్చికి వెళ్ళాలంటే పాదాలు తడిసే నీళ్ళలోంచి నడవాలి వేరే రకమైన వస్త్రాలు ఆరబెట్టాలి. నా ప్రార్థనలూ పూజల్లో భక్తితో స్నానం చెయ్యడం నీటిలో నిలువునా తడవడం వంటి దృశ్యాలుంటాయి. నేను ‘తూర్పు’కి ఒక గ్లాసుడు నీళ్ళు ఎత్తితే చాలు దానిమీద ప్రతిఫలించే ఏపాటి కాంతైనా తండోపతండాలుగా ప్రజల్ని సమీకరిస్తుంది. […]
-
విలంబనము… ఎలిజబెత్ జెన్నింగ్స్, బ్రిటిషు కవయిత్రి
ఈ క్షణం నా మీద ప్రసరిస్తున్న నక్షత్ర కాంతి ఎన్నో ఏళ్ళక్రిందట మెరిసినది. ఇప్పుడు అక్కడ మిలమిలలాడుతున్న కాంతిని నా కనులు బహుశా చూడలేకపోవచ్చు, ఈ కాల విలంబనము ఎలాగా అని నన్ను ఊరిస్తూంటుంది. ఇపుడు నన్ను ప్రేమిస్తున్న ప్రేమ నాదగ్గరకు చేరకపోవచ్చు దాని తొలి లాలసలు తీరేదాకా. కళ్ళు చూచి అందంగా ఉందని గుర్తించేదాకా, ఆ తారకావేశం నిరీక్షించాల్సిందే మనల్ని చేరుకున్న ప్రేమ, మనం ఇంకెక్కడో ఉండగా చేరొచ్చు. . ఎలిజబెత్ జెన్నింగ్స్ బ్రిటిషు కవయిత్రి. […]