అనువాదలహరి

సానెట్ 21- ఏదీ, మరొకసారి, ఇంకొకసారి చెప్పు?… ఎలిజబెత్ బారెట్ బ్రౌనింగ్, ఇంగ్లీషు కవయిత్రి

ఈ కవిత చదువుతుంటే, పాపయ్య శాస్త్రి గారి పద్యం “ఏది మరొక్కమారు హృదయేశ్వర! గుండెలు పుల్కరింపగా

ఊదగదోయి, ఊదగదవోయి….” గుర్తుకు వస్తుంది. ‘పునరుక్తి’ దోషంకాదంటూ చక్కని ఉపమానంతో సమర్థిస్తుంది కవయిత్రి

ఎలిజబెత్ బారెట్ బ్రౌనింగ్ ఈ కవితలో. హృదయగతమైన సుకుమార భావనలు దేశకాలావధులకి అతీతమైనవని

అనడానికి మరొక్క ఋజువు.

.

ఏదీ, మరొకసారి చెప్పు, మళ్ళీ ఇంకొకసారి చెప్పు

నన్ను ప్రేమిస్తున్నానని! పదేపదిసార్లు పలికిన ఈ మాటలు

నువ్వన్నట్టు అవి నాకు కోకిలపాటలా వినిపించినా,

ఒక్కటి గుర్తుంచుకో! ఈ కొండమీదకైనా, ఆ మైదానంలోకైనా

లోయలోకైనా, అడవిలోకైనా ఆ కోకిలపాటే లేకుంటే,

ఆకుపచ్చని రంగును పరుచుకుంటూ నవ వసంతం అడుగుపెట్టదు!

ప్రియతమా! కారుచీకటిలో సందేహాకులమైన

ఆత్మఘోష వినిపించినపుడు కలిగిన మనోవేదనకి

“నన్ను మరోసారి ప్రేమిస్తున్నానని చెప్పు” అని ఏడుస్తాను!

ప్రతిఒక్కటీ ఆకాశంలో పొరలుతున్నా, చుక్కలంటే భయమేరికి?

ప్రతిఒక్కటీ ఋతువుల్ని అభిషేకిస్తున్నప్పుడు పూలంటే భయమేటికి?

ఏదీ నన్ను ప్రేమిస్తున్నానని, నను ప్రేమిస్తున్నానని, ప్రేమిస్తున్నానని

గంటమ్రోగించినట్టు పదే పదే చెప్పు! కానీ, ప్రియా మరొక్కమాట,

నను ప్రేమించడమంటే మనసారా మౌనంలోకూడా ప్రేమించడం!

.

ఎలిజబెత్ బారెట్ బ్రౌనింగ్

(6 March 1806 – 29 June 1861)

ఇంగ్లీషు కవయిత్రి

Elizabeth Barrett Browning

Photo Courtesy:
https://www.poets.org/poetsorg/poet/elizabeth-barrett-browning.

 

Sonnet 21 – Say over again, and yet once over again

.

Say over again, and yet once over again,

That thou dost love me. Though the word repeated

Should seem ‘a cuckoo-song,’ as thou dost treat it,

Remember, never to the hill or plain,

Valley and wood, without her cuckoo-strain

Comes the fresh Spring in all her green completed.

Beloved, I, amid the darkness greeted

By a doubtful spirit-voice, in that doubt’s pain

Cry, ‘Speak once more—thou lovest! ‘Who can fear

Too many stars, though each in heaven shall roll,

Too many flowers, though each shall crown the year?

Say thou dost love me, love me, love me—toll

The silver iterance!—only minding, Dear,

To love me also in silence with thy soul.

.

Elizabeth Barrett Browning

English Poet

Poem courtesy:

http://famouspoetsandpoems.com/poets/elizabeth_barrett_browning/poems/4636

సానెట్ 3… ఎలిజబెత్ బారెట్ బ్రౌనింగ్, ఇంగ్లీషు కవయిత్రి

ఓ ఉదాత్త హృదయా! మనిద్దరం ఒకలా లేము, ఒకలా లేము

మన విధివ్రాతలూ, మన మనుగడలూ ఒక్కటి కావు.

మన ఆత్మల్ని పరిరక్షించే దేవదూతలు ఎదురుపడినపుడు

రెక్కలల్లార్చి ఒకరినొకరు తేరిపారి చూసుకుంటారు

ఆశ్చర్యంతో; నా ఉద్దేశ్యంలో నువ్వు మహరాణులు హాజరయే

సామాజిక సంబరాలలో వారికి అతిథిగా వెళ్ళగల యోగ్యుడివి,

కేవలం కన్నీళ్ళు కార్చడం తప్ప వేరేరుగని నా కళ్ళకంటే

ఎంతో వందల తేజోవంతమైన కళ్ళు రెప్పలార్పకుండా నిను చూస్తాయి

నువ్వు ప్రముఖ సంగీతకారుడిపాత్ర నిర్వహించినపుడు. వన్నె వన్నెల

దీపాల వెలుగుల్లోంచి నువ్వు నన్ను చూస్తే నీ కొరిగేదేముంది?

తమాలవృక్షానికి ఆనుకుని నేను చీకటిరాత్రిలో పాడుకునే

ఒకానొక అలసిన, దీన, నిలువనీడలేని గాయనిని…

నీ శిరసుపై పవిత్ర అభిషేకజలం; నా శిరసున హిమపాతం —

ఈ రెంటికీ సమానత సాధించగలిగినది ఒక్క మృత్యువే!

.

ఎలిజబెత్ బారెట్ బ్రౌనింగ్

6 March 1806 – 29 June 1861 

ఇంగ్లీషు కవయిత్రి .

Elizabeth Barrett Browning
Elizabeth Barrett Browning

Photo Courtesy:

 

https://www.poets.org/poetsorg/poet/elizabeth-barrett-browning

.

Sonnet iii

.

Unlike are we, unlike, O princely Heart!

Unlike our uses and our destinies.

Our ministering two angels look surprise

On one another, as they strike athwart

Their wings in passing. Thou, bethink thee, art

A guest for queens to social pageantries,

With gages from a hundred brighter eyes

Than tears even can make mine, to play thy part

Of chief musician. What hast thou to do

With looking from the lattice-lights at me,

A poor, tired, wandering singer, singing through

The dark, and leaning up a cypress tree?

The chrism is on thine head–on mine, the dew–

And Death must dig the level where these agree.

.

Elizabeth Barrett Browning

6 March 1806 – 29 June 1861

English Poetess

From:

http://crudfactory.com/cf3/e-books/SonnetsFromThePortuguese.pdf

దృగ్గోచరం… ఎలిజబెత్ బారెట్ బ్రౌనింగ్, ఇంగ్లీషు కవయిత్రి

నేను అనుకుంటుంటాను, మనం కూడా, కలతపడ్డ మనసుతో పిల్లలు

వాళ్ళ ముఖాలని కిటికీ అద్దాలకి ఆనించి, తమ నిట్టూర్పులతో

అద్దాలను మసకబార్చి ఆకాశాన్నీ, ఎదురుగా కనిపించే అందమైన

ప్రకృతిదృశ్యాన్నీ మరుగుపరుచుకున్నట్టు, ప్రవర్తిస్తుంటామని.

అయ్యో! ఆ సృష్టికర్త అయిన దేవుడుకూడా ఆరకంగా

బాధాతప్తమైన ఆత్మకీ, మరణానంతర జీవితానికీ,

రెండింటికీ మధ్య ఒక మార్మికమైన గీత గీసాడుకదా!

మనల్ని చూడమని ఆదేశిస్తున్న దృశ్యాల్ని తెలివితక్కువవాళ్లలా

దుఃఖాన్ని అడ్డుపెట్టుకుని చూడలేకున్నాము. ఓ మనిషీ, సోదరా!

ప్రశాంతంగా, ధైర్యంగా ఉండు! నీ వెక్కిళ్ళు ఆపుకో,

విశాలమైన నీ ఆత్మయొక్క కిటికీలను తప్పులనుండి నిర్మలంగా ఉంచు

అలా చేస్తే, ప్రాణప్రతిష్ఠకి అనుమతి దొరికిననాటినుండి

నీ దృష్టి స్పష్టంగా ఉండి సక్రమంగా చూడగలుగుతావు:

సూర్యాస్తమయాన్ని… మృత్యువులోని వెలుగులని.

.

ఎలిజబెత్ బారెట్ బ్రౌనింగ్

(6 March 1806 – 29 June 1861) 

ఇంగ్లీషు కవయిత్రి

.

.

The Prospect

Methinks we do as fretful children do,      

  Leaning their faces on the window-pane  

  To sigh the glass dim with their own breath’s stain,  

And shut the sky and landscape from their view;

And, thus, alas! since God the maker drew

  A mystic separation ’twixt those twain,—       

  The life beyond us and our souls in pain,—      

We miss the prospect which we are called unto  

By grief we are fools to use. Be still and strong, 

O man, my brother! hold thy sobbing breath,     

  And keep thy soul’s large windows pure from wrong;        

That so, as life’s appointment issueth,      

  Thy vision may be clear to watch along  

The sunset consummation-lights of death.

.

Elizabeth Barrett Browning

(6 March 1806 – 29 June 1861)

English Poetess

The World’s Best Poetry.

Eds. Bliss Carman, et al. 

Volume IV. The Higher Life.  1904.

VII. Death: Immortality: Heaven

http://www.bartleby.com/360/4/215.html 

 

ఎదురుచూపు… రాబర్ట్ బ్రౌనింగ్, ఇంగ్లీషు కవి

(ఈ కవిత తన భార్య ఎలిజబెత్ బారెట్ బ్రౌనింగ్ మృతి సందర్భంగా 1861లో వ్రాసినది.)

మృత్యువంటే భయపడుతునానా?  గొంతులో చల్లదనం ప్రారంభమై

ముఖాన్ని చలిగాలి తాకి,

మంచు పేరుకోడం ప్రారంభమై, ఈదురుగాలులు వీస్తున్నాయంటే

నేను ఆ ప్రదేశానికి చేరువయ్యానన్న మాట.

రాత్రి చూడబోతే బలీయము, విరుచుకుపడుతోంది తుఫాను

పట్టవలసింది శత్రు స్థావరం

అక్కడ భయంకరమైన శత్రువు కంటికెదురుగా నిలిచిన్నప్పటికీ

సాహసికుడు ముందుకు పోక తప్పదు

ప్రయాణం ముగిసింది, శిఖరం చేతికందింది,

సరిహద్దులు కూలిపోయాయి

బహుమతి చేతికి చిక్కే వరకూ పోరాడవలసి ఉన్నా, కడకి

అన్నిపోరాటాలకీ అదే బహుమతి

నేను నిత్య పోరాట యోధుణ్ణి— ఇది మరొక్క పోరాటం

చివరదీ, అన్నిటిలోకి మిన్న ఐనదీ

మృత్యుభయం కళ్ళకు గంతలు కట్టి, నిర్వీర్యం చేసి,

నామీద పెత్తనం చెలాయించడం  నాకు నచ్చదు;

లాభం లేదు. దాని అంతు చూడవలసిందే, పూర్వపు వీరుల్లా

నా సహచరుల్లా పోరాడవలసిందే.

ముందుండి ఎదుర్కోవాలి, ఒక్క నిముషంలో జీవితంలోని

వేదనల, నిరాశల, నిర్లిప్తతల బాకీలు చెల్లించాలి

ధీరులకి పరిస్థితి ఒక్కసారిగా విషమించడమే మంచిది,

చివరి ఘడియ ఎంతసేపో ఉండదు

ప్రకృతిశక్తులు ముమ్మరమై, అంతవరకూ ఉత్సాహపరచిన

మిత్రుల మాటలు పలచనై, గాలిలో కలిసి

ఆగిపోతాయి. బాధలలోంచి మొదట నిష్కృతి లభిస్తుంది,

వెనువెనకనే ఒక వెలుగు; తర్వాత గుండె ఆగుతుంది.

ఓ నా ప్రాణంలో ప్రాణమా! నేను నిన్ను మళ్ళీ హత్తుకుంటాను

తక్కినది అంతా పరమాత్మలోనే!

.

రాబర్ట్ బ్రౌనింగ్

ఇంగ్లీషు కవి.

.

Prospice* 

.

Fear death? — to feel the fog in my throat,

The mist in my face,

When the snows begin, and the blasts denote

I am nearing the place,

The power of the night, the press of the storm,

The post of the foe;

Where he stands, the Arch Fear in a visible form,

Yet the strong man must go:

For the journey is done and the summit attained,

And the barriers fall.

Tho’ a battle’s to fight ere the guerdon be gained,

The reward of it all.

I was ever a fighter, so — one fight more,

The best and the last!

I would hate that death bandaged my eyes, and forebore,

And bade me creep past.

No! let me taste the whole of it, fare like my peers

The heroes of old,

Bear the brunt, in a minute pay glad life’s arrears

Of pain, darkness and cold.

For sudden the worst turns the best to the brave,

The black minute’s at end,

And the elements’ rage, the friend-voices that rave,

Shall dwindle, shall blend,

Shall change, shall become first a peace out of pain,

Then a light, then thy breast,

O thou soul of my soul! I shall clasp thee again,

And with God be the rest.

.

(Note: Prospice in Latin means “Looking Forward”)

Robert Browning 

7 May 1812 – 12 December 1889

English Poet and Playwright

బలహీనమైనది… ఎలిజబెత్ బారెట్ బ్రౌనింగ్, ఇంగ్లీషు కవయిత్రి

అన్నిటిలోకీ బలహీనమైనదేదో

నా మనసు ఊహించగలదా?

సూర్యుడు… ఒక చిన్న మబ్బుతునక చాలు

మాటుచేసి కనుచూపుమేర చీకటి ఆవరింపజెయ్యడానికి.

కానీ, అదే మేఘం ఎక్కడున్నా

చిన్నగాలి చాలదూ, చెల్లాచెదరు చెయ్యడానికి?

కానీ, ఆ గాలినే మీది కొమ్మల్లో

ఎండిపోయిన చిన్న ఆకు నిలదొక్కుకోదూ?

ఆ పండుటాకు  ఎన్నాళ్ళు పచ్చగా ఉందో

అన్నాళ్ళు నా జీవితం హాయిగా గడిచింది.

ఇప్పుడు, వసంతానికి ఏ అర్థం ఇచ్చినా,

నేను విచారించకుండా ఉండలేను.

ఓహ్, భగవాన్! కేవలం నిట్టూర్పులకే

పెదాలు రెండుగా చీలే చిగురాకుని నేను!

అలాగైతే,  నా మనసేనా అన్నిటిలోకీ

నేనూహించగల బలహీనమైన వస్తువు?

కానీ, సూర్యుడూ, మేఘమూ

రెండూ శుష్కించి కనుమరుగైనా,

ఒక్క దెబ్బకి, అది వడిగాలి కానక్కరలేదు,

అడవులన్నీ  వాలి మోడులైపోయినా,

శాపగ్రస్తమైన అనంతమైన చీకటిలోంచికూడా

మనిషిని అపూర్వమైన కీర్తిప్రతిష్ఠలవైపు తీసికెళ్ళగలిగేదీ,

ఈ సృష్టిలో అన్నిటికన్నా శక్తివంతమై

బలహీనుల్ని కాపాడి పరిరక్షించేదీ, మనసే!

.

ఎలిజబెత్ బారెట్ బ్రౌనింగ్

6 March 1806 – 29 June 1861

ఇంగ్లీషు కవయిత్రి

.

Elizabeth Barrett Browning

6 March 1806 – 29 June 1861

.

Weakest of All

.

Which is the weakest thing of all

Mine heart can ponder?

The sun, a little cloud can pall

With darkness yonder?

The cloud, a little wind can move

Where’er it listeth?

The wind, a little leaf above,

Though sere, resisteth?

What time that yellow leaf was green,

My days were gladder;

But now, whatever Spring may mean,

I must grow sadder.

Ah me! a leaf with sighs can wring

My lips asunder –

Then is mine heart the weakest thing

Itself can ponder.

Yet, Heart, when sun and cloud are pined

And drop together,

And at a blast, which is not wind,

The forests wither,

Thou, from the darkening deathly curse

To glory breakest, –

The Strongest of the universe

Guarding the weakest!

.

Elizabeth Barrett  Browning

6 March 1806 – 29 June 1861

English Poetess.

నేను నిన్నెంతగా ప్రేమిస్తున్నాను? ( సానెట్ 43) … ఎలిజబెత్ బారెట్ బ్రౌనింగ్

Elizabeth Barrett Browning
Photo Courtesy:
https://www.poets.org/poetsorg/poet/elizabeth-barrett-browning

(ఈ రోజు మార్చి 6, 2012… ఆమె 207వ జయంతి సందర్భంగా)

[ఈ కవిత ఎంత ప్రాచుర్యంలోకి వచ్చిందంటే కొంతమంది Shall I compare thee to a Summer’s day అన్న షేక్స్పియర్

సానెట్ 18 ని గుర్తుతెచ్చుకుని ఇదికూడా అతనిదే అనుకునేంత. నిజానికి ఇది ఎలిజబెత్ బారెట్ బ్రౌనింగ్ తన

ప్రేమచిహ్నంగా భర్త రాబర్ట్ బ్రౌనింగ్ కి వ్రాసిన 45 సానెట్లలో 43వది. ఈ సానెట్ లకి ఆమె ఇచ్చిన నర్మగర్భమైనపేరు

Sonnets from the Portuguese అని. అది చదివితే ఇవేవో పోర్చుగీసు భాషనుండి అనువదించినవని ప్రజలు అనుకుందికి.

కానీ అసలురహస్యం, బ్రౌనింగ్ ఆమెని ముద్దుగా My Little Portuguese అనిపిలవడం.

ఈ కవిత మామూలు ప్రేమకవితలలాంటిదికాదు. ఇందులో చిత్రమైన ఉపమానాలున్నాయి. మనం సరిగా గమనించకపోతే

వాటిని తప్పిపోతాం. నాకు చిన్నప్పుడు బుడుగు కార్టూనొకటి గుర్తొస్తుంది. నీకు తెలిసిన పెద్ద సంఖ్య చెప్పరా బుడుగూ

అని ఎవరో అడిగితే, వాడు ఆలోచించి ఆలోచించి మూ….డు. అంటాడు. అలాగే చిన్నపిల్లల్ని నీకు అమ్మంటేనో

నాన్నంటేనో ఎంత ఇష్టం అని అడిగితే, వాళ్ళు చేతులుబారజాపి… “ఇంత ఇష్టం” అనడం మనకి అనుభవమే. దాన్ని

ఇక్కడ ఎలిజబెత్ 3-dimensional spaceలో చెబుతుంది. అలాగే, Ends of being, Passion put to use in my old griefs,

Childhood faith,  అన్న పదబంధాలు చాలా జాగ్రత్తగా గమనించి ఆనందించవలసినవి.]

.

నేను నిన్నెంతగా  ప్రేమిస్తున్నాను? లెక్క పెట్టనీ…

ఊర్థ్వ అథోలోకాలూ, దిగంతాల అంచులని నా

ఆత్మ అందుకోగలిగినంత విశాలంగా; నువ్వు కనుమరుగైనపుడు

నా ఆలోచనల, ఇంద్రియానుభూతుల అవధులు సంభావించగలిగినంత;

రేయింబవళ్ళు నీ సాన్నిధ్యం నాకివ్వగలిగిన లౌకికానందం మేరకేగాక,

నువ్వు నీహక్కుగా ననుకోరుకునేంత స్వేచ్ఛగా,

పొగడ్తలకి ఒదగనంత స్వచ్ఛంగా,

నా గత విషాదాలతలపుల్లో మగ్గినంత గాఢంగా,

చిన్నతనపు విశ్వాసాలంత అచంచలంగా,

ఒకప్పుడు నా అభిమాన హీరోలను అరాధించినంత నిరవధికంగా,

నా శ్వాసలో, చిరునవ్వులో, కన్నీటిలో రూపింపగలిగినంత స్పష్టంగా,

భగవంతుడనుగ్రహిస్తే, తనువు వీడినతర్వాతకూడా

నిన్ను మిన్నగా ప్రేమిస్తూనే ఉంటాను.

.

ఎలిజబెత్ బారెట్ బ్రౌనింగ్

.

How Do I Love Thee (Number 43)

.

How do I love thee? Let me count the ways.

I love thee to the depth and breadth and height

My soul can reach, when feeling out of sight

For the ends of Being and ideal Grace.

I love thee to the level of everyday’s

Most quiet need, by sun and candlelight.

I love thee freely, as men strive for Right;

I love thee purely, as they turn from Praise.

I love thee with the passion put to use

In my old griefs, and with my childhood’s faith.

I love thee with a love I seemed to lose

With my lost saints,—I love thee with the breath,

Smiles, tears, of all my life!—and, if God choose,

I shall but love thee better after death.

.

Elizabeth Barrett Browning

(6 March 1806 – 29 June 1861)

English Poet.

%d bloggers like this: