అనువాదలహరి

ఆటు… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి

నీ ప్రేమ నానుండి మరలింది కనుక

నాకు నా మనఃస్థితి తెలుస్తోందిలే:

అదొక తీరంనుండి సముద్రంలోకి చొచ్చుకొచ్చిన బండరాయి,

దానిమీద ఒక చిన్న గుంత; అందులో, ఎగసినకెరటాలనుండి

జారిపోగా మిగిలిన నీటితో ఏర్పడిన చిన్న మడుగు.

ఆ గోర్వెచ్చని నీరు ఎండకీ, గాలికీ

మెల్లమెల్లగా హరించుకుపోతుంటుంది.

.

ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే

(22 ఫిబ్రవరి 1892 – 19 అక్టోబరు 1950)

అమెరికను కవయిత్రి

.

Ebb

.

I know what my heart is like

      Since your love died:

It is like a hollow ledge

Holding a little pool

      Left there by the tide,

      A little tepid pool,

Drying inward from the edge.

.

Edna St. Vincent Millay

(February 22, 1892 – October 19, 1950)

American Poetess

Poem Courtesy: https://www.poetryfoundation.org/poems/44720/ebb

ప్రకటనలు

కొండమీద ఒక మధ్యాహ్నం… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి

ఈ ఆకాశం క్రింద
నా అంత ఆనందంగా ఎవరూ ఉండరు.
నే ఒక వంద పుష్పాలు తాకుతాను
కానీ, ఒక్కటీ తురుమను.

నేను మేఘాల్నీ, కొండ కొనకొమ్ముల్నీ
ప్రశాంత వదనంతో తిలకిస్తాను.
గాలి ఎలా పచ్చికని అవనతం చేస్తూ పోతుందో
పచ్చిక తిరిగి ఎలా తలెత్తుకుంటుందో చూస్తాను.

దూరాన ఉన్న మా ఊరిలో
దీపాలు వెలిగే వేళకి
మా ఇల్లు ఎక్కడ ఉందా అని చూసి, గుర్తించి
కొండ దిగడం ప్రారంభిస్తాను.
.
ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే
అమెరికను కవయిత్రి
(February 22, 1892 – October 19, 1950)

.

Afternoon on a Hill

I will be the gladdest thing

Under the sun!

I will touch a hundred flowers

And not pick one.

I will look at cliffs and clouds

With quiet eyes

Watch the wind bow down the grass,

And the grass rise.

And when lights begin to show

Up from the town,

I will mark which must be mine,

And then start down!

.

Edna St. Vincent Millay

 (February 22, 1892 – October 19, 1950)

American Poet and Playwright.

Courtesy: Renascence and Other Poems

by Edna St. Vincent Millay (pp 41- 42)

World Public Library Edition

Mitchell Kennerly, New York, 1917.

కల… ఎడ్నా సెయింట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి

ప్రియతమా! నా రోదనకి విలువ లేదు
నువ్వు నవ్వితే, నేను పట్టించుకోను.
అలా ఆలోచించడం నా తెలివితక్కువలా కనిపించవచ్చు
కానీ, నువ్వక్కడ ఉన్నావన్న భావన ఎంతో బాగుంటుంది.

ప్రియతమా! నిద్రలో నేను మేలుకున్నట్టు కలగన్నాను…
భయపెట్టే,తెల్లని వెన్నెల అలా నేలమీద
పాకురుతూ వచ్చింది…ఎక్కడో, ఏ మూలనో
కిటికీ ఓరగా ఉంది… అది కిర్రు మంది.

చిత్రం! గాలికి కొట్టుకుందేమో అనుకుందికి గాలే లేదు!
నాకు చాలా భయమేసింది. నీకోసం చూశాను.
నీ అనునయంకోసం చెయ్యి చాచేను…
కానీ నువ్వెళ్ళిపోయావు. చల్లగా, మంచుముద్దలా

నా చేతికింద వెన్నెల తగులుతోంది.
ప్రియా! నువ్వు నవ్వినా నేను పట్టించుకోను.
నే నిపుడు ఏడ్చినా ప్రయోజనం లేదు.
కానీ, నువ్వక్కడ ఉన్నావన్న భావన ఎంతో బాగుంటుంది.
.

ఎడ్నా సెయింట్ విన్సెంట్ మిలే

(February 22, 1892 – October 19, 1950)

అమెరికను

 

.

The Dream

Love, if I weep it will not matter,

And if you laugh I shall not care;

Foolish am I to think about it,

But it is good to feel you there.

Love, in my sleep I dreamed of waking–

White and awful the moonlight reached

Over the floor, and somewhere, somewhere,

There was a shutter loose–it screeched!

Swung in the wind–and no wind blowing!

I was afraid, and turned to you,

Put out my hand to you for comfort–

And you were gone! Cold, cold as dew,

Under my hand the moonlight lay!

Love, if you laugh I shall not care,

But if I weep it will not matter–

Ah, it is good to feel you there!

.

Edna St. Vincent Millay

American

(February 22, 1892 – October 19, 1950)

Poem Courtesy: http://www.blackcatpoems.com/m/the_dream.html

ప్రియతమా!ఇప్పుడు నిన్ను మరిచిపోగలను… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే అమెరికను కవయిత్రి

ప్రియతమా! నిన్నిపుడు మరిచిపోగలను.
కనుక ఆ మిగిలిన ఒక్క రోజూ, నెలా, సంవత్సరమూ
నేను మరణించేలోగా, మరిచిపోయేలోగా, ఎడబాటయేలోగా
ఉన్న సమయాన్ని ఎంతవీలయితే అంతబాగా గడుపు.
దానితో సరి. ఆపై శాశ్వతంగా ఒకరిఊసు ఒకరికి ఉండదు.
ముందే అన్నట్టు నిన్ను క్రమంగా మరిచిపోతాను. కానీ ఇప్పుడు
నువ్వు నీ అందమైన అబద్ధంతో బ్రతిమాలబోతే
నా అలవాటైన ఒట్టుతో ప్రతిఘటిస్తాను.

నిజానికి ప్రేమ చిరకాలం కొనసాగితే బాగుణ్ణని నాకూ ఉంది
ఒట్లుకూడా అంతబలహీనంగా ఉండకపోతే బాగుణ్ణనీ ఉంది
కానీ అవి అంతే, ప్రకృతి వాటిని అలా ఉండమని నిర్దేశించి
ఇప్పటి వరకూ విఘ్నంలేకుండ వాటి ప్రయాస కొనసాగిస్తోంది.
మనం వెతుకుతున్నది మనకి లభించినా, లభించకున్నా
జీవశాస్త్ర పరిభాషలో చెప్పాలంటే… అది జడపదార్థమే.

.

ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే

(February 22, 1892 – October 19, 1950)

అమెరికను కవయిత్రి

.

 

.

I Shall Forget You Presently, My Dear

.

I shall forget you presently, my dear,

So make the most of this, your little day,

Your little month, your little half a year,

Ere I forget, or die, or move away,

And we are done forever; by and by

I shall forget you, as I said, but now,

If you entreat me with your loveliest lie

I will protest you with my favorite vow.

I would indeed that love were longer-lived,

And oaths were not so brittle as they are,

But so it is, and nature has contrived

To struggle on without a break thus far,—

Whether or not we find what we are seeking

Is idle, biologically speaking.

Edna St. Vincent Millay

(February 22, 1892 – October 19, 1950)

American Poet

Poem Courtesy: 

http://www.poemtree.com/poems/IShallForgetYouPresently.htm

 

 

ఓ నా మిత్తికా! నువ్వూ గతించవలసిందే!… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే అమెరికను కవయిత్రి

ఓ నా ప్రియ మిత్తికా! నువ్వూ గతించవలసిందే!
ఇంత నీ సౌందర్యమూ నిన్ను ఎంతమాత్రం కాపాడలేదు;
ఎక్కడా లోపం కనరాని ఈ నిపుణ హస్తమూ, అందమైన శిరసూ,
జ్వలించే ఉక్కులాంటి ఈ శరీరమూ, సుడిగాలివంటి
మృత్యువు ముందు, లేదా దానీ హేమంత హిమపాతం ముందు,
ఏ ఆకు రాలడానికి భిన్నంగా లేకుండా, మొట్టమొదటి ఆకు రాలినట్టు
రాలిపోక తప్పదు; ఈ అద్భుతం తెరమరుగుకాక తప్పదు…
మార్పుకిలోనై, అందరికీ దూరమై, చివికి శిధిలమై.
ఆ సమయంలో నా ప్రేమకూడా నిన్ను రక్షించలేదు.
ఇంత నా ప్రేమ నిన్ను వెన్నంటి ఉన్నా, ఆ రోజు నువ్వు
శరీరంనుండి లేచి వాయుమార్గంలో ప్రయాణం చేస్తావు …
ఎవ్వరూ పట్టించుకోని పువ్వులా ఏ గుర్తింపూ లేకుండా.
నువ్వు ఎంత అందంగా ఉన్నావన్నది అక్కడ ప్రశ్నేకాదు
మరణించింది అన్నిటికంటే ఎంత ప్రియమైనదన్నదీ కాదు.

.

ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే

(February 22, 1892 – October 19, 1950)

అమెరికను కవయిత్రి

.

.

And You as Well Must Die, Beloved Dust

And you as well must die, beloved dust,

And all your beauty stand you in no stead;

This flawless, vital hand, this perfect head,

This body of flame and steel, before the gust

Of Death, or under his autumnal frost,

Shall be as any leaf, be no less dead

Than the first leaf that fell,—this wonder fled.

Altered, estranged, disintegrated, lost.

Nor shall my love avail you in your hour.

In spite of all my love, you will arise

Upon that day and wander down the air

Obscurely as the unattended flower,

It mattering not how beautiful you were,

Or how beloved above all else that dies.

Edna St. Vincent Millay

(February 22, 1892 – October 19, 1950)

American Poet

Poem Courtesy: 

http://www.poemtree.com/poems/And-You-As-Well-Must-Die.htm 

ప్రేమే సర్వస్వం కాదు… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి

గమ్మత్తైన శిల్పంతో ప్రేమ సర్వస్వం కాదంటూనే, దాన్ని సర్వస్వంగా వాచ్యం చెయ్యకుండా నిరూపిస్తుంది ఎడ్నా ఈ కవితలో.

***

ప్రేమే సర్వస్వం కాదు; అది తిండిపెట్టదు, దాహం తీర్చదు
నిద్రపుచ్చదు, కనీసం వర్షాన్నుండి రక్షించదు;
అది ప్రవాహంలో కొట్టుకుపోతున్న కొయ్యకూడా కాదు
దాన్ని ఆసరాగా చేసుకుని మునుగుతూ, తేలుతూ, ఒడ్డుచేరుకోడానికి;
గట్టిపడిన ఊపిరితిత్తుల్ని అది గాలితో నింపలేదు,
రక్తాన్ని శుభ్రపరచలేదు, విరిగిన ఎముకని అతకనూలేదు;
అయినప్పటికీ, మనిషి మృత్యువుని కాగలించుకుంటూనే ఉన్నాడు
నేను మాటాడుతున్న ఈ క్షణంలో కూడా, కేవలం ప్రేమ దొరకనందువల్ల.
కష్టకాలం సమీపించినపుడు, బాధలు ఒక్కుమ్మడిగా మీదబడి
నేలకి కృంగిపోయి, ఊపిరాడక సతమతమౌతున్నప్పుడు, లేదా,
బ్రతకాలన్న ఆశనుకూడా దిగమింగిన లేమిలో అలా అనిపించవచ్చు
నేను నీ ప్రేమకు బదులు ప్రశాంతతని ఆహ్వానించ వచ్చు;
లేదా, ఈ రేయి నీ జ్ఞాపకాన్ని ఆహారానికి వినిమయం చేసుకోవచ్చు.
ఏమో అలా జరిగినా జరుగవచ్చు. కానీ, అలా జరుగుతుందని అనుకోను.
.
ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే

22 February 1892 – 19 October 1950

అమెరికను కవయిత్రి

Image Courtesy: http://upload.wikimedia.org

.

Love is not all…

Love is not all: it is not meat nor drink

Nor slumber nor a roof against the rain;

Nor yet a floating spar to men that sink

And rise and sink and rise and sink again;

Love cannot fill the thickened lung with breath,

Nor clean the blood, nor set the fractured bone;

Yet many a man is making friends with death

Even as I speak, for lack of love alone.

It well may be that in a difficult hour,

Pinned down by pain and moaning for release,

Or nagged by want past resolution’s power,

I might be driven to sell your love for peace,

Or trade the memory of this night for food.

It well may be. I do not think I would.

.

Edna St. Vincent Millay

22 February 1892 – 19 October 1950

American Poetess

ప్రయాణం… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి

ఈ రైలు మార్గము మైళ్ళ కొద్దీ సాగుతోంది.
రోజల్లా మనుషులమాటలతో సందడిగా ఉంటుంది
కానీ రోజు రోజల్లా ఎదురుచూసినా ఏ రైలూ రాదు
నాకు మాత్రం దాని కూత ఎక్కడినుండో వినిపిస్తూంటుంది

రేయి నిద్రపోడానికీ, కలలు కనడనికే అయినా
ఎంత చూసినా, రాత్రి మొత్తంలో ఏ రైలూ ఇటు రాదు;
కానీ నాకు ఆకాశంలో ఎగురుతున్న నిప్పు రవ్వలు కనిపిస్తున్నాయి
దాని ఇంజనులోంచి ఎగజిమ్ముతున్న ఆవిరిచప్పుడు వినిపిస్తోంది.

నే నేర్పరచుకున్న స్నేహాలవల్ల మనసు హాయిగా ఉంది
అంతకంటే మంచి స్నేహితులు దొరుకుతారనుకోను
అయినప్పటికీ, స్నేహితులుదొరుకుతారంటే
నేను ఎక్కని రైలంటూ ఉండదు, అది ఏవూరు వెళ్ళనీ.
.

ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే

(February 22, 1892 – October 19, 1950)

అమెరికను కవయిత్రి

Image Courtesy: http://upload.wikimedia.org

.

Travel

.

The railroad track is miles away,

And the day is loud with voices speaking,

Yet there isn’t a train goes by all day

But I hear its whistle shrieking.

All night there isn’t a train goes by,

Though the night is still for sleep and dreaming,

But I see its cinders red on the sky,

And hear its engine steaming.

My heart is warm with the friends I make,

And better friends I’ll not be knowing,

Yet there isn’t a train I wouldn’t take,

No matter where it’s going.

.

Edna St. Vincent Millay

(February 22, 1892 – October 19, 1950)

American Poet  and Playwright

Poem Courtesy:

http://www.blackcatpoems.com/m/travel.html

దుఃఖానికి దగ్గరచుట్టం.. ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను

నేనేమైనా దుఃఖానికి
దగ్గరచుట్టాన్నా, తలుపుతట్టేగడియ
అస్తమాటికీ జారి పడిపోతుందెందుకు?
అలాగని, దబ్భుమనీ పడిపోదు
చప్పుడుచెయ్యకుండానూ రాలిపడదు,
ఎప్పటినుండో దుఃఖం తట్టుకి అలవాటుపడినట్టు!
గుమ్మం చుట్టూ బంతిపూలూ
దవనమూ వేలాడుతుంటాయి.
అయినా, అక్కడ బంతిపూలుంటే నేమిటి
దవనం ఉంటే నేమిటి దుఃఖానికి?
నేనేమైనా దాని చుట్టాన్నా?
అస్తమాటికీ నాతలుపు తట్టడానికి
మనం దాని చుట్టాలమా?
ఓహ్! మీరా! రండి రండి లోపలికి.
.
ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే
February 22, 1892 – October 19, 1950
అమెరికను

 .

Image Courtesy: http://upload.wikimedia.org
Image Courtesy: http://upload.wikimedia.org

.

Kin To Sorrow

.

Am I kin to Sorrow,

That so oft

Falls the knocker of my door–

Neither loud nor soft,

But as long accustomed,

Under Sorrow’s hand?

Marigolds around the step

And rosemary stand,

And then comes Sorrow–

And what does Sorrow care

For the rosemary

Or the marigolds there?

Am I kin to Sorrow?

Are we kin?

That so oft upon my door–

Oh, come in!

.

Edna St. Vincent Millay

American

poem courtesy: http://www.blackcatpoems.com/m/kin_to_sorrow.html

సానెట్ 04 … ఏడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి

(ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే 66వ వర్ధంతి సందర్భంగా)

*

నీ రూపాన్నీ, దాని గురించి నే కన్నకలలతో సహా

నా జ్ఞాపకాలు పరిభ్రమించడానికి అనుమతించేది

ఈ సిగరెట్టు కాల్చడం పూర్తయీదాకా మాత్రమే.

నేలమీద నుసి నిశ్శబ్దంగా రాలుతుంటే

నేపథ్యంలోని జాజ్ సంగీతంతో కలిసి

చలిమంట వెలుగులో ముక్కలు ముక్కలుగా క్రీనీడలు

గోడమీద వంకరలుపోతూ కత్తిలా పొడవుగా సాగేవరకే.

ఒక లిప్త కాలం, ఆ తర్వాత అంతా ముగిసిపోతుంది.

ఆ తర్వాత శలవు. వీడ్కోలు. కల కనుమరుగౌతుంది.

నీ ముఖాన్నీ, దాని రంగునీ, అందులోని

ప్రతి కవళికనీ నేను సులభంగా మరిచిపోగలను.

మాటలు, ఎన్నడూ మరువలేను; చిరునవ్వు, సాధ్యపడట్లేదింకా;

కానీ నీ జీవితంలో నువ్వు గర్వపడే ఈ క్షణం మాత్రం

సూర్యాస్తమయం తర్వాత కొండమీది వెలుగులాటిది.

.

ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే

(February 22, 1892 – October 19, 1950)

అమెరికను కవయిత్రి, నాటక కర్త

పులిట్జరు బహుమతి గ్రహీత

 

 

Image Courtesy: http://upload.wikimedia.org
Image Courtesy: http://upload.wikimedia.org

Sonnet 04

.

Only until this cigarette is ended,
A little moment at the end of all,
While on the floor the quiet ashes fall,
And in the firelight to a lance extended,
Bizarrely with the jazzing music blended,
The broken shadow dances on the wall,
I will permit my memory to recall
The vision of you, by all my dreams attended.
And then adieu,—farewell!—the dream is done.
Yours is a face of which I can forget
The color and the features, every one,
The words not ever, and the smiles not yet;
But in your day this moment is the sun
Upon a hill, after the sun has set.

.

Edna St Vincent Millay 

(February 22, 1892 – October 19, 1950)

American 

Pulitzer Prize for Poetry in 1923

స్మృతిగీతం… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి

చారెడేసి ఉన్న నీ కనులని నేలలో
భద్రంగా ఎక్కడో రహస్యంగా దాచనీ.
సన్నని నీ వేళ్ళు, మెత్తనైన
అందమైన వింతవన్నెల నీ కురులూ…
ఇవన్నీ ఏదో విధంగా తప్పకుండా
నేలలోని రహస్యమాళిగగుండా పైకి లేస్తాయి;
కానీ, అందుకుకాదు గుండెపగిలి సర్వమూ శూన్యమై
కళ్ళప్పగించి చూస్తూ నేనిక్కడ కూచున్నది;
అందంగా అలంకరించినట్టు నీ చిన్ని ఎముకలను
కప్పిన నీ నునులేత చర్మం
వాతావరణంలోకి పువ్వులా విచ్చుకుంటుందని.

కానీ, నీ గొంతు… నేలపొరల్లో
మంద్రంగా పరిగెత్తే నీటి ఊటలు గాని,
వర్షం పడడానికి ముందు చెట్ల గుబురుల్లో
ఉధృతంగా చేసే గాలి సవ్వడులుగాని
నీటిసానువులలో అడవికోళ్ళ అరుపులుగాని,
పిచ్చుకలు వినిపించే కిచకిచలు గాని,
ఆకసాన్ని బయటపెడుతూ, నిర్దాక్షిణ్యంగా మోడైన
చెట్ల పండుటాకులను కాలువలగుండా తోస్తూ తోస్తూ
పిల్లకాయల పాదాలుచేసే చప్పుళ్ళు గాని …
ఆలోచనలు కమ్ముకున్న నా మనసుకు తృప్తినీయవు.
కారణం, ఆ గొంతులోని మాధుర్యం
ఇక మఋఏ రూపంలోనూ … కొత్తగా
మరొకసారి వినిపించమన్నా వినిపించదు.

నాలుగు దిక్కులా బలంగా ప్రాకి
చేవదేరిన ఆ చెట్టు కాండంలోంచి
తన పూర్వ సారాన్ని ఏమాత్రం కొల్పోకుండా
క్రమం తప్పని సూరుడివెలుగుతో పుష్టిగా
రోజురోజుకీ … అనంతంగా ఎదుగుతూ…
మార్పులకి లోనౌతూ నీ రక్తం ప్రవహిస్తుంది,
మొగ్గై, పువ్వై, విత్తనంగా మారుతుంది.
నువు పాడుకునే రోజులు ముగిసిపోవచ్చు గాని
నీ గొంతులోని సంగీత మాధుర్యాన్ని
నువ్వు మాటాడిన అద్భుతమైన మాటలనీ
వాటి రసాయనిక రహస్యాన్ని
ఈ నేల ఎన్నడూ పునః సృష్టి చెయ్యలేదు.
ఒకసారి ఆ దంతపు భరిణ పగిలిందంటే
అందులోని బంగారు చిలక మరి పలకదు.
.
ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే

అమెరికను కవయిత్రి

Edna St. Vincent -Millay
Image Courtesy: http://upload.wikimedia.org

.

Elegy
.

Let them bury your big eyes
In the secret earth securely,
Your thin fingers, and your fair,
Soft, indefinite-colored hair–
All of these in some way, surely,
From the secret earth shall rise;
Not for these I sit and stare,
Broken and bereft completely;
Your young flesh that sat so neatly
On your little bones will sweetly
Blossom in the air.

But your voice–never the rushing
Of a river underground,
Not the rising of the wind
In the trees before the rain,
Not the woodcock’s watery call,
Not the note the white-throat utters,
Not the feet of children pushing
Yellow leaves along the gutters
In the blue and bitter fall,
Shall content my musing mind
For the beauty of that sound
That in no new way at all
Ever will be heard again.

Sweetly through the sappy stalk
Of the vigorous weed,
Holding all it held before,
Cherished by the faithful sun,
On and on eternally
Shall your altered fluid run,
Bud and bloom and go to seed;
But your singing days are done;
But the music of your talk
Never shall the chemistry
Of the secret earth restore.
All your lovely words are spoken.
Once the ivory box is broken,
Beats the golden bird no more.
.
Edna St. Vincent Millay 

February 22, 1892 – October 19, 1950

American Poet 

%d bloggers like this: